June 24, 2020
స్వంత ఇంటిపై కంటే _
అద్దె కొంప లపై ఎక్కువ ప్రేమ,మమకారం_ జాగ్రత్త,అలంకరణ,, భక్తీ, భయం, జ్ఞాపకాలు , శ్రద్ద ఉంటాయి_!
,,, ఎందుకంటే నెల నెలకు మరవకుం డా , నగదు అద్దె గా ,_ చెల్లించాలి ,_!
ఈ దేహం కూడా నిజానికి ఒక అద్దె కొంప యే_!
దీనికీ కిరాయ ,గత జన్మ పాప పుణ్యాలు, జరా రోగ బాధల రూపంలో అనుభవిస్తూ , తగిన మూల్యం చెల్లించక తప్పదు కదా_!
ఒక వాహనం పై ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్తుంటే ప్రాణం హాయిగా ఉంటుంది
,ఒక ఆక్సిడెంట్,లేదా రిపేర్ ,కోసం పెట్టే ఖర్చులు పొందే బాధ, లాంటిదే,, ఈ శరీరం అనబడే వాహన సపరిచర్యలు ,,_!
అందుకే జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు,
ఆటుపోటులు తప్పవు,_!"
_ఇల్లు అయినా,దేహం అయినా ,,శుభ్రంగా ఉంచక పోతే, అనారోగ్యం అశాంతి , బ్రతుకు భయం గా ఉంటూ సంతోషం కరవై ,__ముందుకు నడవదు_! _పూటగడవదు _! బ్రతుకు మహా ప్రమాదం లో పడుతుంది,_! , పైగా యజమాని కోపం చేస్తాడు కూడా _!
, నిర్లక్ష్యం తో అక్కరకు రాకుండా చేస్తే,, నిర్దాక్షిణ్యంగా వెళ్ళ గొడతా డు,,యజమాని ,_!
" ఘటాని కి ఒక మఠం" అనుకుంటాము కానీ,_
ఇలాంటి మొండి ఘటానికి కిరాయకు ఇల్లు ఇవ్వడానికి ,కూడా,దేవుడు ఎన్ని అర్హతలు చూస్తాడు ?
బుద్దిగా ఉంటాడా_?
చెప్పినట్టు వింటాడా ?
ఇల్లు బాగా చూస్తాడా _?
పరిమిత కుటుంబం, తో ఆలోచనలతో ఉంటాడా,?
తాను గమనిస్తూ ఉంటాడన్న జాగ్రత తో , ఉంటాడా,,_?
తనకి కోపం తెప్పిస్తే ,ఏ క్షణంలో నైనా బయటకు ఈడ్చి పడే సే ప్రమాదం ఉందని , అప్రమత్తత తో ఉంటాడా_?
ఇంటి అలంకరణలో ప్రేమ చూపుతూ_, ఆ ఇంటిలో _మూల మూలలా దాగిన యజమాని కారున్యాన్ని గుర్తిస్తూ _కృతజ్ఞతా భావం చూపిస్తూ , ఉంటాడా,_?
" మంచివాడు కదా,_ పోనీలే,చూద్దాం లె __"!'అని జాలి పడితే , అహంకారం అజ్ఞానంతో , "ఈ ఇల్లే నాది _;నాది,_!నేను పోను_!,ఇన్నేళ్లు ఉన్నాను,_! ఇది నా స్వంతం ,ప్రాణం పోయినా ఖాళీ చేయను _!""
రూల్ ప్రకారం ఒక ఇంట్లో ఎవరు పాతికేళ్ళు ఉంటే _ఆ ఇల్లు వారిదే _!అని చట్టం చూపిస్తాడా _!"",
, అయినా _ ఇంత మంచి ఇల్లు మరొకటి దొరకాలంటే , వీడి ప్రవర్తన గురించి నేను ఓ కే చెప్పాలిగా _!""
స్వంత ఇంటిలో ఉన్నా ,"నాది "అనుకోడం వరకే , కానీ, అది కూడా_ ఏదో ఒక రోజున ,_ ఖాళీ చేయక తప్పదు కదా_!
ఎవరికో ఒకరికి అప్పగించి ,వెనక్కి చూడకుండా పోవాల్సిందే కదా _!"",
వస్తువు పైనే ఇంత అభిమానం చూపిస్తే,__అది అస్తిరం అని తెలిసిన నీకు_. పక్కాగా తెలిసిన కూడా __దేహం పై ఇంతగా మమతా నుబందాలు పెంచుకుంటున్న ఓ కీరాయ జీవుడా,_!, చిప్ప చేతపట్టుకుని ,, ఆత్మ చింతన చేయకుండా,_,అంతరాత్మ లో వెలుగొందే పరమాత్మ ను దర్శిం చు కు నే ప్రయత్నం చేయకుండా_ ఎన్ని ఇండ్లు మారుస్తూ _ఇలా పిచ్చివాడిలా తిరుగుతూ , _ఉంటావు_!
నీది కానిది నీది అనుకోడం , తప్పు అన్న బుద్ది జ్ఞానం నీకు కలిగేది ఎప్పుడు_ చెప్పు _!""
కనీసం ఈ మనిషి జన్మతో పుట్టాక నైన _ కృతజ్ఞతా పూర్వకంగా , _ ఇంటి యజమాని పై విశ్వాసం చూపుతూ ,_నిత్యం నమస్కారం చేస్తూ ఉండక పోతే,_ నీ బ్రతు క్కు అర్థం ఉండే నా,_??"
, కరోనా చావులు చూసైనా , మనసు మార్చుకోలేవా_?"
_"ఆ సెగ _నీకు అంటకుముందే _ సద్గతికి దారి వెదుక్కోరాదా,!,_"
_ నీ మంచితనం చూసి_నిను నమ్మి _ ఇల్లు కీరాయకు ఇచ్చిన యజమానిని మోసం చేయ కూడదు సుమా _!"
నీది కాని ఇంటిపై అనవసరం గా వెర్రి భ్రమలు ,పెట్టుకొంటూ,__ వేరే ఇల్లిల్లూ తిరగకుండా_ నీ మీద దయతో నీకు ఇచ్చిన
ఇదే ఇంటిలో ఉంటూనే__
మంచి పేరు తెచ్చుకో కూడదా ,_!"
" అయ్యో' ఈ ఇల్లు ఖాళీ చేసి పోవాల్సిందే నా __?,అనుకునే కన్నీళ్ళ ఘడియలు రాకముందే ,__
వివేకంతో మెద లుతూ _,
__విధిగా నీవు వెళ్లాల్సి వచ్చిన నాడు __ ప్రక్కవాడు బాధతో,జాలిగా __ఒక్క కన్నీటి చుక్క నైనా రాల్చే భాగ్యానికి నోచుకునే లా ,అందరితో సఖ్యంగా , ఉండ రాదా _??"
నీ ఇంటి యజమాని ఔదార్యం గురించి ప్రశంసిస్తూ ఉండు_!!_"
" తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం మామూలు తప్పు కాదు,__ అది దేవుడు కూడా క్షమించ లేని ఘోర అపరాధం అవుతుందని __కాస్తా నీవు
గుర్తు పెట్టుకోవాలి సుమా _!"" ,
ఈ ఇంటిలో ఉండగా నీవు ఎన్ని తప్పులు పొరపాట్లు చేస్తున్నావో ,__ ఇంటి యజమాని లెక్క పెడుతూ ఉన్నాడని , మరవకు_!""
అంతే కాదు, మద్య మద్య నీకు హెచ్చరిక లు కూడా చేస్తూ ఉన్నాడని , కూడా, మరవకు _!""
నీకు ఇచ్చిన ఇల్లు ఒక సాధనం _!ఒక పని ముట్టు,_! చక్కగా పనికి వాడుకో_!_ అది నీది కాదు_!, నీవు దానిని తయారు చేయలేదు_!,అందుచేత దానిపై నీకు అధికారం హక్కులు లేవు,_!
సర్వ హక్కులు ఇంటి యజమాని వే,_!
అందుచేత రెడీ గా ఉండాలి,_నీవు_!ఎప్పుడంటే అప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేయడానికి _!
మంచితనం ,_పుణ్యం ,దానం , భక్తి,జ్ఞాన వైరాగ్యాలు అనబడే భావ సంపద లను మూటలు మాత్రమే _నీ వెంట తీసుకొని పోవడానికి యజమాని సమ్మతిస్తాడని తెలుసుకో, తమ్ముడూ _!""
అంతే కానీ,, ఈ అద్దె ఇల్లు __శాశ్వతం కాదు _!,నిత్యం కాదు _!, నీ తో రాదు_!""
అన్న జీవిత సత్యాన్ని అర్థం చేసుకో,, నాయనా_!""
ఓ జీవు డా_!
ఈ ఇంటిలో వుండగానే , బుద్దిగా ,జ్ఞానం అనే దీపం వెలిగించు కో_!
_ దైవం పై విశ్వాసం తో, బ్రతుకు దిద్దుకో _!
ప్రశాంతత తో_ పరమానందం ,, పొందుతూ _ జీవన్ముక్తి నీ
సాధిం చు _!
_"" నీలో ఉన్న _నీ స్వామిని విడిచి , మరచి _ మూర్ఖంగా ,ఎక్క డో వెదకు తూ __అమూల్యం, అమోఘం , అద్భుతం __ ,భగవద్ ప్రసా దితం _ అయిన నీ జీవన కాలాన్ని వ్యర్థం చేసుకోకు ,, నాయనా,_!""
"నీవె బ్రహ్మవు _!
"నీవె దైవానికి_!"
"నీవే_ నీ అత్మ ఉద్దార కుడవు_!
"తత్ _త్వం_ అసి_!"
ఆ సచ్చిదానంద స్వరూపం_ నీవే_ నీవే_ నీవే _సుమా _!""
నీవూ _ ఆ బ్రహ్మము,__ వేరు కాదు_!
నీవే అతడు _;!
అతడే నీవు_!
నీది కాని నీ ఇల్లును, ఈ దేహాన్ని ,_ ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉన్నావో__
_నీలో ఉన్న _"ఆత్మ "అనే నీ ""స్వంత ఇంటి""ని కూడా _అంతకంటే గొప్పగా చూస్తూ ఉండాలి_ సుమా _!""
,, ఎంతసేపూ బయటకే చూస్తూ ఉంటే _ అక్కడ ఘోరమైన ఉదృత రుద్ర రూపంలో విలయతాండవం చేస్తున్న ఆ_కరోనా ప్రభావం తప్ప మరేమీ కనిపించదు _ నాయనా _!"
__ ఇప్పుడైనా_లోన చూడు_!
అంతరాత్మ లో వెదకి పట్టుకో_
అక్కడే ఉంది నీకు కావాల్సింది_!
నీకు శాశ్వత అనందాన్ని ఇచ్చేది _!""
అక్కడ ,నీకు,__ఏ కరోనా భయం లేని, , బ్రహ్మానందం కలుగుతోంది,,_!"
"చెప్పడమే నా ధర్మం ,_!
వినక పోతే నీ ఖర్మం _!
అంటాడు గీతాచార్యుడు , ఆ శ్రీకృష్ణ భగవానుడు _!""
అందుకే ,
""తృప్తి "అనే ధనం నీ హృదయంలో పొందనంత వరకూ __ నీ మనసు ఇంద్రియాల కు వశమై ,_ కుక్క వలె తోక ఊపుతూ__ అది చెప్పినట్టు వింటూ __ ఆత్మ విచారణ లేకుండా_ ,బుద్ది పనిచేయకుండా _ జీవితంలో ఒక , ధ్యేయం అంటూ లేకుండా _ దాని తో వెళ్లాల్సిందే కదా _
అందుకే " అద్దె కొంప" అనబడే ఇదే దేహాన్ని ,ఒక దేవాలయంగా మార్చుకో_!
అందుకోసం పెద్ద శ్రమ ,ఖర్చు పెట్టుబడి ఏమీ పెట్టే అవసరం లేదు_సుమా _!"
ఇష్ట దైవాన్ని మరవకుండ _, నిరంతరం మనసులో తలచుకుంటూ_ బయట , నీ పనులు సాఫీగా చేస్తూ_ ఉండు_!, చాలు_!
"ఇహమూ _పరమూ రెండూ నీ స్వాధీనం అవుతాయి_!
"ఇదే అద్దె ఇల్లు_ నీకు పునరావృత్తి రహితమైన మోక్ష మార్గాన్ని సూచిస్తూ _,పరమాత్ముని ఆనంద నిలయం గా శోభిల్లుతూ __ జన్మ సార్ధకం చేస్తుంది ,_!""_
ఓమ్ శాంతి శాంతి శాంతిః_!
స్వస్తి_!
హరే కృష్ణ హరే కృష్ణా_!"
Monday, June 29, 2020
అద్దె కొంప
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment