Monday, June 29, 2020

శ్రీ రామ నామ గాన మహిమ-4

June 21, 2020
"మహానుభావా_! తులసీదాసు గారూ ,_!
_ ఈ రోజున  సాయంత్రం _ రామకథ   చెప్పడం అయ్యాక_  ప్రసాదం తీసుకొని అఖరున  _ ఒక  వృద్ద బ్రాహ్మణుడు వెళ్లి పోతూ   మీకు కనబడుతాడు  _మీరు ,వెళ్లి అతడి కాళ్ళ మీద పడండీ_ స్వామీ _! మీ సమస్య తీరిపోతుంది _!"
,_" నాయనా _! ఎవరు ఆయన ,_? నేను  ఎందుకు అతడి కాళ్ళు పట్టుకోవాలి ,_?" నాకు అర్థం కావడం లేదు,_!""
""అయ్యో  _!స్వామీ_!  ఎక్కడ రామకథ జరుగుతూ ఉంటుం దొ ,అక్కడ   ఆయన ఆ ఆంజనేయ స్వామి ,  తప్పకుండా వస్తాడని మీకు తెలుసు గదా ,_!"
_"ఏమిటి _?  నిజంగానే  నా   స్వామి వస్తున్నాడా  _? ప్రతీ రోజునా _? ""
_ మహాత్మా , మీ రు నిత్యం పారాయణ చేస్తున్న రామ కథ గానం  ఎంత ఆనందాన్ని  కలిగిస్తూ ఉందో , ఆ ఆనందం అనుభవించే వారికి మాకు తెలుసు, మీ రామ భక్తి, రాముని యందు మీకు గల ప్రేమాను రక్తి "_!
అపర శ్రీరామ భక్తులు _ మీరు రామ కథ గానం శ్రవణం చేయడం వల్ల ,_ బ్రహ్మ రాక్ష సుడనైన నాకు  ఘోరమైన శాపం నుండి విముక్తి కలుగుతోంది _!
  అలాంటిది , ఆ  రామకథ వింటూ పులకించే  అంజనేయ స్వామి రావడంలో వింత ఏముంది,_? చెప్పండి _!"
ఎక్కడ రామ కథ గానం వినబడుతుందొ  _అక్కడ ఆంజనేయ స్వామి తప్పకుండా  వచ్చి తీరుతాడు ,,_
వస్తున్నాడు_!
వచ్చాడు _!
వస్తాడు కూడా _!
    _ ఇంత  అద్భుత  విషయం తెలిశాక _మీరు  ఆనంద పారవశ్యం లో మైమరచి పోతారు _అని నాకు తెలుసు,__!
"అయ్యా _!, మీకు  శుభాకాంక్షలు_! మీస్వామి   శ్రీ రామ చంద్ర ప్రభువు దర్శనం లభించ బోతోంది _  సద్గురువు , శ్రీరాముని నమ్మిన బంటు _మీ ఆచార్యుని  అనుగ్రహం. _  పొంద బోతూ ఉన్నారు _!
_ఇక నే వెళ్తాను ,_ స్వామీ  రామకథ లో లీనమై  _ చేయాల్సిన పని
మరచి పోయేరు ,_ జాగ్రత్త
_!"" సెలవు ,_!  నమస్కారం _!""
_____-__
"అయ్యా _!తులసీదాసు గారూ ఏమైంది ,_? విచారంగా ఉన్నారు ఎందుకు _? ఏం జరిగింది , స్వామీ ?_
""_ఏం చేయను_ నాయనా _? ,దురదృష్టం నా వెంటే ఉంటోంది_!
_"ఏమైంది స్వామీ_? విషయం చెప్పండి _??""
_"నాయనా _!నీవు చెప్పినట్టే   వెళ్లి _ఆయన కాళ్ళు పట్టుకున్నాను _ నన్ను కరుణించ మని _!",ఆయన  నన్ను విద లించుకుంటు   దూరంగా జరిగి , కోపంతో ,,
"",నేను అంజనేయ స్వామి నీ ఏమిటీ _?
రామకథ చెబుతూ చెబుతూ అందులో లీనమై , నీకు కనబడే వారంతా ఆంజనేయ స్వామి వలె  భావిస్తూ ఉన్నావు కదా  ,నీవు _!"" ఆ శ్రీరాముని ఆత్మ బంధువు  ఆంజనేయ స్వామి ఎక్కడా_??  మీ  ప్రక్క కుగ్రామ నివాసిని_! నేనెక్కడ ?""
  ""మీరు  గొప్ప రామ భక్తులు  _!,   మీలాంటి మహాత్ములు  ఇలా చేయడం వలన _ నాకు ఘోర పాపం కలుగుతుంది,,  సుమా _!"" "పెద్దవాణ్ణి నేను _!
ఏదో రామకథ వింటూ పుణ్యం పొందాలని వస్తె ,_ ఇదేమిటి _?మీరు  నా పాదాలు పట్టుతూ ,_నాకు మహా పాపం  అంటగడుతు ఉన్నారు ,_??"
_"తప్పు _!  అయ్యా _! పూజ్యులు ,పుణ్యాత్ములు _ శ్రీ రామ కావ్య రచన కావించిన  అదృష్ట వంతులు ,__!
మీరు ఇలా చేయకూడదు _! భావ్యం కాదు మీకు _!
అంటూ  మెత్తగా చీవాట్లు పెట్టి  _ ఆయనే  నాకు ప్రతి నమస్కారం చేసి _ వెనక్కి చూడకుండా వెళ్లి పోయాడు   _!""
   ,  _"చూశారా. స్వామి_? మీ అంతటి మహా భక్తులే  ,బోల్తా పడ్డారు , మాయ  ప్రభావం అంత బలంగా ఉంటుంది,  ,  మనకున్న అజ్ఞానం ,అవిద్య వల్ల , పుణ్యాత్ములు ఎదురుగా ఉన్నా  , గుర్తించ లేక పోతాం _!""
గొప్పవాళ్ళు  _ మహానుభావులు ఎవరూ కూడా _ తాము" ఇంత వారిమి " అని  ఎక్కడా చెప్పుకోరు_!
విజ్ఞత తో విశ్వాసం తో , ,సాధనతో ,   సద్గురువు ను వెదకి పెట్టుకోవాల్సి ఉంటుంది    
,_ నా విషయం   అంతా ఆ  ఆంజనేయస్వామికి తెలుసు, _! స్వామి విషయం నాకు తెలుసు,_!  మిమ్మల్ని ఆశ్రయించే దారి , ఆ స్వామి దయ వల్ల నే నాకు  స్ఫురించింది _!
_మొదట్లో స్వామిని చూస్తుంటే  _ఒళ్ళంత మంటలు పుట్టి _ఆమడ దూరం పారిపోయేవాడిని _?? భూత పిశాచ రాక్షస గణాలు  ఆ స్వామి ముందు  నిలబడ లేవు కదా _! స్వామీ _!"
_" నిరంతరం రామ కథ వింటూ ఉండడం , రామ నామం జపిస్తూ ఉండడం వల్ల ,_ ఆంజనేయ స్వామికి నాపై  దయ కలిగింది,
_నా రాక్షస ఆకారం
,.  మీ ద్వారా నే    తోలగాల్సివుంది  _  అని సూచించాడు స్వామి _!
__ మహాత్మా_ తులసీదాస్ గారు  _! రేపు మళ్లీ   ప్రయత్నించండి ,, , ఈ సారి మాత్రం  ఆయన మాటలకు బెదరి పోవద్దు స్వామి,_! అతడి  నామ స్మరణ చేస్తూ,_ అతడి కృప జూపమని  ప్రార్థించండి ,_!""
      అభయం ఇచ్చే వరకూ , రామ దర్శనం దారి చూపెవరకు విడవకం డి__ ఆయన పాదాలు __!""
స్వామీ _
     సెలవు ,
నమస్కారం
     ( ఇంకా ఉంది)
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా _!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...