Saturday, July 25, 2020

భిక్షాం దేహి_2

Jul 9, 2020
బిచ్చగా ని  వలె  భావిస్తూ , దాత ,,అన్నదాత ,ప్రాణ దాత  అయిన  పరమాత్మను  స్మరిస్తూ, అదే  భావంతో దండం పెడుతూ _
""భిక్షాం దేహి"" అంటూ  దయతో అన్నం పెట్టు _! అంటూ అన్నదాత ను కోరాలి _!
వడ్డించే ది భార్య అయినా. మరెవరో అయినా   ఆ క్షణంలో ,,పరమాత్ముని గా  భావించాలి ,_!
దేవుడు స్వయంగా రాడు, కానీ
అలా భావిస్తూ ఉంటే మాత్రం    ప్రేమతో దిగి వస్తాడు _!
  అప్పుడు తాను  తినే ఆహారం అన్నం కాదు_ దివ్యమైన  ఒక " ప్రసాదం " అవుతుంది _!
అందుకే _ఎన్ని పనులున్నా అన్నదాత ను మరవ ని_ మన అన్నదాత _ఆ  సాదా పేద రైతు_ నిజంగా భక్తుడే_ స్వామీ _! అంటూ నారదుడు రైతుకు నమస్కరించాడు  _!
    ఒక పాత  సినిమా పాట ఈ భావాన్ని  సూచిస్తూ ఉంది_!
"నాది నాది అనుకున్నది నీది కాదురా _;
నీవు రాయన్నది _
ఒక నాటికి _రత్న మౌనురా,_!_!
ఏదీ నీది కాదు,నీతో రాదు _!
   అన్నట్టుగా పృత్విపై పుడుతూనే ఏ ప్రాణీ తనకు కావాల్సింది తెచ్చు కోలేదు._!
అన్నీ రెఢీ గా ఉంచి,,_  మనిషి ఆనందంగా ప్రశాంతంగా బ్రతకడానికి అవసరం అయిన సమస్త ప్రకృతి సంపదలు ,వనరుల ను __తన"" దయా భిక్ష ""గ_ భగవంతుడే స్వయంగా సమకూర్చాడు _!
అంటే  మనకు దైవ ప్రసాదంగా  ఇవ్వబడ్డాయి,_!
  ఇందులో ఏ ఒక్కటికూడా  మనిషి స్వయంగా తయారు చేసినవి కావు కదా_!
కేవలం  వాటిని సద్వినియోగం చేస్తూ కృతజ్ఞతా పూర్వకంగా జీవించడమే _ అతడు చేయాల్సిన పని _!
కానీ,దేవుడు అనుగ్రహించిన    దానితో తృప్తి పడకుండా , ,మనిషి "ఇంకా_ ఇంకా _కావాలి ,_! అది కావాలి ,_! ఇది కావాలి _!""అంటూ   వేడుకుంటూ నే ఉంటాడు , తృప్తి పడకుండా _!,
   అన్నీ ఉండి,_అవయవాలు చక్కగా ఉండి, దుక్కలా_ఆరోగ్యంగా ఉంటూ_,అడుక్కోడం , అనేది నిజంగా  నేరం,_!  అది దేవుడు కూడా _
క్షమించరాని విషయం _!
  " బిచ్చగాడు" అన్న పదాన్ని హేళన చేస్తూ ఉంటుంది _  దొంగల వలె _పగటి వేషాలు వేస్తూ _ సమాజాన్ని మోసం చేస్తున్న  అలాంటి దుండగులు చర్య _!
__వారు   నేడు మనం చూస్తున్న బిచ్చగాళ్ల సమూహం ఒక  దందా , ,వ్యాపారం లా ఉంటోంది _!
నిజమైన అనాధలకు ఉప్పు పుట్టకుండా ఉంటోంది _! పట్టపగలు బాహాటంగా ప్రజలను అలా చేస్తున్న వారి వేషం మోసం,, బిచ్చ మెత్తు కొనే తీరు పరమ అసహ్యంగా కనబడుతోంది_!
వాడు , వేషం లో
బిచ్చ గాడు కానీ ,వాస్తవానికి ఆ  వృత్తితో అతడు  లక్షాధికారి అవుతున్నాడు _!
అయినా ఇంకా కావాలి ,,అని బిచ్చం ఎత్తే వారికి దానం చేయడం అనేది నేటి పరిస్తితిలో_ పాపం గా పరిగణించాలి _! అలా గ్రుడ్డి గా చేస్తే మాత్రం
_ ఘోరమైన అపరాధం  అవుతుం ది కూడా
వారికి ధర్మం చేసే వారిది కూడా తప్పే అవుతుంది._!
   వికలాంగులు ,వృద్దులు ,బలహీనులు ,దీర్ఘ కాలిక రోగులు ,అనాధలు ,  నిరుపేదలు  లాంటి  వారికి__ఎంత  దానం చేసినా ,ధర్మం చేసినా,ఆదరించి ఆశ్రమాలు కట్టించి నా _, బ్రతుకు పై  వారికి _ఆశను దైర్యాన్ని_ కల్పించినా_  వారి  శ్రమ  డబ్బు , భావన నిజంగా  సార్ధకం అవుతుంది _!
ఆలాంటి దీనులే దానానికి  నిజంగా యోగ్యులు , పాత్ర త గలవారు_!
  , భోజనం చేసే ముందు,
అన్నపూర్ణ మాత ను ఇలా స్మరిస్తూ,అన్నం పెట్టేవారిని  అమ్మవారి రూపంగా భావించి
ఈ శ్లోకం  స్మరిస్తూ భావిస్తాము _!
"అన్నపూర్ణ సదా పూర్ణే_
శంకర ప్రాణ వల్లభే_
జ్ఞాన వైరాగ్య సిధ్యర్థం_ భిక్షాం దేహి చ పార్వతీ _!""
అంటూ   భుజించ బోయే ముందు  ఆహారాన్ని  అన్నపూర్ణమ్మ ప్రసాదంగా భావిస్తూ  గ్రహిస్తూ ఉంటాము
  ఆదిభిక్షువు  అనే వాడు_ త్రిభువనాలలో పర మ శివుడు  ఒక్కడే ఉన్నాడు ,
ఎవరి వద్ద ఏమీ ఆశించకుండా ,ఉన్నదానితో తృప్తి పడుతూ, అదే పరమావధి ,అదే నిత్యానంద ముగ _అదే సత్యం ,శాశ్వతం ,గా భావిస్తూ బ్రహ్మానందం భరితుడై   నిరంతరం సచ్చిదానంద స్వరూపం తో భాసిస్తు ఉన్న  ఆ ఆదిదేవుడు ఒక్కడే ఆదిభిక్షువు 
  అతడి వద్ద ఏమీ లేదు దిగంబరుడు ,,ధరించడానికి దుస్తులు ,తినడానికి తిండి ,
స్మశానం ఇల్లు,
సదా శివుడు " భిక్షాం దేహి "అంటూ జ్ఞాన భిక్షకై  యాచించేది  కాశీ విశ్వేశ్వర ఆ అన్నపూర్ణ మాత ను మాత్రమే ,
,,,నిజానికి సమస్త స్మృతి శృతి  పురాణాలు  శివుడే  గౌరీ దేవి కి చెప్పాడు
భిక్షాపాత్ర తో  జ్ఞాన భిక్షను అనుగ్రహించు మని ఈశ్వరుడు , ఈశ్వరినీ అర్తించేది  ,ఎందుకంటే,
పరమాత్మను గురించిన జ్ఞానం తెలుసుకో వడం అందరికీ అవసరమే  అని మనకు  చెప్పడానికి !
అందులో చిన్నా పెద్ద ఆడా మగా తేడాలు లేకుండా,జ్ఞానం కోసం భర్యనైనా అర్టించ వచ్చు అని తెలియజేయడానికి శివుడు ,  భిక్షాం దేహి అంటూ జంగమ దేవర వలె  కాశీ నగరంలో , అన్నపూర్ణా మాత అంతః పురంలో ప్రవేశించి ఆమె వద్ద జ్ఞాన భిక్ష ను స్వీకరిస్తూ వెళ్తాడు _!
గౌరీ దేవి శక్తి స్వరూపము అయితే ,శివుడు చైతన్యం ,
శక్తి ఉంటే చైతన్యం ఉంటుంది,
ప్రాణం ఉంటే శక్తి అంటే శివం ,
లేకుంటే శవం
   అందుకే శక్తి స్వరూపిణి  దేవి కృప కోసం ,ఆమె ప్రసాదంగా అనుగ్రహించే  భిక్ష కోసం , ఆమె వద్దకు భిక్షాం దేహి అంటూ అర్థించాడు శివుడు ,
అన్నపూర్ణా దేవి ఇచ్చే భిక్ష వలన శివునికి శక్తి వస్తుంది ,దానితో చైతన్యం ,దానితో భక్తి జ్ఞాన వైరాగ్యం కలుగుతాయి
ఆహారం  భిక్ష గా గ్రహించడం వల్ల పొందే   ప్రాణ శక్తి తో మానవుడు అద్భుతాలు సృష్టిస్తూ దైవానికి చేరువ అవుతున్నాడు
ఇదంతా భిక్ష మహిమా
ఇచ్చేవాడు ,శివార్పణం అని భావిస్తూ  భిక్షను ఇస్తే,
గ్రహించే వాడు  పరాత్పరుని ప్రసాదంగా  స్వీకరిస్తూ ఉంటే ,
ఆ పరమాత్మ ఆ ఇరువు రి కీ తన కృప ను అందజేస్తూ ఉంటాడు ,
అనగా దాత గ్రహీత ఇద్దరూ శివ స్వరూపాలే
పరబ్రహ్మ పదార్థాలే
  శివోహం శివోహం శివోహం
         ( సశేషం )
  స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా ,!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...