Monday, June 29, 2020

ఆత్మ విశ్లేషణ!

June 16, 2020
ప్రతీ మనిషికి  రెండు విధాల పోషణ చేసుకుంటూ జీవించ వలసి ఉంటుంది _!
మొదటిది  _శరీర పోషణ !
రెండవది _ఆత్మ పోషణ !
చాలా మంది శరీరాన్ని పోషించడం తోనే  కాలం గడుపుతూ, సరి పెట్టుకొంటూ, తృప్తి పడుతూ తమ ,జీవితాన్ని  అర్ధాంతరంగా ముగిస్తూ ఉంటారు _
శాశ్వత సుఖాన్ని ,జీవన్ముక్తి నీ అనుగ్రహించే ఆత్మ పోషణ గురించి ఆలోచించ కుండా జీవితం వ్యర్థ కార్య కలాపాలకు దుర్వినియోగం చేస్తూ ఉంటారు
ఆత్మ పోషణ అంటే , ఆత్మ ను ఉద్ధరించు కోవడం , ఆత్మానుభూతి తో అనందాన్ని పొందుతూ ఉండడం , ఆత్మను గురించి విచారణ చేస్తూ ఉండడం , ,సచ్చిదానంద స్వరూపం అయిన ఆత్మ జ్ఞానాన్ని   సాధనతో , ధ్యాన జ్ఞాన కర్మ యోగాలు అనుసంధానం చేస్తూ , తెలుసుకోవడం , ఒక యోగి వలె  , ప్రాపంచిక సౌఖ్యాలు అంటకుండా అతీతు డై ఉండడం ,,  సంతుష్టుడై నిత్య సంతోషి లా ఆనందంగా ఉంటూ  ,జీవించి ఉండగా నే ముక్తిని సాధించే ప్రయత్నం లో ఉండడం ,, ఇదీ ఆత్మ పోషణ అంటే ,
తానెవరో,జీవిత లక్ష్యం ఏమిటో ,ఎవర్ని ఆశ్రయించి  జ్ఞానాన్ని పొందా లో ,,  , ఇలాంటి పరి ప్రశ్నలకు జవాబులు స్వయంగా శోదిస్తూ , భగవద్ ఆరాధనతో , భక్తి విశ్వాసాలతో ,  తన జీవన జ్యోతిని వెలిగిస్తూ ,    అత్మ వికాసాన్ని సాధించడం , చేస్తూ ఉంటే, ఆ  భావ సంపద ను
  "ఆత్మ పోషణ ,," అంటారు
____-
"అంతర్ముఖ సమారాద్యా ,,
బహిర్ముఖ సుదుర్ల భా ___!""
అంటూ లలితా సహస్ర నామాలలో_  ఇది ఒక అద్భుత నామం గా__ లలితా త్రిపుర సుందరి దేవిని _ మనం నిత్యం  కీర్తిస్తూ ఉంటాం _!
  అయితే _బాహ్యంగా అంతటా విస్తరించి ఉంటున్న _  ఆ  దైవిక శక్తిని , ఈ శరీర భావన తో , బాహ్య ప్రపంచం లో దర్శించడం      అంత సులభమైన విషయం కాదు !__
ఎందుకంటే  ఆ పదార్థం ,యదార్థం యొక్క అసలు స్వరూపం కాదు _!"" అది కాలచక్ర భ్రమణం లో  నిరంతరం మార్పులు  చెందుతూ నే  ఉంటుంది ,!_
అత్మ చైతన్యం ఒక్కటే _ ఎప్పుడూ _ఏ మార్పు చెంద కుండా ఉండేది _! నిత్యం ఉండేది  ,,! పరిణామం చెందనిది !__,
_ పదార్థం  లోని చైతన్యం కు కారణం  ఈ పరమాత్మయే_!
దాని వైభవానికి కారణం__  పరమాత్మ ప్రతిబింబంగా అది ఉండడమే  _!_
_ కానీ   తిరిగి ,_దాన్ని గురించిన ఆనందం పొందేది _ మన ఆత్మలో నే కదా !
   తిరుమల లో  శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క  అద్భుత అలౌకిక దివ్య మంగళ సుందర  శాలగ్రామ విగ్రహం ముందు,_ నిలుచుండి ఆ పురాణ పుణ్య  పురుషోత్తముని , జగన్మోహన ఆకార సౌందర్య  లావణ్యాన్ని దర్శిస్తూ  __చేతులు జోడించి నమస్కారం చేస్తూ,_సాష్టాంగ ప్రణామం చేస్తూ ,_" గోవిందా _గోవిందా !""అంటూ ఎలుగెత్తి  భక్తితో  స్వామి నామ సంకీర్తనం చేస్తూ ___ పరమానందంతో  ముందుకు కదులు తూ ఉంటాం !_
అలా _ స్వామి గురించిన ఆ  అపురూప  దృశ్య అనుబంధం __ మన హృదయం లోనే నిక్షిప్తమై ఉంటుంది !_
దీనినే   మనం పదే పదే భావిస్తూ_ స్మరిస్తూ  ,_ ఆత్మలో  చింతిస్తూ  _ ఏడుకొండల స్వామి యొక్క  అద్వితీయ మైన  సౌందర్య మూర్తిని ,, స్వర్ణా భరణ  అలంకార భూషితుడైన , వివిధ పరిమళ పుష్ప మాలా లంకృతు డై న ,కమనీయ రమణీయ మహనీయ శోభ ల అతిశయం తో విరాజిల్లే  ఆ చిన్మయ చిదానంద  స్వరూపాన్ని _,_ లక్ష్మీ పతి సుందర మూర్తిని  _ _మనసులో తరుచుగా  తలచుకుంటూ_  ఆత్మ లో ఆనందిస్తూ ,,స్వామి సన్నిధిలో ఉంటున్నట్టు గా  రమిస్తూ , అతడి పరందామం లో  ఉంటున్నట్టు గా ,_ భావిస్తూ ,,_ ఈ దేహ ధ్యాస మరచి _,పరమాత్మ చింతనతో ,అత్మానందం పొందుతూ ఉండడమే , జీవుడు అంతర్ముఖు డై  ఉండడం ""__,అంటాము  ,
ఇంద్రియాలను మనసును , నియంత్రించి ,అవి మెదడు ఇచ్చే ఆజ్ఞల తో బయటకు పోనీకుండ , ,తన వక్షస్థలం లోనే అతి సూక్ష్మ రూపంలో పరంజ్యోతి లా ప్రకాశిస్తూ ఉంటున్న ఆత్మ సౌందర్యం వైపు మల్లించాలి
  దీనినే జీవుడు "అంతర్ముఖుడు "కావడం అంటాము _!
    ఈ అంతర్ముఖ పరిశీలన తో   , ఎటూ పోకుండా , ఏ శ్రమ లేకుండా , పైసా ఖర్చు కాకుండానే __ కదలకుండా ఉన్న చోటు న నే  _  కేవలం భావనతో మాత్రమే _ దైవ సాక్షాత్కారాన్ని పొందడం. నిజంగా _ ఎంత భాగ్యం ,?ఎంత అదృష్టం_  ఈ జీవుడికి  !??"
పరమాత్ముడు ఎక్కడో బయట  లేడు   _!_
నీలోనే _నీ భావన లోనే _, నీ ఆత్మలోనే  సదా కొలువై ఉన్నాడు _!__
""పంచకోశాంతరస్థితా ,__!" అంటూ మరో నామంతో   కూడా  లలితా మాత ని  స్తుతిస్తూ _  అనందంగా   గానం చేస్తూ ఉంటాం ,_!"
  పరమాత్మ దర్శనం  , ఆత్మ గురించి తెలియాలి _!
ఎందుకంటే  పరమాత్మ ఉండేది ఆత్మ యందే కనుక _!;
ఆత్మ  ను తెలుసు కోవాలంటే ,దాని  చుట్టూ అవరింప బడి ఉన్న ఈ పంచ కోశాల గురించి  తెలుసుకొక తప్పదు ,_!
""మహాత్ములు"" అందరూ   తమ అచంచలమైన భక్తితో  , అపార విశ్వాసం తో  నిరంతర  సాధనతో ___ పరమాత్ముడి  "మహా అత్మ" ను  చేరారు ,,
అన్న మయ్య లాంటి భక్తులు    వేంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తో ఈ పంచ కోశాలను దాటి __ఆత్మ తత్వాన్ని తెలుసుకొని _  శాశ్వతమైన  ఆత్మానందాన్ని పొంద  గలిగారు _!
,, మొదటి ది  అన్నమయ కోశం ,__!_
దీని లో సకల ప్రాణుల తత్వాలు నిబిడి ఉంటాయి !
, ఇది  అన్నమయ  తమ బాల్యం లోనే దాటారు,,_!
రెండవది  ప్రాణ మయ కోశం __!
ఇది దాటాలంటే మనస్సు పై నిగ్రహం సాధించాలి ,,_! అంటే పంచేంద్రియాలను తన  నియంత్రణ ,  లో ఉంచ గలగాలి_!  దీనిని అన్నమయ_ తన  గత జన్మ సంస్కారం తో  అతి సులభంగా  అధిగమించాడు __!
ఇక మూడవది మనో మయ కోశం _
దీనిని దాటాలంటే_  భావన లో_ బాహ్యంలో   _ పరమాత్ముని దర్శించే __స్థిత ప్రజ్ఞత సాధించాలి ! ,
తన భావనా గరిమ తో , సంకీర్తనా ప్రతిభ తో ,_స్వామిపై ప్రగాఢ విశ్వాసం తో __ వేంకటేశుని పై  అపార భక్తి ప్రపత్తులతో  __వేలాది కీర్తనలు రచించి గానం చేసి   స్వామికి సమర్పిస్తూ   శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క అద్భుత అద్వితీయ అపురూప దివ్య మంగళ సుందర స్వరూప  సాక్షాత్కారం   అన్నమయ జీవించి ఉండగా నే  పొందగలిగాడు _
నాలుగవది విజ్ఞాన కోశం __  పరమాత్ముని గురించిన విజ్ఞానం ,తత్వం , జీవిత పరమార్ధం గురించి నిరంతర విచారణ చేస్తూ ఉండడం  __
ఇదంతా అన్నమయ్య అందించిన సంకీర్తనల  భావ సంపద బలం !,,శరణాగతి ఫలం !
5 ఆనందమయ కోశం -__
__ అల్పాత్ములు  గా ఉండి పోకుండా ,  పెరుగుతూ, ఉన్న  తమ వయసు తో పాటే, భగవంతుని గురించిన జ్ఞానాన్ని కూడా పెంచుకుంటూ  __తనలో ఉన్న దివ్య మైన ఆత్మ ను ""మహా ఆత్మ""" గా దిద్దుకొ నే అవకాశం , బుద్దిని , వివేకాన్ని _ మానవ జన్మకు_ ఆ పరాత్పరు డు   దయతో  అనుగ్రహించాడు
   "" ఆనందో బ్రహ్మ_!"" అంటుంది వేదం _!
ఆనందంగా ఉండే ప్రతి జీవి  ,ప్రాణి __ఆ పరమాత్మ  స్వరూపమే !
ఆత్మానందం పొందుతూ ఉంటేనే భగవద్ ప్రాప్తి లభిస్తుంది ,
దుఖం తో ,విచారం తో  నిరాశ నిస్పృహలతో జీవుడు   తన ఆత్మ వైభవాన్ని ,మహాత్మ్యాన్ని ,  ఆత్మ తత్వాన్ని __ఎన్నటికీ  తెలుసు కోలే డు _!

సృష్టిలో ఆత్మ ,పరమాత్మ ఇవి రెండే  శాశ్వత సత్యాలు   _!  శాశ్వతఆనంద నిలయాలు ,_!
ఈ ,పంచేంద్రియాలు. మనిషికి మెదడు  ఇచ్చే ఆజ్ఞల ద్వారా పని చేస్తుంటాయి ,_!
ఇవి ఎల్లప్పుడూ _ బాహ్య ప్రపంచ తాత్కాలిక సుఖ భోగాలు వెదుక్కుంటూ __ఇదే స్వర్గం_! ఇదే అనందం_! ,ఇదే శాశ్వతం_! ఇదే జీవిత గమ్యంగా __ భ్రమిస్తూ_ ఉత్కృష్ట మైన తన ఈ మానవ జన్మకు._ ఒక  అర్థం  _పరమార్ధం లేకుండా_ భ్రశ్టుడై _ఇహ పరలోకాలకు దేనికీ అంటకుండా  పోతున్నాడు_!
,, పంచేంద్రియాలు ఈ శరీరంలో ఉంటూ నే  ,   _పంచ భూతాల ప్రభావంతో_  ,గత జన్మ  సంచిత కర్మల  ప్రమేయం తో  __జీవుడిని సదా విచలితుడిని చేస్తుంటాయి_!
__   మెదడు ద్వారా  మనసును  బహిర్ముఖం  చేస్తూ_ ప్రాపంచిక పదార్ధాలతో  దాన్ని  ప్రభావితం  చేస్తుంటే _  అది ఇంద్రియాలకు వశమై పోతూ ఉంటే _ఇక  జీవుడికి ఉద్ధరణ  ఎన్నడూ  వీలు కాదు !
   ఆ మనసును బుద్దిగా  అణకువతో అనుణయించి , నయంగ బుజ్జగిస్తూ  మనసును బయటకు పోనీయకుండా , ,అదే మెదడు  ద్వారా  అదే మనసును  అంతర్ముఖం చేస్తూ ఉండాలి  _!
  ఆ మనసును , భక్తి ప్రపత్తులను జోడించి ,మెల్లిగా ,ఒక్కొక్క మెట్టును ఎక్కిస్తూ _ పంచ కోశా ల ను దాటించే  సాధనా ప్రక్రియ ను  చేపట్టాలి ,_!
   ఇందుకు   తప్పక అవసరం అయిన  _పరమాత్ముని  అనుగ్రహం కోసం ప్రార్థించాలి ,_!
ఎందుకంటే గత జన్మ సంచిత కర్మ ల ప్రభావాన్ని  దైవానుగ్రహం పొందకుండా _ జీవుడు' ఎన్నడూ అధిగమించ లేడు _!
, j శరీరం ఒక రథం అని భావిస్తే,,
ఇంద్రియాలు గుర్రాలు అవుతాయి
  ఆ గుర్రాల  కళ్ళాలు మనసు అవుతుంది
మనసు సారధి ,__!
బుద్ది రథికుడు_! అవుతూ రథాన్ని నడిపిస్తూ ఉంటాడు __
గుర్రాలు అనే ఇంద్రియాలు మనసు అనబడే కళ్లెం చేత  లాగబడుతూ  నియంత్రణ లో ఉంటే , రథం తన గమ్యం అయిన  ఆత్మ ! సన్నిధానం వేపు చక్కగా వెళ్తూ ఉంటుంది
కోరికలు ఉంటే , మనసు బహిర్ముఖం అవుతుంది
కోరికలు అణగి పోతే ,అంటే ఇంద్రియాలు నియంత్రించ బడితే ,_మనసు అంతర్ముఖం అవుతుంది ,,__
మహా భారత సంగ్రామం ప్రారంభం లోనే _అర్జునుడు  _ తన  రథానికి సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడే సారధి గా ఉండాలని,  స్వామిని _ఆర్తితో  అర్తించి   __తన బరువు, బాధ్యత ,పరువూ, ప్రతిష్టలు  అనబడే  పగ్గాలు ఆయన చేతికి అందించాడు ,_!
ఇక తాను అంటే జీవుడు నిశ్చింతగా  ఉంటూ , పరమాత్ముడు ఎటు తీసుకెళ్తే ఆ దారిన వెళ్తూ తన  జీవన మార్గాన్ని విజయ పథంలో _ సాగిస్తూ  తన ,జన్మను ధన్యం చేసుకున్నాడు. _!
అలా మనం కూడా జీవుడిని అంటే  ఈ మనస్సుని  ,_అంతర్ముఖం చేస్తూ_  పంచ కోశాల ఆవల  _ఆత్మ లో జ్యోతి రూపంలో కొలువై ఉన్న __ ఆ "మహా ఆత్మ "ను_ ఆ పరమాత్మ ను ఆరాధిస్తూ_ ఆనందిస్తూ _ అంతరంగం లో  బ్రహ్మానందాన్ని పొందే ప్రయత్నం చేద్దాం _!
  సర్వం శ్రీ కృష్ణా ర్పణ మస్తు _!
సర్వే జనాః సుఖినోభవంతు !
స్వస్తి హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...