June 7, 2020
ఒక బాటసారి ,దినమంతా తన ఒంటె పై స్వారీ చేస్తూ , మధ్య మధ్యలో మజిలీ లు చేస్తూ , పూర్తిగా అలసిపోయి ,ఒక రోజు రాత్రి సమయంలో ,ఒక సత్రం ముందు అగాడు ,
,, కానీ పాపం , ,ఒంటె ను కట్టేయడానికి ఎప్పుడూ తన వెంట ఉంచుకునే తాడు నూ , భూమిలో పాతి దానికి కట్టి గట్టిగా బిగించే గునపాన్ని __ఈ మధ్య దారిలో ఎక్కడో మరచిపోయాడు __!
పాపం , అంత రాత్రి వేళ , ఏం చేయాలో తెలీక ,అతడు అయోమయంలో పడ్డాడు !
ఇపుడు నిలబడి ఉన్న ఒంటె ను పడుకో బెట్టాలి ,!
,__అతడు చేతులతో సైగ చేస్తూ__ పడుకో , పడుకో అంటూ బిగ్గరగా ఎంత అరచి గోల చేసినా ,,అది వినడం లేదు ,!
ఏం చేయాలో పాలుపోక__ సత్రం లోకి వెళ్లి ఆ యజమానికి చెప్పాడు ,సమస్యను ,!!
,, ""అయ్యా ,,! దయచేసి , త్రాడూ ,,గునపం లేకుండా నా ఒంటె పడుకునే సలహా నాకు చెప్పండి !""
""అంతే కదా ,!మరేం ఫర్వాలేదు!;,,నీవు రోజూ ఏం చేస్తూ ,దాన్ని పడుకో బెడుతూ ఉంటావో , ఇపుడూ అలాగే చెయ్యి, అంతే ! వెళ్లు !""__
"" కానీ , అలా చేయడానికి_ ఇపుడు నా వద్ద తాడూ భూమిలో పాతే ,గునపం లేవు కదా !"" స్వామీ ,,!"
__నేను నీకు అదే చెబుతున్న ,,!;
అవి రెండూ చేతిలో ఉన్నపుడు ఎలా దాన్ని కట్టేసే వాడివో,__ఇప్పుడూ కూడా అదే విధంగా చెయ్యి !""__
""అయ్యా ,మీరు సరిగా వినడం లేదు నా మాట ,!"
అవి లేకుండా నేను ఆ పని చేయలేను !""__
"" నాయనా ,,నేను సరిగానే విన్నాను, ;
సరిగానే చెపుతున్నాను కూడా , !;
తాడు గునపం లేకుండా కూడా నీవు గునపాన్ని భూమిలో పాత గలవు ,!;
ఒంటె మెడకు తాడు బిగించి రెండవ చివరను. ఆ గునపానికి బిగించ గలవు , కూడా !!"",
నీ ఒంటె పడుకుంటుం ది చూడు ,!!
ఒక్క అడుగు కూడా కదలకుండా హాయిగా రాత్రంతా ఉంటుంది కూడా !"
"" ఎలా? స్వామీ ! ఎలా ?! కట్టేయకుం డానే,?, తాడు లేకుండానే , ??నేను సరిగానే వింటున్నానా ,.??""
"".అవును !,నీవు వింటున్న ది నిజమే !!
ఇది,సాధ్యం కూడా అవుతుంది !""
""అయ్యా !ఎలా ? మీ మాటలు వింటుంటే ,,నాకు మతి పోతుంది స్వామీ !""
__""మరేం లేదు ! వెళ్లి , నీ ఒంటె ముందు నిలబడు !
చేతిలో తాడు ఉన్న ట్టుగ ,ఒంటె మెడ చుట్టూ మూడు సార్లు తింపుతూ ముడి వెస్తున్నట్టుగా,, అది చూస్తుండగా నటించు ,!""
తర్వాత అక్కడే గునపాన్ని భూమిలో పాతి నట్టుగా__ గట్టిగా రెండు దెబ్బలు వేస్తున్నట్టుగా __నోటితో బిగ్గరగా శబ్ధం చెయ్యి !
_తర్వాత ఎప్పుడూ చేస్తున్నట్టే , తాడు రెండో చివరను పట్టుకుని , గునపం చుట్టూ తింపుతున్నట్టుగా __ నటించి ,,", అమ్మయ్య !" కట్టేశాను!"" అని దానికి వినపడేలా చెప్పు,!
""ఇక పడుకో ,! పడుకో!"" అంటూ దాని భాషలో , బా బా బా బా అంటూ నెమ్మదిగా ,మెల్లిగా ,, అంటూ చేతులు పై నుండి కిందకు ,అది పడుకునే వరకూ ఊపుతూ ఉండు !""
అంతే !,. నా మాట పై నమ్మకం ఉంచు !,
అది తప్పక నీ మాట వింటుంది ! పడుకుంటుంది చూడు !
ఇక వెళ్లు !"" అన్నాడు
_అతడు వెళ్లి ,సత్రం యజమాని చెప్పినట్టే చేశాడు ,
__ఆశ్చర్యంగా ఒంటె నిజంగానే పడుకుంది !
ఇది చూసి
_అతడికి మతి పోయింది !
ఇదేం విచిత్రమో అతడికి అర్థం కాలేదు !
ఒంటెకు దానా అహారం పెట్టీ వెళ్లి , ఆ
,రాత్రి పడుకున్నాడు. ,!
తెల్లారింది ! ఇక వెళ్లి పోవాలి !
వెళ్లి ఒంటెను" లే ,లే !"మనం వెళ్ళాలి!" అన్నాడు
అతడు ఎంత మొత్తుకున్నా ఆ ఒంటె రవంత కూడా కదల్లేదు ,లేవలేదు !"
మళ్లీ సత్రం యజమాని వద్దకు పరుగెత్తాడు _. ""అయ్యా! నా ఒంటె నేను చెప్పినట్టు వినడం లేదు !"
అంటూ ఏడుస్తూ తల పట్టుకున్నాడు ,,
"ఏం జరిగింది ?_ వివరంగా చెప్పు ?""
__ అయ్యా ! రాత్రి పడుకుంది కదా , Iమనం వెళ్ళాలి ,,ఇక లే !;""లే !అంటే నా ఒంటె అసలే కదలడం లేదు,,!లేవడం లేదు! , ఎలా,!??,నేను
ఏం చేయాలి !? స్వామీ !
__ఇంతే కదా ;" అయినా నీవు నీ ఒంటెను కదలకుండా గుంజకూ గట్టిగా కట్టేశావు కదా నిన్న రాత్రి !,
కట్టి వేయ బడ్డ ఒంటె ఎలా కదులు తుంది చెప్పు ?__ దీనికి ఏడుపు ఎందుకు ??"
__ "అయ్యో,! అయ్యో ,!స్వామి !;__ఏదో ఉత్తుత్తి నే కట్టేసినట్టు నటించాను ,!
తాడు లేదు గునపం లేదు
కదా ! అది నిజం కాదు కదా !""
ఆయన నవ్వాడు ,__
__"ఆ విషయం నీకు తెలుసు ,!నాకు తెలుసు !!
,కానీ పాపం ఆ ఒంటె కు తెలియదు కదయ్యా !;"
__ బిక్క మొహం పెట్టాడు ఒంటె అతను !!
""అయితే ,ఇప్పుడు నేను ఎం చేయాలి స్వామీ ?"
___ ఏం భయం లేదు !
నీవు వెళ్లి దాని ముందు నులుచుండీ ,__ముందు దాని మెడ కట్టు ముడి విప్పుతూ ఉన్నట్టు నటించు !!-
తర్వాత గునపం కట్టిన తాడు విప్పు !-
ఇప్పుడు గునపాన్ని భూమినుండి పీకు తున్నట్టు గా నోటితో శబ్దం చేయ్యి !! చేతిలో తాడును విసిరి పారేస్తున్నట్టు గా మళ్లీ నటించు !"
అంతే !
నీ ఒంటె లేచి కూర్చుంటుంది ,,చూడు !!"
ఇక వెళ్లు ,!
నేను చెప్పినట్టు నీవు చెయ్యి!;"
నీవు చెప్పినట్టు నీ ఒంటె చేస్తుంది !
__లేచి నిలబడుతుంది కూడా !""
_అతడు వెళ్ళాడు !
__అలాగే చేశాడు !
_అలాగే ఒంటె లేచి నిలబడింది కూడా !
__ కానీ ,ఇప్పుడు నిజంగా నే మతి పోయింది మనవాడికి _!
గబాలున _పరుగెత్తి కెళ్ళి ఆ సత్రం యజమాని కాళ్ళ మీద పడ్డాడు అతడు _
""అయ్యా ! రాత్రి ఉదయం మీరు చెప్పడం ,నేను నటించడం , పిచ్చి ఒంటె అలాగే చేయడం ,,స్వామీ !!
ఏమిటీ ఈ ఒంటె __ఆ తాడు__ ఆ గునపం ,__ ఈ కట్లూ కట్టడం , విప్పేయ డం _ లేనిదాని ని ఉన్నట్టుగా చూపి నమ్మించడం. ,పాపం ఆ మూగ జీవం దాన్నే నిజమని నమ్మి , యజమాని నైనా నా మాట పట్ల విశ్వాసం చూపుతూ ఉండడం ,, అంతా మాయగా ఉంది నాకు
ప్రభో !!__
""మీకు మాత్రమే తెలిసిన ఈ తాడు ఒంటె రహస్యం__ఇపుడు నాకు చెప్పితీరాలి !""అంటూ సాష్టాంగ నమస్కారం చేస్తూ , పట్టుబట్టి వేడుకున్నాడు !
సత్రం యజమాని , ఏమీ జరగనట్టు గానే ,చిన్నగా నవ్వాడు ,
నాయనా !
ఇందులో మాయా లేదు! మంత్రం లేదు !
,జీవితంలో మనం రోజూ చూస్తున్నదే __అనుభవిస్తూ ఉన్న దే , ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ! ఇది కొత్తగా చెప్పుకునే కథ కాదు __ బాబూ ;
మనిషి తన జననం నుండి మరణం వరకు _తన జీవితంలో కంటికి కనిపించని ఇలాంటి అనేకమైన బంధనాల తో తనకు తానే కట్టి వేయ బడుతూ ఉన్నాడు ,_!"
___""స్వామీ !నాకు అంత ""పరిజ్ఞానం " ! దయచేసి కాస్త నాకు అర్థం అయ్యే విధంగా చెప్పండి ,!" అంటూ దీనంగా అర్థించాడు !
పెద్దాయన ఇలా , చెప్పసాగాడు
( ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !
Monday, June 29, 2020
ఒంటె , తాడు - నీతి కథ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment