Jul 16, 2020
"ఆగాగు , _!నన్ను చూసి ,,ఎందుకు అలా పారి పోతున్నావు ,?"
ఏమిటి నీవు ఆ డేంజర్ కరోనా వేనా ??
అమ్మో ,,నీకు దూరంగా ఉంటేనే , చావు దెబ్బ తీస్తున్నా వూ కదా. ,ఇంకా నీ దగ్గరికి రావడమే , వామ్మో _!""
__" ఎందుకు నన్ను మీరంతా అనవసరంగా రాక్షసి గా చేస్తూ , నేనేదో చెయ్యరాని పనీ చేస్తున్నట్టు చూస్తున్నారు _!""??
__ లేకపోతే , లక్షల్లో మా వాళ్లందరినీ వరుస పెట్టీ చంపే స్తు ఉన్నావు కదా _!
_ నేనేం చేయను చెప్పు ??_నన్ను పుట్టించింది మీరే _!
బయటకు తెచ్చింది మీరే_!
దేశ దేశాలు తింపుతోంది కూడా మీరే _!
వాడుకుంటూ ఉన్నది కూడా మీరే కదా _!! ఇందులో నా తప్పేముంది __?? _?
,ఏకంగా. ఇలా లక్షల మంది ప్రాణాలు . అన్యాయంగా తీస్తూ ఉండడం నీ తప్పు కాదా_?? న్యాయమేనా చెప్పు _?
__""నీవు పులి వద్ద కెడితే అది చూస్తు ఉంటుందా ,_!
చంపుతుందా__ చెప్పు_?
___పులి ఏ ఒక్కరినీ లేదా ఇద్దరినీ చంపేస్తుంది _!
కానీ నీవు ఏకంగా మహా మహా నగరాలను శవాల కుప్ప గా మారుస్తూ ఉన్నావు కదా_!
నీ కళ్ళు మండి పోనూ _!!""
_ నేనేం చేయను ?__అది నా స్వభావం _!
అయినా మీరు నాకు దూరంగా ఉంటే సరి పోతుంది కదా ,_! ఇందులో సమస్య ఏముంది _!""
__ ఉంటున్నాం _! ఉండక చస్తా మా _! అయినా చావాలని ఎవరికీ ఉంటుంది కనక _!
_ మీరు కూడా నాకు దూరం ఉండండి _! నేనెవరో తెలుసు కోకుం డానే నాకు చేతులు కలిపావు కదా నీవు _! ఇక నీవు బ్రతికి బట్ట కట్టేవా_? ఇక చావడానికి రెఢీ గా ఉండు _!
నాకేం కాదు ,ఇప్పుడు ఇది కామన్ అయ్యింది ,, ఇంటికి వెళ్లి
_!" శుభ్రంగా చేతులు కాళ్ళు కడుగుతూ ఉంటే చాలు కదా _!
_చూశావా _నా వలన ఎంత మేలు జరుగుతుఉన్న దొ __ ఇప్పుడైనా గమనించావా _??
ఏం మేలు చేస్తున్నావు ,_?
భయంతో రోజు చస్తూ బ్రతుకుతూ ఉన్నాం _!దిన దిన గండం నూరేళ్ళ ఆయుసు లా _!!""
_ నేను . మీకు చేస్తున్న మేలు తెలియడం లేదా _?? ఎన్నాళ్ళయింది మీరంతా ఇలా మీరు కొడుకులు కూతుళ్ళు కుటుంబ సభ్యులు కలిసి ఉండక _!!""
__ ఇపుడు ఎంత ప్రేమగా కలిసి ఉంటున్నారు_??
ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. చెప్పు_??
__ ఆ మహా బాగుంది _! కట్టేసి కొడితే పడక చస్తామా ,_!!"
_ ఎంత ప్రశాంతంగా,,ఆనందంగా ఉంటున్నారు , ఒకరికొకరు కలిసి ఉంటూ _!!
బయట ఖర్చులు లేకుండా _ అలసట , శ్రమా పడకుండా _ ఇవన్నీ మరచి పోయి _ మీ ఇంట్లో మీరు ఎంతో ఆనందంగా _ హాయిగా , ఉమ్మడి కుటుంబం తో _ఇలా కలిసి ఉండడం __ నేను. మీకు చేస్తున్న మేలు కాదా _ నిజం చెప్పు_??
, _మిస్టర్ కరోనా _! రోజూ నీకు భయపడుతూ ఇంట్లో ఉండడం సరే _!
కానీ ఇలా ఎన్ని రోజులు ,_? చదువులు మానేసిన మా పిల్లల గతేం కాను_??
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కూలీల సంగతి ఏమిటీ_?! ఎన్ని సమస్యలు తెచ్చి పెట్టావు రా నీ కళ్ళు మండ ,నీవు నాశనమై పో _!! మాకు శనిలా దాపురించావు గదరా _!""
__ అంత కోపం వద్దు బ్రదర్ _!పని చేసుకోవద్దని__ సంతోషంగా ఉండవద్దని నేను అన్నానా _?! చేసుకోండి _ తగిన జాగ్రత్తలు పాటిస్తూ,_!!""
క్రమశిక్షణ మంచిదే కదా_!!""
__ కరోనా గారూ _ ఓ వైపు మారణ కాండ సాగిస్తూ నే మరో వైపు నీతులు చెబుతున్నా వా_!!""
__ మీకు వట్టిగా చెబితే తల కెక్కదు కదా _!!
అందుకే గట్టిగా చెబుతున్నా _!
వాయించి చెబుతున్నా _!! __! పోయినవాల్లు పోయారు ,_!ఇక ఉన్నవాళ్లు__ మీరైనా బుద్దిగా ,ఉండండి _!!"
__అమ్మా రాక్షసి __!!నీకు వేయి దండాలు పెడతాము _! దయచేసి మాకు ,నీవు వెళ్లిపోయే మార్గం చెప్పి__ పుణ్యం కట్టుకో_!
__ మరేం లేదు _! ఒకటే మార్గం , దైవ భక్తినీ పెంచు కొండి,దానితో మీ స్పీడ్ తగ్గుతుంది ,_!
పోరాటాలు ,ఆరాటాలు ఉండవు ,_! అహంకారం తగ్గుతుంది , _!కోపం ద్వేషం ,కసి పగ ,ఈర్ష్య ఉండవు ,_!ఎదుటివాడు కూడా నీ లాంటి ఆత్మ స్వరూపుడు అని భావిస్తారు_!
ముఖ్యంగా __నీవు ఆనందంగా ఉంటావు ,_!ఇతరులను కూడా చల్లగా సంతోషంగా ఉండాలని కోరుతా వు కూడా _!!
__ మా బాగా చెప్పావు _! కరోనా నీతి సూత్రాలు __!మాకు ఇంటా ఒంటా లేని భక్తి ,ఒక్కసారిగా ఎలా వస్తుంది ,_ అదేమన్నా వస్తువా కొనడానికి _!!""
__ అయినా _ దైవ భక్తి కి ద నీకు లింక్ ఏమిటి _!!""??నీవేమన్నా దేవ దూత వా_??
మీ మనుషుల్లో ఇదే మొండి తనం , రంకుతనం ,_!
మిమ్మల్ని నాశనం చేస్తోంది ,_!! ఇంత జరిగినా మీకు బుద్ది రావడం లేదు కదా _!!"" అయినా
__""వినాశ కాలే విపరీత బుద్ది _! నేను మాత్రం ఏం చేస్తా_! ఈ ఫోన్ లు , టెక్నాలజీ చూసి నేను బాగా తెలివి గలవాడిని అన్న పొగరు , గర్వం ,నిర్లక్ష్యం , మూర్ఖం _!
__ వీళ్ళ తీరు చూస్తుంటే , ఇంత ట్లో తగ్గేది కాదు ,,
నేను మీతో సహవాసం చేస్తూ ఇంకా ఎంత కాలం ఉండాలో కదా _!!విసుగు వస్తోంది నాకు _!!""
__అందుకే ,నేమో ,మనుషులకు కాస్త బుద్ది చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు__!! , ,
నేను నీకు భయప డాలా ,_??
నీ కేమన్నా కొమ్ములున్నాయా _?? నీలాంటి రోగాలను విష క్రిముల ను మస్తు గ చూశాం , _! వస్తుంటాయి పోతుంటాయి _!!
నీకు విరుగుడు, ఇంజెక్షన్ లు కనుగొనీ _ త్వరలో నీ అంతు చూస్తాం _! మెడ పట్టి వెళ్ళ గొడతాం _!""
_ మీ తెలివి తెల్లారి నట్టే ఉంది,, _!లక్షల జనాలను మూడు నెలల్లో మట్టు పెట్టిన నాతో నే_ నీ సవాలా ,, _??""
నిండు ప్రాణాలు ఆవిరై పోతుంటే _ ఎం చేయలేక పోతున్నారు కదా _!
మీకు ఎప్పుడూ _ ఘోరంగా యుద్దాలు చేస్తూ ఉండడం ,దేశాలు సరిహద్దుల్లో పోరాడుతూ ఉండడం ,__మతం అనీ, కులం అనీ రాజకీయాలు ,, అవినీతి బాగోతం ,,లంచగొండి కుంభ కోణాలు, చేయడం అబ్బో_! ఇది మీ గొప్ప సంస్కారం _!
ఇక మీరు మారరు , నయంగ చెబితే వినిపించు కొరు కదా _,చావండి!_! మూర్కుల్లారా , ,_! చావండి ,_!!
__ _""అరే వెళ్ళ వయా వెళ్లు _! నువ్వెవరు మాకు నీతులు చెప్పడానికి ,_??, కాల్చి పారేస్తా , నరికి పోగులు పెడతా _!తెలుసా ,_! నీవు నా చేతికి దొరకాలి గానీ ,_!!""
__,అయితే సరే _!ఇదిగో నీ దగ్గరికే వస్తున్నా ,_! కాచుకో__!నీకు నిజంగా దమ్ముంటే నన్ను ముట్టుకో _! అయినా నీకు నా తడాఖా చూపిస్తా ,ఒకసారి _! ఇదిగో నిన్ను ముట్టుకున్నా , ఇక నీ పని అయినట్టే ,,_!
నేను వెళ్తున్నా ,,కాదు కాదు , ఇక నుండి __ నీకు నేను బయట నుండి కాకుండా , నీ లోపల ఉంటూ నీకు కనిపిస్తా , నీకు నరకం చూపిస్తా ,,చూడు _!
రెండు వారాలు గడువు నీకు ,చావడానికి సిద్దంగా ఉండు _
కనీసం ఇప్పటికైనా దేవుడిని ప్రార్థించడం అలవాటు చేసుకో _!
దేవుడా _ మరొక బలి పశువును నాకు ఆహారంగా ప్రసాదించావా _? స్వామీ ,ఎంత దయ నీది స్వామీ,
ఇలాంటి మూర్ఖులు ఉండగా ,నాకు ప్రతి రోజూ పండగే కదా_!
ఇక చర్చ ఏల _ దండగ _!""
జై పరమేశ్వరా _!
( సశేషం )
స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!""
No comments:
Post a Comment