Monday, June 29, 2020

ఆత్మ _పరమాత్మ అనాత్మ _శరీరం - 2

June 13, 2020
, ""ఈ శరీరమే అత్మ ,,, అనీ,
శరీరంతో భోగింపబడే దే అనందం , అనీ,
తనకు ఇష్టం కానిది కష్టం అనీ,,
తనకు అనుకూలంగా ఉన్నది సుఖం , అనీ__
ఇలా  మనసు చెప్పినట్టుగా తాను  నడుచు కోవడం , జీవుడి అజ్ఞానం ,అవిద్య  అవివేకం అమాయకత్వం  తెలియజేస్తోంది !_
మనసును నియంత్రించ లేకపోతే సద్గతి కి నోచుకోకుండా దుర్గతి పాలౌతాడు కదా !_
జీవుడు తన మనసుని  ఇలా అంతర్ముఖం చేయకుండా _ బహిర్ముఖుడు  అవుతూ ఉండడం  ,అతడి గత జన్మ సంస్కార ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది ,
అందుకే పెద్దలు ""
దేనికైనా పెట్టీ పుట్టాలి_!"" అంటారు  ,
జీవుడు  తనకు కనిపించని తన కర్మల మూటను    నెత్తి మీద ఎత్తుకొని    జీవన చర్యలను. కొన సాగిస్తూ వుంటాడు __
, అత్మ స్థానం దైవాంశ గలది  ! అది, సత్యమూ నిత్యమూ శాశ్వతము ,పరమానంద భరితము దివ్యము ! __ ,  ఆ పరమాత్ముని సన్నిధానం మరియు  పరమ ధామం కూడా !_
__అనాత్మ  అనబడే ఈ శరీరం  యొక్క ఉనికి ,నిత్యం మారుతూనే ఉంటుంది  l,
ఇది జీవుడికి ఇక పరికరం లాంటిది , !
రాయడానికి ఉపకరించే పుస్తకం పెన్ను ల వలె__ శరీరం  పరమాద్భుత మైన ఒకసాధనా బలం  __!
, _ అత్మ ఉద్దరింప బడటానికి , జీవుడు సత్కర్మలు, సత్ చింతన చేయడానికి _ ఈ శరీరాన్ని జీవుడు  వినియోగిస్తూ ,జీవన్ముక్తి ని సాధించా ల్సి ఉంటుంది -!
అనగా బ్రతికి ఉండగానే  _ జీవుడు , అంతర్ముఖు డై, మనసుతో  అత్మ విచారణ చేస్తూ , ఆత్మానందాన్ని పొందే సన్మార్గాన్ని   _వేదకు తూ ఉండాలి !_"
నిజమైన శాశ్వతమైన ఆనంద స్థితిని అందించేది ఒక్క  ఆత్మానుభవం ద్వారా మాత్రమే  సాధ్యం అవుతుంది !__
అందుకు _పంచేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు  __ శరీరాన్ని ఆశ్రయించి ఉంటున్నా ఈ పదకొండు అద్భుత శక్తుల సహాయం చాలా అవసరం  అవశ్యకం కూడా !!_
భగవంతుడు ప్రసాదించిన ఈ దివ్య మంగళ శరీరాన్ని__ నడిచే  దేవాలయంగా  మార్చుకోవడం _ తాను దైవ స్వరూపుడిగా  భావించడం __ శరీరంతో కాపురం సాగిస్తూ జీవిస్తున్న ఈ  జీవు డు  చేయాల్సిన అతి   ముఖ్యమైన  పని  !__
  , అనగా మనసు పై నియంత్రణ అవసరం _!
దైవం పై ప్రగాఢమైన విశ్వాసం , భక్తి శ్రద్ధలు అవసరం _!
   స్వచ్చమైన  సంకల్ప బలం అవసరం _!
గురు కృప అవసరం_;
తగిన ప్రయత్నం నిరంతరంగా కొనసాగించడం అవసరం_!
,శరీరం సత్యం కాదు!_  అది ఆత్మ కాదు!_
నిత్యం కాదు_!
, ఆనందకారం కాదు!
శరీరాలు అన్నీ నశించేవే ,,!
అన్న నిజాలు  మనకు తెలుసు !
అయినా __ కూడా _!
ఈ శరీరం దివ్యం , పరమాద్భుతం !,అమోఘం!  భగవంతుని సాక్షాత్కారం కలిగించే అపురూప  అద్భుత సాధనం _!
ఈ శరీర ధారణతో నే  మహాత్ములు ,మహ భక్తులు, కవులు గాయకులు , సిద్ధ పురుషులు   పరమహంస లు ,  పరమేశ్వర అనుగ్రహాన్ని పొందారు_!
బొందితో పరమాత్ముని సన్నిధానం కూడా చేరారు _!
,  మానవ జన్మ పరమ ఉత్కృష్టమైన ది
దీని విలువ తెలుసుకోలేని అజ్ఞాని  _సంసార చక్రంలో జన్మ జన్మల పరంపర లో భ్రమిస్తూ , సద్గతి తెలియకుండా _ మోక్షానికి నోచుకోకుండా ఉంటాడు _!
ఈ శరీరాన్ని __తన యోగ విద్యతో __ నిశ్చలమైన , దైవారాధన తో ,  నవ విధ భక్తి విధానాల్లో  , తనకు వీలైన ఏదో ఒక భక్తి మార్గం తో _ పరమాత్ముని కి  సంపూర్ణ  శరణాగతి చేస్తూ ఆత్మానందాన్ని పొందవచ్చు,!_ ఇదే శరీరంతో బ్రతుకీ వుండగానే   ఆ పరాత్పరుని సాయుజ్యాన్ని పొందవచ్చు ను!
ఇది సాధ్యం అవుతుందని చెప్పడానికే ,పరమాత్ముడు రాముడు కృష్ణుడు  లాంటి అవతారాలు ధరించి , మానవ శరీర ధారణ వైభవాన్ని ,ప్రభావాన్ని ,మహాత్మ్యాన్ని చాటి చెప్పారు !_
  శరీరం ఆత్మ కాకున్నా ,__
దానితో పొందే ఆనందం శాశ్వతం కావని తెలిసినా ,__
ఈ శరీరం లేకుండా అత్మ ను  గురించిన అవగాహన రాదు _!
,కళ్ళతో వేంకటేశ్వర స్వామి దివ్య మంగళ విగ్రహ స్వరూప వైభవాలను దర్శిస్తే నే కదా  __
ఆ జగన్మోహన ఆకారం _నీ హృదయంలో అంటే_ ఆత్మలో సాక్షాత్కా రించేది !_ ఆ మహా భాగ్యం  లభించేది ;. ఈ శరీరంతో అనుభవం పొందితేనే కదా !__
భగవంతుని దివ్య పుణ్య గాథలను వినడానికి __ఈ చెవులు ఉంటేనే కదా __! ఆ ఆనంద నిలయుని మధుర భావనలు _ఆత్మకు ప్రశాంతత ను  ఆనందాన్ని అందించేవి _!
,శరీరం  సహకరిస్తే నే కదా. కలియుగ  ప్రత్యక్ష దైవం _ఆ తిరుమల  శ్రీనివాసస్వామి ముందు నిలబడి , _
ఆ పురుషోత్తముని కమనీయ _రమణీయ మహనీయ _ కోటి మన్మథ సాలగ్రామ  అపురూప సౌందర్యాన్ని _  కళ్ళారా  తిలకిస్తూ మనసారా  ఆయన అందాలు  జుర్రుతూ __ నోరారా శ్రీహరి నామ గానం చేస్తూ ,,
ఆ ఆనంద పారవశ్యం తో అంతరంగం లో, మనసు ఆత్మలో లయించి _ నాట్యం చేస్తూ ఉంటే __కలిగే  ఆత్మానందం తో __పులకించే  మహా భాగ్యం కలుగేది. ._!
అందుకే  పరమాత్మ జీవుడికి  శరీరాన్ని ఊరకే ఇవ్వలేదు !
  _తనకు విధింపబడిన కర్మలు చేస్తూ  _కర్మ యోగి వలె , చేసిన చేస్తున్న  చేయ బోతున్న సమస్త కర్మలు __ ""సర్వం _ బ్రహ్మా ర్పనం_!"" చేస్తూ   _అంటూ దైవాన్ని ధృఢ చిత్తంతో అర్చించాలి !_
   శరీరాన్ని కేవలం  _ ప్రాపంచిక సౌఖ్యాలు __ఇంద్రియ భోగాల కు మాత్రమే పరిమితం చేయకుండా __  ఆ సచ్చిదానంద ఘన స్వరూప ప్రకాశంలో _ ధన్యత పొందాలని _
జీవుడు చిత్తశుద్దితో సంకల్పించాలి  !
"",నన్ను పూజించు! ధ్యానించు ,!భావించు ! నా గురించి విను , ! నా వైభవాన్ని లీలలను పాడుతూ ఉండు , !
నన్ను పొందడమే ధ్యేయంగా చేసుకొంటూ.   నీజీవన చర్యలలో సదా నన్నే స్మరిస్తూ జీవిస్తూ ఉంటే ,__
_ నీ యోగక్షేమాలు నేను  చూస్తూ ఉండే  పూర్తి బాధ్యత నాదే ! _!"
అంటూ గీతాచార్యుడు  మానవాళికి   అమూల్యమైన భగవద్గీత  గ్రంథం ద్వారా   ఈ సత్యాన్ని ,ఆవిష్కరిస్తూ  మనకు  అనుగ్రహించాడు  ,
ఏ పనీ చేస్తున్న _  ఏది భావించిన _అది పరమాత్ముని కి అర్పిస్తూ చేసే  ""_శరీర జ్ఞానం ," పరమానంద కరమ్_!
భుక్తి ముక్తి దాయకం! పరమాత్మ ఆమోదితం !
సర్వే జనాః సుఖినోభవంతు!_"
సమస్త సన్మంగాలాని భవంతు !"
ఓమ్ శాంతి శాంతి శాంతిః!_"" సర్వం  శ్రీ పరమేశ్వర చరణారవిందార్పన మస్తు !""
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !_""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...