Jul 25, 2020
"మనస్సు "అనే అంగం ప్రత్యేకంగా మనలో లేదు,_!
మన ఆలోచనల స్వరూపమే మనస్సు _!
ఈ మనస్సు అనేక రూపాల్లో _మనకు అనుదినం మన ముందు_ మనలోపల _ప్రత్యక్ష మౌతూ ఉంటుంది_!
__కోపం ,ఈర్ష్య ,పరితాపం, దుఖం ,సంతోషం , ఉత్సాహం లాంటి భావోద్వేగాలు __మనస్సు ప్రకోపన తోనే _ బయటికి ప్రకటిత మౌతూ ఉంటాయి_;
" మనస్సు " అనే భావ సంపద మనిషికి దేవుడిచ్చిన అపురూప వరం _!
దానితో నే దివ్యమైన అనుభూతి పొందుతూ ఉంటాం ,,_!
""ఆవేశం _ఆరాధన_ ఆనందం _ఇలా మనిషికి జీవితంలో కలిగే సుఖ సంతోషాలు,కష్ట నష్టాలను మనసు తో అనుభవిస్తూ అనుభూతి పొందుతూ , ఉంటాం _!
మనసు అంటే "నేను అనే అహంకారం""_!
,దాన్ని ఆలోచన ద్వారా భావిస్తూ పనులు చేస్తూ ఉంటాం _!
ఈ మనస్సు ఎంత గొప్పదో ,అంతకంటే గొప్పది అద్భుతం అయినది మన ఈ దేహం _!!
దేహం లేక పోతే అనుభూతులు ఉండవు _!,
చెట్టు రాయి కొండ , జంతువు ల వలె యాంత్రికంగా ఉంటుంది జీవితం _!;
,జీవుడు ,అంటే మనసు ""_!
ఈ ఆలోచనల దర్శనాన్ని రెండు విధాలుగా చూడవచ్చును _!
ఒకటి_ దేవత_!
రెండు _దెయ్యం _!
_""శాంతం,, సంతోషం, సహనం , సత్వ గుణం, స్పందన,లాంటివి_ దేవతా
స్వభావాలు అనుకుంటే__ __కోపం, తాపం, దురాశ , అహంకారం _లాంటి
రాజస తామస గుణాలు దెయ్యం అవహించి చేయిస్తూ ఉన్న పనులు అనుకోవచ్చు_!!"
మనిషికి చెడు. ఆలోచనలు పనులు చేయడం _ చాలా సులభం _!
వాటికి అంతగా కష్టపడే అవసరం లేదు,_!
ఎందుకంటే . మన చుట్టూ ఉండే వాతావరణం అలాంటిది _!
టీవీ, పేపర్ వ్యక్తులు చేసే పనులు మాటలు కుటుంబ సంస్కారం వీటి నుండి తప్పించుకునే వీలు లేదు _! కదా ,
వాటి ప్రభావం మనపై మన మనసుపై తప్పక ఉంటుంది _!
అని అందరికీ తెలుసు _!
__దేవతా గుణాలు లభ్యం కావడం చాలా కష్టం _!
ఎందుకంటే అలాంటి సంస్కారం , పెంపకం దొరకడం చాలా అరుదు కదా ,_!
స్వతహాగా ఏ మనిషీ చెడ్డవాడు కాదు కదా _!
అందరం సంఘం చెక్కిన శిల్పాల మే కదా _!
ఎవరూ పూర్తిగా మంచి_ లేదా పూర్తిగా చెడ్డ వారు కాదు _!
కర్మలను బట్టి అవి ప్రకటిత మవుతు ఉంటాయి _!
_మాట్లాడకుండా _మౌనంగా ఉంటే మాత్రం__లోన వచ్చే ఆలోచనలు కదలకుండా ఉంటాయా_??
ఉండవు కదా _;
మౌనంగా ఉన్నపుడు__ మన ఈ మనసు _ తాను ప్రేమించిన మనిషి ,, డబ్బు , వస్తువు ,చుట్టూ తిరుగుతూ ఉంటుంది
లేదా __
తాను ద్వేషించే వ్యక్తి ,వస్తువు గురించి ఆలోచిస్తూ ఉంటాడు _!
ముఖ్యంగా అతిగా ప్రేమించే ,, మనసు పడే భార్య ,,భర్త లేదా మరొకరు , ఈ మనసుకు ""ప్రభువు ""అవుతూ ఉంటారు_!
, తమ స్వార్థం తో అదే భావిస్తూ ,అదే లోకంలో జీవిస్తూ, దానినుండి బయట పడలేక సతమత మౌతూ ఉంటారు _!
, జడ భరతుడు. ఒక జింక ను పెంచి ,_ ప్రేమించి ,మరుసటి జన్మలో జింక గానే పుడతాడు _!
వేల ఎండ్లతపస్సు నష్టపోతా డు కూడా _!
దృతరాష్ట్రుడు _ తన ""రాజ్య కాంక్ష ""తో కురువంశ నాశనానికి కారకుడౌతాడు _;
రావణుడు కాంతా మోహంలో _కన్నూ మిన్నూ కానకుండ _అకృత్యాలు చేసి , స్వర్ణ లంకా నగరాన్ని _"మరుభూమిగా"" మారడానికి కారకుడు అవుతాడు ,_;
పురాణాలలో మాత్రమే కాకుండా , ఇంటింటిలో నిత్యం __ మనం చూస్తున్న విషయాలే ఇవి _
"" తల్లా _?పెళ్ళామా ,_! ఇద్దరిలో నీకు ఎవరు కావాలో చెప్పు _??
అంటే ఏం చెబుతాం _?
ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండవు కదా _!
,
ఇలా తాము అమితంగా ప్రేమించే వ్యక్తి కోసం__ పోటీలు పెట్టుకుంటు,__ కొట్టుకుంటూ ఉంటారు _!
"ప్రేమ "అంటే పోరాటమా?
పంచుకునే పదార్థమా _?. కాదు కదా _!
ప్రేమ ఒక్కరికే స్వంత మా _?
ఇది పూర్తిగా వ్యక్తి గతమా _!
తమ వారు అనుకునే వారందర కూ పంచడం వలన "ప్రేమ" బలహీనం అవుతుందా _?
ప్రేమ కు మరో పేరు విశ్వాసం _!
__ఎక్కడ తన మంచి కోరేవాడు అన్న నమ్మకం ఉంటుందో అక్కడ ప్రేమ బీజం పడుతుంది కదా_!!
అమితంగా ప్రేమ ఎక్కడో అక్కడ స్వార్థం కూడా ప్రారంభం అవుతూ _ అది ఏ మాత్రం బెడిసి కొట్టి నా__ ప్రాణాంతకం అవుతుంది _!
_"" దాన్ని ఎలాగైనా పొందాలి _! అంతే _!;
,అది ఇంకా ఎవరికి దక్కవ ద్దు _!
నాకే దక్కాలి _!,మరెవరికీ దక్కినా చంపేస్తాను ,_!""
అనబడే . క్రూరమైన ప్రేమ నాటకాలు చూస్తుంటాం_;
ప్రేమ అంటే పగ__ ప్రతీ కారాలేనా _? కాదు కదా _!
_ అందుకే _ ప్రేమ ఎప్పుడూ " త్యాగాన్ని" కోరుతూ ఉంటుంది. ,_!
, ఆ యజ్ఞంలో , దాత,ఒక బలిపశువు అవుతాడు
, అనంతము అపురూపం అయిన ఇదే ప్రేమను భగవంతుని పట్ల ప్రదర్శిస్తే __,అద్భుతాలు జరుగుతాయి_!
వ్యక్తి పట్ల , ఇల్లు వాకిలి ఆస్తి పైన నీకున్న ప్రేమ ను. చూపితే ,, అది సంకుచిత ప్రేమ అవుతుంది _;;
, దైవం పై విశ్వాసంతో చూపే అనంతమైన ప్రేమతో నీకు ప్రశాంతత పరమానందం , జీవన సౌఖ్యం ,జీవన్ముక్తి లభిస్తాయి కదా ,__!!
' శ్రీరామ భక్తుడు , తులసీదాసు_ దైవభక్తి పొందక ముందు __
అతడు తన భార్యను అమితంగా ప్రేమిస్తూ ,వచ్చాడు _!
ఒకరోజు భార్య తన తలిదండ్రులను చూసి రావడానికి , తన పుట్టింటికి వెళ్ళి పోయింది _!
తులసీదాసు ఆమె విరహాన్ని భరించలేక_ హద్దులు మీరిన వ్యామోహం తో _అదే అర్ధరాత్రి వేళ __ఉదృతంగా పారుతున్న ఏరు ను కూడా లెక్కచేయకుండా __ దాటి, ఆమె ఇల్లు చేరుకుంటాడు _
ఆ ఇంటి తలుపు గడియ పెట్టి ఉండడం తో _ఆ రాత్రి సమయంలో ,, గోడ దూకే ప్రయత్నం లో _దానికి వేలాడుతున్న ఒక " త్రాచు పాము "ను తాడు అనుకుని దాన్ని గట్టిగా పట్టుకుని__ పైకి పా కుతూ భార్య పడుకున్న గదికి చేరుకున్నాడు_!
_ నిద్ర పోతూ ఉన్న ఆమె కలవర పడుతూ ఉన్న ఆమెకు ,,అతడిపై విపరీతమైన కోపం వచ్చింది,_!!
అతడి దుస్సాహసం , పిచ్చి ప్రేమ , చూసి అంది _!
నాపై చూపిస్తున్న
ఇదే ప్రేమ ను నీ ఆరాధ్య దైవం అయిన ఆ శ్రీరామచంద్రుని పై చూపి నీ బ్రతుకును దిద్దు కోవచ్చు కదా _!
నలుగురూ ఏమనుకుంటారు అన్న మానం అభిమానం విడిచి పె ట్టి మూర్ఖుడవయ్యావు _!
ఇంత దుర్బలుడు ,మానసిక బలహీనుడు అయిన భర్త నాకు అవసరం లేదు _;
ఇక నీ ముఖం నాకు చూపించ కు_!
ఎక్కడికైనా వెళ్ళిపో ,_!మళ్లీ ఇటు వైపు రాకు _;
అంటూ దుఖిస్తూ అతడిని బయటకు నెట్టేసి తలుపు వేస్తుంది _!
ఆమె మాట తులసీ దా సు మనస్సు కు బాణం లా గుచ్చు కుంది ,_!
మారు మాట్లాడకుండా ,
"మౌనంగా ""వెనుదిరిగాడు _!
" కామి గాని వాడు_ మోక్ష కామి కాడు _!"
అని యోగి వేమన చెప్పినట్టుగా__
,నిస్పృహ ,నిరాశ లో ఉన్న
తన కామాన్ని ఇపుడు దైవానుగ్రహం వైపు మళ్ళించాడు ,_;
మౌనం లో చేసుకున్న ఆత్మ విచారణ _తులసీదాసు ను అపర రామ భక్తుని గా మార్చింది ,_!
నేరుగా అతడు కాశీ నగరం చేరుకొని _రామ నామం కోట్ల సంఖ్యలో జపిస్తూ _ శ్రీరామ చంద్ర ప్రభువు అనుగ్రహం పొంది , "శ్రీ రామ చరిత మానస అను అద్భుతమైన_ మహిమాన్విత మైన _ రామకావ్య రచన చేసి _, రామ భక్తి సామ్రాజ్యాన్ని ఇనుమడింప జేస్తూ , జీవన్ముక్తి ని పొందాడు _!
ఒక్క మౌనం మనిషి జీవిత గతిని మార్చేస్తుంది _ కదా
" మౌనం" అనేది గంభీరమైన మహా సాగరం __అనుకుంటే అందులో కదిలే ఆలోచనలు , సాగరాన్ని మథనం చేసే మేరు పర్వతం లాంటి ది _!
మనసు మంచిదైతే _ చిలికి నపుడు _ అమృతం లభిస్తుంది _!,
రాక్షస ప్రవృత్తి తో దుష్ట చతుష్టయం వలె మంతనాలు చిలికితే _ విషం పుడుతుంది _!
మహా భారత సంగ్రామం జరగడానికి మూల కారణం_" దృతరాష్ట్రుని మౌన మే ,కదా _!
__""మౌనం కలహ నాస్తి _! _!
అంటారు విజ్ఞులు _!
రెండు చేతులూ కలిస్తే నే కదా చప్పట్లు మృోగేది _!
ఒక చేయి మౌనంగా_ కదలకుండా ఉంటే _ రెండవ చేయి ఎంత కదిలినా _ఏం చేయగలదు
చెప్పండి _?"
( ఇంకా ఉంది )
స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"
Saturday, July 25, 2020
మౌనం అంటే _3
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment