June 4, 2020
యువరాజు గా నమ్మిన బంటుగా తనను సేవిస్తూ ,తమ్ముడిగా, ఆత్మ బంధువు గా తనను ప్రేమిస్తూ , ఇపుడు రాజద్రోహం నేరం కింద నేరస్తుడు గా ఉంటూ, మరణ శిక్ష కు గురి కానున్న దురవస్థ లో ఉంటున్నా కూడా, , ఆ బాధ ఏ మాత్రం కాన రాకుండా ,ఆనందంగా ఉన్నాడు ,
ఇలా అతడి లో , ,,అనుకోకుండా కేవలం వారం రోజుల్లో వచ్చిన ఈ అద్భుతమైన మార్పు కు రాజుగా, ఆ అన్నగారు చాలా ఆనందించాడు !
, ఈ వారం లో తమ్ముడి నడవడి గురించి ఆరా తీశాడు ,
అతడిలో దోషం కనిపించలేదు!
,, తామే బలవంతం చేసి ఒప్పించినట్లు తన మంత్రుల ద్వారా తెలిసింది ,
పది మంది అపరాధులను దండించ డం కంటే , ఒక నిరపరాధి ని దండించడం మహా ఘోర అపరాధం అవుతుంది ,,!
పోనీ అని విడిచి పెడితే , సోదరుని పై ప్రేమ వల్ల శిక్ష వేయలేదు అంటారు, ప్రజలు !
, కానీ ఈ తమ్ము డి ప్రవర్తన చూడబోతే , పరివర్తన చెంది న ఒక మహా యోగి లా , చక్కని ప్రశాంత వదనం తో ,నిర్మల చిత్తం తో , మృత్యువు ను ఆహ్వానిస్తూ సంతోషంగా కనిపిస్తూ ఉన్నాడు !!,
క్షమాభిక్ష ను కూడా అర్తించడం లేదు! , మొహం లో, బాధ లేదు !,భయం లేదు, !
అద్భుతమైన ఈ వింత మార్పు ను అతడిలో చూస్తుంటే రాజుగారికి ఆశ్చర్యం ,విస్మయం కలిగాయి !
రాజుగారు అతడి శిక్షను రద్దు చేస్తూ అన్నాడు,
""తమ్ముడూ!
,నీవు నాకు గురు స్థానాన్ని ఇచ్చి ,నాకు శిష్యుడు గా శరణాగతి చేస్తూ ఉన్నావు ,! నేను కలలో కూడా ఊహించని అత్యున్నత స్థితికి ఎదిగావు ,!
నిజానికి నీవు మనిషిగా మరణించి ,,ఒక యోగి గా పునర్జన్మ సాధించా వు !
అనగా , నీవు మరణ శిక్ష ను పొందినట్టే ,!
భోగి లా కాకుండా యోగి లా కనిపిస్తూ ఉన్నావు !
ఏ జన్మ పుణ్యమో నిన్ను ధార్మికత చిత్తం తో , దైవభక్తి నీ సాధించావు,,!
నీలో మునుపటి నా తమ్ము డిని చూడటం లేదు !
అయినా , నా ధర్మం నిర్వహించకే తప్పదు కదా !
"నీకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తూ ఉన్నాను ,!
ధర్మ శాస్త్రము ప్రకారం ఈ శిక్ష , నీకు మరణ దండన తో సమానము ,
తమ్ముడూ !ప్రేమా స్పదు డవు!, పరమ ఆత్మీయుడవైన నీలాంటి సోదరుని కోల్పోతున్న నాకు ,,కూడా ,, విధి శిక్ష ను విధిస్తూ ఉంది , ! నాకు చాలా బాధ గా దుఖంగా ఉంది,,
కానీ తప్పదు మన ఎడబాటు !
వెళ్లు , ఇదే మన చివరి చూపు ,!
అంటున్న అన్నగా రి కాళ్ళను తన కన్నీటితో కడిగాడు తమ్ముడు ;
""ప్రభూ ,!
నాలో దైవాన్ని దర్శింప జేస్తూ , పునర్జీవనాన్ని అనుగ్రహించిన ,,జీవితాంతం ,,నేను మీకు ఋణ పడి ఉంటాను !
నేనిక ధర్మ వర్తనతో ,ఆధ్యాత్మిక చింతనతో ,దేశాటన చేస్తూ,ధర్మాన్ని , భగవద్ భక్తి తో బాటు రాజ భక్తిని , ప్రభోదిస్తు ఈ శేష జీవితాన్ని ప్రశాంతంగా సంతృప్తిగా గడుపుతాను !!
ఈ దేశ పౌరుడిగా ,మీ శిష్యుడిగా ,మీకు కీర్తి ప్రఖ్యాతి తెస్తాను ,,! ఆ విధంగా
మీకు ఒక శిష్యుడిగా గురుదక్షణ చెల్లించు కునే ప్రయత్నం చేస్తాను ,,
,నన్ను ఈ మార్గంలో నడిపించ డానికి ,,నాలో పరివర్తన కలిగించడానికి ,, , , ధర్మ ప్రచార మార్గంలో , దైవభక్తి తో , పయనింప జేయడానికి , ఈ విధంగా నన్ను దన్యున్ని చేయడానికి , ఆ దయామయుడు,, ఆ కృపాసాగరుడు , భగవంతుడు ఆడిన ఒక నాటకం ఇది!
నన్ను దీవించండి ,!
మహా రాజా ! గురు దేవా!
ఇక సెలవు ,!"
అంటూ సాష్టాంగ పడుతూ ప్రణామం చేసి వెళ్తున్న తమ్ముడిని చూస్తూ వుంటే ,రాజుగారికి బాధ దుఖం ఒక్క సారిగా పొంగి వచ్చాయి
,చటుక్కున వెనక్కు దిరిగి,రాజభవనం వేపు వెళ్లి పోయాడు
,___________
ఆత్మలో భగవంతుని ప్రతిష్టిం చుకొంటు ఆరాధించే వారికి మృత్యువు అంటే ఏ మాత్రం భయం ఉండదు !_ అలా కాకుండా , అదే పనిగా _
మృత్యువు గురించి భయపడుతూ ఉంటే ,అది ఇంకా ఇంకా భయపడుతూ నే ఉంటుంది ,!
అసలు మృత్యువు అంటే ఎందుకు భయ పడాలి మనం ?!
మృత్యువు అంటే ఏమిటో కొంత మనకు తెలుసు !
__ప్రాణం , అంటే జీవుడు ,అంటే " నేను అనే అహం ___ చివరి శ్వాస విడుస్తూ,,"" కిరాయ ఇల్లు లాంటి , ఈ శరీరం వదలి పోవడం మరణం అంటాము !!
, ఖాళీ గా ఉంటున్న అద్దె కొంప లాంటి ,మరో ఉపాధి లో తిరిగి ఆశ్రయం పొందడం ,,జననం అంటున్నాం ,!;
ఇందులో పెద్ద తికమక లేదు ,
కానీ చావు అంటే అందరూ పడే భయం గురించి తెలియాలి !
,తెలిసిన వారి వద్ద తెలుసు కోవాలి కూడా !
భయం అంటే ,, ఇంత కాలం అలవాటైన తన "ఆటలు " ఇక సాగవని , తెలిసి,,,మనసులో కలిగే ఆందోళన ,ఆవేదన ,ఆక్రందన , పంచేంద్రియాలు పని చేయకుండా పోవడం ,,!భయం
అనుకుందాం !
మరణించాక ఏమౌతామో ,ఎవరికి తెలియదు ,!
కానీ , ఆ క్షణం వరకూ హ్యాపీ గా సాగిన ఈ బ్రతుకు బండి ,,మృత్యువు అనబడే ,బురదలో కూరుకపోయి ఇక సాగనంటూ ఉంటే, పాత బండి, పోతే పోనీ,మరో బండి ఇస్తాడుగా దేవుడు , అంటూ హాయిగా మృత్యువు కు ఆహ్వానం పలుకుతూ రెడీ గా ఉండవచ్చు కదా !
కానీ,
అలా ఉండటం లేదు ,సీన్__ మారుతూ ఉంటుంది
భయానకంగా ,అయోమయంగా ,,దెయ్యం పట్టిన వాడిలా ఈ చావు అనే భయం వేధిస్తూ ,బ్రతికి ఉండగా నే నరకాన్ని కళ్ళముందు చూపిస్తూ , తాను మాత్రం పరమా నందాన్ని పొందుతుంది ఈ మృత్యువు !;,
మనిషిని పిరికివాన్ని చేస్తున్న ఈ భయం అనే మహమ్మారి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు !".
(ఇంకా ఉంది )
Monday, June 29, 2020
మృత్యు భయం -6
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment