Wednesday, June 3, 2020

కృష్ణా కరునించరా

June 2, 2020
""కృష్ణా , కరునించ రా ,
నా మనసు తెలియరా !""

"నేనోపలేను రా _
నీ వేణుగానము!
నే తాళలేనురా  !
నీ రూపదర్శనము !

"నన్ను  నేనే మరచి,
నిన్ను నాలో తలచి,
భావించునంతలో,,
మాయలోనా  ముంచి,
మాయమౌదూవేల??"

""వేణువూదీ ,,నీవు ,_
ఆనందపడతావు  ,!
వింటున్న మేమంత
బొమ్మలౌతాము గద !!
మదిలోని   నా బాధ_
నీకెలా తెలిపేది ??
కరుణించు కృష్ణా !
కనికరించరా , నన్ను !""

""నా బేలతనమునూ  ,
, నా  వేదనా స్థితినీ ,
, నీకు తెలుపాలంటే ,_
నే మురళీ నేర్వాలి !
మధురంగా పాడాలి ,!
అదివిన్న క్షణములో_
నీవు రాధ గా మా రీ,_
నా విరహ బాధంతా,-_
తెలిసిన ప్పుడు కదా,!
నా లోని నీవె పు డు,_
మాయమూ కావు గదా !"

""కరునించ రా ,కృష్ణా!
వేణువును మ్రోయించు __
విధము తెలుపుచు నాకు !
రాధకు కృష్ణునికి _
బేధమూ కనరాని_
అద్వైత ప్రేమను _
అందించరా ,కృష్ణా !"

"ప్రేమ యే దైవము!
ప్రేమయే  ఈ జగము!
ప్రేమయే మూలము!
ప్రేమయే మన శక్తి !
ప్రేమయే నా భక్తి !
ప్రేమ యే చేతన ము !
ప్రేమయే జీవమూ !
ప్రేమయే భావమూ !
ప్రేమయే బంధిం చు!
ప్రేమయే విడిపించు!
ప్రేమయే  కని పెంచు!
ప్రేమ నిను చేర్పిం చు,!
ప్రేమ నిను మరిపించి,
నాలోన నిను చేర్చు,,!"

"ఆనంద మన ఇదియే
ఆనంద మన మనమే
ఆనంద మన మనసే,
ఆనంద మున విరిసే !"

        "శ్రీకృష్ణార్పణం ""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...