Wednesday, June 3, 2020

మృత్యు భయం _3

May 30, 2020
" వాలి సుగ్రీవుల వైరం" మనకు తెలుసు !
ఇద్దరిలో ఒకరు చస్తే గానీ , పగ చల్లారలేదు !
", అన్న చంపేస్తాడు !"అని తెలిసి ,  మృత్యు భయం తో ,,అతడు రాలేని  ఋష్య మూక పర్వతం పై ఉండి పోయాడు  సుగ్రీవుడు !!,
  !
నిజానికి _"మృత్యు భయంతో  " తనలో  జ్ఞానోదయం అవుతుంది ,!, కానీసుగ్రీవుడి కి   మాత్రం అన్న పోయినా ,రాజ్యం వచ్చినా,  మారు మూల దాగిన కూడా  జ్ఞానం రాలేదు ,!
భోగ లాలస తో ,ఇంద్రియాల కు వశుడై పోయాడు , !రామాజ్ఞ ను కూడా మరిచాడు !
  కొందరు అదృష్టవంతులు  ఏ భయానికి  ,ఆవేదనకు  గురికాకుండా  నే ,,మృత్యు దేవత దయకు నోచుకుంటారు !
గుండె పోటుతో ,నిద్రలోనే పోయేవారు , విమాన అగ్ని జల ,భూకంపం ప్రమాదాలలో   చిక్కి   కను రెప్ప పాటులో ,,ప్రాణాలు కోల్పోయే వారు ఉన్నారు !
మృత్యు వు ఎటు వైపు నుండి దూసుకు వస్తుందో కదా అన్న భయంతో  అనుక్షణం ప్రాణాలు. అరచేతిలో పట్టుకొని , దేశ భక్తి దీక్షతో  ,,దేశ సరిహద్దుల్లో శత్రువుల తూటా లకు  బలి అవుతూ  అనుకోకుండా  అక్కడికక్కడే అసువులు బాసిన వారు , మన దేశ జవానులు __ నిజంగా ధన్యులు !!
ప్రతి వాడూ ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదు,!
మృత్యు భయం తో  హాస్పిటల్ లో లేదా ఇంట్లో   వృద్దాప్యంలో ,రోగాలు,కరోనా వంటి  వ్యాధులతో  ,మంచం పట్టి , చావు కోసం ఎదురు చూస్తూ ,చావడం మామూలు విషయమే ,! కానీ     దేశం కోసం  దేశ సేవ ,దేశం అంటే ప్రేమ ,, తోటి వారి ప్రాణ రక్షణ కోసం ,అందరూ నా వారే అనే దివ్య భావనతో సరిహద్దుల్లో పోరాడుతూ , ఆత్మ సమర్పణ చేసే వీర జవాన్లు  నిజంగా అమరులు ,!.
బ్రతుకు అంటే వారిదే,!
""పరోపకారార్ధం ఇదం శరీరం !"
శరీరాన్ని పోషించేది  తనకు  వీలైనంత గా ,ఇతరులకు సహాయం  కోసమే  అని ధర్మ శాస్త్రాలు చెపుతున్నాయి,!
ఇతరుల ప్రాణాల కోసం ,,తమ ప్రాణాల్ని త్యాగం చేయడం  కన్నా మించిన గొప్ప ధర్మం ,ధనం , మానవత  ఏ శాస్త్రం లోనూ లేదు కదా !
ఎందుకంటే వారు ఏ భయం లేకుండా నేరుగా మృత్యువు నే ఎదిరిస్టూ చాలెంజ్ చేస్తున్నారు !
  బిడ్డకు జన్మ ఇస్తున్నప్పుడు తల్లి అనుభవించే   బాధ వర్ణనాతీతం ,! . ఆమె తన 
ప్రాణాలతో  నే చెలగాటం ; ఆడుతూ ఉంటుంది !!
అయినా తల్లి,తన ప్రాణాన్ని ఫణంగా పెట్టీ ,, ప్రసవ వేదనా నరకాన్ని , ఎంతో  ఇష్టంగా  సహిస్తు, భరిస్తూ,నరక యాతన ను ఇదే లోకంలో బ్రతికివుండగానే చవి చూస్తూ,  బిడ్డను కంటుంది !!
ఆమె తపః ఫలం అది!
ఎన్నో జన్మల కలల నోముల పంట అది !;
ఎంత ఆనందమో ఆమెకు,?   తాను పడ్డ అంత కష్టాన్ని , దుర్భర వేదన నూ, పొత్తిళ్ళలో తన బిడ్డను చూస్తూ మరచి పోతుంది !
అందుకే తల్లి ప్రేమను మించిన ప్రేమ ఉండబోదు  సృష్టిలో !!"
,ఆమెకు ఈ సమయంలో మృత్యువు అంటే భయం లేదు !
నిజానికి అది ఆమెకు జీవన్మరణ సమస్య ;! అయినా ఆమె లెక్క చేయదు కదా !
ఎందుకంటే తన ప్రాణం కన్నా ,తన బిడ్డ ప్రాణం ముఖ్యం అని భావిస్తుంది !,
తాను ఏమైనా ఫర్వాలేదు ,!కానీ  తన బిడ్డ బాగుండాలి ,,ఆరోగ్యంగా ఉండాలి ! అంతే!
ఆమె జీవితాంతం ఇదే ధ్యేయంగా జీవిస్తుంది !!
ప్రాణ త్యాగానికి అయినా సిద్ధపడి మృత్యు దేవత ను ఎదిరిస్తూ తన  త్యాగ  భావంతో, ఈ, "మాతృ దేవత   , సృష్టి లోని సకల దేవతల కంటే గొప్పది !" అని నిరూపిస్తూ ఉంటుంది !
అందుకే ప్రేమ  గొప్ప ది,
దాంతో  కేవలం మృత్యువు నే కాదు ,,
విశ్వాన్ని  కూడా జయించవచ్చు ,!
సతీ సావిత్రి తన భర్త పై ఉన్న ప్రేమ కోసం మృత్యు దేవత ను కూడా ఎదిరించింది ,!;
భాగవత భక్తులు , భగవంతుని పై ఉన్న అపారమైన ప్రేమతో , అతడి సేవలో ,తమ ""మృత్యు భయాన్ని ""కూడా  లెక్కచేయకుండా ,, భక్తితో  దైవారాధన లో తరించి ,,శ్రీకృష్ణ సాయుజ్యాన్ని పొందారు!! ,,
అలాగే ,జీవుడు శరీరం నుండి నిష్క్రమిం చే సమయంలో ,అనుభవించే  మరణ అవస్థ ,ఎంత ఘోరంగా ఉంటుందంటే ",,,వేయి తే ళ్లు ఒక్కసారిగా తనను  కుడితే ఎంత బాధగా ఉంటుందో !"""
అంత నరకం,"", జీవుడు , అనుభవిస్తూ ఉంటాడని "" అని శాస్త్రం చెపుతోంది ,
మృత్యువును  సమీపిస్తున్న మనిషికి  మృత్యు భయం పోవాలి అంటే ,మృత్యువు గురించిన జ్ఞానం తెలియాలి ,!!
ఇందుకు ఒక చిన్న కథ చెప్పు కుందాం!!
__ ఒక రాజ్యంలో ,,ఇద్దరు అన్నదమ్ములు  అన్యోన్య ప్రేమానురాగాల  తో  ,ప్రేమగా కలిసి ఉంటున్నారు !!
అన్న రాజు,తమ్ముడు యువరాజు గా ఒక ప్రాంతాన్ని పాలిస్తూ ,ధర్మం నీతి నిజాయితీ లను చక్కగా  పాటిస్తూ ఉన్నారు!!
ఒకరోజు అన్నగారు వేటకు వెళ్ళాడు!
,వారం గడిచినా  అతడు తిరిగి రాకపోవడంతో , మంత్రులందరూ కలిసి తమ్ముడికి బలవంతంగా  రాజ్యాభిషేకం చేస్తారు ,!;
రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు , కదా !
మరునాడే అన్న గారు తిరిగి వస్తాడు ,క్షేమంగా ,!!
తాను త్రోవ తప్పాడ నీ, వేదక్కుంటు రావడానికి ఇన్ని రోజులు పట్టిందని చెప్పాడు !,
_ఈ లోగా , అక్రమంగా ,, ఈ రాజ్యానికి  " రాజు గా ప్రకటించు కున్న తమ్ముడికి మరణశిక్ష ను విధిస్తాడు !
తమ్ముడు కాళ్ళా వెళ్ళా పడి ఏడుస్తూ అన్నను వేడుకుంటూ ఉంటాడు _
  ఇందులో తన తప్పు ఏమీ లేదని , మంత్రుల ప్రోద్బలంతో నే  ఇదంతా జరిగిందని  ,క్షమించమని  ఏడుస్తూ అన్నగారిని ప్రాధేయ పడుతాడు ,
,,__కనీసం తోడబుట్టిన వాడిగా నైనా దయ జూపమని  అన్నగారి కాళ్ళు పట్టుకుంటాడు తమ్ముడు ;
""రాజద్రోహం"" కింద నీకు ఈ శిక్ష తప్పదు!
, అయినా. నీవు  పశ్చాత్తాపం  పొందుతూ ఉన్నావు కనుక ,ఒక వారం రోజులు నిన్ను చెరసాల లో స్వేచ్చగా ఉంచేస్తాను ,!
వారం తర్వాత నీ తల నరకడం ఖాయం!""
ఈ లోగా. ఈ వారం రోజులు  నీకు రాజ భోగాలు లభిస్తాయి!,,త్రాగడానికి మధువు,, భుజించ డానికి కమ్మని షడ్రసోపేతమైన విందు భోజనాలు నీకు అందజేస్తారు;
ఆనందించ డానికి, శృంగార జీవితం అనుభవించడానికి నీకు  అందమైన వనితలు  ,నిన్ను అనుక్షణం సేవిస్తూ ఉంటారు ,!
ఏది కోరితే అది ,నీకు క్షణం లో ఇవ్వబడుతుంది ,!
  ఈ వారం రోజులూ ఎంజాయ్ చేస్తూ  హాయిగా ఉండు, తమ్ముడూ !"""
అంటూ వెళ్లిపోయాడు అన్నగారు  ,
అన్నట్టుగానే తమ్ముడికి వినోదాలు విలాసాలు ఏర్పాటు జరిగాయి ,
  రాత్రి గడిచి , ప్రతీ రోజూ తెల్లవా రుతూ నే,, రాజభటుడు  వచ్చి ,""ఒక రోజు గడించింది ""!
రెండో రోజు,,! మూడో రోజు,!,"అంటూ చావు హెచ్చరిక చేస్తూ, చివరకు , ఈ రోజు ఏడవ రోజూ "" గడచింది , !""
రేపు తమరికి శిరచ్చేదం!"" అంటూ  చెప్పి వెళ్లిపోయాడు!
,  అతడి మరణ దండన కు అంతా సిద్దం చేశారు,
తమ్ముడు వధ్య  శిల పై తలను వంచాడు
తలారి   చేతిలో కత్తిని  ఎత్తే ముందు ,అడిగాడు , ""మీకు చివరి కోరిక ఉంటే చెప్పండి ,,తీరుస్తాము!!"" అన్నాడు ,
""నాకు రాజుగారిని చూడాలని వుంది!"" ,అన్నాడు తమ్ముడు !
వచ్చాడు రాజు,!
" ఏమిటీ ?!"ఇంకా నీకు భోగించడానికి సుఖాలు , సమయము కావాలా ?
ఈ వారం రోజులూ,, అనుభవించిన సౌఖ్యాలతో నీకు  తృప్తి కలగ లేదా?""
అన్నాడు__
(  ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...