May 29, 2020
"తల్లీ,! యశోద మాతా, !
కొట్టబోకు మా కృష్ణుని!
అతడి పై కి బెత్తమెత్త, నీకు చేతు_లెటు లొచ్చేను !"??"
_"_నవనీత ము దొంగిలించి_
నవనీత చోరుడాయే
మా యెడదలో _కొలువై ఉంటూ
గోపీ మానసచోరుడాయే!!"
కన్నయ్య చేయి ,_ కందిపోతే,
మా గుండెలు బ్రద్దలు కావా !""
అమ్మా , ఓ నంద రాణీ!
మా కృష్ణుని విడవవే, తల్లీ!
అంత గట్టిగా పట్టబోకే!!
, బిడ్డ కంట తడి , చూడ లేమే !""
""నల్లనయ్య చేసే దంతా
మేము కోరు కున్న దే కదా!
మా కోసం చేసే దే కదా!!
గోపాల కృష్ణుని లీలలు
మా పాలిట ఆనంద హేల లు !
నీలమేఘశ్యామసుంద రుని.
బదులుగా మము__ దండించ వమ్మా!
మా ముద్దుల కృష్ణుని కోసం ,_మా
ప్రాణాలైనా అర్పిస్తాం "";!!
మా జీవన జ్యోతి ఆతడు!
మా కన్నుల వెలుగు ఆతడు !
మా కడుపున పుట్టలేదని ,
బాధ పడుతూ ఉంటాం కానీ,
మా కొడుకుల కన్నా మిన్నగా
కృష్ణుని ప్రేమిస్తూ ఉన్నాం!
మా గుండెలో కి తొంగి చూడు
అచట పారాడు కృష్ణుని చూడు ,
నీ కొడుకు సామాన్యుడా,,?
తన చూపుల మము బందించేను !!""
జై శ్రీ కృష్ణ!
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!"
No comments:
Post a Comment