June 4, 2020
"కొడుకా ! వచ్చావా, ,,! రారా !,ఎన్ని రోజులైంది రా , కన్నా నిన్ను చూడ క ! ప్రాణం లేచి వచ్చి నట్టుంది, రా ! భగవంతుని దయ అపారం కదా ! కొడుకా , రా !
నాదగ్గర కూర్చో ,,!""
ఆహా ,! ఈ రోజు నాకు పండగ రోజు కదా , నా కొడుకు నన్ను వె దక్కుంటు వచ్చాడు , నా కోసం !! ఈ రోజే నాకు దసరా ,దీపావళి ,, ! ఈ వార్త ఊరి వాళ్ళకి తెలిస్తే , , నిజంగా వచ్చాడా నీ కొడుకు , ఏం తెచ్చాడు ,ఏమన్నాడు , నిన్ను రమ్మంటాడా తనతో ,,! డబ్బులు ఏమైనా ఇచ్చాడా,,?, అంటూ ఎంత సంబర పడతారో కదా !!""
"అమ్మా ,,అమ్మా !నీకు ఎంత సంతోషంగా ఉన్నదో ,నాకు కూడా అంతే సంబరంగా ఉందే ,అమ్మా! నిన్ను ,నీ సంతోషం చూస్తుంటే ,,, !""
, "అమ్మా !ఇలా నీవు నన్ను దగ్గరకు తీసుకొని ,ప్రేమతో , నా తల ,వీపు , నీ చేతులతో మెల్లగా నిమురుతూ ఉంటే ,అమ్మా! ఎంత హాయిగా ఉంటుందో తెలుసా,?
నాకున్న బాధా ,బరువు, అలసట ,అన్నీ క్షణంలో మటు మాయం అవుతా యి కదా అమ్మా !""
""కొడుకా! నీ కోసమే నేను బ్రతికేది ! నిశ్చింతగా నీ చేతుల్లో పోవలన్నదే నా కోరిక !
దేవుణ్ణి రోజూ ఇదే కోరుకుంటాను , స్వామీ నా కొడుకును తన కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ !
అంటూ వేయి దేవుళ్ళకు మొక్కుతుంటాను రా నానా ,!"
""ఒరేయ్ కన్నా ,! నీ కు ఏమనిపిస్తుం దో , నాకు తెలియదు కానీ ,నాకు మాత్రం ఇలా నా వొడిలో తలబెట్టుకొని పడుకున్న __నా చిట్టి కొడుకును చూస్తుంటే , నీ చిన్న తనలో ఎంత అల్లరి చేసే వాడివో అవన్నీ గుర్తుకు వస్తాయి తెలుసా ??
__ ఎంతో ధనం ,ఎన్నో రాజ్యాలు సంపాదించిన ట్టు నాకు ఎంతో అనందం కలుగుతోంది రా !!
"" అమ్మా !,నేను ఏమిచ్చా నని నీకు ఇంత సంతోషం ??""
""నా పిచ్చి తండ్రి ,!
నీవు నా కలల పంటవు ,! నా జీవిత సర్వస్వానివి , నా బంగారు తండ్రివి !, ఎన్నో కష్టాల ఫలానివి !,, నా పూర్వ జన్మల నోముల పున్యానివి !
మీ తండ్రి బ్రతికి ఉంటే నిన్ను నీ సంసారాన్ని చూస్తూ ఎంత సంతోషించే వాడో కదా ! ఆయనకు ఇది బాకీ లేదు, మీ బాధ్యత బరువు నాకు అప్పజెప్పి పోయాడు కదా !
_ అందుకే ,నిన్ను దగ్గరకు తీసుకుంటు , నీ కోసం మేము పడ్డ బాధలు అన్నీ మరచి పోతానురా కొడుకా!!
__""అమ్మా ఒక్కటి అడుగుతా ,!నీవు ఏమీ అనుకో వు కదా ?!""
"" నాపిచ్చితండ్రి ,!! నా కన్నా , ఏమనుకొను గానీ చెప్పు ,ఏం కావాలో ,!?""
"" అమ్మా! నాకు నీవు కావాలి !
నా వెంట నీవు రావాలి అమ్మా !, ఈ మారుమూల గ్రామంలో ఒక్కదాని వి ఒంటరిగా ఉండటం ,పైగా పెద్ద తనం , కూడా !అమ్మా , ఇలాంటప్పుడు నీవు తప్పకుండా మా దగ్గర నే ఉండాలి కదా అమ్మా , !!"
ఎవరన్నారు రా నేను ఒక్కదాన్ని అనీ, ఈ ఊరు వారంతా నన్ను ప్రాణంగా చూస్తారు , ఎప్పుడూ కనిపెడుతూ ఏది కావాలన్నా తెచ్చి పెడతారు , రాత్రిళ్ళు నాతో ఇదే ఇంట్లో తోడుగా ఉంటారు కూడా ,! వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా , కన్నా ! ఏ జన్మలో ఋణమో , ఎంతో ప్రేమతో నా మంచి చెడూ చూస్తారు ,అవసరం అయితే డాక్టర్ ను కూడా తీసుకొస్తారు రా , నాన్నా !"
అయినా నాకు చేత కాకుండా పోతే , అప్పుడు ఎలాగూ నీ దగ్గరకు రాక తప్పదు కదా !!" శక్తి ఇచ్చాడు దేవుడు,,చూద్దాం , ఎంత వరకు వీలయితే అంతవరకూ ఇలా ఈ బండి నడవనీ , !!" ఆ పైవా డు ఉన్నాడు కదరా ,. నన్ను చూసుకోడానికి ! ఎందుకు . నీకు అంత భయం చెప్పు !!""
""అలా కాదమ్మా! ,, అంత వరకూ ఇలా కష్ట పడుతూ,, నీవే అన్నీ పనులు చేసుకుంటూ , ఎవరూ లేని వారి వలె మాకు దూరంగా ఉండటం ,, అంత అవసరమా ,అమ్మా ,??
నీవే చెప్పు ?? మాకు మాత్రం బాధగా ఉండదా ?!"
""పిచ్చి తండ్రీ !, నీ మనసు నాకు తెలియదా చెప్పు ,? నీకు అర్థం కాని సంగతి ఒకటి చెప్పనా ??""
""చెప్పు అమ్మా !, ఇంత పెద్ద వాడిని అయ్యాను , అయినా , ,ఇంకా నాకు తెలియనిది ఉంటుందా ??""
""ఉంది రా కన్నా !అదే ఈ తల్లీ ప్రేమ ! మీరు ఎక్కడ ఉన్నా ,దైర్యంగా ఉండే శక్తిని , ఇస్తుంది అది ! నీకు ఇప్పుడు అర్థం కాదు,, నీ బిడ్డలు పెళ్ళై,,నీకు దూరంగా ఉంటే,,అప్పుడు తెలుస్తుంది కన్న పేగు తీపి !!""
కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్లు బిడ్డలు అల్లుళ్ళు వారి పిల్లలు అందరూ నా వాళ్ళే , !నా మీద ప్రేమ ఉన్న వారే !,
నేనంటే ప్రాణము వారికి !! నిజమే ,,!
కానీ ,నన్ను చూడటానికి ,, నా కోసం ,, ఈ ముసలి దాని కోసం , ఇదే మీ అమ్మ కోసం __ప్రత్యేకంగా మీరు' ఎవరైనా చూడటానికి ప్రేమతో ఇలా వస్తుంటే ,, నా ఆయుష్షు మరింత పెరుగుతూ ఉంటుంది __ అలా మీరు నా కోసం రావడం ,,నాకు చాలా సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుంది రా ,!
పెద్ద తనం లో కన్న వారు కోరుకునేది ఇదే ,ఆదరణ ! అమ్మా అంటూ ప్రేమతో మమ్మల్ని పలకరిస్తూ బ్రతి కినన్నాల్లు , ,సంతోషంగా ఉంచడం !!
ఇది చాలు కొడుకా ! ఇంకా ఏమీ కోరం మిమ్మల్ని !
__నాకున్న ది , రోజూ ,నేను తింటున్నది, __ స్వయంగా నా చేతులతో వండి ,నా ఇంట్లో ,నేనే మీకు ప్రేమతో ,స్వయంగా తినిపిస్తూ ఉంటే _అది నాకు ఎంతో ఆనందం, పరమసంతోషంగా , ఉంటుంది తెలుసా !
ఈ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటూ మళ్లీ మిమ్మల్ని చూసే వరకూ, బ్రతికి ఉండే శక్తిని తెచ్చుకుంటాం రా కన్నా !!"
, ""అమ్మా !అలా నీవు కళ్ళ నీరు పెట్టు కోకే !"
,నాకు కూడా ఏడుపు వస్తుంది ,!"
__ఏదో నలుగురు ఏమనుకుంటారు__ అని ,నిన్ను రమ్మని మాతో ఉండమని అంటున్నాను ,,,! అంతే !"దానికంత బాధ పడాలా చెప్పు ?""
""కొడుకా , నీ ఇల్లు ,నా ఇల్లు _ అంతా ఒకటే !
ఇది నీదే !అది నీదే , !
_కానీ ,ఇలా స్వంతంత్రంగ ఉంటూ , , వృద్దాప్యం లో ,ఎవరి చేత కూడా మాట పడకుండా , వారి మోచేతుల కింద చేయి చాచకుండ , ఉండాలని ఈ నీ పిచ్చి తల్లి ఆశ ! అంతే !, __నాకు ఇష్టమైన ది, కలో గంజో, వండుకొని తింటు, ఈ ఊరి వారితో , కలిసి మెలిసి వుండటం లో ఏదో తెలియని తృప్తి ఉంటుంది !
__మీ ఇంటిలో _మీతో కలిసి ,మనవలు మనవరాళ్లు తో ఆడుకుంటూ ఉంటే చూస్తూ పొద్దు గడపడం ,, నాకూ సంతోషమే అనుకో ,!!
కానీ ,
మీ కు భారం కావడం ,ఇబ్బంది పెట్టడం , ,మీతో చేయించు కోవడం ,,కంటే , కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉండటంలోనే మీకూ మాకు అందరికీ క్షేమం ,!సంతోషం అనిపిస్తుంది కదా !
అయినా మేము ఎక్కడ ఉంటే ఏం కొడుకా !
,మీరు చల్లగా ఆనందంగా సంతోషంగా ఉంట నాకంతే చాలు ,!!
వీలు అయినప్పుడల్లా ,మీరు ఒకసారి వచ్చి నన్ను ఇలా చూసి వెళ్ళండి చాలు !!
ఇదే పది వెలు !
ఎంతమంది తలిదండ్రులు అనాథ ల వలె ఈ మాత్రం ఆదరణ కు కూడా నోచుకోకుండా ,,వృద్ధాశ్రమం లో దిక్కు లేని వారిలా బ్రతకడం లేదు ?? చెప్పు ??
అలాంటి దీనస్థితి నాకు రాకుండా , కొడుకా ,నీవు మాకు నీవు _విడువ ని చల్లని నీడ వలె _ నన్ను కని పెడుతూ ఉన్నావు కదా !,
అందుకే ఆ
దేవుడు చాలా గొప్పవాడు రా నాన్నా !,
దయ గల కొడుకు __, నేనంటే ఎంతో ప్రేమ పడే బంగారం లాంటి కొడుకు నూ, కోడలునూ ,చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు నాకు !
ఓ ,
భగవంతుడా !! నీ ఋణం ఎలా తీర్చుకొ నే ది ,, ప్రభూ !
నీకు శతకోటి దండాలు! తండ్రి !__"_
""అమ్మా ! ఇలా నిన్ను ఒక్కదాన్ని విడిచి వెళ్ళడం నాకు ఎంతో కష్టంగా ఉందమ్మా !""
""కొడుకా , ఫోన్ ఉందిగా ,! నీవు రోజూ చేస్తూనే ఉంటావు కదా ,!_
ఏది అవసరం అయితే అది తెచ్చి ఇస్తున్నావు కదా !" ఎందుకు బాధ పడతావు అలా ,సంతోషంగా వెళ్లి రారా బాబూ ,కోడలు పిల్లలను అడిగినా ను అని చెప్పు రా ,!" నీ ఆరోగ్యం జాగ్రత్త ! వేళకు భోజనం చేస్తూ ఉండు బాబూ !"
నేను భోజనం చేసే వేళ, కొడుకా , రోజూ నీవే కళ్ళ లో ఉంటావు ! నీ ముద్దు మోము ఎప్పుడూ గుర్తుకు వస్తు నే ఉంటుంది రా బాబూ !"
అమ్మా అలా బాధ పడకు , కళ్ళలో నీళ్ళు పెట్టుకోకు ! నేను చూడలేను ;
సరే అమ్మా నేను వెళ్లి వస్తా జాగ్రత్త ,;
అమ్మా , కాస్త నీ చేత్తో, నాకు ఇష్టమైన పెరుగన్నం తినిపించ వా !"",
"అయ్యో ! నా మతి మండా !
మాటల్లో మరిచే పోయాను గదరా ,ఎంత పొరబాటు జరిగింది ,, ఇన్నాళ్ళ తర్వాత వచ్చి,నా కొడుకు అన్నం పెట్టమని నన్ను._ఈ కన్న తల్లిని ఇలా అడగ డం ఎందుకు , రా !??
__నీవు వచ్చిందే అందుకు !-,నేను ఇక్కడ ఉన్నదే ఇందుకు ,!!" కదా ;, కన్నా
పద మన ఇంట్లోకి !!" , నీకు కడుపు నిండా తినిపిస్తే గానీ ,నాకు తృప్తి ఉండదు కదా !
ఎప్పుడు తిన్నావో, ఏం తిన్నా వో, ఎంత ఆకలిగా ఉందో కదరా కన్నా ?! , __
""అమ్మా !ఇదిగో ,, చూడు !నీకు ఇష్టమైన మామిడి పళ్ళు , ,ఇంట్లో నీ కోడలు చేసిన పాల కోవా తెచ్చాను చూడు ,!"__
""నా బంగారు తండ్రి!
నే నంటే మీకు ఎంత ప్రేమ రా నాన్నా !
నా కోడలు బావుందా ?,మనవడు ఆడుకుంటూ ఉన్నాడా ?,మనవరాలు నన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటుందా. ,?""
"" అమ్మా , మేము నిన్ను గుర్తు చేయని రో జు ఉండదు తెలుసా !?, ఈ ఇల్లు ,ఇక్కడి చిన్నప్పటి విషయాలు , నాన్న గారి గురించి అందరం అనుకుంటాం కూడా !""
" బాబూ ! చాలు , ఈ జన్మ కు ఇది చాలు ! ఈ త్తృప్తి మిగిల్తే చాలు ! మీరు చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటానురా ,
అందర్నీ ఇలా సంతోషంగా ఉంచు,నాలాంటి వృద్ధులను ఇలా ప్రేమతో ఆదరించే కొడుకుల అండ దండలను వారికి అనుగ్రహించు స్వామీ ! నారాయణా ,!
నీకు శతకోటి నమస్కారాలు!
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !
Monday, June 29, 2020
అమ్మ మనసు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment