Monday, June 29, 2020

శ్రీ రామ నామ గాన మహిమ 1

June 17, 2020
"స్వామీ ! , హే శ్రీరామ చంద్ర ప్రభో ,_!
నా ఇష్ట దైవం అయిన మిమ్మల్ని చూడాలని బాల్యం నుండి ఎంత పరితపిం చానో,,
మొదటిసారిగా మీ దర్శనం లభించగా , అనందం తో నేను ఎంతగా పరవశం తో  పులకించి పోయా నో , మీకు విన్నవిం చుకుంటున్నాను
     "హే ప్రభూ_! బ్రహ్మాది దేవతలు నాకు ఎన్నో అమోఘమైన  వరాలు ప్రసాదించారు ,,_!
కానీ నాకు తృప్తి కాలేదు ,_!ఎవరికోసం నేను జన్మించాను ?  నా దైవం ఎవరు ?
వారిని ఎలా కలిసేది ?_""
అని బ్రహ్మ గారిని  కోరాను
  శ్రీమన్నారాయణుడు   _ శ్రీ రామునిగా  _భూమిపై అవతరిస్తాడు _!
,అతడే నీ దైవం !,  నీ స్వామి ,! గురువూ_! ,సర్వస్వం  అతడే ,_! అన్నాడు
  ,"నేను అతడిని ఎలా గుర్తు పట్టాలి _?"
   "రాముడే నిన్ను గుర్తు పడతాడు _! హనుమా ,!
"కానీ ,  ఆ విషయం నా కెలా తెలిసేది _?"
"నిన్ను చూడగానే , తొలి పరిచయం లోనే, నీవు చెప్పకుండానే , ",ప్రేమతో  ". హనుమా  " అని నిన్ను  సంబోధిస్తాడు నీ రాముడు _!
_   కానీ ఈ నామం  తో అందరూ   నన్ను పిలిచే వారే కదా ,_!"
  _"అయితే మరొక గుర్తు  జ్ఞాపకం పెట్టుకో "!
,"నేను నీకు బహూకరించిన వజ్ర కవచ కుండలాలు    ఎవరికి కనిపించవు ,-!నీకు తప్ప_!!
కానీ ఎప్పుడైతే   నీకు రామ దర్శనం నీకు అవుతుందో , ఈ ఆభరణాలు   ఆ రాముడికి మాత్రమే  అగుపిస్తాయి ,,; ,
""హనుమా ! నీ కంఠ సీమ లో  మెరుస్తున్న  ఆ వజ్రా భరణాలు , నిన్ను  హనుమ గా  సూచిస్తూ ఉన్నాయి , సుమా _!
అంటాడు
బ్రహ్మ గారు చెప్పిన వాక్యం ఈ నాడు  నిజమైంది !
నా స్వప్నం  ,తపస్సు ఫలించింది!
, హే రామచంద్రా , స్వామీ ,!
  నా కోసం _నన్ను కనికరించి బ్రోచుటకై  _ఇలకు ఇలా _దిగి వచ్చావు_!
ప్రభూ !నేను ధన్యుడను!
నిన్ను చూస్తుంటే  నా సోదరులను చూస్తున్నంత సంతోషంగా వుంది,నీవు చేసిన ఉపకారానికి నేను ఏ విధంగా ఋణం తీర్చు కొనగలను చెప్పు ?__
స్వామీ,_!మీరు నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ  కౌగలించు కొంటూ  ఉన్నపుడు నాకు కలిగిన అనందం  తో  ఈ సేవకుని  జన్మ చరితార్థం అయ్యింది
ఇంతకన్నా సుఖం సౌఖ్యం అదృష్టం , మహా భాగ్యం  ఉంటుందా ప్రభూ _!""
""_హనుమా!_ నీ ఎదురుగా  ఉన్న నన్ను  చూస్తుంటే నీకు  ఎలాంటి అనుభూతి కలుగుతూ వుంటుందో చెప్ప గలవా ?"
""_హే  ప్రభో ,శారీరికంగా అయితే మీరు  నాకు స్వామి అంటే యజమాని _!
నేను మీ విశ్వాస పాత్రుడ నైన సేవకుడ ను !__ రామ బంటును _;
  ఇక మానసికంగా చూస్తే __
స్వామీ ,, మీరు గురువు,_!దైవం _!
నేను మీ శిష్యుడను ,!  ప్రియ భక్తుడ ను,_!"
__ ఆత్మపరంగా చూస్తే మాత్రం _
స్వామీ  !, హే రామా !
,నీవే నేను !
నేనే నీవు!
అహం బ్రహ్మాస్మి ,!_
  నా  ఈ భావన లో ఏదైనా లోపం ఉంటే మన్నించు స్వామీ !""
   , హనుమా ,  !_
  నీ స్వామిభక్తికి ,,,  నీ స్వామి సేవకు , నీకు నీవే సాటి _!
నీ  ఈ విశ్వాసం , నీ శరణాగతి భావం ,, అనితరసాధ్యం సుమా  _!
అయినా _
ఎందుకయ్యా _నేనంటే నీకు ఇంత  ప్రేమ_? ఇంత భక్తి , అమితమైన విశ్వాసం ??
*"స్వామీ !,  మీ నామం లో ఏమిటో తెలియని  అద్భుతమైన శక్తి  ,మహత్తు దాగి ఉన్నాయి,_!
రామ అంటే చాలు , పాల పొంగులా ఉత్సాహం అనందం ,అనంతమైన శక్తి, చైతన్యం , సముద్ర కెరటాల వలె ఉప్పొంగుతూ ఉంటాయి ,_!
  అనాడు _శ్రీరాముడు ఆ  గుహు ని సహాయంతో  _ అతడి నౌకలో_ అతి కష్టంగా గంగానది ని దాటాడు _
కానీ , హే రామ ప్రభో,!
నీ రామ నామాన్ని జపిస్తూ ఉండే  అల్ప ప్రాణి,  ఈ వానరానికి ,  శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని కూడా  దాటే శక్తి  లభించింది ,
స్వామీ , ఇపుడు మీరే చెప్పండి ,రాముని. బాణ మా,, రాముని నామమా ,__ఏది గొప్ప దొ,?_""
, "అయితే హనుమా , _!నా కంటే ,నా నామమే గొప్పది అంటావు ,!, అవునా _!
   స్వామీ ,, నేను . నా అనుభవం తో ,మీకు ,,నిజం చెబుతున్నాను  _!
ఎవరు ఎక్కడ రామ నామ గానం చేస్తున్నా _,రామాయణ కథ వినిపిస్తూ ఉన్నా_  నాకు తెలియకుండానే   అక్కడకు వెళ్లి పోతూ ఉంటాను ,_!, ఆ పురాణ స్థలం లో _ ఒక మూలన కూర్చుం డీ _ ముకుళిత హస్తాలతో, గద్గద స్వరంతో రామ నామాన్ని గానం చేస్తూ ,, కళ్ళ నుండి ఆనంద భాష్పాలు   రాలుస్తూ  , పరవశిస్తూ నన్ను నేనే మరచిపోయి ,పరమానందం పొందుతూ ఉంటాను_!
ఆహా,_! ఆ  సమాధి స్థితి నుండీ ,తిరిగి  బయటకు రావడం   చాలా కష్టం అవుతుంది ప్రభూ _!
హనుమా నీ లాంటి ఆత్మబంధువు నాకు లభించడం నాకు చాలా ఆనందంగా ఉంది సుమా _
  హనుమా ,_! ఒక విషయం తెలుసు కోవాలి అని ఉంది
అయితే ,,,నేను నీ ముందు ప్రత్యక్షంగా  ఉంటున్నా కూడా ,  నన్ను విడిచి , నా రామకథ  విన్పించే చోటికి వెళ్తావా ,__??
ఇది అన్యాయం కాదా ,?!
స్వామిని విడిచి  దూరంగా ఉండడం ,నీకు బాధగా ఉండదా ?
  ""హే రామ చంద్ర ప్రభో, _!
స్వామీ ,, 
మీరు సాక్షాత్తూ  భగవద్ స్వరూపులు ,
లోకాల నేలే పరమాత్మ వు _! సృష్టి స్థితి లయ కర్త వు_!
తండ్రి,_! నీకు తెలియని ధర్మము ,  రహస్యాలు జగతిలో ఉంటాయా ?
_ నీ కథ మాధుర్యం, లో ,_ నీ నామ సంకీర్తన వైభవం లో _నేను పొందే బ్రహ్మానందం , అది అనుభవైక వేద్యం ,,_!
వర్ణనాతీతం ,_!
ఆనంద సాగరం ,_!  
నా రాముని గురించి నేను ఒక్కడినే , సేవిస్తూ ఉండడం కంటే,, నా వలె ఎందరో రామ భక్తులు _ అందరూ ఒక్క చోట కలిసి,, రామ కథ గానం చేస్తూ _  పరవశిస్తూ _  మనసారా తనివార  ఆ ఆనందాన్ని  అనుభవిస్తూ __నోరారా  "రామ్ రామ్ రామ్ _""!అంటూ అందరూ కలిసి చేసే నామ సంకీర్తన వల్ల నాకు కలిగే ఆనందమే అధికం , : అత్యంతమధురం ,, స్వామీ _!
,,.   నా కళ్ళ ఎదుట ఉన్న మీ   ఈ దివ్య మంగళ విగ్రహ దర్శనం కన్నా ,
హే ప్రభో__
  నేను నా కళ్ళు మూసుకుని_ అంతరంగంలో కదలాడే మీ దివ్య జ్యోతి స్వరూపాన్ని  దర్శిస్తూ _తన్మయంతో తాదాత్మ్యం పొందే ఆనంద మే మిన్న __!
_మధురాతి మధురం !
ఆహా ,, పొగడ తరమా రామా , నీ నామ గాన మహిమా ,,,___!""
  " హనుమా  ఓ_హనుమా _! _ లేచి వెళ్తున్నావు_! ఎక్కడకు ?
ఎవరు పిలుస్తున్నారు,?_ చెప్పు __?
,, నీ కోసమై వచ్చిన నన్ను విడిచి ,నీవు  దూరంగా వెళ్లిపోవడం భావ్యమా,_??
ఇది తగునా,నీకు హనుమా ?__""
  "స్వామీ _!మన్నించు _!
రామ చంద్రా క్షమిం చు _!", నా మనసు ,తనువూ _ ఆ రామ నామానికి అంకితం అయ్యాయి_ తండ్రీ!
ఏం చేయను  నేను ??_  ఆశక్తు డను,!
అక్కడకు వెళ్లకుండా  ఉండలేను , స్వామీ _!, "అదిగో _!అక్కడ _ ఆ కాశీ మహా నగరంలో   _, "తులసీదాసు" అనబడే  మీ  పరమ' రామభక్తుడు  ఒకడు __  మీ పై ,అమితమైన భక్తి ప్రపత్తులతో,_ తులసీ మానస రామాయణం కావ్యం  అద్భుతంగా  రచించి  _  నిత్యం  ఆ రామకథను _ భక్తి పారవశ్యం తో  తానే గానం చేస్తూ   స్వయంగా ఎంతో మంది, రామభక్తులకు   శ్రవణానంద కరంగా _ రమణీయంగా , వినిపిస్తూ ,  సమస్త పురజనులను ఆనంద పరుస్తూ __అది  వినేవారి , వారి జన్మలను సార్ధకం చేస్తూ ఉన్నాడు , ప్రభూ ,_!"
"నా దేహం _ నా ప్రాణం_నా  మనసు  ఆగడం లేదు _!
_అతడి నోటినుండి వెలువడే అమృతభరిత మైన శ్రీ రామ కథ  మానస రామాయణం శ్రవణం కోసం  నన్ను లాక్కెళ్తూ ఉన్నాయి_!
అపర శ్రీ రామ భక్తుడు , కాశీ పుర నివాసి  ,,__ఆ తులసీదాసు గారు   , తన రామకథ ను ప్రారంభం చేసే వేళ _  అయ్యింది  _!
"ప్రభో_!  మీ నామ గాన వైభవం ఎక్కడ ఉంటుందో,, ఈ హనుమ  రెక్కలు  కట్టుకొని అక్క డికి  వాలుతూ ఉంటాడని _మీకు తెలిసిన సత్యమే ,కదా _;
"స్వామీ _!
  అందుచేత _నేను అక్కడకు  వెళ్ల క తప్పదు _  దయతో నన్ను  క్షమించు _!
భక్తజన పరిపాలా _!
  హే రామ చంద్ర _!
కరుణా సాంద్రా _!
    హే పరం ధా మా, పరాత్ప రా, ,_! పరమాత్మా
ఇక నాకు సెలవు ,_!  స్వామీ,_!""
జై శ్రీ రామ్_! జై జై శ్రీ రామ్_!
జై బజరంగ బలీ_!
___-
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా !-
,,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...