Monday, June 29, 2020

నిత్య సంతోషి- కర్మ యోగి!

June 10, 2020
ఏ రకమైన  "మోహం ""అనే పాశం, బంధనం లేని వాడు  మన  భోళా శంకరుడు  !
ఒంటి మీద బట్ట ఉండదు,!ఆభరణాలు,సుగంధ పరిమళాలు , స్వర్ణ సింహాసనం  లాంటి , భొగ భాగ్యాలు  ఇవేమీ ఉండవు !
స్మశానం లో భూత ప్రేత పిశాచ గణాలతో సహవాసం , !
ఒంటిపై భస్మ లేపనం , తో  ప్రాపంచిక సౌఖ్యా లకు అతీతంగా ఉంటాడు ఈ శివయ్య !
, ఇలాంటి వాడిని చూస్తే  బంధనాలు కూడా  భయ పడతాయి ,
చుట్టూరా మంచు కొండలు , ఏకాంతము ,  దరహాస వదనం లో   తరగని చెదరని ప్రశాంతత  పరమానందం ,!ఆయన  సన్నిధి , భక్తులకు శాశ్వత పెన్నిధి  ,!
శివ లింగం మీద ఎన్ని పాలు నీళ్ళు ,గంధం చందనం  మల్లె పూలు బిల్వ దళాలు , భస్మాది లేపనాలు ఎన్ని రకాల సమర్పించు కుంటున్నా , ఆయన కు ఏది అంటకుండా నున్నగా ఉన్న లింగం  పైనుండి కిందకు జారుతూ , ప్రాణ వట్టం ద్వారా వెళ్లి పోతూ ఉంటాయి ,
అతడికి సంతృప్తి ని కలుగజేసే ది ,ఒక మారేడు దళం , కాసి ని  ఒక పువ్వు  నీళ్ళు  ,ఏదైనా ఒక పండు , !
ఇవి చాలు ,
అయినా కూడా  ఒక షరతు !!
మనసు పెట్టీ అర్చించాలి !
ఈ మనసుతో   ఆ శివలింగ స్వరూప పరమేశ్వరుని సతతం ధ్యానిస్తూ  , అలా పూజించడం , వల్ల కలిగే ఆనందం శివయ్య కు కాదు ,
అది నీకు కలగాలి ,
ఆయన  వదనంలో ప్రస్ఫుటంగా  అగుపించె అనందాన్ని , ప్రశాంతత ను నీవు  మనసు ద్వారా భావిస్తూ  __ఈ పత్ర పుష్ప ఫల తోయాల తో సేవిస్తూ _ పొందుతూ   ఉండాలి

పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు గీతా చార్యు డు
అంటే  భక్తి జ్ఞాన వైరాగ్య  భావన లు    ఈ మూడు ఏక కాలంలో నీ హృదయంలో ఏకం కావాలి_
ఎక్కడో హిమాలయ పర్వతాల మధ్య, కైలాస శిఖరం పై ,కొలువున్న పరమశివుని పరమానంద కరమైన    పరమ పద మనో స్థితిని  కేవలం సాధనా సంపత్తి తో ,పరిపూర్ణ విశ్వాసంతో  చేరు కోవాలి ,
ఒకటే ధ్యేయం ,
  ఈశ్వరుని కృప ,
ఈ రకమైన పరిశ్రమ లో  కలిగే  మోహం __, వస్తువు గురించి కాని , వ్యక్తి ,లేదా సంపద  ,బాంధవ్యం తో  కాని   సంబంధం ఉండదు  .!
ఇలాంటి శరణాగతి చేసేవారికి  ఏ మాయా అంటదు , ఏ బంధనాలు ఉండవు ,!
ఎందుకంటే ,  ఈ రకమైన ""మోహం  "" , తనువూ మనసూ లను  ఏకం చేసి  జీవుడికి , బ్రహ్మానం దాన్ని ఇస్తుంది ,
ఇలాంటి ఉన్నత భావాలు కలగాలం టె . , మనసా వాచా కర్మణా _కొంత శ్రమ చేయక తప్పదు , కదా !ఇందుకు . ఒక చిన్న  ఉదాహరణ !
మా చిన్న అన్నగారు , కీర్తి శేషులు శ్రీనివాసరావు గారు , అలాంటి నిర్మొ హాన్నీ కలిగి ఉండేవారు ,
,దానం చేయడంలో అతడి ఉత్సాహాన్ని చూసి తీరాలి
ఇంటి ముందుకు ఎవరైనా వృద్దుడు బిచ్చ గాడు ,ఒక పేదరాలు  కనబడితే చాలు , ఒంటికి ఉన్న చొక్కా విప్పి ఇవ్వడం ,లేదా ఇంట్లో ఉన్న బియ్యం ,పెద్ద గిన్నెలో తెచ్చి ఇవ్వడమో,
లేదా , షర్ట్ జేబులో ఎంత డబ్బు ఉంటే అంత ఇచ్చేయ డమో,లేదా , వడ్ల కుప్ప లో నుండి , గంప తో వడ్ల ను  ఎత్తి   వారి జోలెలో పోసేయడమో చేసే వాడు
తాను ఎక్కడున్నా , బిచ్చ గానీ అరుపు వింటే చాలు పరుగున వచ్చి , ఏది కనిపిస్తే అది ,అన్నం రొట్టెలు ,  ధాన్యం , శాలువా  ధోవతి , చీర , తువ్వాలు, పంచె _ ఇలా _వెనక ముందు చూడకుండా __ఎవరు వారిస్తున్నా వినకుండా  దానం చేస్తూ ఉండేవాడు_!___
అయితే అతడికి ఉద్యోగం లేదు , నెలసరి ఆదాయం లేదు , ,భూముల సేద్యం పై వచ్చే  చాలీ చాలని ఆదాయం తో ,_ సరిపెట్టు కునేవాడు
ఎవరు తనని విమర్శించినా , అసహ్యించు కున్నా , గేలి చేసినా ,  తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకున్న పస్తులు ఉంటున్నా ,,పొట్టకు బట్టకు కష్టంగా ఉంటున్నా , సంసారం గడవడం బహు బాధగా అనిపించినా ,అతడు ఎవరిని చేయి చాచి అడిగే వాడు కాదు _!_
కూతురు  తన చదువులో  శ్రద్ద చేయకుండా ఉంటే కోపం చూప డు!
పెళ్ళీడు కు వచ్చిన కూతురుకి సంబంధం  నచ్చక పోతే , బాధ పడడు !
తనకు ఇష్టం ఉన్నపుడు ,ఇష్టం వచ్చిన వాడిని చేసుకో నీ అంటాడు !
ఇంటి గోడల పైన ఎటు చూసినా  భగవద్గీత శ్లోకాలు అతడి చేత రాయబడి కనిపిస్తాయి ,,
,,తల్లి భక్తి పరురాలు కావడం తో అతడికి ఆమె తల్లి తండ్రీ  గురువూ దైవం , అన్నీ ఆమెనే !
తల్లి చివరి శ్వాస విడుస్తూ ఉంటే, ""అమ్మా ! నీవు లేకుండా  నేను బ్రతుకు తానా ?"  అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు _
అప్పుడు చూశాం అతడిలో బాధ ,,ఖేదం , నిర్వేదం ,నిర్లిప్తత , నిరాశ  సంపూర్ణ వైరాగ్యం ,;
నిజంగానే  అన్నట్టుగానే , తల్లి మరణించాక పక్షం రోజుల్లోనే  ఆమె కొడుకు కూడా   తన తుది శ్వాస విడిచాడు!
చిత్రం ఏమంటే , జననం అయ్యాక  పిల్లాడు ,తన తల్లి ప్రక్కన కనిపించిన విధంగా ,అతడు మరణించాక కూడా తల్లిని దహనం చేసిన చోటు ననే ఆమె కొడుకూ కూడా అక్కడే అదే చోట పడుకొని తల్లిని చేరుకో వడం ,అతడి కి తల్లితో ఉన్న అనుబంధాన్ని  సూచిస్తూ ఉంది !
కారణం  ,,,అతడి చిరు ప్రాయ దశ లోనే తండ్రి పోవడం!!
, అలా  అతడి 60  ఏళ్ల వయసు వాడైన ఒక్క రోజు కూడా తల్లిని విడిచి ఉండలేదు !
"శ్రీనివాసా !" అని కొడుకుని రోజుకు ఒక వంద సార్లు  పిలిచేది , ఆ పిలుపులో , భగవన్నామ ము చేస్తున్నంత సంబరపడే ది ఆ తల్లి !!
__ అలా ,తాను తల్లి చాటు బిడ్డగా ఉంటూ ,  ప్రాపంచిక సుఖాలు ప్రక్కన పెట్టీ ,ఆధ్యాత్మిక చింతనతో, ఇటు తల్లి సేవ,,అటు దైవ స్మరణ __ చక్కగా చేసుకొని  జన్మ  సార్థకం  చేసుకున్నాడు ఆ శ్రీనివాసు డు !
కీర్తి శేషుడు అయిన అతడి తండ్రి కూడా శ్రీరామ భక్తుడు కావడం ,,అతడు ఆనంద రామాయణ గీతాలను రచిస్తూ  తొక్కుడు హార్మోనియం వాయిస్తూ , సుప్రభాత వేళల్లో ప్రతీ దినం గానం చేస్తూ ఉండడం వలన బహుశా , అతడి కొడుకు అయినందు వలన అద్భుతమైన   అతడి తండ్రి గారి భక్తి శ్రద్ధలకు కూడా వారసుడు అయ్యాడేమో అనిపిస్తూ ఉంటుంది ,,  !
అతడు ఉంటున్న. గ్రామంలో నే హనుమాన్ దేవాలయం ఉంది ,ప్రతిరోజూ అక్కడ పదిమంది గ్రామస్తులతో కలిసి భజన , భగవద్గీత శ్లోకాల పఠనం ,లాంటి వాటితో సత్సంగ్  నిర్వహిస్తూ , ,జ్ఞాన యోగి వలె జీవించాడు ,,!
తన ఆర్థిక ,ఆరోగ్య ఇబ్బందులను ఎవరికి చెప్పే వాడు కాదు !
అతడు నిత్య సంతోషి,,! స్తితప్రజ్ఞుడు !,,ఒక కర్మ  యోగి ,;ఒక   మిత భాషి!
సదా  శంకరుని వలె మందహాసం వదనంతో కనిపించే వాడు !
భక్తి  శ్రద్ధలతో ,పూజలో జపంలో , అనుష్టానం లో , అతడు మనసా వాచా కర్మణా చేసి చూపించే వాడు
దేవుడికి రోజూ పెట్టే నూనెదీపం లో ,  అతడు నూనె  పోస్తూ "" అది ఎప్పుడూ అఖండ దీపం!"" లా వెలగాలని అంటూ ఉండేవాడు
అనుదినం _ భగవద్గీత శ్లోకాల ను ఉచ్చ స్వరం తో__ఆ" వాడ "మొత్తం వినబడేలా రోజూ చదివే వాడు
రాత్రి రామ భజన ,తల్లితో భార్యతో కలిసి ,అర్ధ రాత్రి అయ్యేవరకు  నోటికి , చదువుతూ ,  చేతులతో చప్పట్లు చరుస్తూ  అత్యుత్సాహంగా ఆనందంగా  ,భజన చేసేవాడు  ,
,అతడిలో శివుని ప్రశాంత వదనం వలె , చిరు నవ్వుతో ,శాంత చిత్తంతో , సంతృప్తి  కనపడేది  !!
, మీకు , ఎన్ని బంగళాలు కోట్ల డబ్బులు  ,,కార్లు ఉన్నా _ నా అంత ధనవంతుడు ఉండబోడు కదా !"". అంటూ నవ్వుతూ
అనేవాడు ,,!
ఎందుకంటే తా ను  రాముణ్ణి ,రామ నామాన్ని మరవకుం డా ,విడవకుండా గట్టిగా పట్టుకొని _అనుదినం స్మరిస్తూ   ఉంటున్నాడు   కనుక ,,!
నిజానికి   అత డు పడుతున్న  నిత్య కష్టాలే__ అతడి దగ్గరి చుట్టాలు !
దేవుడు అనుగ్రహించిన సంతృప్తి దైవభక్తి ,నిరంతర  ఈశ్వర చింత నలే  ,__ఆయన మనస్సుకు  స్వాంతన కలిగించే  పరమ సౌఖ్యాలు, !
తన భక్తుని వేదించేవన్నీ  ఏమీ మిగలకుండా __అన్నీ లాగేసుకుని _చివరగా తన "కృప""ను ఇస్తాడేమో ఆ ఈశ్వరుడు !!
   అలా నిర్వికారంగా ,నిరాపెక్షా భావంతో  , ఈశ్వరుని కృప పై అచంచల విశ్వాసం తో. చెదరని భక్తి ప్రపత్తులతో ఉండడం సామాన్య విషయం కాదు !
,అంత పేదరికం లో కూడా ఒక్క క్షణక్షణం పాటు  భగవన్నామ సంకీర్తన మరవకుండ,. చేస్తూ  సంతోషంగా  తమ జీవనాన్ని  అలా ప్రశాంత చిత్తం తో  సాగించే   అలాంటి కర్మ యోగులు  __, ఆ పరమశివుని అనుగ్రహానికి తప్పకుండా  పాత్రులుకాగలరని అనిపిస్తుంది _!_
మనకు తెలియని  ఇలాంటి అజ్ఞాత   పరమ భక్తులు ఎందరో ఉన్నారు ! అలాంటి మహానుభావుల కందరికీ   సాష్టాంగ ప్రణామాలు  !!
   ఈ అంతు తెలియని అగాధ  తమో మయ సంసార కూపం లో ఉంటున్నా, కూడా , దేనిపై  అతిగా "మోహం" పెట్టుకోకుండా_ ,పెంచుకోకుండ , , తామర ఆకుపై నీటి బొట్టు వలె __దేనికీ అంటకుండా  _కేవలం ఈశ్వర చిత్తంతో __నిర్మల హృదయంతో ,__ప్రశాంత జీవనం కొనసాగిస్తూ_అంతా భగవద్ అర్పణం చేస్తూ జీవిస్తూ ఉండడం   అనేది   _ ""నిజమైన భక్తుని ముఖ్య  లక్షణం !""
భక్త ప్రహ్లాదుడు ,భక్త రామదాసు లాంటి  ఎందరో భక్తులు , సంసార బంధంలో ఉంటున్నా ,దేనికీ తగలకుండా , ఉంటూ , వారి చిత్తాన్ని. భగవంతుని పై మాత్రమే తగిలేలా చూస్తూ ," మోహం" తమ దరికి చేరకుండా జాగ్రత్త పడుతూ తరించారు ,  ఆ భక్త మహాశయులు !"
హే పరమేశ్వరా ! దయా సాగరా ,  నీపై బుద్దిని నిన్ను భావించి అర్చించి తరించే  చిత్త శుద్ది నీ ధృఢ సంకల్పాన్ని అనుగ్రహించు !
హే నారాయణా , జగదీశ్వర శరణు !""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...