Monday, June 29, 2020

ఒంటె_తాడు బంధనం - 3

June 9, 2020
అంతే కాదు __
ఈ" మోహం "అనే  రంగు రంగుల అతి  విచిత్రమైన , బంధనం ,తెంపుకోవడం కోసం __ ఈ జీవుడు  ఒక్కోసారి , ఎన్నో జన్మల ను ఎత్తవలసి ఉంటుంది ,__
ఉదాహరణ కోసం మనకు తెలిసిన చిన్న కథ !!__
జడ భరతుడు అనే తపస్వి అరణ్యంలో చక్కగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు!
, ఒకరోజున నదీ స్నానం చేస్తూ ఒక జింక శిశువు ను చూశాడు ,!
దాని తల్లి , పులి అరుపు వింటూ ప్రాణ భయంతో , పరుగెత్తి, వెళ్తుండగా ఈ శిశువు ను ప్రసవిస్తూ ,అది  మృతి చెందింది __ భూత దయతో స్పందించి  అతడి ,మనసు ద్రవించింది ,,
ఈ భరతుడు వెళ్లి ఆ జింక కూనను సంరక్షిస్తూ  తపస్సు మానేసి ,అదే ధ్యాస తో ,దాని బాగోగులు చూస్తూ ఉండి పోయాడు!!_ ఆ జింక , పెరిగి ,కొన్నాళ్లకు మృతి చెందింది!
ఇక ఈ ముని కూడా __అదే పరితాపం తో , జింక పిల్ల పై పెంచుకున్న వ్యామోహం అనే బంధనం తో , అది పోయింది అన్న దుఖం తో ఒకరోజున అతడు కూడా చనిపోయాడు _! మరుజన్మలో అతడు అదే జింక జన్మ ను ఎత్తాడు  కూడా !
తపస్సు చేసిన కారణంగా పూర్వ జన్మ వాసన జ్ఞానం ,జ్ఞాపకాలు  జింక రూపంలో ఉంటున్నా , అవి మాత్రం వదల్లేదు !__
""యథా మృతి ,_తథా ఆకృతి !"".
ఇది గీతా వాక్యం ;!దీని ప్రకారం __
జీవుడు ఎలాంటి ఆలోచనల తో మృతిని పొందుతూ ఉంటాడో , మరుజన్మ లో _అలాంటి ఆకృతి గల జన్మ  నే __ధరిస్తూ ఉంటాడు
,  అపుడు అతనికి ఆత్మ విచారణ కలిగింది !
"ఏమిటీ తాను చేసింది ?
పశువు వలె ఈ మోహం అనే ఆశా పాశాలలో చిక్కుకొని  ఉత్కృష్టమైన మానవ జన్మను వ్యర్థం చేసుకున్నా నే , అయ్యో !
పరమేశ్వరా ,,నన్ను క్షమించు !
మనిషి గా జన్మించే ఒక్క అవకాశాన్ని అనుగ్రహించు తండ్రీ  !""అంటూ  దీనంగా పరమాత్ముని  అర్థించాడు  విలపించాడు
దేవుడు అతడి విశ్వాసాన్ని ,ప్రేమను , ఆర్తిని ఆవేదన లను గమనించి , మానవ జన్మ ను ప్రసాదించాడు ,,
మరుజన్మలో  అతడు  జ్ఞానవంతుడై , ఈ భవ బంధాలకు , సంసార సౌఖ్యాల కు   అతీతంగా , , ఉంటూ తన జ్ఞాన ప్రకాశం తో అద్భుతమైన విద్వత్తు నూ , సంపాదిస్తూ ఆధ్యాత్మిక  జీవనాన్ని కొనసాగించాడు __
ఇలా  ఈ జన్మ లో , తనవా రు అనబడే ఆత్మీయులతో  తాను  పెంచుకుంటున్న ఈ  ఋణాను బంధం   నుండి విడిపించు కొలేక అనేక  జన్మలు ఎత్తవలసి వస్తోంది .__
దీనినుండి బయట పడే మార్గం కూడా  ఇదే మానవజన్మ లో ఏర్పాటు చేసుకోవాలి -..
తాను ఉద్దరింపబడటానికి , జీవుడికి  మరో దారి లేదు కూడా !!
ఇతర జన్మ లలో __జీవుడు ఉద్దరింపబడే  సౌకర్యం సౌలభ్యం ,సాధనం   లేనే  లేదు!;
  వివేకంతో , ఆత్మ విచారణ తో, భగవద్గీత లాంటి అమోఘమైన గ్రంధాల పఠనం తో  వాని , తత్వ అవగాహన తో  వాని ,ఆచరణ , , నిరంతర చింతన వల్ల మాత్రమే  ఇది సుసాధ్యం అవుతుంది !!___, ,, తానేమిటో ?,తాను ఎవరో ,?తన జీవిత లక్ష్యం ఏమిటో ,? ఈ ఘోరమైన సంసారకూపం లో పడవేస్తున్న ఈ బంధనాల నుండి విముక్తి ని ఎలా పొందాలో ,? ఇలాంటి పరి ప్రశ్నల పరిశోధన తో ,  సాధన చేస్తూ  , సద్గురు కృపతో  , భగవంతుని వేడుకోవాలి _
అత్యంత, జటిలమైన ఈ బందనాల నుండి విముక్తి ని పొందే   సమస్యకు , తనకు తానుగా పరిష్కారాన్ని  శోధిస్తూ ముందుకు సాగాలి !
, ఇటు తన  జన్మ రాహిత్య  విధానాన్ని ,, అటు అద్వితీయమైన పరమేశ్వర లీలా విలాసా న్ని అన్వయం చేసుకుంటూ , పరమార్థ చింతనతో , పరాత్పరుని సన్నిధానం చేరుకునే ముక్తి మార్గాన్ని  స్వయంగా  కనుక్కోవా ల్సి ఉంటుంది , !;__
___ సకల ప్రాణుల ఉపాధి లో ఉండే , పంచేంద్రియాల పై   _ చుట్టూ ఉన్న పంచభూతాలు ప్రదర్శించే అసాధారణ ప్రభావ మే ఈ మోహం అనబడే బంధం !,,
,  ప్రాణుల దేహాలు పంచభూతాల నిర్మితాలు ,;
  కాబట్టి వాని అంశలే ఈ దేహాలు !,
జీవించి ఉన్నపుడే కాదు , మృతి చెందా క కూడా ,అదే పంచభూతాల లో కలిసి పోక తప్పదు కదా!
ప్రాణం ఎలా వస్తుందో , ఎక్కడ ఎలా ఉంటుందో ఎలా ఎక్కడికి పోతూ ఉంటుందో , ఎవరికీ ఎన్నటికీ  ,అంతుబట్టని   చిదంబర రహస్యం  అది !!
,_ మనిషిని మాయ చేస్తూ  తోలు బొమ్మలా ఆడిస్తూ వస్తున్న
జగన్మా య ;;
మహా మాయ ,!
భగవద్ కృప ఉంటేనే తప్ప ఈ "మాయ "అనబడే మోహ బంధనాల నుండి మనం బయట పడలేం , కదా !!
    ( ఇంకా ఉంది )
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా ,!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...