Saturday, July 25, 2020

భిక్షాం దేహి "_1

Jul 7, 2020
భిక్ష అంటే తినడానికి ఆహారం_!
" ,దేహి" అంటే , అయ్యా దయచేసి నాకు ప్రసాదించండి_! "
అంటూ దీనంగా ,వేరే దిక్కు లేకుండా,  దిక్కు తోచ ని పరిస్తితుల్లో ,,, పొట్ట గడవని స్థితిలో ,_ఒక  ఇంటి యజమాని  వాకిట నిలబడి ,ఆహారం కోసం ,,బ్రతిమాలు తూ ఉన్నట్టుగా ఒక బిచ్చ గాడి  ప్రార్థన _అది _!
_" బిచ్చగాడు "అంటే నే మొదటి నుండి అనాదిగా _, ప్రతివారికీ  ఒక చిన్న చూపు, ఏహ్య భావన కలుగుతుంది_!
ఎందుకంటే వారి
పరిస్తితి  ఎంత దైన్యంగ ఉంటుంది
తిండి ఆశ్రయం ఆదరణ   లేని అనాథ బ్రతుకులు వారివి_!
వారిని     తమ సంఘం నుండి వెలివేసిన  వేరే ఒక "జాతిగా ""
పరిగణిస్తూ ఉంటారు _!
, కానీ,నిజానికి బిచ్చగాడు కాని వారెవరూ భూమిపై లేరు, ఉండ బోరు కూడా _!
ఎందుకంటే, ,
మానవుడు సంఘజీవి_!  పుడుతూనే _ ఒకరి మీద మరొకరు ఆధార పడుతూ బ్రతుకుతూ ఉంటారు _!
తప్పదు కూడా _!
, రోజూ తినే ఆహార పదార్థాలు,ధరించే దుస్తులు,నివసించే ఇండ్లూ ,ఉపయోగించే బండ్లూ,వాహనాలు ,ఇలా అన్నీ ఎక్కడి నుండో రావాలి _!
ఎవరో తయారు చేయాలి _!,
అలా ఇవ్వడం_ పుచ్చు కోవడం , తో  బ్రతకాలి _!తమకు కావాల్సింది ,,  ప్రక్కవాల్లను  అడుక్కోవాల్సిందే __!
అంటే బిచ్చ గాడి అవతారం లో కాకున్నా,_ సివిల్ డ్రెస్ లో కోరుతూ,_ విధి లేని పరిస్తితి లో, వేడుకుంటూ ,_ బ్రతిమాలు తూ  _వచ్చిన పని పూర్తి చేసుకోవాల్సిందే ,_!
""నీవు బిచ్చ గాడి వి_!" _""అంట విపరీతంగా కోపం వస్తుంది, _ ఎవరికైనా _! అదేదో తిట్టు పదం లా భావిస్తూ ,,పట్టరాని రోషంతో
",నన్ను ఇంత మాట అంటావా? _నీకెంత దైర్యం ,?
""నాకేం గతి లేదని దిక్కు లేదని అనుకుంటున్నావా  నీవు __!??""
ఉండు నీ అంతు చూస్తా __!""
అంటూ కోపంతో ఊగి పోతారు _! చేతిలో ఏదీ ఉంటే అది విసురుతారు _!
కారణం తానుమాత్రం _""బిచ్చ గాడిని _కాదు_! అన్న అహంభావం _నటన _! అజ్ఞానం _!
  ఒకసారి కాశీ క్షేత్రంలో, భిక్షాటన చేస్తూ" ,భిక్షాం దేహి"" అంటూ  వేల మంది శిష్య బృందంతో ఇంటింటికీ , తిరుగుతూ  ఉన్న _ వ్యాసమహర్షి కి  కూడా ఇదే  దుర్గతి  పట్టింది ,__!
వారం గడిచింది_! ,పాపం _! అయినా ఏ ఒక్కరికీ  భిక్ష దొరక లేదు_ అక్కడ ! ,  ఇంకేం _!
అతడిని "ఆకలి రాక్షసి"" ఆవహించింది ,_!
_ధర్మం అధర్మం విచక్షణ కోల్పోయి , కమండలం నుండి నీరు విడుస్తూ , ఆపుకోలేని  కోపొద్రేకం తో_ అతడు  నేరుగా ఆ కాశీ క్షేత్రాన్ని  శపించ బోయాడు_!
,ఇదంతా కాశీ విశ్వనాథుని పరీక్ష గా గుర్తించ లేక పోయాడు , ఆయన _!
తర్వాత అన్నపూర్ణ దేవి ,అతడిని శాపం పెట్టకుండా ఆపి,అతడికి__ అతడి శిష్య వర్గానికి_ కడుపునిండా విందు భోజనం పెట్టీ _ తృప్తి పరుస్తుం ది_!
కానీ వ్యాసుడు _ సాక్షాత్తూ ఈశ్వరుని  నివాస స్థానం అయిన కాశీ నగరానికి హాని తల పెట్టడం అన్న _ అపరాధానికి  శిక్ష మూల్యం చెల్లించక తప్పలేదు_!
ఫలితంగా  అతడు కాశీ నగరం నుండి శాశ్వతంగా  బహిష్కరించి బడ్డా డు ,
భిక్షాటన చేసే వారిలో  క్షమా గుణం ,పరమా శాంత స్వభావం ,, కోపాన్ని నియంత్రించే సంయమనం ఉండి తీరాలి ,
అలాంటి సాధువులు ఒక చోట ఉండరు ,ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ,_ ఇది నా స్వంతం అన్న స్వార్థం వారికి కలుగదు _!
  భిక్ష అనేది అమృత తుల్యమైన ఒక   పరమాత్మ భావన ,_!
ఒకసారి _
  లోకంలో తానే  ఒక మహా భక్తుడు గా గర్విస్తూ ఉన్న నారద మహర్షి నీ చూసి,,అది  ,నారాయణుడు గ్రహించి   _అతడిని  భూలోకం తీసుకెళ్ళి _అక్కడ  తన పొలం దున్నుతూ ఉంటున్న  ఒక రైతు ను చూపించి ,_ "భక్తుడు  "అంటే అలా ఉండాలి  _! అన్నాడు
_నారదునికి ఆశ్చర్యం కలిగింది ,_!
_"ఎలా ఈ సామాన్యుడు_ ఒక  మాన్యుడు అవుతాడు అని _!?""
_చూస్తూ ఉండు _!""అన్నాడు నారాయణుడు _!
రైతు పొలం పని అయ్యాక_ కాళ్ళు చేతులు కడుక్కు నీ , భార్య అతడికి  ఆహారం  వడ్డిస్తూ ఉండగా _ అరటి ఆకుముందు కూర్చున్నాడు _!
భోజనం చేసే ముందు తన  రెండు చేతు లు జోడించి  కళ్ళు. మూసుకొని నిర్మల హృదయంతో , నీశ్చల భక్తితో పరమాత్ముని ధ్యానిస్తూ  రైతు ,ఇలా ప్రార్థించాడు_!
"ప్రభూ ,నాకు భిక్షగా అన్నం పెట్టావు _ ఆకలి తీరుస్తూ ఉన్నావు "!
తినడానికి  , నోరూ , ఆహారం అందించే చేతులూ ఆరోగ్యం అవయవాలు , అస్తి _ అనందం శక్తి ఇస్తు__
  నాకు శరీరంలో  అద్భుతమైన  చైతన్యం కలిగిస్తూ  ఉన్నావు
స్వామీ _!  అనాథ నాథుడ వు_ సర్వ ప్రాణి,పోషకుడవు_! రక్షకుడవు _!దయార్ద్ర హృదయుడవూ ,_!
తండ్రీ _!
నన్ను అనుగ్రహించిన  ఇదే రీతిలో_ ఈ సర్వ  ,జగతిలో_ ఆకలికి అల్లాడే సకల ప్రాణుల కు_ అన్నదాత వై _ వారికి కూడా సరిపడే  ఆహారం  అందిస్తూ _వారిని పోషిస్తూ వారి ప్రాణాలను కూడా  రక్షించు ,_!
భిక్షాం దేహి,_! హే
పరమాత్మా _!  నన్ను  ఇలా కటాక్షిస్తూ ఉన్నందుకు  కృతజ్ఞతగా నీకు ఇవే మా ప్రణామాలు _!!""అంటూ దండం పెట్టీ ,
విస్తరి లోని భోజనానికి కూడా నమస్కరించి_ తిండికి ఉపక్రమించాడు   రైతు _!,
ఏ పనీ చేయకుండా , ఏ రంధీ లేకుండా _ ఏ బాధ్యత  తెలియకుండా _హరి నామం ఒక్కటే పలకడం మాత్రమే భక్తి అనిపించు కో దు కదా _!
  ( సశేషం )
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...