May 29, 2020
,"ప్రాణ భయం లేనిది ఎవరికి ,? చెప్పండి ,,!""
భూమిపై పుట్టిన ప్రతి ప్రాణికీ "మృత్యువు "అంటే భయం ఉంటుంది !
__అరణ్యంలో తిరిగే జింకలు లేళ్ళు,కుందేలు,, లాంటి అల్ప జంతువులు,, పులి ,సింహం లాంటి క్రూర మృగాల బారిన " ఎప్పుడు పడుతామో?" అన్న మృత్యు భయంతో అనుక్షణం గజ గజ వణకుతో ,,బహు అప్రమత్తత తో సంచరిస్తూ ఉంటున్నా కూడా,, హఠాత్తుగా ఎక్కడనుం డో మృత్యు దేవత లా గా మీద పడి కరచుకు పోయె, పులి కి ఆహారం అవుతూ నే ఉంటాయి ,!!
అలా , పిల్లి నుండి ఎలుక ,__గ్రద్ద నుండి కోడి ,పాము ,, లాంటి ప్రతీ ప్రాణి ,,ప్రాణ భయంతో పరుగులు పెడుతూ తమను తాము మృత్యు దేవత బారి నుండి రక్షించు కోడానికి బతికేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి !!
అలాగే , సముద్ర జలాల్లో, నదీ నదాల్లో మొసలి,, తిమింగలం లాంటి భయంకర ప్రాణుల మృత్యు కుహరం లాంటి వాటి నోటిలో పడి _క్షణంలో తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయే అల్ప జంతువులు ,చేపలు లాంటివి ,అనేకం !
భగవంతుడు ఇలా ఒక జంతువును మరో జంతువుకు ఆహారంగా పుట్టించాడు ,!
చిన్న చేపకు జీవితం నుండి విముక్తి కలిగిస్తూ మింగేస్తూ , పెద్ద చేప బ్రతుకుతూ ఉంటుంది ,!
ఇది మరొక దానికి ఆహారం గా అవుతుంది;
ఇది సృష్టి విధానం , !
ఆహారం కోసం అవి చంపుతూ ఉంటే, ఈ మనిషి అనేవాడు ,మరొక మనిషిని కాల్చడం, చంపుతూ ఉండడం ,, ఇదంతా దేని కోసం !
కేవలం పగ ప్రతీకారం ,వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసేవాడు మని శా?
రాక్షసు డా ?
చంపడం మనిషీ ప్రవృత్తి గా మారింది,,అందుకే , జంతువులు మనిషి పై ,, పగ బట్టాయి,
కరోనా రూపంలో తమకు ఈ దుష్టుని పై ఉన్న కసిని,ప్రతీకారాన్ని ఇలా తీర్చుకుంటున్నా యేమో ,, అనిపిస్తూ వుంటుంది !
చర్యకు ,ప్రతిచర్య ఉంటుంది !
ఇది ప్రకృతి నియమం కదా !
దానికి కూడా కడుపు మండుతూ ఉంటుంది కాబోలు !!""
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు , కదా !!"
కానీ ఇప్పుడున్న కరోనా రగిలిస్తూ ఉంటున్న ఈ ,""రావణ కాష్టం ""లాంటి విపత్తు ను ఏ పేరు తో పిలవా లో చెప్పండి !!
__ప్రపంచాన్ని గడ గడా వణకు పుట్టిస్తూ , భయాందోళన కలిగిస్తూ , ఏ మాత్రం కనికరం లేకుండా మనుషులను వరుస పెట్టీ చంపుతూ పోతూ ,, శాంతి భద్రతల ను తన చేతిలోకి తీసుకొని,, అభద్రత,, అరక్షన , అశాంతి,, ఆవేదనా భావాలను మనలో కలుగ జేస్తూ ఉన్న __ఈ "మృత్యు దేవత"" బారి నుండి ఎలా రక్షించు కోవాలి ,?? అన్నది అందరకూ,తీరని ఘోర సమస్య అయ్యింది !;
__ కంటికి కనబడని అత్యంత అల్ప సూక్ష్మ విష జీవి ,, అది ! ఈ కరోనా వైరస్ క్!!" సోకిందంటే , విడిచి పెట్టకుండా చంపుతూ ఇంకా ఇంకా ముందుకు వస్తోంది ,!
! ఈ మహమ్మారి , ఆబ్రహ్మ దేవుని వద్ద ,""మనిషి చేతిలో తనకు చావు లేని వరం"" రాయించుకొని వచ్చినట్టు !""తోస్తూ ఉంది, ,!
ఇదిఅన్నీ దేశాల్లో పగ బట్టినట్టు గా ,, బహు వేగంగా ,తీవ్రంగా వ్యాపిస్తూ ,,, ఏ మందు కూ లొంగకుండా ఇంకా ఇంకా ప్రబలుతు నే ఉంది ,!
""మృత్యు భయం "" అనేది ,ఇపుడు అందరి కళ్ళల్లో , అంతరంగంలో,, నేరుగా అగుపడుతూ ఉంది ,!;
పైకి మాత్రం తెలియనట్టుగా _బింకంగా ఉంటున్నాడు ;
కనిపించే శత్రువు నుండీ విడిపించుకు నే ""కనీస ప్రయత్నం "" చేయవచ్చును ,!!
,కానీ ఇలా కంటికి ,కనపడకుండా ""ఇంద్ర జిత్తు""లా ""మాయా యుద్దం ""చేస్తూ తన చేతికి దొరికిన వారిని దొరికినట్టు గా,, మట్టు బెడుతు ఉంటూ,,"" మృత్యు భయాన్ని "" అడుగడుగునా తలపింపజేస్తున్న ఈ దుష్ట కరోనా ఎలా వచ్చింది ?"" ఎలా పోతుంది ?""
ఎప్పుడు పోతుంది ?'
ఎవరు పంపించారు !
ఈ దుష్ట క్రిమి సృష్టి కర్త ఎవరు!!
ఎంతమందిని చంపితే దాని ఆకలి తీరుతుంది ? "" ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలే !!
__ మాములుగా నైతే ,,మానవాళి ని వేదించే ప్రతీ సమస్య కు ఒక పరిష్కారం వె దకుతూ జయం పొందుతూ సంతోషిస్తూ , ఉంటాడు మనిషి !; ,
ఇంత గొప్ప మేధావి ,శాస్త్రజ్ఞుడు ,సాంకేతిక వేత్త , బహు రంగాల్లో ప్రజ్ఞా శాలి !
అంతటి ఘనుడు, ఇపుడు ఈ అల్ప ప్రాణి కరోనా,, ఈ మృత్యు దేవత ను __ ఎదిరించ డానికి బదులు ,, దానికే తాను ఆహారం గా మారుతున్నాడు ,!!
శత్రువు బలం ,,"" మృత్యువు భయం ,అమోఘం అని తెలుస్తోంది కదూ !;
"మృత్యు భయం !* అంటే ఏమిటో తన దాకా వస్తేనే తెలుస్తుంది ,కదా !
నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను ,
అది వివరిస్తాను మీకు !!
నాకు by pass surgery జరిగింది 15 ఏళ్ల క్రితం !!,, మృత్యు లోకం వెళ్లి ,తిరిగి భూమిపైకి వచ్చే అవకాశం అదృష్టం నాకు భగవంతుని అనుగ్రహం వల్ల లభించింది ,!
నాకు ""గుండె పోటు ""రాగానే ,, నన్ను చూసిన డాక్టర్,"" ,లాభం లేదు! చేయి దాటి పోయింది విషయం !!
నేనేం చేయలేను ; ,Hyderabad తీసుకెళ్లండి !""
అన్నపుడు "మృత్యు భయం "" తెలిసింది !
మా వాళ్ళు అందరూ doctor గారి కాళ్ళు చేతులూ పట్టుకుంటే బ్రతిమాలి తే,,"
"",చూస్తాను !,కానీ , గ్యారంటీ లేదు !!,24గంటలు గడిస్తెనే గానీ ఏమీ చెప్పలేను !""
అంటూ icu __ ఉంచినపుడు , నాకు తెలిసింది ""మృత్యు భయం !;""
, అపోలో ఆస్పత్రిలో చేరిన నాకు ,ఆత్మీయుల ఆక్రందన ఆవేదన చూస్తుంటే "", మృత్యు భయం ""తెలిసింది, నాకు !
సర్జరీ కి ముందు దేవుడికి దండం పెడుతూ ఉన్న ""విజయ్ దీక్షిత్"" డాక్టర్ గారిని చూస్తుంటే తెలిసింది "బ్రతుకు పై మనిషికి ఉండే తీపి "" తో బాటు మృత్యు భయం !
సర్జరీ కి ముందు,, గుండె ను సవరించే నిమిత్తం__ కొట్టుకోవడాన్ని ఆపుతూ ,,రక్తాన్ని కృత్రిమ పరికరాల ద్వారా పంపిస్తూ ,ప్రాణం పోకుండా శరీరాన్ని వారు రక్షిస్తూ, ఉన్నపుడు ,తెలిసింది మృత్యు భయం !
శరీరస్పర్శ ,పోయింది ,!! తెలివి జ్ఞానం పోయాయి ,!
బాహ్య ప్రపంచం తో సంబంధం తెగి పోయింది !
ఐసీ హాలులో ఉంచాక ఒక రోజు తర్వాత ,తెలివి వస్తే ,నాకు అమర్చబడి ఉన్న పైపులు ,సూదులు ,మందులు చూస్తుంటే , అపుడు తెలిసింది"" ,మృత్యువు అంటే భయం !""
ఎదుట దేవుడు లా కనిపించాడు డాక్టర్ "దీక్షిత్"" గారు !
కృతజ్ఞత తో చేతులెత్తి ,, ""అయ్యా ! మీరు నా ప్రాణ దాతలు !,భగవంతుడు మీరు !"అంటూ నమస్కరించడం చేస్తే , చిరునవ్వు తో __ నాతో ఆ డాక్టర్ గారు అన్న మాటలు,, నా చెవిలో ఇంకా ధ్వనిస్తూ నే ఉంటున్నాయి ,,
, ""మిస్టర్ మనోహర్ !"
"నన్నూ ,నిన్నూ రక్షించేది ఆ పై వాడు !
,, వాడి చేతిలో పరికరాలం మనం !
ఈ నాటక రచన దర్శకత్వం ,సెట్టింగులు ,మాటలు ,సన్నివేశాలు అన్నీ వాడే ఏర్పాటు చేస్తాడు !
మనకు కనబడకుండా ఉంటూ,, తాను అనుకున్నది అనుకున్నట్లుగా మనతో చేయిస్తూ ఉంటూ ,,ఇలా మనతో ఆటలాడు కుంటు ,ఇదంతా ఒక వినోదంగా చూస్తూ ,తాను మాత్రం ఏమీ ఎరుగని వాడిలా ఒక " సాక్షి "లా గమనిస్తూ ఉంటున్నా డే , చూడు!,అదిగో ,; నీవు నాకు పెట్టీ దండం వాడికి పెట్టు,!!
ఎవడు నిన్ను బ్రతికించాడు డో, వాడికి పెట్టు నీ నమస్కారం !"
ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో,,
నిన్ను బ్రతికించి న వాడి కోసం , కృతజ్ఞత చూపిస్తూ ,ఎందుకు నిన్ను బ్రతికించా డో , అందుకు నీవు బ్రతకాలి !
ఈ ప్రపంచం ఒక టీవీ అనుకో !
నీవు ఈ ప్రపంచం లో లేవు , చని పోయావు అన్నట్టుగా ,, ఎవరి తో నూ సంబంధం అతిగా పెట్టుకోకుండా , "వాడి "తోనే బ్రతకాలి ,
వాడి కోసమే బ్రతకాలి !
నీవు లేకుంటే, ఇక్కడ ఏ లాంటి విపత్తు , ఏ కొరతా రాదు ,ఎప్పటిలాగానే ప్రశాంతంగా ఏమీ జరగనట్టుగా ,హాయిగా నడుస్తూ ఉంటుంది,
అందుచేత బెంగ , అనేది ఉంటే వాడి కోసం , పెట్టుకో !
రోజూ అతడినే స్మరిస్తూ , కృతజ్ఞతా పూర్వకంగా దండం పెడుతూ ,వాడి కోసం బ్రతుకు !
ప్రాణం ఇచ్చింది వాడే !!
,పోయె ప్రాణాన్ని తిరిగి నీకు
దానం చేసింది ఆ కరుణా మయుడైన భగవంతు డే ,!
నీ శ్వాస ధ్యాస , ఇక నుండీ ,,వాడి పైన ఉంచు! ,
మరవకుండ విడవకుండా, వాడి పాదాలు గట్టిగా పట్టుకో !
నీకు నేను జ్ఞాపకం ఉంటే , నా తరఫున కూడా వాడికి ప్రణామాలు అందజేస్తూ ఉండు !
చాలు !
ఇదే ప్రత్యుపకారం గా నాకు,, నీవు ఇచ్చే ఫీజు, !
అంటూ పైకి చూస్తు చేతులెత్తి నమస్కరి స్తూ వెళ్లి పోయాడు !
అతడు ఒక డాక్టర్ , గా నే కాకుండా గురువులా ,నాకు చక్కని ""మార్గ దర్శనం చేశాడు ,!
నేను ఎలా బ్రతకాలో ఆయన బోధించాడు !
గీతాచార్యుడు , ఆ శ్రీకృష్ణ భగవానుడే ఆయన రూపంలో నన్ను అనుగ్రహించ డానికి అలా గీత బోధ చేశాడేమో అనిపించింది !!
దేవుడు స్వయంగా రాడు కదా !మనకు అంత సీన్ లేదు కూడా !
మన అదృష్టం బావుంటే ఇలా ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఇలా కనికరిస్తూ ఉంటాడు
దైవం పై అతడికి ఉన్న అపారమైన విశ్వాసానికి , అతడి ఆధ్యాత్మిక భావ సంపద కు కృతజ్ఞతగా గురు దక్షిణ గా వారికి మనసులో ప్రతి రోజూ దండం పెడుతూ ఉంటాను ,!;
అతడి మాటలు అక్షరాలా ,సాధ్యమైనంత గా పాటిస్తూ ,భగవద్ చింతన లో శేష జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ,
__ ఉత్తమ మైన సంకల్పం మనలో కలిగించడం , అది నెరవేరే దిశలో మనల్ని నడిపించడం , అంతా ఆ పరమాత్ముని అనుగ్రహం తోనే జరుగుతుంది కదా !
స్వామిని నమ్మి చెడిన వారు లేరు !""
ఆ పరాత్పరుని పై _ ఎంత విశ్వాసం ఉంటే , అంత ఫలితం మనకు లభిస్తూ నే ఉంటుంది కదా !
స్వస్తి ;
హరే కృష్ణ హరే కృష్ణా !
Wednesday, June 3, 2020
మృత్యు భయం _2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment