Saturday, July 25, 2020

భిక్షాం దేహి ,_4

Jul 11, 2020
   అద్భుతమైన  ఈ " భిక్ష ""  అనబడే   సంప్రదాయం మన హిందూ  ధర్మంలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది _!
  అందమైన ఆధ్యాత్మిక భావన ,,పరమాత్మ భావన , దివ్యమైన  అనుభూతి పొందడం  మాత్రమే   కాకుండా __ మానవుని జీవితాన్ని  భగవద్ ప్రసాదంగా స్వీకరిస్తూ  ఉండడానికి కావలసిన ""భక్తి జ్ఞాన వైరాగ్యా ల ""అవశ్యకత
గురించి కూడా,,""
భిక్షాం దేహి "" అన్న పదం  తెలియజేస్తోంది _!
"భిక్ష ""అనేది   పరమ  దయాలువు అయిన   పరమాత్మ ప్రసాదం _!
ప్రాణి కోటి పై పరమాత్ముని అనుగ్రహం__ అనేక స్వరూపాలలో ఉండి ,__ దయామృతాన్ని వర్శిస్తూ,_, వాటి యోగక్షేమాలను  చూస్తూ ఉంటుంది _!
దయా భిక్ష, క్షమా భిక్ష ,ప్రాణ భిక్ష _ సత్య వ్రత దీక్ష  భిక్ష లాంటి  అపురూపమైన   ధర్మాలను కూడా ప్రతిపాది స్తు ఉంటున్నాయి _!
   తనకి కీడు చేసే బద్దశత్రువులను కూడా  క్షమా భిక్ష తో  విడిచి పెడుతూ, వారికి " జీవన దానం ""చేయవచ్చు ను _!
ఇది కూడా భిక్ష నే _!
""దయా దేహి,క్షమా దేహి ,రూపం దేహి గుణం దేహి , శాంతం దేహి ,ధనం దేహి,బలం దేహి, అంటూ తనకు కావాల్సిన  గుణాన్ని వరంగా బిక్షగా , అర్థిస్తూ ,, దాన్ని సమర్థుడు సర్వజ్ఞుడు  అయిన ఆ సర్వేశ్వరుని  కోరుతూ ఉంటాడు _!
,, విభీషణుడు ,రాముని వద్ద శరణాగతి కోరాడు_!
""  హే శ్రీరామచంద్ర ప్రభో _! దయచేసి నా  ఈ విన్నపం వినండి _!
నేను రాక్షసుడ ను,_!
నీకు శత్రు పక్షం వాడను ,,_! పైగా , నీ శత్రువు ,, రావణుడి కి  _స్వయానా సోదరుడను కూడా ,_! 
హే ,శ్రీ రామా __!
ప్రస్తుతం ,
నేను ఆపదలో ఉన్నాను ,,_!
నేను కనబడితే చంపేస్తాడు మా అన్న రావణుడు_!
నాకు ఆశ్రయం లేకుండా చేశాడు _!నాకు   తల దాచుకొనే దిక్కు లేదు _!,
కష్టాల్లో బాధల్లో కూరుకు పోయాను _!
రామచంద్రా_! నీవు దయా సాగరుడవు అనీ __శరణాగత దీక్షా వ్రతుడవు __""అనీ నీ నమ్మిన బంటు, ఆ  హనుమ ద్వారా  విన్నాను_!
స్వామీ,, నా మాటలు నమ్మండి _!
నిన్ను శరణు కోరి వచ్చాను _! శరణాగత వత్సలా,, లక్ష్మణా గ్రజా _!
నన్ను రక్షించు _!,   రఘు వీరా _!
శరణు శరణు  శరణు _!!అంటూ  రాముని పాదాల ను. ఆశ్రయించి 
శరణాగతిని ""భిక్ష "" గా పొంది,రాముని సేవలో  తరించాడు  విభీషణుడు ,_!
     అమోఘం అనితర సాధ్యమైన ""దయాభిక్ష ""ను మహాత్ములు ప్రసాదిస్తూ_ ఉంటారు__!!
తనను ,చంపవచ్చిన శత్రువులను కూడా మిత్రులు గా చూస్తారు ,_!
వారు ,,మనసు మార్చుకొని   శరణు కోరితే   _,దయతో దయా భిక్షను అనుగ్రహిస్తారు ,_!!
   రాముని బాణం తో నేల కూలిన  వాలి ,,తన అపరాధాన్ని అహంకారాన్ని గుర్తించి  తనను ,క్షమించమని  శ్రీరాముని వేడుకుంటాడు _!!
కరుణా సముద్రుడు__ సీతా రాముడు_ వాలికి  దయా భిక్ష తో బాటు , మోక్షాన్ని  కూడా అనుగ్రహిస్తాడు _!
  ఇదే కోవకు చెందిన ""దయాభిక్ష . _"" ను   కూడా  _భక్త అంబరీషుని కథలో చూస్తాం ,_!
  రాక్షసి నీ సృష్టించి  అంబరీషుని హతమార్చబోతాడు దుర్వాసుడు _!
చివరకు  దుర్వాస మహర్షి  తన   అపరాధాన్ని తెలుసుకొని క్షమించమని  శ్రీహరి భక్తుడు ,_ఏకాదశీ దీక్షా వ్రతుడు అయిన  ఆ  అంబరీషుని__  తనకు ""ప్రాణభిక్ష _""పెట్టమని దీనంగా  ప్రార్థిస్తాడు _!
  వేడి జ్వాలల ను క్రక్కుతూ మహర్షిని హింసిస్తూ ఉన్న_ ఆ  శ్రీహరి చక్రాయుధాన్ని__ భక్త మహాశయుడు __అంబరీషుడు  _తన ప్రార్థనతో  దాన్ని  శాంతింప జేసీ  __మునికి_"" ప్రాణ దానం_"" చేస్తాడు _!
ఆపదలో ఉన్నవారిని కాపాడుతూ ఉండడం,, అలా వారి   ప్రాణాన్ని  రక్షించడం కూడా ""ప్రాణాన్ని భిక్ష గా  ఇవ్వడం , ప్రాణ భిక్ష పెట్టడం అంటాము _!!
  ఆకలికి మల మల మాడుతున్న మూగ ప్రాణులకు ,మనుషులకు  అన్నంపెట్టి  ప్రాణం నిలబెడుతూ __ప్రాణం నిలబెట్టడం కూడా  గొప్ప పుణ్య కార్యం _ అవుతుంది '_!
,, తల్లీ కుంతీ దేవి  కి ఇచ్చిన మాట ప్రకారం ,__ దానకర్ణుడు ,తన చేత చిక్కిన భీమా ధర్మ రాజు నకుల సహదేవులను విడిచి పెట్టీ ,వారికి "" ప్రాణ భిక్ష ""అనుగ్రహిస్తాడు _!
""అమ్మా __మాదా కబలం _!"", అంటూ _ఆర్తితో ఆకలి తో  మన ఇంటి ముందు వచ్చిన బిచ్చగాడు సాక్షాత్తూ పరమేశ్వరుడు ని స్వరూపం , గా భావించాలి _!
  అనాథలకు పది రూపాయలు ఇస్తే ,,దానికి బదులుగా పది రెట్లు అధికంగా ఫలితాన్ని అనుగ్రహిస్తాడు పరమాత్ముడు ,_!!
"క్షమ "అనేది పరమ ధర్మం _!
అహింసా పరమో ధర్మః _! అంటుంది వేదో క్తి_!""
       !! సశేషం !!
   స్వస్తి !!
  హరే కృష్ణ హరే కృష్ణా !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...