Saturday, July 25, 2020

కట్టు

Jul 9, 2020
"ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న
చిన్న దానా _?
  అంటూ  చేస్తున్నా కరోనా చాలెంజ్   పరిణామాలు
____&&&&&&&___
  "ఎడ్ల బండి తోలుకునే రోజుల్లో _
దొంగ ఎడ్ల మూతికి _ కంక బుట్టి కట్టేవారు_!
పాపం_!
దానికి  తిందామని ఎంత ఆశ ఉన్నా ,,_కూడా
బుట్టి అడ్డం వచ్చేది _!

ఇపుడు  మనిషి గతీ అంతే_!
మూతికి మాస్క్ కట్టు తో _
తిండి కట్టు _!, మాట కట్టు,_!
దొంగ తిండి కట్టు,_!
  నాలుగు గీరెల బండి పై    తిండి కట్టు_!
చుట్టాల ఇంట్లో విందు కట్టు_!
రాత్రి పూట తిరుగుళ్ళు కట్టు_!
కోపంగా మాట్లాడటం కట్టు_!
బీర్లు బార్లు వైన్ లు కట్టు_!
థియేటర్ లలో సినిమాలు కట్టు _!
షాపింగ్ లు కట్టు, మార్కెటింగ్ లు కట్టు_!
తాగి తందనాలు  అడటం కట్టు _!
  బార్లు , హోటల్ ,పార్టీలు కట్టు_!
  మూతి ముక్కు కలిపిన కుట్టు, ఈ కట్టు _;
మిర్చీ బజ్జీ పానీ పూరీ వాసన కట్టు_!
బిరియానీ మసాలా  పట్టు వాసన  కట్టు _!
  పశువుల మెడకు తలుగు వలె_
చేతులకు కూడా  కట్టు_!
అడ్డమైన తిండి కోసం_
చెయ్యి చాచకుండ కట్టు_!
   బెల్ల మైనా _పెళ్ళామైనా
ముట్టకుండా చేతి కట్టు_!
   చుట్టమైన , వాడు చస్తే
చూడకుండా కట్టు_!
బజారు కెళితే   ముక్కు తాడు కట్టు_!
  బజారు టిఫిన్స్_ తినకుండా కట్టు _!
చుట్టాలు ఇంటికి
రాకుండా కట్టు_!
స్నేహితుల తో   రాసుకు పూసుకు _
తిరగకుండా కట్టు_!
ఎవరు వేయని  కట్టు_!
ఎపుడు పోతుందో తెలియని  మహమ్మారి  _కట్టు__!
మహా మాయ దారి కట్టు_!
తనకు తానే తగిలించు కున్న ఈ కట్టు_!
,  ఎంత బాధలో ఉన్నా_
ఎంత హ్యాపీ అనిపించినా_
పిల్లలకు ఎగరాలి_ ,గెంతాలి_
బయట తిరగాలి_! అనిపించినా ,_!
, నల్ల
పరదా చాటు చేసి
స్వేచ్ఛ,స్వాతంత్ర్యం హరించిన కట్టు_!
రోజు కాదు_నెల కాదూ_
ఎపుడు ముగుస్తుందో  గానీ_ దీని
అంతు  తెలియని  నీ ఆట కట్టు _!
ఇంటింటికీ యమ గండం లా_
బయట కాలు పెట్టకుండా కట్టు_!
  బాల బాలికల  బాల్యానికి కట్టు_!
రెక్క ఆడితే గానీ _!
  డొక్కఆడని వారిని కట్టు_!
వలస కూలీల కు   మెతుకులు కరువును చేస్తున్న  దీ కట్టు_!
నిరుద్యోగుల భవితకు
గొడ్డలి పెట్టు ఈ కట్టు _!
దేశ నాయకులు , విజ్ఞాన వేత్తలకు _
తల నొప్పిగా మారిన కట్టు_!
మందు మా కూ తెలియని కట్టు_!
నడిచే కాళ్ళ మధ్య ఇరికిన
కట్టె లాంటి కట్టు_!
అష్ట దిగ్బంధనం చేసిన
మంత్ర గ త్తె ఈ కట్టు _!

  ఆనంద మనిపించే  నగరాలను
నరకం  చేసిన కట్టు _!
  అందాల రాజధానులు    ఘోరస్మశానం  గా తలపించే కట్టు _!
నాలుగు గోడల మధ్య నీ ఆట కట్టు_!
ఫోనులు టీవీ లు టాబ్ లు వంటలు
ఇదే లోకమనిపించే  బంగారు కట్టు_!
విదేశంలో వారు , తమ
దేశం పోకుండా కట్టు
రాకుండా పోకుండా విమానాలు కట్టు _!
ఉద్యోగాలు కట్టు, ఉపాధి కట్టు_!
జీవితం పై విరక్తి పుట్టిస్తున్న కట్టు_!
  పుట్టిన వాడు చావక తప్పదు.  కానీ
  ఎంతటి బద్దశత్రువుకు కూడా
కరోనా చావు రాకూడదు
అనిపించే కట్టు_!
అని దేవుని ప్రార్థించే కట్టు _!
తనకు తానుగా విప్పలేని కట్టు_!
తోడు నీడగా మారిన కట్టు_!,
ఇంటా బయటా  విడవని కట్టు_!
కట్టు బాట్లు చేస్తున్న కట్టు_!
భార్యకు భర్తకు మద్య కట్టు_!
తల్లీ దండ్రి,కొడుకు బిడ్డా_!
వావి వరుసలు లేకుండా జేసీ_!
దూర దూరంగా చేస్తున్న కట్టు_!
భయాందోళన పెంచిన కట్టు_!
చావు భయాన్ని  తలపించే కట్టు_!
  పాపకు ముద్దూ పెట్టకుండా కట్టు _!
  బయట మనిషి ఇంటికి రాకుండా కట్టు_!
ఇష్టమైనది తినకుండా కట్టు_!
ఆడకుండా కట్టు_!
పాడకుండ కట్టు_!
కూరలు పప్పులు  పండ్లు ఫలాలు _
ముడితే కట్టు_!,పడితే కట్టు_!
మనిషికి మనిషి తాకకుండా కట్టు_!
  

  మనిషి ఆగడాలు చూడలేని  ఆ__
దేవుడు వేసిన  శిక్ష
, ఈ కట్టు_!
   నోటికి వచ్చింది ప్రేల కుండా కట్టు_!
ఇష్టమొచ్చిన ది చేయకుండా కట్టు _!
వాసనకు బానిస కాకుండా కట్టు_!
  బట్ట కు పొట్టకు , బ్రతుక్కు కట్టు_!
  చూసిందం తా మేయకుండ కట్టు_!
కట్టు తీస్తే చాలు , కరోనా కాటుతో_
   క్షణం లో అవుతావు
శ వ పాకెట్టు_!
  కడసారి చూపుకు నోచ నీయని కట్టు_!
  కన్నీటి బొట్టు రాలనేయని కట్టు_!
పాపమనిపించ ని దయలేని కట్టు_!
కనికరం కరుణా
కనిపించ నీ కట్టు_!
యముని పాశం వలె  బంధించు కట్టు_!
ప్రాణ వాయువు కూడా  పీల్చకుండ కట్టు_!
రోజు రోజుకు ముడీ ఇంకా
బిగుస్తున్న కట్టు_!
బ్రతికుండగానే _
చంపుతు న్న  కట్టు_!
   దేవుడా అనుకుంటూ కట్టిన ఈ కట్టు_!
అందాలు కట్టు_! _!,ఆనందాలు కట్టు_!
,   బాధ చెప్పకుండా కట్టు_!
బోరున ఏడవ కుండా కట్టు_!
  సంతోష పడనీయని కట్టు_;
ఎవరిని చూసినా కట్టు_!
యమ దూత అనిపించు ఒట్టు _!
  పేద ధనిక బేధం చూపని కట్టు_!
కుల మత వర్గ జాతి బేధం చూపని కట్టు_!
సమానత్వ భావం తో   ఒడిసి పట్టి  చంపుతున్న  కట్టు ,_!
అగ్ర రాజ్యాల పొగరు
అణచి వేస్తున్న కట్టు_!
నిస్సత్తువ నిరాశల
పెంచుతున్న కట్టు _!
దేవుడొక్కడే దిక్కని
అనిపించే కట్టు _!
కనిపించని దైవాన్ని
రోజూ గుర్తు చేయు కట్టు _!
పోలీస్, డాక్టర్_ యాక్టర్,లీడర్_
బేధమేంచని కట్టు,_!
కట్టు బాటు లేకుండ
తిరిగేవాడిని ,
కట్టివేయు ఈ కట్టు_!
    ఈ  కట్టు తీసేదేపుడో_?
  ఈ పాడు కరోనా పోయె దెపు డో_?
దేవుడు కరుణించేదెపుడో_?
  ఈ చావులు తగ్గే దె పుడొ_?
ఈ  దొంగ బుట్ట తొల గే దెపుడో_?
  ఈ దొంగ బ్రతుకు పోయేది ఎపుడో_?
ఈ దాగుడు మూతల ఆట ఆగే దెపు డో_?
ప్రతి రోజూ, ప్రతి వాడూ_ఇలా
   జీవన మరణ సమస్య ల తో_
సతమత మవకుండ _
మనశ్శాంతి లేకుండా , చేసే కరోనా నుండి విముక్తి ఎపుడో _?
శాశ్వత
  పరిష్కార మార్గ మెపుడో_?
ప్రపంచ శాంతి  కలుగు నెపు డో,
సర్వే జనాః సుఖినోభవంతు, _!
అను వేద వాక్యం నిజమయ్యే ది ఎపుడో_?
మాకు తెలియదు  పరమాత్మా _!
   దిక్కు లేని మా బ్రతుకు ల
బ్రోచు దేవర _!
మాకు  నీవే గతి,_! తెలిసీ తెలియ క చేసిన
  మా అపరాధాలను
మన్నించి __
మమ్ము బ్రోవుమయ్య స్వామీ _!
నీవె శరణు_! ,
ప్రభూ _!
నీకే శరణు_!
ఆపద్భాందవ వేగమే  రారా_!
అలసి సొలసి న

ఆపన్నుల  _
మీ బిడ్డలను 
మము గావరా_!
ప్రేమతో బ్రోవ రా _!
శరణు శరణు శరణు _!
స్వస్తి_!
హరే కృష్ణ హరే కృష్ణా _!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...