Monday, June 29, 2020

పుష్పహాసము

June 10, 2020
విష్ణు సహస్రనా మాలలో ఒక నామం ,
  ఓమ్ శ్రీ పుష్ప హాసాయ నమః

   "పుష్పహాసము

   1_ సృష్టి లోనున్న సకల _ సంపదలలోన_
_మిన్నగా ఎన్నదగినది _ పుష్ప జాతి   !__
స్వచ్ఛమౌనట్టి   పరిమళ సౌరభాల_
పరమ  పావన భావన తో వెదజల్లు పూవులన్నీ -
యోగ్యత ను పొందు
   దేవదేవుని  దివ్య పాద మ్ము లందు_
అత్మ సమర్పణ నొందు
మహా భాగ్యమ్ము కొరకు !
   
  నేను పూవులు  ప్రతి రోజు జమచేసి   కొనుచు నుందు !
అలయ మ్మున పూజారి కందజేతు __!
, దైవ మున కర్పించు నాతడు _తన హస్తమ్ము తోడ_!
  నేను చూతును  దూరము గ నిలిచి యుండి _!
 

  శ్రమను   నే జేతు _ప్రభువు పై ప్రేమ తోడ !
  __ఊరకే పొందు పుణ్యము_
స్వామికి   ఆ పూలనొసగి_
నాకు లేనట్టి  శ్రీవారి పాద సేవ
  చేయు  పూజారి_ నేనేమో చూచుచుందు !  

  భావమే లకో కలిగే 
_ఈ రీతి మదిని 
  మనసు  చేదరెను ,_
  మొగమును  చిన్న బోయే
  దైవపూజ కు  మరునాడు పూలు కోయ _
చేతులెందుకో రావాయే , దేవ దేవా !""

  పూలతోటలో  పిచ్చిగా తిరుగు నాకు __
పక పకమటంచు నవ్వు పువ్వుల  తీరు చూసి_
   చిత్రముగ నేనొక వట్టి చిత్తరువు నైతి !

      పుష్ప సముదాయ  మద్భుత కాంతు లీను చుం డే -
ఎదుట కనిపించు ప్రతి పుష్ప దళము లోన
  మందహాస ము  చేయుచు సుందరముగా _
కృష్ణ భగవానుడే  ప్రత్యక్ష మాయె  నిజము !

చూచు చుంటిని శిఖిపించ మౌళి సొగసు
కనుల ఆనంద భాష్పాలు  నిండి పోవ_
నీల ఘన శ్యామ సుందరుని  రూపము నకు
అంజలి ఘటించి సాష్టాంగ పడితి నేను !

  బొమ్మ వలె నున్న నన్ని  పలుకరించె !
" ఏమి తలపోసి నేడు  నా కెదురు రావు ??
    పుష్ప పరిమళ  ద్రవ్యాల నేల తే వు ??"
నీవు పుష్పాలు తేకుండ  నా పూజ యగునా??
  నీవు బాధ లో ఉన్న,
నీ పూల నె టుల గొం దు ??"

  తెలిసి పోయెను నీ  అంతరంగ  ఘోష !
నేను నీకడ లేనని  తలచు నిన్ను
, జాలి దలచితి , నీ  ముందు నిలిచి పోతి !
నీవు కోసిన ప్రతి పుష్ప గుచ్చ మందు
నేను ఉందును , నీ ప్రేమ చూచు చుందు
మధుర మధురాతి   తలపుల  మాలలల్లి _
పరిమళ మ్ముల వెదజల్లు
పూవుల శోభ తోడ
అలరు  నా విగ్రహ సౌందర్య మతిషయమున
చూచి పులకిం చు . నిను జూచి   పరవశింతు !

పూవు పూవున నేనుంటి , విచార మేల ?
  ప్రేమ పొంగగా  నీవు నాకొరకు పూలు పెంచి _
  పొం దెదవు ఆనంద మును
డెందమున  భక్తి తత్పరత తోడ
పూవు విరిసిన  చాలు _నేను కనపడుదు నీకు !
నవ్వు ప్రతి పువ్వు నందు నే నుండి నవ్వు చుం దు !
వేయి నామాల లో  ఒకటిగా  పుష్ప హాసం !__
పుష్పమున దరహాస మొలుకు  చుండు నేను
పుష్ప హాస మను నామము న   పిలువ బడు దు !
 
ఎంత ప్రేమతో తలచిన అంత గా  ఉందు ఎదను _
ఎంత నమ్మకముంచిన  అంత నా వాడ వగు దు!
   సృష్టి లోనున్న సకల సంపదల కెల్ల_
పుష్ప సముదాయ మన్న  నాకెంతో ప్రీతి !
వాని కున్నట్టి సహజ సౌందర్య కాంతి,
  కలుషిత ము లేని ,కల్మష బుద్ది లేని __
స్వచ్ఛ మైనట్టి వాటిలో అతి స్వచ్ఛ మైన __
పుష్ప దరహాస మన నాకు ప్రీతి మెండు !!
నాకు ఇష్ట మైనట్టీ పూవుల నిష్ట పడుచు
నీవు చేయుచు ఉన్నట్టి ఈ పుష్ప పూజ ఫలము__
ఊరకే బోదు  అందించు జయము  శుభము __
     కలిసిపోదువు గానీ _ నీవు నా  మూర్తి యందు !
నిలిచి పోవును నీ కీర్తి శాశ్వత ముగా!

అనుచు దీవించు శ్రీకృష్ణ మూర్తి గాంచి
పలక లేనైతి గద్గద స్వర ము తోడ _
ఎంత దయ కృష్ణ !  నా కు దర్శనము నొసగ
  భువన మోహన నీ వు ప్రతి పూవునందు ,
నిండి యుంటివి  నను దన్యుని చేయు కొరకు
హే గోపాల!గోవింద! దీన బం ధో !
హే నంద నందన ముకుంద , రాధా లోలా !
ఆందు కొనుమయ్య హృదయ పుష్పాంజలులను ,
_  కృష్ణ!హరే కృష్ణ _హరే కృష్ణ  అనుచు భజించు  నన్ను
కలువ కన్నుల కన్నయ్య  కనికరిం చె !
పూవులో నున్న కృష్ణయ్య మాయ మ య్యె!
  సంభ్ర మాశ్చర్య  మున నాదు చిత్త మందు ,
చేరి నిలిచెను నా హృదయ కమల మందు !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...