Monday, June 29, 2020

సుఖం అంటే ?

June 5, 2020
ఆత్మానుభవం తో  సంపాదించే ఆత్మానంద మే  వాస్తవమైన సుఖం !
ఏ సుఖం ఉంటే ,,మిగతావి ఏవీ  రుచించవో , ఆ   సచ్చిదానంద పరబ్రహ్మ అద్వైతా ను భవ స్థితి ని  జీవుడిని తృప్తి పరిచే , అనందో బ్రహ్మ ,అని తలపించే  శాశ్వత మైన  "సుఖం " అవుతుంది
, ఈ స్థాయికి చేరాలంటే పరమాత్ముని అనుగ్రహానికి నోచు కోవాల్సి ఉంటుంది !__
ఉత్తరాఖండ్ లో_ _"ఉత్తమ్ ప్రదేశ్ "అనే  ఒక నగర మహా రాజు గారికి    సకల  సంపదలు  , పెద్ద కుటుంబం ,పేరు ప్రతిష్టలు ,,రాజ వైభోగాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి ,__
  నిరంతరం __ విందులు ,విలాసాలు వినోదాలలో ఆనందంగా ఉంటూ ఉన్న అతడికి _ ఒక్కసారిగా , ఎందుకో తెలియని విచారం తో  కృంగి పోసాగాడు ,,__
""నాకు ఏదో జబ్బు వచ్చింది ,!అందుకే ఇన్ని  ఉన్నా కూడా  సంతోషంగా  ఉండ లేక పోతున్నాను!" దయచేసి ఎవ్వరైనా పుణ్యాత్ములు నా జబ్బు నయం చేయండి!""
,అంటూ  విలపిస్తూ విచారంగా ఉంటూ, తన గది నుండి బయటకు రావడం మానేశాడు _ఆ రాజు _!
,_ఈ వార్త నగరంలో చాటింపు చేశారు ,!రాజుగారి జబ్బు నయం చేసి ,అతడిని సంతోషంగా చేసిన వారికి __ వారు కోరినంత ధనం ఇస్తామంటూ ప్రజలకు చెప్పారు ,!!
అతడికి వున్న "జబ్బేమి టొ "తెలియదు ,!
"ఎందుకు విచారిస్తూ ఉన్నాడో తెలియదు ,! దీనికి  ఎవరు మాత్రం ఏం చేస్తారు ,?""
ఎవరి వల్లా ఈ పని కుదరలేదు ,,
చివరకు ఒక పండితుడు రాజు వద్దకు వెళ్ళాడు ,
""రాజా! ఎందుకు మీరు దుఖ పడుతున్నారు ??"" చెప్పండి ?"
"అదే  నాకు కూడా తెలియడం లేదు !""
, "పోనీ ,మీ సభలో ,రాజ భవనం లో ఉంటున్నవారు  ఏ  రంది లేకుండా సుఖంగా  ఉంటున్నారని మీరు భావిస్తూ ఉన్నారా ,,?""
"అది  కూడా నాకు తెలియదు  !నేనడగ లేదు ఎవర్నీ !""
""తెలుసుకోండి , రాజా !
ఒకవేళ  ఏ కష్టం తెలియకుండా ,సుఖంగా ఎవరైనా  ఉన్నారని తెలిస్తే , _వారు అడిగినంత ధనం ఇచ్చి ,  వారు తొడిగిన  అంగీ లేదా  చొక్కా  తెప్పించుకు ని __ఆ చొక్కాను మీరు ధరించండి !
అంతే!
ఇక మీరు  ఎప్పుడూ సుఖంగా నే నవ్వుతూ _ పరమ సంతోషంగా  ఉంటారు !""
, అని చెప్పి వెళ్ళాడు
మళ్లీ చాటింపు ,ఆ అంగీ , చొక్కా కోసం ,!""
అలాంటి వారిని వెదకడం కోసం రాజ భటులు__ పాపం  పడరాని పాట్లు పడుతున్నారు , ఎవర్ని అడిగినా "సుఖమా ?"" అది ఎలా ఉంటుంది ,అని  ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు ,,
నగరంలో  నిత్యం సుఖంగా ఉన్నవారు ఎవరూ. వారికి  దొరకలేదు !;
__నగరం విడచి _ దాని ప్రక్కన గల  అనేక గ్రామాల్లో కూడా  తిరగడం చేశారు ,!
అయినా లాభం లేదు !
ఇక వెనక్కి వెళ్లిపోయే సమయంలో,, చివరి ప్రయత్నంగా ,  వారు ఒక ఎడ్ల బండి తోలుకునే వాడిని అడిగారు ,
""ఎలా ఉన్నావు  ?""
""నాకేం హాయిగా సుఖంగా ఉన్నాను !""
""ఇప్పుడే నా , ఎప్పుడూ నా ??""
ఎప్పుడూ ,, ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా,, తిట్టినా , పొగడి నా !""__
""అవునా ,! ఆహా!  మాకు ఎంత సుదినం నేడు ! నీ కోసమే వెదకుతున్నాం. ఇన్నాళ్లూ !
,హమ్మయ్య ! దేవుడు కరుణించాడు  కదా !
ఇక నీవు ధరించే చొక్కా ఇవ్వు ,  ఎంత డబ్బు కావాలో చెప్పు ? ఇస్తాము !""
"నాకు చొక్కా లేదు!__ నేనెప్పుడూ తొడగను  కూడా ,!""
"అదేమిటి  ?? పైన వేసుకోడానికి ఒక చొక్కా  కూడా లేకుండా నీవు సుఖంగా ఎట్లా ఉంటావు ,??"
"ఏం. ,? చొక్కా ఉంటేనే సుఖంగా ఉంటారా ??_
సుఖం చొక్కా  లో  ఉంటుందా ,?"",
""ఏమో ! ఈ   సుఖం  ఏమిటో ,అది ఎక్కడ ఉంటుందో,, దాని కోసం ఆ రాజుగారు ఇంత తాపత్రయ పడటం ఏమిటో , అంతా చిత్రంగా ఉంది మాకు ! అది తెలుస్తే మేము ఇలా ఎందుకు తిరుగుతూ ఉంటాం !అదంతా
మాకు తెలీదు కానీ __నీ విషయం రాజుగారికి చెబుతాం ! ఇక వెళ్తాం !అంటూ వెళ్లారు రాజభటులు ,,
వెళ్లారు వాళ్ళు ;
తెల్లారి తానే వచ్చాడు రాజు __తన వెంట  అట్టహాసంగా ,సమస్త రాజ పరివారం తో  _  మందీ మార్బలం తో __
అది చూసి బండి తోలేవాడు __"" అలసి పోయాను ,! నాకు నిద్ర  వస్తోంది ,ఇపుడు ,;",రేపు  రండి !"" అన్నాడు
మరునాడు వచ్చాడు రాజు !
,కానీ తానొక్కడే మహారాజు వేషంతో కత్తి కటారులతో , దర్పంగా ,!;
మళ్లీ బండి వాడు "" , నాకు బండి తోలుకునే పని ఉంది; నేడు నాకు  తీరిక లేదు,, రేపు రా !""
అన్నాడు
రాజు కి కోపం రాలేదు!; నిరాశ పడలేదు !,పైగా పట్టుదల పెరిగింది ; మళ్లీ తెల్లారి , రోషంతో వెళ్ళాడు!;
మరునాడు ,ఉదయమే బండి వాడు నిద్ర లేవక ముందే వచ్చి  అతడి ప్రక్కన కూర్చున్నాడు ,
కానీ రాజు వేషం లో కాదు , అతి సామాన్యుడు గా ,!!"  _  అతడి భుజం పై ఒక పంచె, ,చేతిలో ఒక కర్ర !" ఇవి చూస్తూనే
బండి వాడు లేచి వెళ్ళి __ రాజును కౌగలిం చు కొంటూ , అదే బండి కింద తన  ప్రక్కన  చింకి చాప పరచి ,  కూర్చో బెట్టుకున్నాడు ,!
ఇక  _ వారిద్దరి మధ్య సుఖం గురించిన , అద్భుతమైన  సంభాషణ మొదలైంది ,
*
ఎడ్ల బండి తొలుకు నే వాడు , ఆ ప్రాంత మహారాజుకు  "" నిత్య సుఖి !""  ఎలా ఉంటాడో  వివరిస్తూ ఉన్నాడు !
""రాజా , !నీ సభ లో ఉన్న మంత్రులు ,పండితులు ఎవరైనా   తాము సుఖంగా ఉన్నామని  మీకు చెప్పారా ?"
""తాము ఎవరూ కూడా  సుఖంగా లేమని  అన్నారు !"
""అదేమిటి  ,వారికి అన్నీ ఉన్నాయి కదా ,!" లేనిది ఏదైనా ఉందా ? అది లేదని బాధ గా  ఉందా వారికి??""
""ఏమో ?,అదే  సమస్య నాకు కూడా ఒక జబ్బు లా వేధిస్తూ ఉంది !""
""రాజా! ," సుఖం ""అంటే నీ అభిప్రాయం ఏమిటి ,?? చెప్పు !"
"" అందుబాటులో అన్నీ ఉండడం , ఏది కోరితే అది లభించడం , ఇదే సుఖం !"" అనుకున్నాను, ఇంతవరకూ !""
"" అంటే వస్తువుల్లో సుఖం ఉందని మీ ఉద్దేశ్యము__ అవునా ?""
""అంతే కదా ,,;""
అయినా తృప్తి,కలగడం లేదు , సుఖం అనిపించడం లేదు  !"    అంతా మాయగా ఉంటోంది ,,నిన్న ""ఆహా  !"" అనిపించింది  , నేడు అయ్యో,!"  అంటూ తల పెట్టుకోవాల్సి వస్తోంది !""
""అంటే  భోగించే ,, ఉపయోగించే  ఏ వస్తువుల్లో  కూడా సుఖం లేదు  !""అని తెలుస్తోంది  కదా !""
""అవును !"
,"మరి ఎక్కడ ఉంది  సుఖం ??""
  ""మీరు  మహా రాజులు! వనితలు ,విందులు , మధిర మగువలకు  మీకు కొదువ ఉండదు  కదా  !" లేదు అనేదే లేదు కదా మీకు ??"
     ""నాకూ అదే వింతగా ఉంది ,! ఎన్ని రోజులు అలా వి,లాసాల్లో మునిగి తేలుతూ ఉన్నా , ఎక్కడో వెలితి గా అనిపిస్తూ ఉంటుంది ;
ఆ మోజులు తీరగానే ఖేదం !;, అవి ఎదురుగా ఉంటే మో దం ! ""
,   మధిర ,మధువు  లాంటి భోగ వస్తువుల అనుభవం ,అందమైన  వనితల  శృంగారం తో  పొందే అనందం కన్నా __ఇక ,ఇవి దూరం ఆవు అవుతాయి  కదా ,, ఎప్పటికీ నన్ను అంటి పెట్టుకొని ఉండవు కదా !""అన్న బాధ  వేదన అధికంగా  మెదులుతూ ఉంటున్నాయి ,నాలో ,__!
""__అందుకే దేని పై కూడా మనసు పోవడం లేదు ,! ఇది వైరాగ్య మా ?!,,లేక ఒక  రోగమా?" ఏదీ కూడా   అర్థం కావడం లేదు , నాకు !""
  "రాజా ,;మీరు చెప్పిన దాన్ని బట్టి  ఎదురుగా కనిపించే ఏ వస్తువూ కూడా  మీకు ఆనందాన్ని ఇవ్వ లేదు అని తెలుస్తోంది కదా!""
""అవును !,, కానీ  మరి ఎక్కడుంది ఈ  అసలైన  అనందం ?""
నీకు కావాల్సిన సుఖం బయట కనిపించడం లేదు !!""
అని తెలిశాక లోపల వెతుక్కోవాల్సి ఉంటుంది కదా !""
లోపల అంటే  ఎక్కడ ??""
"" అంటే నీ హృదయంలో!""
""  అంటే  నీ ఆత్మలో !""
""ఆత్మ నా ?!,ఎక్కడుంది ? అది ఎలా ఉంటుంది ?
ఆత్మ  అనేది నిరంతరంగా దివ్యంగా ప్రకాశించే   ఒక  పరంజ్యోతి స్వరూపము ,!;
ఆత్మ వలనే జీవుడు  తన జీవనాన్ని కొనసాగించి ,కోరుకున్న వాటిని__ అంటే మోక్షాన్ని కూడా  సాధిస్తూ ఉన్నాడు! ,,
""ఆత్మ బలం "*వల్లనే జీవుడు సంతోషంతో ప్రగతి ,పథంలో పయనిస్తూ ఉన్నాడు ,!
చిత్రం ఏమిటంటే" ఏ ఆత్మ వలన తాను ఆనందంగా ఉంటున్నాడో , తనలోనే ఉంటున్న   అదే  ఆత్మను గుర్తించడంలో విఫలుడవు తున్నాడు ,
""  ఆత్మ ఉంది నాలో  నీలో ,!,అనడానికి ప్రమాణం ఏమిటీ ?
""నీవు పొందే సుఖం దుఃఖం   ,,  అనుభూతి"""__ ఇవన్నీ ఆత్మ వల్లనే లభిస్తున్నాయి ,కదా !!
రూపం ,గుణం లేని  ఆ ఆత్మను అర్థం చేసుకో వడం ఎలా ,?""
""అవును!!,నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం  ఈ ఆత్మ !,""
_ దాని స్వరూపం  ఎంతటి మహాత్ములకు  కూడా అర్థం  చేసుకోలేరు ;,
""ఇలా ఉంటుంది అని కూడా  చెప్పలేము , !" "నాశము లేనిది !,అమోఘం,, అవిభక్త ము , అద్భుతం   దైవాంశ సంభూత ము ,, బ్రహ్మానంద కరము ,,జీవుడు దేవుడితో అనుసంధానం చెందించే  అపురూప  అద్వితీయమైన శక్తి చైతన్య స్వరూపము. ఈ ఆత్మ ,!!""
__,అయితే , కేవలం అనుభవం ద్వారానే  ఆత్మానందాన్ని  పొందవచ్చు !""
""ఆత్మ ఎక్కడ ఉంటుంది ,!""
""ప్రతి ప్రాణి లో ఉంటుంది ,!""
""ఆత్మ లేని చోటులు  ఉంటాయా ,?""
ప్రతీ ప్రాణి ,తన మనుగడ కొరకు ధరించే , ఉపాధి లాంటి ఈ శరీరాలు "__  ఆకారాలు,, ఇవేవీ కూడా  ఆత్మ కు  స్వరూపాలు కావు!;
వాటిని "అనాత్మ " లు అంటారు కూడా ,,;
, ,""అనాత్మ అంటే అర్థం ఏమిటి ,!?""
, ఈ   దేహాలు , అన్నీ అనాత్మ స్వరూపాలే !""
అజ్ఞానం  అంటే ఏమిటీ ?!!"
నిత్యం కానీ ఈ దేహాలు ఆత్మ స్వరూపాలు అని భ్రమించడం ,అవిద్య ,అజ్ఞానం ,అవివేకం కూడా !!""
""ఆత్మ_ అనాత్మ ,!" ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో ?""
""అనాత్మ ,పరిణామాలకు గురి అవుతుంది !
క్షణక్షణం మారుతూ ఉంటుంది !
,,అది నాశనం అవుతుంది !
,  క్రమేణా ,,కాల గర్భంలో  కలిసి పోతుంది,!
ఆత్మకు చావు లేదు ,మార్పు చెందదు ! !""
""ఎందుకు మనీషి ""అనాత్మ ను  _ఆత్మ !""అని అపార్థం చేసుకుంటూ ,జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాడు?!""
"" ముఖ్య కారణం ఆత్మ గురించిన విచారం చేయకుండా , ఉండడం !"" ""ఎండమావుల వంటి  ఈ  ఇంద్రియ సుఖభోగాలలో మునిగి తేలుతూ ,""ఇదే శాశ్వత ఆనందం!"" అని భ్రమ పడుతూ ఉండడం !"* ముఖ్య కారణం !;""
,""__అయితే మనిషి అనుభవించే  సుఖం విషయ సుఖాలలో   నిజమైన  ఆనందం లేదా ,?? అది పరమానందం కాదా ?""__
""కాదు ! కానే కాదు !
,పరమానందం అనేది పరిణామాలకు లోను కాదు ,; అది సత్యము నిత్యమూ శాశ్వతము , జ్ఞాన మయ ము ! అంటే పరమాత్ముని సాక్షాత్కారం నేరుగా తలపించే __ దివ్యమైన  పరమాద్భుత  మధురానుభూతి  అది!;"" పరమాత్మ స్వరూపం , ను ఆత్మ సాక్షాత్కారం తో తలపింపజేస్తూ ఉంటుంది , యోగులు మునులు మహాత్ములు ,భక్తిపరులు    ఈ బ్రహ్మానంద స్థితిని  కోరుతూ  ఉంటారు ;"!!   ""అహం బ్రహ్మాస్మి!""
నేనే పరమాత్మ స్వరూపాన్ని  ,అన్న తత్వ జ్ఞానం,ప్రదర్శిస్తుంది , , ఈ ఆత్మ సుఖ వైభవ ము !!
ఆ దివ్యానుభవ స్థితి ని పొందాక ,జీవుడికి ___ఇక ఈ తుచ్ఛమైన అల్పమైన , క్షణికమైన చిన్న చిన్న  ఆనందాలన్నీ , మరుగున పడి __    ఆ పరందాముని  తలంపు ల మధుర భావన అనే ఙ్ఞాన అమృతానంద   లహరిలో  ఆత్మ సుఖం అనబడే  సుధాంబుది తరంగాల లో తేలియాడుతూ ,పరాత్పరుని చింతన లో రమిస్తూ __ తేలియాడుతూ   ఉంటాడు !
__  అలాంటి  దివ్యమైన అఖండమైన ఆత్మ తేజస్సు ముందు , ఈ అనాత్మ లు ___ సూర్య భగవానుని దివ్య తేజస్సు ముందు ,దీపపు కాంతుల వలె వెల వెల బోతూ ఉంటాయి ,,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...