June 8, 2020
మనిషి ,,జంతువులకు "ఎర" వేసి పట్టి ,,వాటిని తాడుతో కట్టి బంధించి ,అవి తాను చెప్పినట్టు వినెవరకూ,, చెయ్యమన్నది చేసేవరకూ దాన్ని బోనులో వేసి , వాటిని తిండికి ,దప్పికి మాడ్చి ,తనకు నచ్చినట్టు గా ఆడిస్తూ, ఆ మూగ జంతువులను బొమ్మలు చేసి ,తాను పబ్బం గడుపుకుంటు ,దాన్ని ప్రదర్శిస్తూ డబ్బును సంపాదిస్తూ ఉంటాడు
__ పాపం విధి లేక,, తమ సహజ గుణాలను మరచి , కృత్రిమ అలవాట్ల ను నేర్చుకుంటూ __కొన్ని రోజులకు అదే అలవాటై ఏ తాడు లేకుండానే అవి అతడికి కట్టు బానిసలు గా స్థిరపడి పోతుంటాయి __, పులి సింహము ఎలుగుబంటి ,ఏనుగు ,చిరుత వంటి క్రూరమైన మృగాలను కూడా అతడు కీలు బొమ్మలుగా మార్చి __ఆడిస్తూ ఉంటాడు
__కారణం , అవి అజ్ఞానంతో _ ఆహారం పై మోహం తో _వాడు పన్నిన వలలో చిక్కుకోవడం , వల్ల బందీ అవుతున్నాయి _
అందమైన రామ చిలుక లాంటి పక్షులను అయితే _ చేపలకు ఎర వేసి పట్టినట్టుగా పట్టుకొని పంజరంలో బంధించి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు ___
ఇది ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మూగ జంతువుల విషయం !!
__ కానీ , ఈ మనుషులు మాత్రం , ఎలాంటి తాళ్ళు కూడా అవసరం లేకుండా కేవలం ""మోహం " అనే పాశాలకు అంటే కంటికి కనపడని తాళ్ళ కు ఒకరికొకరు జీవితాంతం బందీలై ఉంటున్నారు , కదా !!
ఈ త్రాళ్లు మాత్రం ,కంటికి కనపడని _మహ శక్తివంతమైన ,బంధనాలు ,
!ఇవి మనం తెంపుకుంటే తెగే వి కావు ,!
పైగా ,ఎంత మందితో ఎంత మమకారాన్ని ,బందుత్వాన్ని , పెంచుకుంటూ ఉంటే ,రాకపోకలను ,,ఇచ్చుకుని పుచ్చు కోడం ఎంతగా చేస్తూ ఉంటే , అంతగా వాటితో ,మరింతగా , ఇంకా ఇంకా గట్టిగా ,బలమైన మోకు తాడులా తయారై ,, అడుగు కదలనీయకుండ , వారికి వేరే ఆలోచన. ఏదీ రానీయకుండా ,,అదే ధ్యాస అదే ,యావ ,అదే పిచ్చిలో లేవకుండా అతః పాతాళ లోకాల లో కి త్రోసి వేయబడుతూ ఉంటాడు;!
ఆ మోహం l అనే బంధనం భార్యా భర్తల దే కావచ్చు ,! తండ్రీ కొడుకుల, తల్లీ కూతుళ్ళ , స్నేహితులు ,బంధువులు , యజమాని సేవకుడు లదే కావచ్చు !,ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటున్న ఏ బంధం అయినా ,ఎక్కువైతే మోహా న్ని ,ఇంకా అతిగా పెంచుకుంటే వ్యామోహాన్ని కలిగిస్తూ ఉంటుంది ,!
ఒకమనిషి తన పెంపుడు జంతువు , పిల్లి కుక్కా లాంటి పై పెంచుకునే మమకారం కావచ్చు _
ఏదైనా తాను కదలకుండా ,ఇతరులను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటూ ,స్వేచ్చగా విహరించే అవకాశాన్ని కోల్పోవడానికి వేసుకున్న బేడీ లే కదా !!
రామాయణం లో రావణుడు ,, ఆ సీత మ్మపై,, పెంచుకున్న స్త్రీ వ్యామోహం , తో పతనం అయ్యాడు
, భారతంలో దృతరాష్ట్రుడు , తన కొడుకు పై పెంచుకున్న పుత్ర వ్యామోహం తో , తమ వంశాన్ని , లక్షలాది తమ కుటుంబాలను ,
సర్వ నాశనం చేసుకున్నా డు కదా ! __
ఈ"" బంధనాలు లేకపోతే మేము బ్రతకలే ము"" అనే బలహీనత ,నిస్సహాయత తో బలవంతంగా ఈ బంగారు సంకెళ్లను మనకు మనమే ఏరి కోరి తగిలించు కుంటు , అదే ఆనందం అన్న ""పిచ్చి భ్రమ""లో బ్రతుకులు ఈడుస్తు గడుపుతూ ఉన్నాం _ మనం !!
ఈ "మోహం " అనే బీజాన్ని , మనిషి మనసు అనే తన అందమైన ఆనందకరమైన హృదయక్షేత్రం లో నాటుకొంటూ ,,దానికి మమత అనే నీరు పోసి,, శ్వాస తో చక్కగా గాలి అందిస్తూ ,దాన్ని మొక్కగా పెంచి పోషిస్తూ , క్రమంగా వృక్షం గా పెంచేస్తూ ఉన్నాడు ___
_ ఎన్నటికీ తీరని దాహం లాంటి __మోహం అనబడే __కామం" అనే అగోచర బంధనం తో_స్వయంగా తనకు తానై తన మెడకు వదలకుండా బిగించు కుంటు ఉన్నాడు,__
ఈ బంగారు సంకెళ్లను , స్వర్ణ కంకణాలు అనే ఆశా మోహ పాశాలను _ కట్టుకొడం సులభమే ,!
చాలా తేలిక !
కారణం ఇది. తన స్వార్థం కోసం చేస్తున్న పని !;
కానీ దాన్ని విడిపించు కోవడం ,లేదా దాని పట్టు నుండి విడివడ టం మాత్రం తనకు సాధ్యం కాదు ! కారణం ,దీనికి త్యాగం అవసరం ,!.
అంత పరిపక్వత , పరిజ్ఞానం , తన వద్ద లేదు , గత జన్మలో కూడా ఇలాంటి త్యాగం అనబడే ధనాన్ని సంపాదించ లేదు ,,కూడా ;;
. ( ఇంకా ఉంది)
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !
Monday, June 29, 2020
ఒంటె _తాడు _ మోహ పాశ బంధనం_2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment