June 1, 2020
ఆ అంతర్యామి ని _నా హృదయ అంతరాళం లో నిక్షిప్తం చేసుకుని, , క్షణ కాలం కూడా మనసులో ఏ ఇతర మైన అన్యభావనకు తావివ్వకుండా, ,,మీరిచ్చిన వ్యవధిని , కేవలం ఆ శ్రీకృష్ణ భగవానుని సచ్చిదానంద స్వరూపాన్ని ఆరాధించడం లో మాత్రమే వినియోగించు కున్నాను !
భగవద్ ఆరాధనకు 1_స్మరణం,2_ప్రయత్నం 3_భక్తి ప్రపత్తులతో వందనం ,, మరియు 4_నిరంతర చింతనం కొనసాగిస్తూ ఉండాలి
ప్రభూ !,
భగవద్ దర్శనం కావడానికి తపన సాధన ,విశ్వాసం , భక్తి శ్రద్ధలు ఉండి తీరాలి !!
"భగవద్ భక్తి ""కన్నా మించిన ఆనందం జగతిలో మరొకటి ఉండదు కదా !
అనన్యమైన భగవద్ చింతన కీర్తన తో,,దివ్యంగా ,భవ్యంగ పరమాద్భుతం గా ఈ వారం గడచింది !
నేను ఆ పరాత్పరుని సన్నిధానం లో ఉంటూ పరమా నందం పొందాను!
మనిషి ఎన్నేళ్ళు బ్రతికాడు అన్నది ముఖ్యం కాదు ,!
ఎన్ని రోజులు ,లేదా నెలలు అతడు భగవంతుని సేవలో గడిపాడు అన్నది ముఖ్యం !
అలా దైవారాధన కోసం వినియోగించబడిన రోజులు లేదా నెలలు అతడి వయస్సును సూచిస్తూ ఉంటాయి !_ఒక వారం రోజుల వ్యవధిలో_
దైవాన్ని , దర్శింప జేసే
ఇంతటి మహా భాగ్యాన్ని నాకు కలుగజేసిన మీ కు శతకోటి ప్రణామాలు !! ,, అనేక జన్మ లు తరింపజేసే అద్భుత అవకాశాన్ని ,,నాకు అనుగ్రహించిన మీరు__ నిజంగా నా పాలిట ""ప్రత్యక్ష గురు దేవులు,!""
ఈ విషయ వాసనా భరితమైన సంసార భవ బంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తూ ,,నన్ను ఉద్ధరించడానికి ఆ పరందా ముడు పంపించిన ఒక గొప్ప
మహాత్ములు గా. మీరు నాకు కనిపిస్తూ ఉన్నారు
ప్రభూ; !""
""మీరు నిజంగా ధన్యులు ,!"
__నాకు ఇపుడు ఈ మరణ శిక్ష అంటే ఏ మాత్రం భయం వేయడం లేదు !
, ఎందుకంటే,నేను పరమేశ్వరుని పరమ ధామం లో బ్రహ్మానంద చైతన్య స్థితి లో ఉంటున్నాను ,!!
, బాహ్యంలో ,మనకు ఎదురుగా కనిపించేది వట్టి మాయ !
, చిత్త భ్రమ , ను కలిగించే కృత్రిమ సోయగాలు ఈ మాయా ప్రపంచంలో విస్మృతిని,నిజం అన్న అభాసు భావన ను దర్శింప జేస్తూ, యదార్థ స్వరూపాన్ని మరుగు పరుస్తూ ఉంది !;
నశించిపోయే పదార్థంలో జగతిలో సంతోషాన్ని వెదకడం మూర్ఖత్వం అవుతుంది కదా !!,
__""నాది కాని దానిని , నాది!"" అనుకోడం అజ్ఞానం! అవిద్య అవివేకం , కూడా !!
ఇంద్రియాలకు లోబడి, పరబ్రహ్మ అయిన ఆ జగదీశ్వరుని మరచి పోతున్నాం మనం !;_
ఏదీ శాశ్వతం కాదు ,!;
__ బ్రహ్మ పదార్థంగా భాశించే ఆ పరమాత్ముని సన్నిధానం తప్ప !
ప్రశాంతత , సంతృప్తిని పొందడం కేవలం మన ఆత్మానుభూతి తో మాత్రమే సాధ్యం !; ఆ ఆనందం ఈ
బాహ్య ప్రపంచంలో లేదు ! మన అంతః కరణం లో,ఉదయించే మధురమైన భావము లో ఉంటుంది ఆ ఆనందం ;;
__ ఆత్మ లో సాధనతో అన్వేషణ చేసుకుంటూ,ప్రయత్న. ద్వారా పరమాత్ముని అనుగ్రహం తో నేను ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నాను !
, మహాత్మా ,I
బాహ్యంలో నాకు కనిపించే మీరు ,,,ఈ పరిసరాలు ,,
ఇవన్నీ ,ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శింప జేస్తూ ఉన్నాయి!!
___ నా అంతరంగం లో ""హరే కృష్ణ ,హరే కృష్ణా"" అనే దివ్య మైన ,జన్మ తారక మంత్ర గాన వైభవం లో ఆ , గోపాల కృష్ణ భగవానుడు , నా హృదయంలో ప్రకాశిస్తూ నే ఉన్నాడు !
,పరమాత్ముడు నాకు అండగా ,తోడుగా ఉండగా. నాకు
భయమేల ,??
చింతించ డం వట్టి దండగ!
__ఈ ""మృత్యు భయం పోయేందుకు ,, ఆ పరీక్షిత్తు మహారాజు మహా భాగవత శ్రవణ భాగ్యాన్ని ఆశ్రయించినట్లు ,నేను కూడా కల్పతరువు లాంటి భగవన్నామ స్మరణ ను ఆశ్రయించాను ,,ప్రభూ!""
, మీ లాంటి సద్గురువు ల ఆశ్రయం తో ,భగవంతుని చేరాలి అన్న తపన ఉంటే చాలు !!
నా అంతరంగం లో మెదిలే పరమాత్మ గురించిన భావ సంపద ను ఆవిష్కరిస్తూ ,నాకు అమూల్యమైన అపురూపమైన జీవన్ముక్తి అనుగ్రహానికి మీరు కారకులై నారు !!
__మీకు మరొక్కమారు త్రికరణ శుద్ధితో సాష్టాంగ ప్రణామాలు సమర్పించు కుంటున్నాను
మహాత్మా ,!
అఖండమైన ,అమోఘమైన పరమ అద్భుత మైన , ఆ బ్రహ్మాండ నాయకుని పరమ పావన చరణాల చెంత చేరడానికి ఈ భవ బంధాల నుం డీ నన్ను విడుదల చేస్తూ ,తరుణోపాయం గా
మీ విద్యుక్త ధర్మాన్ని కూడా. నెరవేర్చు కొండి ,;
హే పరా త్ప రా !
హే జనార్దనా ;
హే రాధికా వల్లభా !
నా ప్రణామాలు స్వీకరించి నాకు జీవన్ముక్తి ని , అనుగ్రహించు , పరందా మా !"పరమ పురుష!!
మురళీ మనోహ రా, !
సెలవు !
""-_ ( ఇంకా ఉంది )____'
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !
Wednesday, June 3, 2020
మృత్యు భయం _5
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment