Monday, June 29, 2020

అంతర్ముఖుడు కావాలంటే ?

June 15, 2020
  మెదడు లో పంచేంద్రియాలను నియంత్రించే  అద్భుత కేంద్ర నాడి మండలం _ఇందులో  గ్రహణ  , శ్రవణ ,దర్శన  ఘ్రాన ,  స్పర్శ  లకు స్పందించే నాడులు  వాటికి ప్రత్యేక గదులను  ఈ మెదడు లో ఏర్పరచాడు భగవంతుడు
ఎన్నో ఏళ్ల సంగతులు కూడా జ్ఞాపకం ఉంచుకునేందుకు కూడా ఒక అర ఉంటుంది
ఇలా మనిషికి ఆజ్ఞాపించె , విధులు నిర్వహించే  అఙ్ఞలను  మెదడు
నిర్వహిస్తుంది
__జీవుడు ఆత్మ యందే  , తల్లి ఒడిలో బిడ్డ వలె ఆనందంగా ఉంటాడు _
కానీ వాడి గత జన్మ కర్మలు అలా ఉండనివ్వవు
, ఆత్మ చుట్టూరా పంచ కోశాలు అవరించబడి ఉంటాయి
   ఇవి అన్నమయ, ప్రాణ మయ,, మనోమయ, ఆనంద మయ  , జ్ఞాన మయ కోశాలు ,__
వీటితోనే జీవుడికి దుఖం అనందం  , మనో వికాసం లాంటి చైతన్య అవస్థలు కలుగుతూ ఉంటాయి __,
,జీవుడు ఉన్న ఈ శరీరం అనే ఉపాధి ,  పంచ భూతాలు గాలి నీరు అగ్ని భూమి ఆకాశము వీటితో నిర్మించబడి ఉంటుంది _
ఈ శరీరానికి ఉపకరణాలు గా కన్నూ ముక్కూ చెవి నోరూ చర్మము అనబడే అద్భుతమైన  మహా శక్తివంతమైన ఐదు ఇంద్రియాల తో కలిసి   శక్తి వంతంగా పనిచేస్తూ ఉంటాయి __
   ఏ అనుభూతి అయినా జీవుడు బాహ్య ప్రపంచం లోని పదార్థాలు లేదా వ్యక్తుల సంబంధాలు మెదడు ద్వారా  నిర్వహిస్తూ ఉంటాడు __
ఇదే జీవుడి బహిర్ముఖం అనబడే  మనస్తత్వం __
అనుభూతులు  , పంచ కోశాల   సహాయంతో పొందుతూ ఉంటాడు __
తన జన్మ స్థానం అయిన ఆత్మ గురించి తెలుసు కునెంత పరిజ్ఞానం __జీవుడికి  కలగకుండా పోతే ,  పరమాత్మ యొక్క స్వరూపాన్ని  ఎన్నటికీ తెలుసుకోలేడు _!
జీవు డు  తనకు ఆశ్రయ మిస్తున్న ఆత్మను ఉద్దరించు కోడానికి , శ్రమించాల్సి ఉంటుంది -_, జనన మరణ చక్రంలో పడకుండా ఉండడానికి __ ఈ శరీరం ఒక  అత్యవసరమైన సాధనం !,ఒక పనిముట్టు ,!
    మానవశరీరం  తో  కాకుండా మరే శరీరం తోకూడా  జీవుడు సద్గతిని ,మోక్షాన్ని , జీవన్ముక్తి నీ , భగవద్ ప్రాప్తిని సాధించ లేడు _!
,శరీరం ఆత్మ కాదు !,నశించేదే ,! ఇది అనాత్మ ,! ఆత్మ కాదు !
జీవుడు తాను ఈ శరీర మే  అని భ్రమిస్తూ ఉంటే ,అది మూుర్ఖమే అవుతుంది ,__
అత్మ తెలియాలంటే పంచ కోశాల గురించి   తెలియాలి    __ప్రతీ మనిషి  తన చరమ దశలో గతం గురించి విచారిస్తూ ఉంటాడు ,_!
__బాల్య దశలో  _ప్రాణ మయ, అన్న మయ కోశాల అనుభవం పొందుతాడు ,,
వయసు తో పెరిగిన విజ్ఞానం తో  మనో మయ కోశం  ,విజ్ఞాన మయ కోశాలు వృద్ది చెందుతాయి !_
, వీటిని గురించిన అనుభూతి ఆనంద మయ కోశం లో కలుగుతూ ఉంటుంది __!
ఆత్మ ,  , ఈ "మనసు "అనే పనిముట్టుతో బయటి ప్రపంచం తో సంబంధం ఏర్పరచు కుంటుంది _!
భగవంతుడు ఆనంద స్వరూపుడు , _!
అందువల్ల ఆత్మ కూడా ఆనంద స్వరూపమే _!
ఎందుకంటే ఆత్మ ,పరమాత్మ స్వరూపమే ,_!
మనిషిలో ,జగతిలో , సూర్యుని లో ఉన్న వాడు ఒకే పరమాత్మ అని తెలుసు కొన్న వాడు, ఈ లౌకిక జ్ఞానం నుండి విడివడి , ఈ ప్రాణ మయ అన్న మయ మనో మయ విజ్ఞాన మయ, ఆనంద మయ కోశాలు ద్వారా , ఆత్మ జ్ఞానం పొందినప్పుడు మాత్రమే  పరమాత్ముని  చేరుకొన గల డు ,,_!
దేహభావన ను   _క్రమంగా ఆత్మ రూపంలో ఉన్న దైవంగా ఆవిష్కరించడం _ అనేది _ జీవుడు చేయాల్సిన  అతి ముఖ్యమైన  పని  _!!
మాయ అనే ఈ పంచేంద్రియాలకు వశు డై,  __జీవుడు ,, తన జీవిత పరమార్ధం గ్రహించ లేక పోతున్నాడు _!
ఈ అయోమయ స్థితి నుండి బయట పడడానికి__ యోగ సాధన ఒక్కటే శరణ్యం _!
,  యోగ ప్రక్రియ ద్వారా పంచ కోశాల గురించి తెలుసు కుంటు  ఉంటే __క్రమంగా
ఇంద్రియ నిగ్రహం శక్తి అలవడుతుంది _!
మన ఆత్మ చుట్టూ రా ఉంటున్న  ఈ పంచ కోశాల గురించి కొంత తెలుసు కొందాం ,"__!
1_అన్న మయ కోశం ,_____!
ఇది చూపు ,వాసన ,,స్పర్శ, రుచి ,వినికిడి  తో పాటు ఎముకలు కండరాలు ,అవయవాలు ఇవన్నీ  ఈ పరిధిలోకి వస్తాయి
ఇది భూ తత్వాన్ని కలిగి ఉంటుంది ,_!
2_ ప్రాణ మయ కోశం___
ప్రాణం అంటే శక్తి  ,_!
ఇది 5 రకా లు_!
ప్రాణ ,అపాన ,ఉదాన , వ్యాన, నాడులలో ఉండే ప్రాణ శక్తి
, ఇది రక్త ప్రసరణను , నాడుల లో _ చైతన్య శక్తులను నియంత్రిస్తూ ఉంటుంది
   ఇవి గాకుండా  మరో 5 ఉప ప్రాణ శక్తులు కూడా ఉన్నాయి ,_!
నాగ,కూర్మ ,కృకర , దేవ దత్త,ధనంజయ ,నాడులు_!
ఇవి శరీరంలో ని _72,000 నాడులకు ప్రాణ శక్తిని అందిస్తూ ఉంటాయి ,
3_మనో మయ కోశం_____!
   ఇది  జీవుడి లో కలిగే __ ఆలోచనలు భావన ల నిలయం ఈ కోశం ,_!"
చేతన , అచేతన, ఉప చేతన అవస్థలు  ఈ కోశం ప్రభావా లే !""
కామ, క్రోధ ,లోభ, మోహ మద, మాత్సర్య ,అరిషడ్వర్గాలు ఈ కోషానికి సంబంధించి నవే , _!"
4_ విజ్ఞాన మయ కోశం ___!
ఇందులో __పరమాత్మ ఉన్నదనే భావన రావడం ,
నేను అనే అహం నశించి పోవడం ,,
ధారణ ,సాధన ల ద్వారా , అంతర్గత క్రమశిక్షణ ఏర్పడి ,, జీవుడు పరమాత్మతో అనుసంధానం ఏర్పరచు కోవడం ,ప్రాపంచిక విషయాల వదలి , సమాధి స్థితి ని పొందడం _!
ఇలా ఇది పూర్తిగా. పరమాత్ముని అవగాహన కు సంబంధించిన వ్యవస్థ  గా ఉంటుంది _!
5_ఆనంద మయ కోశం ,____
అంటే ఆధ్యాత్మిక దేహం !
ఆత్మ పరమాత్మలో ఐక్య మయ్యే_ అద్భుత పరమానంద స్థితి  _!
ఇదే జీవుడికి ముక్తిని సూచించే బ్రహ్మానంద తన్మయ దేహ స్థితి _! ని సూచిస్తూ ఉంటుంది ,
______
ఈ భౌతిక శరీరం ఒక , అన్న మయ కోశం అనుకుంటే , _
ఆసనాలు ,,ప్రాణయామం చేస్తూ ఉండాలి _!
, మనో మయ కోశం అనుకుంటే __
ధ్యానం చేస్తూ పరమాత్మను భావించ వచ్చు ను,_!
విజ్ఞాన మయ కోశం_
అని భావిస్తే , భగవద్గీత  లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం , ప్రసంగాలు వినడం భజన కీర్తనలు చేయడం లాంటివి చేస్తూ ఉండాలి _!
  ఇక _తాను ఆనంద మయ కోశం __అని భావిస్తే,
ధ్యాన స్థితి నుండి ధారణ స్థితి కి చేరి,,క్రమంగా సమాధి స్థితి ని పొందడం చేయాలి _!
_ఇలాంటి దేహావస్త ను , జీవన్ముక్తి ,"" ని పొందడం అంటాము !_
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !_

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...