Wednesday, June 3, 2020

మృత్యు భయం _4

May 31, 2020
"శిరచ్చేదం "శిక్ష పడిన తమ్ముడు ,,  మహారాజు గా ఆజ్ఞాపించిన తన  అన్నగారి పాదాల పై పడి ,అనందాష్రువులు రాలుస్తు  , ,
" ప్రభూ !"
""మీరు నాకు ఇపుడు ఒక సోదరుడుగా కానీ,ఒక మహారాజు గా కానీ అగిపించడం లేదు , !
నేను సద్గతి పొందడానికి మార్గ దర్శనం చేస్తున్న
ఒక సద్గురువు లా మీరు నాకు  కనిపిస్తున్నారు !!""
, "నాకు జైలులో  అన్ని సుఖభోగాలు, విందు భోజనాలు ,వినోదాలు , మీరు  సమకూర్చారు ,!
అందుకు  మీకు కృతజ్ఞత ను తెలియ జేసుకుంటున్నాను !
కానీ అందులో ఏ ఒక్కటీ కూడా నేను వినియోగించు కొలేక పోయాను ,
బ్రతుకు పై  రోత పుట్టించే ఆ భోగాలను చూస్తుంటే విరక్తి కలుగుతూ ఉంది !
   ""సుఖాలు ఇంకా అనుభవించడానికి , ఇంకా కొన్ని రోజుల సమయం కావాలా  నీకు ??" అని మీరు నన్ను  అడిగారు !__""
కానీ ఈ రాజ భటులు
యమ దూతల వలె నా ముందు నిలబడి ఉంటే,,ఇది కావాల నే కోరికలు కలుగుతాయా ?? మీరు అందజేసే ఈ భోగాలు , సౌఖ్యాల పై మనసు నిలుస్తుందా ప్రభూ??
పులి నోటిలో తల దూర్చిన వాడికి ,  బ్రతుకు పై మధుర భావాలు తలపుకు వస్తాయా,?? చెప్పండి !!
మీరు నాకు ప్రసాదించిన
ఈ వారం రోజుల అవకాశం __ ఒంటరిగా ,ప్రశాంతంగా ,, ఉంటూ, వికలంగా  ఉన్న మనసు ను , కుదురుగా నిలిపి ,నాకు  ఆత్మ విచారణ చేసేందుకు చక్కగా ఉపయోగించింది !!"
"" నేను చేయని తప్పుకు ,ఎందుకు ఇంత ఘోర మైన శిక్ష పడింది,?!""
నేను మీకు స్వయానా సోదరుడిని ,!
నీ రక్తం పంచుకు పుట్టిన వాడిని !"
చిన్నతనం నుండి నేనేంటో, నా స్వభావం ఏమిటో మీకు చక్కగా తెలుసు ,!
కలలో నైనా  మీకు చెడు ఊహించని ,అపకారం  తలపెట్టని  నాపై ,,
మీకు ఎలా  అనుమానం కలిగింది ??""
అంటే,అది మీ తప్పు కాదు!
"ఖచ్చితంగా ఇది నా అపరాధమే , ;"
నేను ఏ  జన్మలో  చేసిన పాపమో ,ఇపుడు ఈ రూపంలో నా అనుభవానికి వస్తోంది !
""అష్టావక్రుడు "అనే మహ తపస్వి ,కి  కూడా _ నరకంలో   శిక్ష పడిందట!!
సల సలా కాగే నూనెలో అతడిని వేయించి బాధించారట !"". అతడు. యమున్ని
కారణం అడిగితే,
""మీరు మీ చిన్నతనంలో చీమలను చంపారు !""
అని  సమవర్తి , చెప్పా రట !",
అందుచేత , ఎంతటి వారైనా , తాము చేసిన పాపపు కర్మలకు తగిన శాస్తి అనుభవించక తప్పదు కదా !
""ప్రభూ ,!
మీరు ధర్మ ప్రభువులు! మీకు  ,రాజద్రోహం చేసిన వాడు ,తమ్ముడై నా  సరే  , శిక్షకు పాత్రుడే !
తెలిసి చేసినా,తెలియక చేసిన ,తప్పు తప్పే,!!"
నన్ను శిక్షించకుండ _ వదిలేస్తే,ప్రజలు మిమ్మల్ని తప్పు పడతారు ,!!
""తనకి ఒక న్యాయం , తనవారి కి ఒక న్యాయ మా ?""
అంటూ మిమ్మల్ని వేలెత్తి చూపుతారు !
చక్కని మీ పరిపాలన లో నా విషయంగా ఒక మచ్చ రాకుండా ఉండాలి ,!
అందుచేత  నా పై , దయ ఉంచి , నాకు ఈ శిక్షను అమలు చేయండి  ప్రభూ ,!""
అయితే మరొక్క వినతి ,నీ మీకు తెలియజేసే అవకాశం నాకు  ఇవ్వండి !""
అంటూ పశ్చాత్తాపం తో , ధర్మ నిరతి తో సోదర ప్రేమతో ,  నీతి,నిజాయితీ ఆచరణ లో  చూపిస్తున్న  తమ్ముని  చూస్తుంటే రాజుగారికి హృదయంలో ,విపరీతమైన దుఖం తో బాటు  ప్రేమ కూడా  పొంగుతోంది
,,కష్టంగా అణ చుకుంటూ  "సరే ! చెప్పు ," తమ్ముడూ !""అన్నాడు ,
""మహారాజా !
ఈ వారంలో నేను  ""మృత్యువు ""అంటే ఏ మాత్రము కూడా  భయపడని  మనోవికాసా  న్ని  , గుండె నిబ్బరం,, తత్వ జ్ఞానాన్నీ సంపాదించాను ,!
""మృత్యు వు అంటే ఎందుకు భయపడాలి ??
తప్పు చేసిన వాడు _పిరికి వాడు,బలహీనుడు ,, పాపాత్ముడు  భయపడాలి , !?: __నిరంతరం మారుతూ ఉండే
ఈ జగత్తు లో ఏ ది శాశ్వతం ,కనక ??""
ఇంద్రియాలతో
అనుభవానికి వస్తున్న ఈ  వస్తువులు, విషయాలు మనుషులు , , అన్నీ  కాల గతి లో సమసి పోయేవే కదా !;"
ఈ  సమస్త ప్రపంచం దుఃఖాలకు నిలయం!! , అన్నీ కష్టాన్ని, దుఖాన్ని కలిగించేవే ,! ఎందుకంటే , ఏదీ ఉండదు,!
వచ్చే వన్నీ పొయేవే !!
__ఈ రోజున ఉన్న నా అనేది ,రేపు మరొకరి సొత్తు అవుతుంది !!
నా వాళ్ళు అనబడే వారు __.రేపు  శాశ్వతంగా కనిపించ కుండా పోతారు !;
,నిజానికి ఈ జగతి ఒక మరుభూమి, ని ,,స్మశానాన్ని తలపిస్తూ ఉంటుంది!!
, మరణించిన వారితో, శవాలుగా  మారిన వారితో,   ,రేపు  శవాలుగా మారబోయే వారితో ,, ఎంత  భయాన్ని జుగుప్స, విరక్తి భావాలను   కలిగిస్తుందో చెప్పలేము ,!; దయ గల  ఈ
మృత్యువు,మనల్ని  ఈ బాధల నుండి తప్పిస్తూ ఉన్నందుకు, ఆ దేవతా మూర్తికి  మనం మనసారా ధన్యవాదాలు అందజేయాలి !!
,  మృత్యువు అంటే భయం బదులు  దానిని గురించిన ,జ్ఞానాన్ని  పొందాలి !!
చిరిగిపోయిన బట్టలాంటి ఈ ఉపాధిని  వదలి , కొత్తగా  నవ జీవనాన్ని సాగించే మరో ఉపాధి ని ఆశ్రయించాలి ,!; ఈ జన్మలో మనం అన్నదమ్ములం !
మరు జన్మలో __
ఎవరికి ఎవరో,? కదా ,,!
,దేహంతో బాటు బంధుత్వాలు ,బరువులు బాధ్యతలు , వద లు కోవడం కూడా ఆ పరమాత్మ అనుగ్రహం గా భావించా ను నేను !""
అందుకే , ఈ వారం రోజులూ,"" హరే రామ హరే రామ
,రామ రామ హరే హరే_!!
హరే కృష్ణ హరే  కృష్ణా
కృష్ణ కృష్ణ హరే హరే !!" అంటూ పరమ ఆనందంగా భగవన్నామ స్మరణం చేస్తూ   తన్మయత్వం తో , గడిపాను !
  (  ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...