Saturday, July 25, 2020

భిక్షాం దేహి__3

Jul 10, 2020
   మనిషికి  అంతర్గతంగా ,,సహజంగా ఉండే అహంకారం ,అజ్ఞానం , అవిద్య ,, గతజన్మ  కర్మ ఫలాల  వల్ల  ,
పదార్థ జ్ఞానం తోనే బ్రతుకు ఈడుస్తూ ఉంటాం __!;
యదార్థం అయిన పరమాత్మ స్వరూపాన్ని గురించిన జ్ఞానం  _అతడిలో  కొరవడుతుంది ,_!
"" కుడిచే దన్నము _
కోక కట్టెడి ది_
నడమంత్రపు సిరి_ నాటకము _
అని అన్నమయ్య అన్నట్టుగా _
" _!
ఏదీ తనతో రాదు,_!
అన్న వైరాగ్య భావన  రావడం  కూడా  మనిషికి అవసరమే _!
ఎంత  మోహం పెంచుకుంటే _అది దూరం అయితే అంత దుఖం _!
అందుకే "జ్ఞానం, వైరాగ్యాలు ""మాత్రమే ఇవ్వాలంటూ  _ అవి అన్నపూర్ణ మాత ఇచ్చే భిక్ష మహాత్మ్యం వలన సిద్ధిస్తాయని , దేవి ని కోర బడింది _!
అలాంటి భావ సంపద తో కోరడమే భక్తి,_!"
పరమాత్మ  ఆరాధ న అవుతుంది _!
  అందుచేత  భోజనం చేశాక
"అన్నదాత సుఖీభవ _!""
అంటూ  ఆ పరమ కృపాళుడు, దయా సాగరుడు , దీన జన పోషకుడు  , సమస్త జనావళికి ప్రాణికోటి కి పోషకుడు ,అన్నదాత అయిన  _ఆ పరాత్పరుని  కృతజ్ఞతా భావంతో స్మరిస్తూ ఉంటాం _!""
""హనుమ దీక్ష, అయ్యప్ప దీక్ష ,, దుర్గా దేవి దీక్ష ,,వేంకటేశ్వర స్వామి దీక్ష _ శివ దీక్షా _ బాసర లో  సరస్వతీ మాత దీక్షలు _ తీసుకునే భక్తులు ,"" భిక్షాం దేహి"" అంటూ ఇంటింటికీ వెళ్ళి భిక్షను గ్రహిస్తూ_ మండల దీక్ష నిర్వహిస్తారు_!
భిక్ష మహత్తు వలన  వారికి జయం శుభం కలుగుతుంది_!
అందుచేత _దాత అనేవాడు , ఆ భగవంతుడు ఒక్కడే ,_!
మనమంతా బిచ్చ గాళ్ళమే,,_!
అతడు ఇచ్చింది తింటూ__,చెప్పింది చేస్తూ,ఎప్పుడూ రమ్మంటే అప్పుడు  సంతోషంగా  అతడితో వెళ్ళడానికి సిద్దంగా ఉండడమే,_ మన కృతజ్ఞతా ప్రకటించే విధానం _!
అతడి దయా దాక్షిణ్య ముల పై ఆధారపడిన మనమంతా బిచ్చగాళ్ళ రూపంలో   _అతడి అనుగ్రహం కోసం _ ప్రార్ధిస్తూ ఉండాలి ,_!
అన్నింటినీ ఆతడి దయా భిక్ష గా భావించాలి _!
_సాక్షాత్తూ_ ఆ  శ్రీమన్నారాయణు డే  స్వయంగా _వామన రూపం ధరించి "భిక్షాం దేహి ," అంటూ_ మూడడుగుల భూమి నీ _తనకు  దానం చేయమని_ మహా వీరుడు, త్రిభువన సామ్రాట్  , దాన శీలుడు అయిన బలి చక్రవర్తి ని అర్థించాడు _!
తాను గ్రహించిన దానానికి ఎన్నో రెట్లు ఫలితాన్ని ,వైభవాన్ని పదవిని శాశ్వత కీర్తిని   అతడికి అనుగ్రహించాడు  విష్ణువు _!
  బలి చక్రవర్తి కి తెలుసు _,తనను  దానం అడిగేది _సాక్షాత్తూ  నారాయణుడు , అనీ _! ఇలా "భూ దానం ""రూపంలో  తన ఐశ్వర్యం , తీసేసుకోడం కోసం వచ్చాడని  కూడా తెలుసు _! ఇంతవరకూ అతడు_, తన వద్దకు యాచన కై _ ఎవరు వచ్చినా కూడా _ వారిని నారాయణ స్వరూపంగా భావిస్తూ_ అడిగిన వారికి లేదనకుండా__ పుష్కలంగా  దానం చేస్తూ వచ్చాడు బలి _!
ఇప్పుడు స్వయంగా నారాయణుడే  ఇంటిముందు
""భిక్షాం దేహి ""అంటూ  నిలిచాడు_! ఇదే బలి కోరింది,
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ,, లక్ష్మీ పతి,సకల సంపదలకు నిలయుడూ, అంతటి వాడే  తన ముందు చేయి చాచి ,
రాజా '_!భిక్షాం దేహి _!
అంటూ యాచించడం  తన భాగ్యం గా జన్మ సాఫల్యత గా భావించి _తన అదృష్టానికి ఆయన ఎంతో  మురిసి పోయాడు
_ అందుచేత ,,తన కుల గురువు   శుక్రాచార్యుడు _విష్ణువు కు  దానం ఇవ్వవద్దని   ఎంత వారించినా  , తొనక కుండా  , వినకుండా  సందేహించకుండా , ,ఇచ్చిన మాట తప్పకుండా_ పరమ సంతోషం తో_ మూడడుగుల భూమిని దానం చేసి,శాశ్వత కీర్తిని సంపాదిం చాడు _! బలి చక్రవర్తి _!
అయితే  అలా భగవంతుడు , భక్తుడి వద్దకు  స్వయంగా రాడు_! బలి చక్రవర్తి కి ఉన్నంత యోగ్యత ఉంటే తప్ప _!,
మంచి వారి రూపంలో,_మహాత్ముడు గా, సాధువు గా , వస్తూ,, అనాథలకు __ఆపన్నులకు_ ఆశ్రయము ,,ఆదరణ_ అన్న పానీయాల లోటు లేకుండా__ సకల సదుపాయాలు  సమకురుస్తూ__  తమ ప్రేమను ,దయను , భూత దయ ను పేదవారికి_ దయా భిక్ష గా  అందిస్తూ  అనుగ్రహిస్తూ ఉంటా డు _!
  అందుచేత
""ఆర్తి తో అర్తించేవాడు_ బీదవాడు_ బిచ్చ గాడు_! అనుకుంటే ,,
ఆప్యాయత, అనురాగం, ప్రేమల తో  ,ఆర్తులను అనుగ్రహించే వాడు భగవంతుడే  అవుతాడు _!
ఎవరికైనా సహాయం అందిస్తే ,, వారు , అయ్యా_! దేవుడి వలె వచ్చి నన్ను ఆదుకున్నారు , కదా, మీ ఉపకారం ఎన్నడూ మరవలేను , అంటూ ఎంతో వినయం తో దైవం ముందు ప్రణమిల్లి న విధంగా భక్తితో గౌరవిస్తూ ఉంటారు_!
, డాక్టర్ లు__ తమ సేవలతో రోగులను   వారు పడే బాధలనుండి రక్షించి "ప్రాణదాత "లు అవుతారు_!
""అన్నమో రామ చంద్రా_"" అంటూ అలమటించే అన్నార్తుల ను _ప్ దగ్గరకు పిలిచి  __ ప్రేమతో అన్నం తినిపించే వాడు నిజంగా భగవంతుడే
అవుతాడు _ కదూ _!""
ఇది ప్రాణ భిక్ష ,అవుతుంది _!
""అన్నదానం కు మించిన దానం లేదు _""అంటారు
ఎందుకంటే ,, ఆకలి గొన్న వాడికి పెడితే _ఆ అన్నం ""పోయె ప్రాణాన్ని ""నిలబెడుతూ ఉంది _!
    పరమాత్ముని స్వరూపంలో  కనిపించే వాడు
గృహస్తు _!
ఇల్లు కట్టింది ,ఉంటున్నది __,తమ ఇంటికి వచ్చి వెళ్లే అతిథులను _అభ్యాగతుల ను  _గౌరవ మర్యాదలతో, ఆదరించి సత్కరించడానికే _!  అతిథులను , సాక్షాత్తూ నారాయణుడి రూపంగా భావిస్తూ ,చక్కగా  సత్కరించి  ,భోజనం పెట్టీ పంపించే పరమ ఉత్కృష్టమైన బాధ్యత  నిర్వహిస్తూ ఆనందం పొందడానికి   గృహస్థ జీవితం అని తెలియాలి ,_!
అలా  పరమాత్మ భావం తో ఉండే గృహస్తు __తన జీవితంలో తెలిసీ తెలియ క , చేసిన  సంచిత , ప్రారబ్ద కర్మ లనుండి _ ముక్తి పొందే అవకాశం ఉంటుంది _!
ఈ సౌకర్యం _ఆచారం , సంస్కారం ,,సంప్రదాయం ,మానవ జాతి ఉద్దరించబడటానికి
భగవంతుడు అనుగ్రహించిన    అద్భుతమైన    వరం ,_!
_ గృహస్థ ధర్మము_!
బిచ్చగా డికి చేస భిక్షా  దానం "' వలన   గృహస్తు పాపాలు పటా పంచలై పోతాయి ,
అందుచేత బిచ్చగాడీ ఆత్మలో ఉన్న పరమాత్ముని దయ వలన   గృహస్తు కృతార్తుడు అవుతున్నాడు
దాత గ్రహీత ఇద్దరూ ఆత్మ స్వరూపాలే ,అనుకుంటే
నేను  ఇతరులకు దానం  చేస్తున్నాను అన్న భావన రాదు
తనకు తానే ఇచ్చు కుంటున్నాడు అనుకుంటాడు _!
అందుకే ,గ్రహీత లో ఉండి చేస్తున్న  ఆత్మ బోధ  ఇలా ఉంటుంది _
"" ఒరేయ్,, సంసారీ _! గృహస్తు _!
నీవూ,నీవు ఉంటున్న ఇల్లూ, కుటుంబ  సభ్యులు క్షేమంగా ,ఆనందంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం _!
ధర్మం ,దానం  చేసుకోవడం _ వల్ల లభించే పుణ్యం _ నీకు వచ్చే జన్మలో నిలువ ఉండేది , అక్కరకు వచ్చేది, ,__!_ నీతో ఉంటూ నీకు ఉత్తమ సంస్కారం తెచ్చేది  _!  ఈ దానగుణం తోనే సాధ్యం _!
దేవుడు నీకు ఇచ్చింది _నీవు బ్యాంకుల్లో,దాచటానికి , కాదు_!
అస్తి బంగళాలు పోగేసు కోడానికి అసలే  కాదురా ,నాయనా_!
_ మాలాంటి దీనులకు_ బికారు లకు _అనాథలకు ,_ అభాగ్యుల కు  ఇవ్వడానికే ,_!
ఎంత పంచితే , అంత పెరిగేది  ఈ  సంపద _!
, గత జన్మలో చేసిన పాపాల ప్రక్షాళన చేసుకోడానికి ఉపకరించే అద్భుత సాధనం  ఈ దానం స్వభావం _!
_! నీ ఇంటి ముంగిట నిలుచుండి  __తన రెండు చేతులు  ముందుకు చాపి _
"అమ్మా _! అయ్యా _!_భిక్షాం దేహి _!""
అంటూ  ఆర్తితో అరిచే వారికి _
నీవు _నీ స్వహస్తాలతో  _ సంతోషంగా , చేసుకునే ఈ అన్న దానం _వస్త్ర దానం_ థన దానం  _ పుణ్య ఫల మే _నీ కు తోడుగా  , చల్లనినీడగా  నిలిచి వచ్చేది  _ నీకు ముక్తి మార్గం చూపించేది _!అందుకే _ తమ్ముడూ _!
పెట్టీ పుట్టాలి _!,
అంటే _
ఇపుడు నీకున్న , ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకో_!
లేకుంటే _
వచ్చే జన్మలో _నీవు కూడా నా లాగే  అనాథ లా _ఇలా _ఇంటింటికీ బికారి లా  తిరుగుతూ
"భిక్షాం దేహి _!"
అంటూ తిరగాల్సి వస్తుంది సుమా _!
తస్మాత్ జాగ్రత్త _!"
అంటూ అందరికీ ఇచ్చే అద్భుతమైన , మానవ జీవన  గీతా సందేశ _ సారమే
ఈ బిచ్చగాడిఅవతార రహస్యం  _!
  "భిక్షాం దేహి _!"అనబడే జగద్గురువులు  సూచించిన  మాటను _ అన్న దాతగా  ఈశ్వరుడు  నిలిచి_  "అన్నదానం మిన్న _!"_అన్నది _ అక్షరాలా ఆచరిస్తూ  నిజం చేస్తున్న పరమ సత్యం_! 
_ఇలా  ,నిరంతరం_ తన  కొలువులో ఘనంగా వైభవంగా ,భక్తులకు ,అన్నార్తులకు పేద బీద ధనిక తారతమ్యం లేకుండా_ఆ  , నిత్యా నంద కరీ, వరా భయకరి,,సౌందర్య రత్నాకరి,  _ కృప కొరకై , భక్త జన సందోహం _ఏకమై ముక్త కంఠంతో,ఆర్తితో ,అమ్మలగన్న అమ్మ ను _
""భిక్షాం దేహి ,_! కృపావలంబనకరీ _!_మాతా _!  అన్న పూర్నేశ్వరీ_! _
అంటూ స్తుతిస్తూ , కీర్తిస్తూ, తరిస్తూ _ కాశీ మహా నగరం  వైభవాన్ని వేనోళ్ళ  చాటుతున్న పరమాద్భుత తత్వం
_ ఈ అన్న సూక్తం_ప్రాధాన్య  మహాత్మ్యం _!_!""
           ( సశేషం )
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా

,,

"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...