June 15, 2020
నాట్య మాడనా ?
కృష్ణా !
నర్తించి పులకించనా !""
!!నాట్య !!
నీ వేణు నాద లహరి లో
పలికించే రాగ మధురిమ లో
రస భావ అభినయం మ్ములో
నర్తించి నే పులకించనా !"
, ఆ నాదము నేనే కానా ?
!!నాట్య !!
నీ చూపు లో, నీ శ్వాస లో
తనివార నర్తిస్తూ _నే
అలసి నీలో కలిసి పోనా!"
నిను నాలో చూసు కోనా !
,!! నాట్య మాడ నా !!
వేణువు తో సరిగమ పలికి
వేణువు తో నన్నలరించి _
వేణువు తో ననుసంధించి_
వేణువు తో ఏకం చేసి_
నేనే నీవయ్యే వూ__!
నను ధన్య ను చేసెవు _!"
!!నాట్యమాడనా !!
విడదీయరాని బంధం_!
జన్మ జన్మల ఈ సంబంధం!
రాధా కృష్ణ అనుబంధం _!
అందమైన అనురాగ బంధం !""
!!నాట్యమాడనా !!
నేను నీ రాధను రా !
ఈ మాధవుని గాథను రా!
నీ అనురాగ సుధనురా! ,
నీ మధుర గాన లహరిలో
పరవశించి పులకరింతురా!
!!నాట్య మాడ నా!!
No comments:
Post a Comment