June 19, 2020
"అయ్యా_! మీరే మంటున్నారో మీకు తెలు స్తోం దా _!??
స్వామీ,, నేనెక్కడ , ??-_ఆ శ్రీ రామచంద్ర ప్రభువు , సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు , అత డెక్క డ ??
నా జన్మకు , నా యోగ్యతకు శ్రీరామచంద్రుని తీసుకొచ్చే గొప్ప చరిత్ర ఉందా_? లేదు స్వామీ లేదు _! ఈ అభ్యర్థన నా శక్తికి బుద్ధికి మించినది ,__!"
ఎక్కడ ఆ రామ చంద్ర ప్రభువు ,! ఎక్కడ ఈ బ్రహ్మ రాక్షస జన్మ ,_?
అయ్యా _!ఇంత పెద్ద కార్యము నా చేత కాదు,:_!
అయ్యా ,_! ఆ ఒక్క "" రామ దర్శనం_"" తప్ప మరేదైనా అడగండి _! నా దీనత ను గమనించండి స్వామీ _!"" మిమ్మల్ని కన్నీళ్ళతో వేడుకుంటూ ఉన్నాను ,, కరుణ చూపండి _!""
, నాయనా _! నీవల్ల అవుతుందా లేదా అన్నది నా మనసుకు తట్టడం లేదు, కానీ,
నేను నిత్యం ఆ రామచంద్ర ప్రభువును కోరుకునేది ,, స్వామీ నీ దర్శన భాగ్యం అనుగ్రహించు మని మొర పెట్టుకుంటు ఉంటాను
, ,రాముడు లేకుండా జగతిలో ఏదైనా ఉంటుందా_? చెప్పు ,అంతా రామమయం కదా ,_!
నాయనా ,నాకు ఎక్కడ చూసినా అంతటా ఆ సాకేత రాముడే కనిపిస్తూ ఉన్నాడు _!
,రామ దర్శనం తప్ప _నాకు మరేమీ అవసరం లేదు,,_!
నిన్నే కాదు, ఎవరు కోరు కొమ్మని అడిగినా , ఎప్పుడైనా, నేను అడిగేది ఆ దయాంతరంగుడు , శరణా గత వత్సలుడు,, ఆపదో ద్దార కుడు,,,, సీతా మనోభి రాముడు ఆ శ్రీరాముని దర్శన భాగ్యాన్ని మాత్రమే కోరుతూ ఉంటాను,
ఈ రామకథ , ఈ రామాయణ రచన , ఈ పురాణ ప్రవచనం , ఈ జీవితం ,,, ఈ ఉచ్వాస నిశ్వాసలు. అంతా ఆ కళ్యాణ కర , రమణీయ,కమనీయ ,మహనీయ ,అద్వితీయ , అపురూప అద్భుత ,, జగన్మోహన సౌందర్య సుందర దివ్య మంగళ విగ్రహ స్వరూప దర్శనం కోసమే నాయనా _!
నా ఆర్తిని ,,నా ఆర్ద్రత ను కూడా నీవు అర్థం చేసుకో నాయనా ,_!
ఏ రాముని అనుగ్రహంతో నీకు ఈ సద్భావన , సత్వ గుణ సంపద కలిగిందో, ఏ రాముని అనుగ్రహంతో , నాకు రామ మానస చరిత కావ్య రచనా భాగ్యం కలిగిందో
ఏ రాముడు దయ వలన నాకు ఒక చక్కని రామ భక్తుని తో మాట్లాడుతూ పరమానందం పొందుతూ ఉన్నానో,
ఏ రాముని అనుగ్రహంతో నీవు రాక్షస ప్రవృత్తి నుండి నివృత్తి నీ పొందుతూ ఉన్నావో
ఏ రాముని దయ వలన ఈ సకల చరాచర జగత్తు ఆనందమయంగా , సకల సంపదల నిలయం గా, విరాజిల్లుతూ ఉందో, ఏ రాము ని అపారమైన కరుణ తో మానవ జన్మ ధరించిన నేను , రాక్షస శరీరం ధరించిన నీవూ, రామకథ గానా మృత ఆస్వా దనతో పునీతులం అవుతున్నా మో ,
అట్టి శ్రీరాముని దర్శనం కోసం ఆరాట పడటంలో తప్పు లేదు కదా ,
తారక రాముడు, తారణ కారకుడు, నాకు ఆ రామ దర్శనం ఇప్పించూ నాయనా,, , _!"
,,, "అయ్యా ,_! తెలుసు,మీర్ అంతరంగం లో రాముడు కొలువై ఉన్నాడు అనీ _!
రామ దర్శనానికి మీకు సంపూర్ణ యోగ్యత ఉందనీ తెలుసు __!
స్వామీ,_! మీ భక్తి ప్రపత్తుల ను , రాముని పై గల అచంచల విశ్వాసం చూస్తూ ఉంటే, తప్పకుండా ఆ రామ దర్శనం చేయగలరని కూడా నాకు నమ్మకం కలుగుతూ ఉంది_!
అయ్యా ,_! నాకు మీ రామ ప్రభువు ఒక పరీక్ష పెడుతున్నాడు _! తులసీదాసు గారూ _!మీరు ఇంత. మొండి పట్టు పట్టితే నాకు ఏమీ తోచడం లేదు,,!
నాకు , ఒక్క మార్గం తోస్తూ ఉంది, స్వామీ _! నేను మీ రాముడిని తేలేను_,,_!_ మీకు ఆ రామదర్శనం చేయించలేను,,_!
, కానీ , స్వామీ,
ఆ రామదర్శనం చేయించే ఒక మహాత్ముని మాత్రం_ మీకు చూపగలను _!
, ""ఆహా, ఎంత మంచి మాట చెప్పారు ,_ నోటిలో అమృతం పోస్తూ , _ ఎండలో, ఎడారిలో ,దాహం తో కొట్టు మిట్టాడుతు ఉన్నవాడికి __చల్లని మంచి నీరు అందించి నట్టుగా _నాకు ఎంత తీపి కబురు చెప్పావు కదా నాయనా ,_! త్వరలో నీకు రాముని దయ వల్ల ,తప్పకుండా , విముక్తిని పొంది , సద్గతి ని పొందుతా వు ,_!
నా మాటను నిజం చేస్తాడు. చూడు,, నా రాముడు _! ధర్మ మూర్తి,_! నా ప్రభువు _!
_ నాయనా ,,చెప్పు _! నా రాముని చూపించే ఆచార్యుడు ఎవరో , ఎక్కడ ఉంటాడో ,త్వరగా చెప్పు ,, నాకు వారిని చూపిం చి పుణ్యం కట్టుకో ,, నాయనా _! చూశావా రామాను గ్రహం ,,
నమ్మిన వారిని ఎలా కరునిస్తు ఉంటాడో _?!
"_అయ్యా_! తులసీదాసు గారూ,,_!ఆయన ప్రతి రోజూ ఇక్కడకు, మీ రామకథ. శ్రవణం చేయడానికి వస్తున్నారు స్వామీ _!"
""అవునా,_, నాయనా ,_! అంత గొప్ప మహానుభావు డు , రోజూ నా ఇంటికి వస్తున్నారా_??
, నేను చెప్పే కథ అతడు వింటున్నా డా _? ఇది కలా,_? నిజమా _? నమ్మలేక పోతున్నాను నాయనా _!
"_అవును_ స్వామీ _! ఆయన అందరికంటే ముందుగా మీ రామకథ ప్రసంగం వినడానికి వస్తుంటారు _!
రామకథ ప్రసంగం పూర్తి అయ్యాక _ అందరూ వెళ్లి పోయ్యాక __ చిట్ట చివరకు వెళ్లి పోతుంటారు_!""
", అవునా? ఎంత విచిత్రం ?!" ఇది ఏదీ, నేను గమనించడం లేదు ,_! నాయనా _!
ఎవరు ముందు వస్తుంటా రో,, ఎవరు వెనక వెళ్తూ ఉంటారో , నాకు తెలియదు _ నాయనా _!
కానీ ఒక్క నిజం మాత్రం తెలుసు ,,ఎక్కడ రామకథ జరుగుతూ ఉన్నా _,అక్కడ శ్రీ రామ భక్తా గ్రేసరుడు _ వాయు నందనుడు, _కేసరీ పుత్రుడు,_హనుమంతుడు మాత్రం_ తప్పనిసరిగా వచ్చి వింటూ ఉంటాడు_ అని నా ప్రగాఢ మైన నమ్మకం ,_! నాయనా _!
"స్వామీ_! మీరు చెప్పింది అక్షరాలా సత్యం _! స్వామీ,,
మీరు రామకథ పఠన ఆనందంలో మునిగి తేలుతూ ఉం టూ ఇటువంటి చిన్న చిన్న విషయాలు గ్రహించరు_!
,__రేపు గమనించండి ,ఒక వృద్దుడు అందరికన్నా ముందుగా వస్తూ ,,ఒక మూలన కూర్చుం టూ , పురాణ శ్రవణం అయ్యాక అందరూ వెళ్ళిపోయాక చివరివాడుగా వెళ్తుంటాడు _ ఆయన !!""
( ఇంకా ఉంది )
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా _!"
Monday, June 29, 2020
శ్రీ రామ నామ గాన మహిమ_3
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment