June 14, 2020
"కృష్ణా ,,! నీవు అవతార పురుషుడు వని నాకు తెలుసు,! నాతో ఈ బృందావనం లో ఉండబోవని తెలుసు!
,కానీ నిన్ను క్షణ కాలం కూడా _చూడకుండ ఉండలేని నేను__ ఒంటరిగా ఇక్కడ నీకు దూరంగా_ ఏం చేయాలో చెప్పు ? ఎలా బ్రతకాలో చెప్పు !? కృష్ణా ,, చంద్రుని విడిచి వెన్నెలా నిన్ను విడచి నేనూ ఉండగలనా ?
ఆ విషయం గుర్తుకు వస్తెనె భయాందోళన కలుగుతూ ఉంటుంది కృష్ణా !!_ దయచేసి నాకు నీ విరహాన్ని భరించే దారి తెలుపు !__"
_"రాధా ! నా గురించి అంతా తెలిసిన నీవే __ఇంత బేల వైతే ,, మరి ఆ అమాయక గోపికల సంగతి ఏమిటీ !?"" చెప్పు !"
"" కృష్ణా ! నా ప్రాణం నీవు , !
భువన మోహనము గా మృోగిస్తూ ఉంటున్న ఆ వేణు నాదం నా కోసమే అని తెలుసు !"
నీవు మ్రోగించేది వేణువు కాదు , _నా హృదయ తం తువులను సున్నితంగా మీటుతూ , నీ ఊపిరిని నాలో ఊదుతూ ,_ఉంటే నేను పొందే అద్భుతమైన మధురాతి మధుర మైన ఆనంద లహరి లో. దూది పింజ వలె తేలిపోతూ _బ్రహ్మానంద అనుభూతి తో ,పరవశం కలుగుతూ __ ఉన్నట్టుగా అనిపిస్తుంది ,,
___ కృష్ణా !నీ వేణునాదం లో ఏ అద్భుతశక్తీ ఉందో _తెలియదు కాని , అది నన్ను పిలుస్తూ , నా ప్రాణాలు తోడేస్తూ ఉంటుంది ,__
కృష్ణా నీవు లేని నేను మనలేను !"
""__రాధా !నా ప్రియ సఖి! ,నీవు అపర గోలోక దేవతా మూర్తి వి !_ మామూలు మానవ కాంత వలె మాట్లాడకు సుమా !__""
""కృష్ణా !నీవు నామాట దాటే స్తున్నా వు సుమా _!""
చారు శీలా ! ప్రియా _ హే రాధే !, నా ఆరాధ్య దేవతా !_ నీకోసం ఏదైనా చేస్తాను నీకు ఏం కావాలో చెప్పు , !""
__"కృష్ణా !_ నేను నిన్ను రెండు వరాలు కో"రుతున్నాను సుమా !_""
_ రాధా !_రెండు కాదు_ కదా ,,_ ఎన్నైనా ఇస్తాను ,, చెప్పు!""
కృష్ణా ,!__
ఒకటి , దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ నీ అవతార లక్ష్యం అని నాకు తెలుసు ,! అందుకు నీవు వెళ్ళ క తప్పదు అని కూడా తెలుసు !_
అందుకే నాకోసం నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను ,__!
__" రాధా !అలా నీవు కంట నీరు పెట్టకు రాధా _! నేను చూడలేను ! , నీ కన్నీరు నా కాళ్ళకు బంధాలు వేస్తూ నా కర్తవ్యాన్ని మరిపిస్తు ఉంటుంది సుమా !""
అందుకే ,నీవు నా హృదయంలో నిలిచి అంతరంగం లో పరామానందాన్ని సదా నాకు కలిగిస్తూ ఉంటావు !_
__"నీవే నేను ,నేనే నీవు_" గా ఉంటున్న మనం , ఎప్పుడూ వేరుగా ఉండము!_
__"రాధా !నేను నీలో ఉండటం మాత్రమే కాదు !, నీవు కూడా నాలో ఉంటూ నాకు శక్తిని చైతన్యాన్ని ,కర్తవ్య నిర్వహణ దక్షత నీ కలుగ జేస్తూ ఉంటావు సుమా _!
__ఇక నీ రెండవ కోరిక ఏమిటీ రాధా ?""_
"" కృష్ణా !, నిన్ను ఎడబాసి _నీ విరహానల జ్వాలల లో _ నేను ఎన్నాళ్ళు నీ స్మరణలో బ్రతుకుతూ ఉంటానో __?నాకు తెలియదు !
,కానీ ఈ పవిత్ర ధరిత్రి ని శాశ్వతంగా విడిచే ,_ నా అంతిమ క్షణాల్లో మాత్రం నీవు నాకు ఎదుట కనిపించాలి , నీ దివ్య మంగళ విగ్రహం దర్శనంతో నన్ను. దన్యుతాలను చేయ్యి కృష్ణా ,!_ పరమ ప్రశాంతత , నూ,, పరమ అనందాన్ని నాకు అనుగ్రహించు నా ప్రాణమా!__""
'"రాధా _! నిన్ను ఆనందంగా ఉంచడమే నా లక్ష్యం సుమా !- అది నా నా బాధ్యత కూడా ! ""నాకోసం జీవిస్తూ_ నన్నే ధ్యానిస్తూ _భావిస్తూ , ఉండేవారి యోగక్షేమాలు నేనే స్వయంగా చూస్తుంటాను _!"
అని నేను నే భక్తులకు ప్రమాణం చేశాను _!
"నిన్నే కాదు _నన్నే నమ్ముకున్న ఈ వ్రజవనితలను కూడా నా సన్నిధానం లో చేర్చుకుంటా ను _!
"" రాధా !_నీవు అడగకుండానే మరొక అద్భుతమైన వరాన్ని కూడా నీకు ఇస్తున్నాను _!
ఇకనుండి ""ఈ బృందావనం దివ్య సీమ _ ఈ రాధా కృష్ణుల ప్రేమనిలయంగా " ప్రసిద్ది పొందుతూ ఉంటుంది_!
అంతేకాదు -!ఇక్కడ నీవు అధి దేవత వు గా ఉంటావు _! ,"నన్ను ఎవరైనా దర్శించాలి _!""అంటే అందుకు ముందు వారు _నీ అనుమతి తీసుకోవా ల్సి ఉంటుంది _! ఈ శ్రీకృష్ణుడు _ రాధా విధేయుడు , రాధా కృష్ణుడు , రాధా మానస విహారుడు _ _"అంటూ. భక్తులు నాకు కొత్తగా నన్ను నీతో కలిపి పిలుస్తూ నన్ను ఆనంద పరుస్తూ ఉంటారు ,
తమ ఇష్టదైవం కు ఏది ప్రియమో ఆ విధంగా భక్తులు నామ స్మరణ చేస్తూ నివేదన సమర్పిస్తూ ఉన్న భక్తులు _నాకు అత్యంత ప్రియులు అవుతున్నారు ,__
""_కృష్ణా !నేను అపారమైన నీ ప్రేమ సామ్రాజ్యంలో నన్ను నీ పట్టమహిషి గా చేసి ధన్యురాలి నిచేశావు కదా ,!_ నీ అపురూప ప్రేమానురాగాల అమృత వర్షం లో నన్ను తడిపిస్తు_ తాదాత్మ్యం పొందుతూ పరవశిం చే మహా భాగ్యాన్ని అనుగ్రహించా వు __
ఇందుకు బదులుగా _నీకు ఏమివ్వ గలను కృష్ణా ,?"
""రాధా ,,!_నీవు ఇవ్వవలసింది ఒకటి ఉంది _!"
'"ఏమిటది చెప్పు ?_కృష్ణా !
_"ఇంకా నాది !"అంటూ నా వద్ద ఏమి మిగిలి ఉంది _ చెప్పు ?"'_
""_, రాధా , నా శక్తి వి నీవు ,! నా శ్వాస వు నీవు ,! నా మార్గ దర్శనం చేసే జ్యోతివి నీవు _! నా ప్రాణం నీవు ,! అయినా _, నీవు నాకొక మాట ఇవ్వాలి _రాధా !_""
_స్వామీ కృష్ణా !_ నా ప్రాణ,నాథా _!జగన్నాథ,! _ నన్నింతగా నీ ప్రేమామృత భావాల్లో ముంచెట్టుతూ మత్తెక్కిస్తూ_ నా అస్తిత్వాన్ని మరపిస్తు_ ఉంటున్న ఓ పరాత్ప రా _! __నీకు ఎలా నా ధన్యవాదాలు తెలిపేది_? _కృష్ణా !_ నవనీత చోర ,, నంద కుమారా !_నీకు శతకోటి ప్రణామాలు _!
""_రాధా !నీ అంతరంగం నాకు తెలుసు ,!
అయినా నా పరోక్షంలో నీవు ఇక్కడ ,నేను అక్కడ ఆనందంగా ఉండాలి ,_!"అంటే నాకు నీవు ఒక మాట ఇవ్వాలి రాధా _!""
_""కృష్ణా_, చెప్పు !_ఏదైనా నీకు సమర్పించడం లో ఎంత ఆనందం ఉంటుందో మాటల్లో చెప్పలేము , సుమా !""
నిజానికి " ,భాగ్యం "అంటే ఇదే కదా !_ఇంతకు మించిన ఆనందం ఎవరికి ఉండ బో దు కదా !_""
__""రాధా ! ఇలా నన్ను అదే పనిగా తలచుకుంటూ _నీవు కంట నీరు పెట్టకుండా ఉండాలి ,_!
ఇదే నా కోరిక !_ ఎందుకంటే నీ ఆశృధారలు నా మార్గానికి అడ్డుగా నిలుస్తూ __విచలితుని చేస్తూ ,కర్తవ్య విముఖున్ని చేస్తాయి _!
__""అందుకే రాధా !,నేను నిన్ను విడిచి వెళ్ళిపోయాక __ దుఖించ కుండా_కన్నీరు పెట్టకుండా ఉంటానని నాకు నీవు మాట ఇవ్వాలి రాధా _!""
, _"" అహో ,కృష్ణా!_ నీవు ఎంత నిర్దయుడవు !_,నీవు పరమత్ముడవు ,నీకు బాధ దుఖం కష్టాల కు నీవు అతీతుడవు _ కదా !
ఈ మానవ కాంత_రాధా హృదయం లోని కృష్ణా విరహ తాపాన్ని ఎలా నీకు అర్ధం చేసేది ??_
_ నీకోసం నేను పడుతున్న నా విరహాగ్ని నా,ఈ కన్నీటి ప్రవాహం లోనే చల్లారుతు _నాకు కొంత స్వాంతన , కలిగిస్తూ ఉంటుంది _
ఇపుడు కనీసం ,అలా నా హృదయ భారం_ మనో వేదన తగ్గించు కోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నావా _? గోపాలా ,!" ఇది నీకు న్యాయమా ,చెప్పు ?__
__""కృష్ణా !నీకేం తెలుసు స్త్రీ హృదయం_? అది ,ఎంత సున్నితమైన దొ _?ఎంత సుకుమార మో ??-
నీవు స్త్రీ వి కాదు కదా ,!నీకు తెలియదు ! చెప్పినా నీకు అర్ధం కాదు _!
తన దైవాన్ని ప్రాణ సమానంగా _ ప్రేమిస్తూ_ ఆరాధిస్తూ_ తన జీవితాన్ని అతడికై పూర్తిగా అంకితం చేయగలిగే త్యాగ గుణం__ ఒక్క స్త్రీలకు మాత్రమే సాధ్యం _!
నీవు స్త్రీ గా మారినా కూడా __ నీ హృదయం లో నిరంతరం కొలువై ఉండే ఈ కృష్ణుడు ఉండడుగా _!
అయినా_ "గుండెను బండ రాయిగా ""_చేసుకుంటూ నీకు మాట ఇస్తున్నాను _!
""కృష్ణా _! ఈ క్షణం నుండి_ నీ రాధ__నీ కోసం __ఒక్క కన్నీటి చుక్క కూడా రానీయ దు _సరేనా ??_""అయినా , కృష్ణా !_
_నీవే నా వాడవయ్యాక ,"__ ఎల్ల వేళలా నీవే అంతరంగం లో ఉంటూ బ్రహ్మానందం కలిగిస్తూ ఉంటే __,నాకు ఈ కన్నీటి తో పనేముంది ??__
"" రాధా ._! నా ప్రియతమా _ నా ఆరాధ్య దేవతా ,,రాధికా !_ నా ప్రాణ సఖీ_!_
" ఇక నేను వెళ్లి వస్తాను _!
""కృష్ణా_! ఇదిగో __నీ పాదాల వద్ద ప్రణమిల్లుతు ఉంటున్న నీ_ఈ _రాధను అనుగ్రహించు ,__!
తిరిగి _ఎప్పుడో_ ఎక్కడో_ ఏ విధంగా నీవు నన్ను ఎలా కరునిస్తూ ఉంటావో_??
అంతా నీదే భారం _!_ __ ఈ రాధాదేవి _ మా కృష్ణుని __తన కొంగున ముడివేసుకొని , కృష్ణుడు లోక కల్యాణం చేయకుండా ఆపింది ,_! _మా మీద ఆమెకు దయలేకుండ పోయింది ,_! ఆమె _తన స్వార్థమే చూసుకుంది _!
మా స్వామిని మా వద్దకు రాకుండా కృష్ణుని నిర్బంధించి _మమ్మల్ని ఈ రాక్షసుల బాధ నుండి తప్పించుకునే దారి లేకుండా చేసింది _! అంటూ నీ భక్తులు బాధ పడుతూ ఉంటే , నా విషయంగా నిన్ను _ వారు మాటలు అంటుంటే __నేను సహించ లేను ,కృష్ణా ,!"
""వెళ్ళిరా _! జయొస్తు ! విజయోస్తు ! శుభమస్తు ! హే మాధవా, కేశవా,మధుసూదనా !_ రాధాకృష్ణా !,విజయీభవ ,!
జై శ్రీ రాధే జై శ్రీ కృష్ణ !
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా !_
Monday, June 29, 2020
రాధా దేవి ఆంతర్యం
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment