Jul 24, 2020
" మౌనంగా ఉండటం అంటే మాట్లాడకుండా ఉండటం ,_!"
"మాట్లాడుతూ ఉంటే ఒకటి రెండు ఆలోచనలు వస్తాయి _!
_అదే నడుస్తూ ఉన్నపుడు కూడా ఆలోచనలు అంతగా రావు _!
కానీ నడిస్తుంటే మాత్రం వాని ధార వేగం తగ్గుతుంది_!
మనిషి ఆగితే ఆలోచనలు ప్రవాహం లా వెంబడిస్తూ ఉంటాయి _!
__అంటే మౌనంగా ఉండటం అనేది ఎంత భరింపరాని విషమ పరిస్థితి గా ఉంటుందో కరోనా పుట్టించిన ఈ ఉపద్రవం వలన మనకు ప్రత్యక్షంగా అనుభవ పూర్వకంగా తెలుస్తోంది _!
దయచేసి సమయం తీసుకొని అడగండి , మీరు నివసిస్తున్న నగరాల్లోని వీధులను , రాజధా ని రహదారుల ను ,గ్రామాలను __
ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అనీ _!?""
ఏటేటా మనం పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా మన పట్టణాలలో__ విధిగా నిర్వహించే _ బోనాల పండుగ , గణేష్ నవరాత్రులు , రంజాన్ , లాంటి పండుగ రోజుల్లో_ హోరెత్తిపోయె పాటలతో__ లక్షలాది జనాల కేరింతల తో రాత్రి అని తెలియకుండా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఉత్సవాల సందడి , హుషారు , ఆ జోరు , ఆ సంతోషం ,,ఏమైంది అని అడగండి _?
ఎందుకు ఈ మౌనం ,?ఒక నగరం కాదు
ఒక దేశం కాదు ,
ప్రపంచం మొత్తం రాత్రి వేళల్లో స్మశాన వాతావరణం లాంటి మౌనం ఎందుకు ? అని అడగండి ?
మీ వారు మీ వాడ వారు ఎవరైనా పోయారా ?
అందుకే మౌనం పాటిస్తూ ,,కన్నీటితో ,శ్రద్దాంజలి ఘటిస్తూ ఉన్నారా ?
అని అడగండి _??
కరోనా మృోగిస్తు వస్తున్న ఈ మరణ మృదంగం విషాదంతో. ప్రపంచంలో ని ప్రతీ నగరం గ్రామం. ఊరూ వాడా చిన్నబోయాయి _!
ప్రజలలో చైతన్యం_ ఉత్సాహం _ఆనందం కరువై ,జీవితం బరువై,_ఎవరి మొహాన కూడా నెత్తురు చుక్క లేకుండా , వెల వెల బోతున్నాయి కదా _!
దిన దినము ఈ నైరాశ్యం ,స్మశాన వైరాగ్యం పెరుగుతూ , బ్రతుకు పై తీపి తగ్గుతోంది _!
గతంలో, అర్ధ రాత్రి వేళ కూడా_ పబ్బులు _క్లబ్బు లు_ సినిమాలు , ఆఫీస్ లు ,బస్సులు ఆటోలు ,విమానాలు ఎంతో రద్దీగా , బిజీ బిజీ గా తినడానికి ,పడుకోడానికి టైమ్ లేకుండ ఉరుకులతో పరుగులతో జీవితం గడిచింది _!
,ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి వక్కడ మంత్రం వేసినట్టుగా స్తంభించి పోయాయి _!
మౌనం బ్రహ్మ రాక్ష సిలా _ ప్రపంచ వ్యాప్తంగా అంతటా రాజ్యమేలుతు వస్తోంది _!
నేటి జీవన విధానం _ ప్రస్తుత పరిస్తితి _ఎంత దారుణంగా మారింది _ అంటే
అనాథ అనేవాడు గతంలో ,, నా అన్నవారు , ఎవరూ లేని వాడు అనుకునే వాళ్ళం _!
కానీ,
ఇప్పుడు ఆ నిర్వచనం మారింది _!
ఎవరికి కరోనా సోకితే ,,వారు అన్ని ఉండి కూడా " అనాథ "లు అవుతున్నారు _!
అంతే కాదు_!
సంఘం వారిని
వెలి వేయడం తో బాటు , ఓటరు జాబితా నుండి ,బహిష్కరణ చేస్తూ వస్తోంది కూడా_;
కరోనా తో బాధ పడేవా రి వద్దకు రావడానికి , డాక్టర్ కానీ ,పోలీస్ , సిస్టర్స్,, ఒప్పుకోవడం లేదు _!
కనీసం సానుభూతి చూపించి ,కన్నీటితో సాగనంపే భార్యా పిల్లలు బంధువులు స్నేహితులు కూడా చివరి చూపుకు కూడా నోచుకోకుండా దూరంగా ఉంటున్నారు ,_!
మృత్యు దేవతను చూస్తున్నంత భయంతో జంకుతున్నారు _;
బ్రతికి ఉండగా నే కన్నీటితో_ టా టా బై బై లు వీడ్కోలు చెబుతూ ఉన్నారు __!
ఎంత దీనంగా , మారిపోయింది
ఉన్నతమైన మానవ జన్మ ఎత్తిన జీవుడి అవస్థ _! పరమ దౌర్భాగ్య స్థితిలో అయోమయంలో భయాందోళన లో పడి దిక్కు తోచక ఉన్న మన సమాజ వ్యవస్థ __! హుందాగా దర్జాగా జల్సాగా ఉన్న కోట్లకు పడగె త్తి న ,మనిషి బ్రతుకు నేడు సత్య హరిశ్చంద్ర సినిమాలో స్మశాన వాటిక లో పాడిన పద్య సారాంశం లా నికృష్ఠమైన గతి దాపురించింది కదా _!
ఎన్ని బంగళాలు ,_ ఎంత మంది బంధువులు _,ఎంత బంగారం _అస్తి పాస్తులు _ ఎంత బ్యాంక్ బ్యాలన్స్ లు_ ఉంటే మాత్రం _ఏం లాభం చెప్పండి _? _,సమయానికి అవి తనకు అక్కరకు రాకుండా పోతే _!
ఆదరణకు నోచుకోకుండా పోతే _!"
ఇప్పుడు కరోనా నివారణ అనేది సామాజిక బాధ్యత అయ్యింది _!
చుట్టూ తిరిగే మన వారిలో కరోనా దొంగ ఎవరో ఎలా కనిపెట్టే ది ??"
__అందరూ చిత్తశుద్దితో కలిసి_ ఉద్యమం లా చేపట్టి _ స్వచ్చందంగా ,తమ ఇంటినుం డే కట్టుబాటు వ్యవస్థ ను , కొనసాగిస్తూ వస్తేనే తప్ప
__ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కునే వీలు లేదు_!
మాస్క్ లు ధరిస్తూ,సామాజిక దూరం పాటిస్తూ, ఇల్లూ ఒళ్లూ పరిసరాలు శుభ్రంగా ఉంచుతూ , అప్రమత్త గా ఉంటే తప్ప
మరో మందు మాకు పరిష్కారం కనుచూపు మేరలో లేదు _!;
అలాంటి సామాజిక దృక్పథం రానంతవరకు._ కరోనా మారణ హోమం ఆగదు_!
అర్థం లేని ఈ మౌన పోరాటం కు అంతు ఉండదు _!
ఎప్పుడూ ,ఎక్కడ ఏం జరుగుతుందో , చాప కింద నీరులా కరోనా వ్యాప్తి జరుగుతోంది _!
__ , ఎంతో మంది _కరోనా చేతిలో బలి పశువు అవుతున్న దౌర్భాగ్య దుస్తితి __
నీ వరకూ రాకుండా జాగ్రత్తలు తీసుకో _!
కనపడని దొంగను పట్టాలి_ __అంటే అది నీ వల్ల కాదు _! నీవు దానిని చూడలేవు _!
నీకు కనపడ కుండా మౌనంగా ఈ చోద్యం చూస్తూ ఉన్న , ఆ భగవంతుడు ఒక్కడే __ఈ కరోనా ఆటను కట్టడి చేయగల సమర్థుడు _!
"అడగందే అమ్మైనా అన్నం పెట్టదు _!అంటారు కదా _!
అందుకే కంటికి అగుపడని భగవంతుడిని._ కళ్ళలో నింపుకొని ,మనసులో పెట్టుకొని ,గుండెల్లో దాచుకుని ,ఆర్తితో ,ఆవేదనతో ప్రార్థించడం ఇప్పుడైనా నేర్చుకో_!
ఎప్పటికైనా ఈ శరణాగతి చేయక
తప్పదు కదా _!
ఇది నీకోసం మాత్రమే కాదు _!
సకల జనుల సంక్షేమం కోసం ,_!
""సర్వే జనాః సుఖినోభవంతు ,_!""
అంటూ మనసుతో వేడుకోవాలి _!
మరణ సదృశ మైన ఈ కరోనా మహమ్మారి ""మౌనంగా"" కొన సాగిస్తున్న _ఈ హింసా పూరిత జన సంక్షోభాన్ని నియంత్రించ మని __ ఇప్పుడైనా దైవాన్ని కోరుకోవాలి కదా _!
నెత్తురు చుక్క కారకుండా _ కత్తి కటారు లేకుండా ,,మానసిక వేదనతో బాటు , శారీరిక బాధలతో నరక యాతన కు గురిచేస్తూ __ దొంగ దెబ్బ తీస్తూ ,, లక్షలాది జనాలని నిర్దాక్షిణ్యంగా చంపేస్తోంది ఈ రాక్షసి _!
కరోనా బాధితులకు నిరంతరం , త్యాగ భావంతో , వారికి సేవచేస్తు వారు కూడా__ క్షత గాత్రులు అవుతున్నారు కదా _!
ఇక కరోనా తో మరణించిన వారి పరిస్తితి మహా ఘోరంగా తయారైంది _! , ఇలాంటి పైశాచిక కృత్యం , బహుశా ఎక్కడా వినలేదు_! చూడలేదు_! జరగలేదు కూడా _!
శ వాన్ని బయట పడేయడానికి కూడా ఒక్క మనిషి కూడా ముందుకు రావడం లేదు _!
అందరికీ ప్రాణ భయం_;
పోయిన వాడు ఎలాగూ రాడు__!
"నేనెందుకు వాడితో చావ డానికి పోవాలి ,_!"
అన్న స్వార్థం _! బ్రతుకు పై తీపి __మమకారం _!
"తనకు మాలిన ధర్మం లేదు _!
అంటే ఇదేనేమో కదా _!
,_అందుకే విజ్ఞులు ఎవరూ నోరెత్త డం లేదు ,_!
"అపరాధి "వలె "_నేరస్తుల వలె _ చేతులు కట్టుకొని మౌనంగా ,శ్రద్దాంజలి ఘటిస్తూ ఉంటున్నారు_!
అంతా మౌనం _!
సమస్య మౌనంగా పెరుగుతూ వస్తోంది _!
పరిష్కారం కూడా చేతకాక _ మౌనంగా ఉంటోంది _!
కరోనా వ్యాధి రాకుండా
ఆధ్యాత్మిక చింతన_ అలవాటు చేసుకుంటే మంచిది_; _!
ప్రస్తుతానికి ఇదే పరిష్కారం _!
మనః శాంతి లభిస్తుంది
_!అంటే
మౌనమే శరణ్యం ,_!
మౌనమే దిక్కు _!
మౌనమే మానవత్వం _!
మౌనమే దైవత్వం _!
మౌనమే పరమానందం _!
మౌనమే సర్వ జన సమ్మతం _!
మౌనమే సచ్చిదానంద స్వరూపం _!
మౌనమే జీవాత్మ_!
మౌనమే పరమాత్మ _!
మౌనంగా సంచరించే పంచ భూతాల సాక్షిగా ,__
మౌనంగా ఉంటూ చుట్టూ జరుగుతున్న పరిణామాలను సాక్షిగా గమనిస్తూ _మౌనంగా నిన్ను నడిపించే
కర్మ సాక్షి ని ,__ ప్రత్యక్ష పరమాత్ముని గా భావిస్తూ__ ఆత్మార్పణ గావిస్తూ , ఆత్మ సాక్షిగా ,శరణాగతి చేస్తూ ఉండాలి _!
""ఈ కరోనా సమస్య , మాది కాదు స్వామీ _!"
కరోనా సమస్య నీది _!
పరిష్కారం చేసే బాధ్యత కూడా నీదే _నీదే _నీదే _!
ముమ్మాటికీ నీదే ప్రభూ_!
హే పరమేశ్వరా _;
హే దీన బాందవా_!
హే ఆపద్బాంధ వా_!
శరణు_ శరణు _శరణు_!
____ (ఇంకా ఉంది )
___ స్వస్తి _ !"
హరే కృష్ణ హరే కృష్ణా _!
((ఇంకా ఉంది )
హరే కృష్ణ హరే కృష్ణా _!
No comments:
Post a Comment