Wednesday, June 3, 2020

అదృష్టం అంటే !"?

June 3, 2020
""అమ్మ సన్నిధి లో గడపడం  నిజమైన ఆనందం ,అదృష్టం,,జన్మ ధన్యం కావడం !!""
అమోఘమైన "అమ్మ అనుగ్రహం "తో
అమ్మ మన ఇంటిలో మూడు నెలలు  మాతో బాటు ఎంతో సంతోషంగా ఉంది !!
తన ప్రేమతో, మా దంపతులను ఆశీర్వదిస్తు, తన ఆధ్యాత్మిక చింతన తో రోజు మమ్మల్ని  ఆనందింప జేస్తూ , ఎంతో తృప్తిగా, సంతోషంగా ,ప్రశాంతంగా అద్భుతంగా  ,,గడిచింది ,
,,  నిత్యం టీవీ లో రామాయణం,భారతం శ్రీకృష్ణ లాంటి పురాణ గాథలు రోజూ క్రమం తప్పకుండా.  తనతో  చూస్తూ  గడిపాం! సాయంకాలం 6pm కు భక్తి భజన స్తోత్ర కార్యక్రమాలు తనతో చూశాం !
ఉదయం జియ్యంగారి ఆదేశం ప్రకారం. తనతో బాటు  శ్రీ రామ నామాన్ని గానం  చేశాం !
తాను నిరంతరం , శ్రీరామ నామాన్ని  రాస్తూ  , రామ కోటి రచన లో  లీనమై , వేరే ధ్యాస లేకుండా ,సమయాన్ని ఏ మాత్రం వృథా పోనీయకుండా ,,దైవారాధన చేస్తూ , గడుపుతూ ఉంది అమ్మ ,!
ఎవరైనా బంధువులు వస్తె ఇక పూట,లేదా ఒక రోజు ఉంటారు , అతి కష్టంగా ,
కానీ ,
పరమ కృపాలుడు ఆ సాంబశివుని కరుణ వలన దుర్గా మాత ఆశ్రయం లో ,అనుగ్రహంతో , ఒకటి కాదు రెండు కాదు మూడు నెలలు మేము  , పెన్నిధి లాంటి అమ్మ సన్నిధిలో ,  సాక్షాత్తూ జగదంబ సన్నిధానం లో ఉంటున్న అనందం తో ,గడిపాం ,
సత్సంగం అంటే  ఇలా అమ్మ ఒడిలో  ఉండడం !!అమ్మ దయతో
అమ్మ అనుగ్రహం తో
అమ్మ సహచర్యం లో
అమ్మ  చల్లని మాటల మూటల మాధుర్యాన్ని  అందుకుంటూ ఉండడం కదా!
ఎవరు వచ్చినా,
ఎవరితో ఉన్నా, వారితో , ఇలాంటి సత్సంగం ,ఆశించలేం కదా!
ఏవో ముచ్చట్లు , ఏదో లోకాభి రామాయణం , తో వ్యర్తంగ ,,,అర్థం లేకుండా సమయాన్ని  దుర్వినియోగం చేస్తూ ఉంటారు ,
కానీ
,ఈ అమ్మతో ఉన్న ఈ మూడు నెలల పండుగ రోజుల్లో, దైవ పూజ పఠనం కార్యక్రమాలతో సమయాన్ని సద్వినియోగం అయ్యింది !;
_ భక్తి కార్యక్రమాలు చూడటం
_భక్తి పుస్తకాలు చదవడం
_భక్తి గీతాలు పాడటం
రాయడం, ,
ఇలా దివ్యంగా భవ్యంగ ,అనుదినం అమ్మ కొలువులో సేద దీరే భక్తుల వలె, మేము , మాటల్లో చెప్పలేని దివ్యమైన దైవాను భూతిని  పొందాము!
,అదృష్టం అంటే మాది!
ఇలా అమ్మ వద్ద ఉండే ప్రతీ వారిది. కూడా !
అమ్మ లేని లోటు ,అమ్మ విలువ ,అమ్మ దీవన చలువ బలం ,,,
ఇవన్నీ అమ్మ కు దూరంగా ఉన్నవారికి చక్కగా తెలుస్తుంది  కదా !!
అమ్మ ప్రేమతో మూడు నెలల పాటు,అమితానందాన్ని పొందిన మాకే,ఇంత సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తూ ఉంటే
ఇక
అమ్మ అనే నిధి తో
అమ్మ అనే పెన్నిధి తో
అమ్మ సన్నిధిలో
అమ్మ ప్రేమను ,అమోఘమైన
అమ్మ ఆశీర్వచనం తో,,అనునిత్యం
అనుదినం అనుక్షణం ఆనందంగా  గడుపుతూ ఉండే ఆ   కొడుకులు ,,కోడళ్ళు  వారి కుటుంబం  ఎంత  భాగ్యవంతు లో చెప్పలేము కదా ??
"హే  జగజ్జననీ !
మాకు అందించిన  ఈ  అమ్మ దయ కు ,
అమ్మ పరిచర్య లకు
నీకు  శతకోటి ప్రణామాలు!! స్వీకరించు  తల్లీ !
ఇలాంటి సత్సంగాన్ని ,భావ సంపద ను అమ్మ దయ అనే  బ్రహ్మానంద స్థితిని ,,
చెదరని తరగని ప్రేమానురాగాల ను ,
అనుబంధాలను ,
మరచిపోకుండా , మళ్లీ మళ్లీ మాకు  ప్రసాదిస్తూ ఉండు , శ్రీ మాతా !
కరోనా , ఇలా మాకు ,, ఈ విధంగా  చూపించిన  దయను , మేము మాత్రం  మరచి పోలేము  !,
ఎవరికి ఏ నష్టం, కష్టం కలిగించిం దో ,, కానీ
మా దంపతుల కు  మాత్రం అద్భుతమైన  "అమ్మ ఒడి లో "ని  అనందాన్ని అనుగ్రహించింది !
" హే , పరమేశ్వరీ !!"
నీకు నమస్సులు !
అలాగే  ఇన్ని రోజులూ,,తమ "మాతృమూర్తి ప్రేమ "అనే అమృతాన్ని  ,,మాకు కూడా కొంత , ఈ రకంగా  పంచి ఇవ్వడానికి  సహకరించిన ఆమె పుత్ర రత్నాలకు కూడా. మేము  ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ,!
వారి ప్రేమతోనే ఇది సాధ్యం అవుతుంది కదా ;
,, హే జగన్మాత !
ఇలా సదా నీ సేవలో , నీ స్మరణతో జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా గడిపే లా  మమ్మల్ని కటాక్షిం చు , మాతా !!
మా అమ్మ గుర్తుకు తెస్తోంది ఈ అమ్మ ,
ఎప్పుడూ , తాను రామ కోటి వ్రాస్తూ ,  ఉండేది ,,
ఇలాంటి భగవద్ భక్తులు  ఉన్న ఇల్లు సాక్షాత్తూ దేవాలయమే అవుతుంది , కదా !
సదా నేను కోరేది ఈ పరమ పావన  సంస్కృతి నే ,

హే లలితా త్రిపుర సుందరీ!
హే నారాయణి!
హే రాజరాజేశ్వరీ !
నమో నమః !"
సర్వే జనాః సుఖినోభవంతు!
సమస్త సన్మంగలాని భవంతు !"
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...