Wednesday, June 3, 2020

రాధా కృష్ణుని ఆంతర్యం !

May 30, 2020
""రాధా , నా  ప్రాణ ప్రియా,
నా మానస విహారిణి,,!
జగముల కధిపతి నైనా_
నీ ప్రేమకు దాసుడను  !
నిను తోడు వీడని నీడను !!""
.

"నా భక్తులు నను మరవరు !
నేనేమో నిను  విడువను!"
ఏమి చేతు, నెందు బోదు!
నీ ముందు నుండి
కదలనీవు!!""
.

"నిను విడచి మనలే క__
భక్తుల చెంత ఉండలేక,__
కలవరపడు నా మదిని,_
వేణు గానమధురిమ తో_నను
సంతసింప జేసినావు ,!

"నా లోని శక్తి నీవు,!
నాలో అనురక్తి నీవు,!
నీవు లేని నేను లేను!
నీ వలపును గెలవలేను!
యుగాల మన అనుబంధం!
చెదరని ,తరగని బంధం!!""

"రాధా!" అను తలపు నన్ను ,
గెలిపించును  ఎల్లపుడూ!
నా ప్రాణము , నా జీవము
నా భావము , సర్వస్వము
నా పాలిట భాగ్యం నీవు !
నా ఆరాధ్య దేవత వు నీవు !
నా వేణు నాదం నీవు,!
నా లోని  చేతనము నీవు!!

ఒకనాటి మధుర సాయంత నమున
వేణువు ను బూని , నీవు ఎదుట కూర్చుం డి యుండ!!
సూర్య భగవాను పసిడి కిరణాల చేత ,,
రంగులు చింది రంజించు  యమునా నదీ తటాన !""

""నీవు మృోయించు వేణు వే,నేను కా గా!
ప్రకృతి , పులకిం చె,
నీ వేణు గానమందు !;
కరిగి పోవుచు నుంటి
నే "వెన్న ""లాగా ,!!
మధుర మధురానుభూతుల____ ఈ
తలపు  చాలు!
నేను అర్పించు కొందు
నన్ను  నీ పదము లందు !"
_____జై శ్రీ రాధే, జై శ్రీ కృష్ణ!
______'___
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...