Monday, June 29, 2020

ఆత్మ _ అంతరాత్మ! _అనాత్మ _శరీరం!_1

June 12, 2020
డాక్టర్ శ్రీ వెంకట రెడ్డి గారు , "ఆత్మ _ అనాత్మ" భావన  గురించి ఆసక్తి ని  తెలియజేశారు __
,_ ఆ  పరమ అద్భుత  ఆధ్యాత్మిక రహస్య  తత్వాన్ని     గురించి_  చర్చించే ప్రయత్నం చేద్దాం !_ __ జీవుడు ఆత్మ ను విడవకుండా  జన్మలు ధరిస్తూ వస్తుంటాడు
__ఆత్మ లేకపోతే జీవుడు లేడు , 
గత జన్మలో   ఈ జీవుడు చేసిన కర్మలు అనుభవింపజేయ డానికి  ,
ఈ జన్మలో ఆత్మ  ఈ జీవుడిని  ఈ ఉపాధి తో  అతడిని __సంసిద్దుడిని చేస్తుంది !__
పుణ్యం చేస్తే సుఖాలు ,పాపం చేస్తే కష్టాలు  ఈ  జీవుడికి అనుభవింపజేస్తుంది , అత్మ !_,
తాను మాత్రం  కేవలం సాక్షిగా చూస్తూ ,ఉంటుంది , !
భగవంతుడు ఆత్మ రూపంలో , అంతర్యామిగా ఉంటూ _ తన కర్మలను తూ చా తప్పకుండా నిర్వహించే లా జీవుడి బుద్దిని ప్రకోపింపజేస్తు  ఉంటున్నాడు __
కర్మల శేషం ముగిశాక  జీవుడి శరీరం నుండి నిష్క్రమించుతుంది ఆత్మ__ దానితో బాటే జీవుడూ పోతాడు _ కానీ ఇన్నాళ్లు కాపురం ఉన్న ఇల్లు లాంటి ఈ శరీరం పై భ్రమ వాసన జిగుత్స , అంత తొందరగా పోవు కదా !
శరీరం పూర్తిగా కాలిపోయి కూలిపోయే వరకూ ఆశ తో చూస్తూ వుంటుంది జీవాత్మ _ పంచభూతాల ప్రభావం జీవాత్మ పై అంత బలంగా ఉంటుంది మరి !__
,, ఇక  ఆత్మ అనేది అందరికీ తెలిసినట్టు గా , చావు పుట్టుకలు లేనిది ,_ ఆది మద్యాంతము లు లేనిది , _ తన స్వయం ప్రకాశం తో జీవుడిని ,ప్రభావితం చేస్తూ , జీవింపజేస్తూ ,ఉంటుంది !__
,జీవుడి సంతోషం , సుఖం బాధలు ,బరువులు అన్నీ ఆత్మ సాన్నిధ్యంలో నే  సాధ్యం అవుతాయి _!,
జీవుడి పుట్టుక స్థానం ఈ ఆత్మ ,  యే !
భూమిపై పుడుతూనే  ఆత్మ తో కలిసిఉంటూ__ బ్రహ్మా నందం పొందుతూ ఉన్న ఈ జీవుడు__ ఒక్కసారిగా __ఈ రంగు రంగుల బాహ్య ప్రపంచం చూస్తూ విచలితు డౌతాడు !_
,, పంచభూతాల  తో. నిర్మించబడిన  ఉపాధి లాంటి ఈ శరీరం ను అవరించి యున్న పంచేంద్రియాలు ప్రభావం తో   __బాహ్య ప్రపంచంలో  ఉన్న  వివిధ పదార్థాలు ,విభిన్న మనుష్యులు లతో కూడియున్న ఈ , మాయా ప్రకృతి అందాల కు  ,,__ ""అయస్కాంతానికి  ఆకర్షింప బడే  ఇనుప సూది  _"" లా  ప్రతి స్పందించడం  ప్రారంభిస్తాడు __
,జీవుడు అంటే స్త్రీ లేదా పురుషుడు అని అర్థం !
జీవుడు, మనస్సు ,ప్రాణం , నేను అనబడే అహంకార భావన ఇవన్నీ  ఒకటే !!_ఒకే  తత్వాన్ని సూచిస్తాయి __కూడా !"
,,    నిజానికి _ కన్న తల్లి లాంటి ప్రేమగ ల    ఈ  "ఆత్మ ""అనబడే చల్లని  చెట్టు నీడలో జీవుడు  హాయిగా  ఆనందంగా జీవితం గడపాలి _!
కానీ అతడి కర్మల ఫలితం _ఆ జీవుడిని అలా ఊరకే ఉండనివ్వ దు __!
  ఈ అత్మ యే జీవుని  నిజమైన  నివాస స్థానము !
వచ్చింది  ఆ ఇంటి నుండే !
తిరిగి పోవాల్సిం ది కూడా అదే ఇంటికీ _!"
ఈ అత్మ  చుట్టూ_ పంచ కోశాలు  అవరింపబడి ఉంటాయి ,
ఇవి
అన్నమయ, జ్ఞానమయ మనోమయ ఆనంద మయ మరియు, విజ్ఞాన మయ   కోశాలు _ఐదు !_
ఈ ఐదు కోశాల వలన జీవుడికి  అద్భుతమైన  చైతన్యము _అనుభూతులు  కలుగుతూ ఉంటాయి !, ఇవి ఆత్మ అధీనంలో ఉంటాయి ,!
భగవంతుడు ,జీవాత్మకు అనుగ్రహించిన అందమైన ఏర్పాటు ఏమిటంటే __
ఆత్మకు మనసు ఒక పనిముట్టు లాంటి ది!__
అలాగే జీవుడికి ఈ శరీరం ఒక పనిముట్టు లాంటిది !__ జీవుడు , ఈ ఐదు పరిధులు దాటి _బాహ్య ప్రపంచం తో సంబంధాలు   పెట్టుకొంటూ ,తన మాతృ స్థానం అయిన  ఈ" ఆత్మ" ను మరచి పోతాడు _!
ఏ దివ్య శక్తి ప్రమేయం తో , తన జీవన చర్యలు ప్రభావితం అవుతూ ఉన్నాయో, __
ఏ అద్భుత శక్తి   చైతన్యమే   తన ఆనందానికి , మనోల్లాసం కు  మూల కారణమో _
,అట్టి దివ్యమైన అత్మ ను గుర్తించడానికి తగిన  వ్యవధి  లేకుండా  బిజీ బిజీ గా ఉంటాడు
ఈ ప్రాపంచిక వస్తువులు దృశ్యాలు , ప్రాణులు ,జగత్తు అంతా  భగవంతుని . మాయా   ప్రభావం తో  ఉంటుందని ,,  జీవుడు తెలుసుకోలేక పోతున్నాడు _ _
  తనలో ఉన్న  ఆత్మ  అనే  దైవ శక్తి_  తనను ఏ విధంగా నడిపిస్తూ ఉందో _.,అలాగే ఎదుట  అగు పించే ప్రతీ పదార్థంవెనుక ఉంటూ  __దాన్ని ప్రకాశింప జేస్తున్న ది కూడా ఆ  పరమాత్మ వైభవ మే __అని అర్థం చేసుకునే పరిజ్ఞానం లేకపోవడంతో ,
  ఈ జీవుడు , ఈ బాహ్య ప్రపంచమే యదార్థం అనీ,,తన శరీరమే  అత్మ అన్న భ్రమలో  జీవిస్తూ ,ఉంటాడు _!
పదార్థ ప్రపంచమే  ,యదార్థ మని  తప్పుడు భావనతో ,, మనసు ను  దాని ఇష్టం వచ్చినట్టుగా పోనిస్తూ ,, మానసికంగా శారీరికంగా  బాధలకు లోనౌతూ ఉంటాడు __
మామిడి పండు తింటూ పొందే అనందాన్ని మాత్రం , ఆత్మానుభూతి తోనే సాధ్యం అవుతుంది
అంటే ఆ రస మాధుర్యాన్ని ఆనంద మయ కోశం  లో స్పందిస్తూ  సహకరించడం.  ద్వారా   _  ఆ మామిడి పండు రస మాధుర్యాన్ని ఆస్వాదించే వీలు కలుగుతుంది ,_!
జీవాత్మకు  ఈ దేహము నందు  బాల్యము ,యవ్వనము ,వృద్దాప్యం ఉన్నట్లే , మరియొక దేహ ప్రాప్తియూ ,పరిణామాలు కలుగుతూ ఉంటాయి !_,
    ఇలా జీవుడు ,సుఖ దుఃఖాలు  బాధలూ ఆరాటం జీవన పోరాటం , ఇవన్నీ ఆత్మానుభూతి తో సంబంధం లేకుండా ,శరీర సంబంధం తోనే  అనుభవానికి తెస్తూ ఉంటున్నాడు __
(  ఇంకా ఉంది)
  స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా ,!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...