Monday, June 29, 2020

అందరూ మనవారే !

June 11, 2020
ఇలాంటి మాట వింటూ ఉంటాం ,
కానీ ఆచరణ లో పెట్టడం లో శ్రద్ద చూపం !
ఎందుకంటే వారి కష్ట సుఖాలు తెలుసుకునే తీరిక లేదు ! ప్రయత్నం చేయం!
కానీ ఇప్పుడు అలాంటి సాంఘిక బాధ్యత ,సామాజిక దృక్పథం ఏర్పరచు కొక తప్పదు
సంఘం శరణం గచ్ఛామి అనుకోక తప్పదు !
కారణం మనం సంఘ జీవులం ,!
మనిషికి కష్టాలే  ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి ,! శ్రీరాముడు వేల ఏళ్ళు రామ రాజ్యంగా పాలించిన విషయం కంటే __ఆయన పది నెలలో పడిన సీతా అపహరణ కష్టాలే _మనం గుర్తు పెట్టుకుంటాం !""
ఇలా మనిషికి జ్ఞాపకం ఉండేవి సుఖాల అనుభూతుల కంటే _తాము పడుతున్న  కష్టాలు  గురించి పదే ప దే చింతిస్తూ కుమిలిపోతూ __ప్రస్తుత సౌఖ్యాలను  కూడా దుఃఖ మయం చేసుకుం టూ ఉంటారు !
   ఇక సుఖాలు జ్ఞాపకం వచ్చేవి _ తాను కష్టాలు పడుతున్నప్పుడు !!__
"అయ్యో!" మేము  ఆరోజుల్లో ఎంత హాయిగా ఆనందంగా. ఉండే వాళ్ళం?""_ ఇపుడు ఎంత కష్టం వచ్చి పడింది !""__ అంటూ ,పాత అనుభవాలు తవ్వుతూ  _తాము పడుతున్న కష్టాలను మరచి పోయె ప్రయత్నం చేస్తుంటారు !
   దీనికి కారణం ,
తన అజ్ఞానాన్ని  అవిద్య అవివేకం లను   తాను గుర్తించక పోవడమే !__
సుఖాలైన ,,కష్టాలైన  తాను చేసిన కర్మల ఫలితాలే అనుకోక పోవడం  మరొక కారణం !_
ప్రతీ వాడూ చివరి శ్వాస వరకూ సుఖంగా ఉండాలని అనుకుంటాడు  కదా !_
ఇది మానవ నైజం !
కష్టాలను ఎవ్వరూ _కావాలని  కోరుకోరు కూడా !__
నిజానికి __సుఖం విలువ ,సుఖం యొక్క అర్థం ,పరమార్ధం తెలియాలంటే _ మనిషి కష్టపడక తప్పదు!!_
బంగారు ఆభరణాలు తయారు కావాలంటే__ఆ బంగారం వేడి వేడి నిప్పుల్లో కాలుతూ __సమ్మెట పోటు తినక తప్పదు!_
__ బోలెడన్ని కష్టాలు పడితేనే  కదా __పాండవుల ధర్మ నిరతి, బయట పడింది ! వారి ప్రతిభ తెలిసింది __!
సీతమ్మ కష్టాల ద్వారా__ ఆమె పతివ్రత ప్రభావం , ఆమె సతీ ధర్మం ,రాముని పరాక్రమం ,  ఆదర్శం ఇవన్నీ  తెలి శాయి_!
ఎన్ని కష్టాలు ఎదురైన_  తట్టుకునే  రాముని మనో నిబ్బరం , తన విద్యుక్త ధర్మం లో అచంచల విశ్వాసం ,, వీరత్వం   సోదర ప్రేమ , స్వామి భక్తి భూత దయ ఇలాంటి__ మానవత్వ విలువలు  ఆచరణ యోగ్యం అని మనకు తెలిసింది _ రామయ్య సీతమ్మ కష్టాల వల్లనే కదా !__
"" నేను ఉంటే సీతమ్మ ను పోనిస్తానా ??""
అంటూ ఉంటారు  కొందరు!
అంటే అలాంటి మూర్ఖపు పని నీవు చేస్తావు ,,కానీ నేను చేయను , అని ప్రగల్బాలు పలుకుతూ ఉంటారు ,
కానీ__
""బుద్ది కర్మాను సారిని ,,!""
అన్నట్టుగా   పొందాల్సిన కర్మ ఫలితాన్ని బట్టి __తన బుద్ది ప్రేరేపిం చ బడుతూ ఉంటుంది  అన్న విషయం వారు గుర్తించ రు !__
చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే ,__
"జరుగబోయే ది  తనకు తెలియక పోవడం !_"
ఇలా  చేస్తే తనకు కష్టాలు వస్తాయి !__"అని తెలిస్తే  తాను ఆ పని  ఎన్నడూ చేయడు!!__
అయితే తనకు ఇష్టం అయితే  మాత్రం __ఎంత కష్టాన్ని అయినా ఓపికతో  భరిస్తూ ఆ పని చేస్తూ ఉంటాడు__!
ఇష్టం కాకపోతే  __అది  ఎంత సుఖమైనా , లాభ కరమై నా  కూడా __కష్టం గా భావిస్తూ ఉంటాడు
అనగా__ కష్టమైనా ,సుఖమైనా తాను  మనసు లో అనుకోడా న్ని బట్టి వుంటుంది !_
కష్టాలు సుఖాలు వేరే ఎక్కడో లేవు
తన మనసులో ఉంటాయి _అంతే !
భగవంతుడు రెండు రకాల మనిషిని అనుగ్రహిస్తూ వస్తున్నాడు __
ఒకటి , _వాడి భవిష్యత్తు  తెలుపక పోవడం !__
రెండు _ జరిగింది మరచిపో యే లా మాయ ను కమ్మడం !!_
  "గతం గోష్టి న కర్తవ్యం!" అంటారు పెద్దలు !
మంచి అయినా చెడు అయినా ,జరిగిన దానికి  అదే పనిగా  విచారిస్తూ , చేసే పని ,,కర్తవ్యాన్ని మరవవ ద్దు !__
అంటూ శ్రీకృష్ణ పరమాత్మ గీతామృతం లో జ్ఞాన బోధ  చేశాడు
"కర్తవ్యం దైవమాహ్నికం !
అంటూ  ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యం నిర్వహిస్తూ వెళ్లు ,!___""
అని అర్జునుడికి బోధిస్తాడు
  __"అయితే ఇదే  పెద్ద చిక్కు ముడి !"
అలా ఎవ్వరూ చేయరు కూడా __ ఒక్క జ్ఞాని తప్ప!
ప్రతి పనీ ,ఫలితాన్ని ఆశించే _ప్రతీ వ్యక్తి చేస్తుంటాడు !_
,అయితే , వచ్చే ఫలితాన్ని కూడా. మంచి అయినా చెడు అయినా , లాభం కానీ నష్టం కానీ , సుఖం కానీ దుఖం కానీ ,సమానంగా స్వీకరించేందుకు అతడు  సిద్దంగా ఉండాలి  !_
కానీ అనుకున్నట్టుగా ఉంటే సంతోషం  గా ఉంటాడు!
లేకపోతే దుఖం పొందుతాడు !_
కారణం స్వార్థం !
అహంకారం !,
అజ్ఞానం ! అంతేకాదు __
  తప్పు జరిగింది తన ఆలోచన ,పని మాట ల ద్వారా __అన్న విషయం తెలిసినా కూడా ,ఒప్పుకోకుండా , పశ్చాత్తాపం చెందకుండా ,అదే కరెక్టు అంటూ మూర్ఖంగా మొండిగా  అతడు వాదన చేస్తూ ఉండడం  కూడా
మనిషి యొక్క నిజమైన బలహీనత _అపరాధం కూడా !_
అందుకే అతడు తనలో ఉన్న దైవాన్ని ,__తనను నడిపిస్తున్న ఆ పరమేశ్వరుని ,__ బయట గల సర్వాంతర్యామి తత్వాన్ని అతడు  గుర్తించలేక పోతున్నాడు ,!__
నిరంతరం తనని కాపాడుతూ , _ తనకి తప్పులు దిద్దుకొ నే అవకాశాన్ని ,,బుద్దిని , పరిస్తితులను అనుగ్రహిస్తూ వస్తున్న _ ఆ దేవదేవుని కృపను అర్థం చేసుకోలేక పోతున్నాడు  ఈ అమాయక మనిషి !__
__ ప్రస్తుతం _ఈ కరోనా మహామారీ ఉద్రుత ప్రభావం కూడా. ,మనిషి చేస్తూ ఉన్న స్వయంకృతం అపరాధ ఫలితమే ,_కదా !
అది ఎవరికో ఎక్కడో _ మనదాకా వస్టే చూద్దాం _ అన్న నిర్లక్ష్య భావన _ఇపుడు కొంపలు ముంచేస్తుంది __!
""ఇతరులు బాగుంటేనే తాను బాగుంటాడు __"
అన్న సత్యాన్ని ఇప్పటికైనా_ తాను _ గుర్తిస్తూ_ తన  జీవన విధానాన్ని  సవరించు కోవాల్సిన  తప్పనిసరి అవసరం  ఇప్పుడు ఏర్పడింది !_
ఎందుకంటే ఆ దెయ్యం నీ ప్రక్కనే _ నీ ఊరిలోనే పొంచి ఉంది__!!_
ఇంతవరకూ _"నీవు ,నీ కుటుంబం బావుంటే చాలు ,!_నీవు బావుంటావు !"__
అనుకున్నావు ,, కదా ?_
ఇప్పుడు అలా కాదు ,!__
నా ప్రక్క వారు, స్నేహితులు, బంధువులు , నా వీధి లో ఉండే వారు , నా కాలనీ ,,నా ఊరువారు_ అందరూ  బావుండాలి!""_ అంటూ
ప్రతిరోజూ దేవుడికి మొక్కుకునే  సమయం ఇపుడు  వచ్చింది  !_""
  అందుచేత ,
ఉదయం స్నానం చేస్తూనే , పూజా వ్రతాలు , చేయకున్నా__ ఆలయాలకు వెళ్ళ లేకున్నా __ , దేవుడి పై నమ్మకం లేనివారు అయినా ,__ రోజూ దేవుడికి నమస్కారం పెట్టే అలవాటు లేని వారు అయినా __
ఈ విపత్తు సమయంలో మనమందరం  కలిసి __మన వారందరి కోసం _మన వాడ__ మన ఊరు __మన జిల్లా __మన రాష్ట్రం __ మన దేశం మాత్రమే కాకుండా__ మన ప్రపంచం లో ఉంటున్న__ మనవారందరి యోగ క్షేమాల కోసం __, ఈ కరోనా నుండి విముక్తి నీ పొందడాని కోసమైనా  ,__ అందరం ఒక్కటై _ పవిత్ర  హృదయాలతో _
రెండు చేతులూ జోడించి__ ఆ పరమేశ్వరుని  భక్తితో విశ్వాసం తో  ,,, నీతీ నిజాయితీ తో __ప్రార్థన  చేయాలి !_"
""అంతా మనవా రే  !""
అన్న విశాల దృక్పథం తో మనసా, వాచా ,కర్మణా భగవంతుని వేడు కుందా ము !_"
""సర్వే జనాః సుఖినోభవంతు !""
""సమస్త సన్మంగలానీ. భవంతు!""
ఓమ్ శాంతి శాంతి శాంతిః !"
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...