June 4, 2020
కృష్ణా !"
నీ ప్రేమయే జగతికి మూలం !,
నీ ప్రేమయే జీవన సారం!
మోహనముగ వేణు గానము చేసిన
, మది
పొంగును ప్రేమ సుధామృతం !
మోహము ,కోపము __తాపము ,ద్వేషము
తొలగును నిను ప్రేమించిన క్షణమున
, మమతా మరులను పూజా కుసుమాల _
నీ చరణ కమలముల యెడ
అర్పించిన చాలును ,
అణువణువున నీ ప్రేమతో నిండిన
జగ మున చూతుము కృష్ణా !
,_ నీ రూపమున !!""
""నిన్ను చేరుటకు , నీ ప్రేమ పొందుటకు _
నా కడలేవు గతజన్మ పుణ్యములు _!
నిన్ను తలచ,నేను ఆశక్తుడను !
అవివేకినీ , అవిద్యా పరుడను!
నీవే గతి యని,నీవే పతి యని
నమ్మిన నను
నీ వానిగ చేకొను !,
No comments:
Post a Comment