Jul 27, 2020
""అక్కా అక్కా ,_!""
""ఎవరు ,!? ఎవరా పిలిచింది _?
"నేను అక్కా _!నీ తమ్ముడి ని _!"'
తమ్ముడా_? , నాకా ,_? ఎవరూ లే రే_?
_ఇదిగో _!ఇక్కడ అమ్మ కడుపులో నుండి నిన్ను పిలుస్తున్నా ,_!" ఇటు చూడు అక్కా _!""
ఏమిటి మా అమ్మ కడుపులో నుండా_?
నీకు మాటలు వచ్చా _?
_"ఏమో_? నాకు తెలియదు_! , ఈ మాటలు ఏమిటో _నేను ఎక్కడ ఉన్నానో _?"
_" చిత్రం గా ఉంది ,_! ఇదేమిటి _? అమ్మ కడుపులో నుండి బయటికి వచ్చాక _రెండేళ్లకు కూడా రాని మాటలు__ నీకు అప్పుడే ఎలా వస్తున్నాయి ?_"
_అదంతా నాకు తెలియదు గానీ _అక్కా _ నాకంటే ముందు నీవు వచ్చావు కదా _బయటకు,_!
అక్కడ ఎలా ఉంది_?,నాకు చెప్పవూ_?
_తమ్ముడూ _! ముందు ఇది చెప్పు__ నీకెలా ఉంది _? అమ్మ కడుపులో ఉంటే _?
"అమ్మో_! ఎం చెప్పను_ అక్కా ,_!; అంతా అయోమయం ,_! గందరగోళం_! భయానకం _!, ఎటు చూసినా చీకటి,_! అంతా దుర్వాసన , ఎదో చిక్కగా ఏదో తగుల్తూ ఉంటుంది _! నన్ను చుట్టుకుంటూ ఉంటుంది _! భరించలేని వాసన ,దుర్గంధం _! శత్రువు కు కూడా ఈ అవస్త రావద్దు _! మహా ఘోరంగా ఉంది అక్కా_! ,ఎప్పుడూ బయట పడదామా_! అనిపిస్తూ ఉంటుంది _!, ఈ నరక కూపం లో నుండి_!
చీ చీ నా మల మూత్ర ముల లోనే తేలుతూ మునుగుతు , , అక్కా _!
చెప్పలేని బాధ _! _;
_! అలాగా తమ్ముడూ _!అంత కష్టంగా ఉంటుందా ,?!"
"కష్టం _" అని మెల్లిగా అంటున్నావా అక్కా_! , ""గర్భ నరకం ""అంటారు చూడూ , __ అదే ఇది _!_పాపం _!,నాకే ఇంత దురవస్థ గా ఉంటే ,_ఇక ,అమ్మ నన్ను మోస్తూ , పనిచేస్తూ ,నాకోసం తింటూ ,,నేను మెదులుతూ తన్నుతు ఉంటే ,ఎలా భరిస్తూ ఉంటుందో_ కదా ! , ఆమె అవస్త తలచుకుంటే. నాకు బాధగా ఉంది అక్కా_!""
_అయినా _ కొత్తగా నీకు చెప్పేది ఏముంది _!నీవు కూడా ఈ అవస్త పడ్డావు కదా _!,నేను పడుతున్న బాధ నీకు కూడా తెలిసి ఉండాలి కదా _ అక్కా _!""
_"లేదు తమ్ముడూ _;! అమ్మ కడుపులో ఉండగా ఏం జరిగిందో గానీ నేను ,బయటకు వచ్చాక. మాత్రం__ ఏమీ జ్ఞాపకం లేదు , నాకు _!
ఈ చిత్రం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు సుమా_!""
"అక్కా , ఎలా ఉంటోంది నీకు అక్కడ ,_?!; నీకు సంతోషంగా ఉందా_?? ,చెప్పు _అక్కా _!""
_ తమ్ముడూ _;ఇక్కడ చాలా అందంగా_ ఆనందంగా_ ఉంటుంది_! ,మాటల్లో చెప్పలేం _; వస్తె నీకే తెలుస్తుంది _;"
_"" అందంగా"" అంటే_ ఏమిటో _ వివరంగా చెప్పు అక్కా_!""
"అందం "అంటే మనం చూసే ప్రతీ పదార్థము ,_ఇంకా _ఇంకా చూడాలని అనిపించేది _!
""అవునా _!అలాంటివి ఏమిటో _కొన్ని చెప్పు అక్కా__!"
"అబ్బో _;అనేకం ఉన్నాయి _! ఏం చెప్తాం _; ఎన్నని చెబుతాం _! అంతా కలిపి ప్రకృతి అంటారు_! తమ్ముడూ ఒక్క మాటలో చెప్పాలి అంతే ,
"అందం "అంటే అమ్మ ,_!"
అంతే _!""
_అక్కా _ఏమిటి _? మన అమ్మ అంత అందంగా ఉందా _?? నిజంగానా _!
""నీవు చూస్తావు గా _! ఎందుకు తొందర _!
_ అయితే "ఆనందం"" అంటే ఏమిటి అక్కా _??
ఆనందం అంటే , _అమ్మ నాకు పాలు ఇస్తూ ఉంటున్నా,_ గోరు ముద్దలు తినిపిస్తూ వున్నా _, లాలి పాట పాడి నా _, అమ్మ నవ్వినా __ఎత్తుకొని ముద్దాడిన __అమ్మ తన కళ్ళతో ప్రేమగా నన్ను చూస్తూ ఉన్నా__నా , బుగ్గలపై ప్రేమతో ముద్దు పెట్టుకున్నా__, స్నానం పోస్తూ ఉన్నా , __ , ఉయ్యాల జంపాల ఊపుతూ ఉన్నా , __ తన గుండెలకు దగ్గరగా నన్ను సుతారంగా హత్తుకుంటూ ఉన్నా ,__
ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేను రా నాన్నా_!!
" నేను పొందుతూ ఉంటున్న ఆ హాయి" నే "ఆనందం "అంటారు రా కన్నా ,_!""
__"అక్కా _!నీవు ఇలా చెబుతుంటే _నాకు ఎంతో సంతోషంగా ఉందే అక్కా_! నా బాధ లన్నీ మరిచి పోతున్నాను అక్కా _!""
_"" కాని _తమ్ముడూ _; నీకు ఒక నిజం చెప్పాలని ఉందిరా తమ్ముడూ _!"
__""ఏమిటి అక్కా_ అది_?? నీవు చెబుతూ ఉంటే_ నాకు ఇంకా వినాలి_! ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది అక్కా_!
నా ప్రియమైన _ తమ్ముడూ _!
"ఆనందం _అందం _!"ఇవి మనకి ఇవ్వడానికి _ నిరంతరం _అమ్మ ఎంత కష్టపడుతూ ఉంటుందో _నీకు తెలియదు గా _!,పాపం _! తనకి కంటి నిండా నిద్ర _ కడుపు నిండా తిండి _ తగిన విశ్రాంతి , ఉండవు_!! , సరికదా _!తాను ఎంత బాధ పడుతూ ఉన్న __బలహీనంగా ఉన్నా __ఎవరికి చెప్పుకో దు రా కన్నా_!
__""అవునా అక్కా __!"
_అంతేకాదు తమ్ముడూ _!;ఎన్ని చేదుమందులు తింటుంది _! ఎన్ని ,ఉపవాసాలు చేస్తుందీ _; ఎంత శ్రమ పడుతూ ఉంటుంది చెప్పలేను రా ,_! అమ్మను చూస్తుంటే నాకు ఏడుపు ఆగడం లేదు రా తమ్ముడూ ,__!!""
_ ఎడవకు అక్కా _!అలా నీవు అమ్మ కష్టం గురించి చెబుతూ ఉంటే _నిజంగా నాకూ దుఖం వస్తోంది సుమా _!""
" ఒక నిజం తెలుసుకో తమ్ముడూ _!అమ్మ ఒడిలో ఉన్నంత వరకే _మనకు అందం _ఆనందం._; మనం పెరిగి పెద్దయ్యాక_ క్రమంగా అమ్మ ఒడి దూరం అవుతుంటే __ఇక మనం పడే _బాధలు _కష్టాలు_ బాధ్యతలు _బరువులు_ కన్నీళ్లు _అన్నీ క్రమంగా ఎక్కువ అవుతుంటాయి తమ్ముడూ_!""
""అక్కా ,ఏమిటీ _??ఇక్కడే అనుకుంటే __అక్కడ కూడా ఉంటాయా బాధలు అక్కా _?!""
" అయ్యో _!తమ్ముడూ_! అమ్మ కడుపులో ఉండేది మనం తొమ్మిది నెలలు మాత్రమే _!!
__ కానీ ఇక్కడ భూమిపై పడ్డాక _ ఏదైతే" అందం_ ఆనందం _""అనుకుంటూ ఉన్నామో __దాని వెనక కష్టాల కడగండ్లు కూడా దాగి ఉంటాయి రా తమ్ముడూ__!""
_""అక్కా _;ఇదంతా నీకెలా తెలుసు __!నీవు చిన్న పాపవే కదా __!""
__" తమ్ముడూ _! మన అమ్మ దగ్గరికి వచ్చే పోయే వాళ్ళను నేను గమనిస్తూ ఉన్నాను _!
వారంతా ,ఏడుస్తూ విచారిస్తూ _ బాధ పడుతూ __ఏదో పోయిందని __ఎవరో పోయారని __ జరగ రానిది. ఎదో జరిగింది __!"అనీ ఎప్పుడూ _ విచారంగా _విషాదంగా తమ గోడును అమ్మ తో చెబుతూ వెళ్ళ బోసుకుంటూ చెబుతూ ఉంటారు,_! అది నాకు కొంత తెలుస్తూ ఉంటుంది _;""తమ్ముడూ _!""
_""అక్కా అక్కడ అంతా ""అందం _ఆనందం_"" గా ఉంది అన్నావు కదా __!_ మరి మళ్లీ ఇదేమిటి అక్కా_?! వాళ్ళ ఈ ఏడుపు అంతా దేనికోసం అంటావు _??" _
__"అదే నాకూ అర్థం కావడం లేదు_ తమ్ముడూ _! నాకైతే _అమ్మ ప్రేమలో తప్ప _అందం _ఆనందం మరెక్కడా కనిపించడం లేదు ,_!;
_సరే గానీ తమ్ముడూ_; నీవు ఎక్కడి నుండి వచ్చావు __? ఎవరు నీవు _?, గతం ఏమైనా నీకు జ్ఞాపకం ఉంటే చెప్పు _!
_ ఇక్కడి విషయాలు _ఎలాగూ నీవు బయటకు వస్తావు గా _అప్పుడు నీకే తెలుస్తుంది __!ఈ అనంతమైన సృష్టి విశ్వం , చీమ_ దోమ _మనిషి _సకల ప్రాణులు _ ఇదంతా స్వయంగా నీవే తెలుసుకుంటా వు కదా ,__!
_ తమ్ముడూ_! ఈ ధరిత్రి అందాల గురించి మాటల్లో చెప్పలేం ,_; అనుభవిస్తూ ఆనందం పొందాలి గానీ _!!" ఇక , నీ కథ వినాలని ఉంది చెప్పు _ తమ్ముడూ _;""
_ అక్కా _ నాకు లీలగా కొంత తెలుస్తూ ఉంది_!, ఏ జన్మ నో_ ఏ పుణ్యమో__ ఏ మాయ నో_ ఏమిటో నాకు
తెలియ డం లేదు గానీ __ అక్కా _; భగవంతుని అనుగ్రహం వల్ల ఈ మాత్రం జ్ఞానం నాకు లభిస్తూ ఉంది _;
నేను ఎక్కడ ఉన్నానో ,_ ఎంత బాధలో ఉన్నానో __ ఎందుకు ఈ మానవ జన్మ వస్తోందో__ కొంత తెలుస్తూ ఉంది అక్కా_!""
__గతంలో కూడా నేను మనిషిగా పుట్టాను , అని తెలుస్తోంది _! అప్పుడు కూడా పాప పుణ్యాల కర్మలు చేశాను __;
__ అంత్య కాలంలో భగవన్నామ స్మరణ చేస్తూ శ్వాస విడవడం వల్ల __ ఇదిగో __ఇ లాంటి సంప్రదాయ కుటుంబంలో కి భగవంతుడు నన్ను పంపిస్తూ ఉన్నాడని
తెలుస్తూ ఉంది _;_!
_ ఈ కర్మల లెక్కలు ఏమిటో _ నాకు తెలియదు కానీ అక్కా __ఈ విధంగా ఇలా గర్భ నరకం అనుభవిస్తూ __ పోతూ ఉంటే _ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో __ ఊహిస్తే నే నాకు భయం భయం గా ఉంది అక్కా__;""
__ అందుకే ఓ దైవమా_!!. నా మీద దయ ఉంచు_! మరల మరల జన్మ లేకుండా __నన్ను దయ చూడు _!, అని ఆవేదనతో _ ఆర్తితో_ ఆ పరాత్పరుని ప్రార్థిస్తూ నే ఉన్నాను _;!"
_""అక్కా__! నాకు తెలుసు నీ చుట్టూ ఉన్న ప్రపంచం _!!", నీకు తెలియదు __; నీవు చిన్న పిల్ల వి ,_!! ఇంకా అజ్ఞానం లో ఉన్నావు _!"",
__"నీకు నేనొక బ్రహ్మ రహస్యం చెబుతాను .__ జాగ్రత్తగా విను _ అక్కా _!'
_" నేను ఇపుడు ఉన్నది , ఈ ,మాంసం ముద్ద లాంటి ""మావి ""అనే తొడుగు సంచీలో ,_!;
""అమ్మ నాభి నుండి _ ఆహారం_ నీరు నా పొత్తి కడుపు కున్న నాభి గొట్టం ద్వారా నాకు అందుతూ ఉన్నాయి _;
ఈ మావి లో నేను విడుస్తూ ఉన్న మల మూత్ర ముల లోనే నేను కదులుతూ_ నా జీవన చర్యలు దుర్వాసన భరీస్తు క్షణం ఒక యుగం లా _ రోజులు లెక్కపెట్టుకుంటు గడుపుతూ ఉన్నాను ,_!
__సర్వ ప్రాణులు కూడా తల్లీ గర్భం లో_ ఇలా అండం నుండి పిండం ఆకారం ఏర్పడే వరకూ_ ఉంటూ ఈ దురవస్థ పడాల్సిందే కదా అక్కా _!""
అంతే కాదు_!
ఈ దశలో _ ప్రతీ ప్రాణికి_ గత జన్మ గురించిన జ్ఞానం కొంత ఉంటుంది , _! ఎవరూ కూడా ఇలా జన్మ పరంపర లో చిక్కుకొని ఉండాలని _ కావాలని కోరుకోరు కదా_!"
__""కానీ అక్కా _తప్పదు_ ఈ భ్రమణం _!
ఎంత కాలమో _తెలియదు_?
చిత్రం ఏమిటంటే , _మాతృ గర్భం నుంచి
బయటకు వచ్చాక__ మనం ఇదంతా మరచి పోతూ ఉంటాం _;;
భగవంతుడు విధించిన కర్మలు అనుభవిస్తూ కూడా __ ఇదంతా అతడి మాయా ప్రభావం అని_ తెలుసుకోలేని దయనీయ స్థితిలో పడిపోతూ__ సంసార కూపంలో మునిగి__ కర్తవ్యం మరచి ,_ కర్మలు చేస్తూ ఉంటాం _!
అజ్ఞానం అవిద్య ,అహంకారం తో ఉత్కృష్టమైన మానవ జన్మ ను వ్యర్ధం చేస్తూ ఉంటాం_!
అక్కా , _!
నీవు చెప్పింది నిజం ,_!
అమ్మను మించిన దైవం లేదు ,_!
అమ్మ ప్రేమను మించిన ఆనందం లేదు _!
"కష్టం "అనేది పరమ పవిత్రమైన అమ్మ ప్రేమకు దూరం అయినప్పుడే , అనుభవానికి వస్తుంది _!;
దేవత లాంటి ఈ అమ్మను ఇచ్చింది ,అమృతమైన ఆమె దయ ప్రేమ అనురాగం మనకు అందించింది ఆ దయామయు డే కదా _!!"",
__" అక్కా ,ఇదంతా ఆ జగన్నాథుడు ఆడిస్తూ ఉన్న ఒక వింత నాటకం _!""
_"అక్కా_! మన అమ్మ చేస్తున్న పూజ ,__ లో లోపల చేస్తున్న శ్రీ మాత్రే నమః అనే నామ జపం __,నాకు ఎంతో ఆనందాన్ని శక్తిని చైతన్యాన్ని కలిగిస్తూ ఉంది __!
అంతేకాదు _ అక్కా _!
__ దీనికోసం ఆ ""అమ్మలగన్న యమ్మ ""ను అనునిత్యం స్మరిస్తూ ,,పుట్టబోయే తన సంతానానికి జగన్మాత పై భక్తి భావ సంపద ను రంగరించి పోస్తున్న ఇలాంటి అమ్మ కడుపులో మళ్లీ మళ్లీ జన్మించా లి అని నాకు __!" అనిపిస్తూ ఉంటోంది అక్కా_;!
మనం ఎంత పుణ్యం చేసుకున్నా మో_ కానీ _"",ఇంత మంచి పుణ్యాత్ము ల ఇంటిలో జన్మిస్తూ ఉన్నందుకు _ గర్వంగా సంతోషంగా ఉంది సుమా _!!
"" ఓ పరందామా _; , నిన్ను నిరంతరం ఇలా _తలచే_ కొలిచే __సేవించి_ తరించే _ఈ తలిదండ్రుల వలె ___మాకు కూడా _నీ పరమ పావన చరణ కమలాల పై మాకు భక్తిశ్రద్ధలు కుదిరే లా__ మమ్మల్ని అనుగ్రహించు_ తండ్రీ _!""
హే పరమాత్మా_!""
హే ఆర్తజన శరణ్యా _!"
అంటూ మనం ఎప్పుడూ శరణాగతి చేస్తూ ఉండాలి ._ అక్కా _!"
ఆ హరి నామ రూప ధ్యాన గాన స్మరణ భావన తప్ప __మన జీవాత్మ ఉద్దరింపబడటానికి _
మరో వేరే దారి లేదు కదా
అక్కా_;""
వింటున్నావా __లేదా _??""
_ గుర్తు వినిపిస్తూ ఉంది _! అయ్యో_!
నిద్ర పోయావా _!
అవునులే ,_!
అమ్మ అనురాగ పొత్తిళ్ళలో పడుకున్న బిడ్డకు _, అమ్మ పాడే జోల పాట కు లాలన కు __ నిద్ర రాకుండా ఉంటుందా _!""
ఆహా _! ఏ స్వర్గ సౌఖ్యాలు కూడా అమ్మ ఒడికి సాటి రావు కదా _!""
_ బహుశా ""బ్రహ్మానందం"" అంటే ఇదే కాబోలు , _!;
_" నిజంగా ఆ భగవంతుడు ఎంత దయామయుడు ?? అక్కా _;""
స్వయంగా _ ఇలా "అమ్మ"" రూపంలో వచ్చి చిన్నారి పాపలకు _ఆలన పాలన _ తన ప్రేమానురాగాలు కురిపిస్తూ_ వాటితో మురి పిస్తు_ అందని స్వర్గ సుఖాలను మనకు అందిస్తూ ఉన్నాడు కదా _!
__""జీవాత్మ _పరమాత్మ" అనుసంధానం అంటే , ఇదే కదా _!""
__ తన సంతానాన్ని తన ఒడిలో ఆప్యాయంగా పొదుగు కోని __ అమృత తుల్యం అయిన తన చనుబాలను ఇస్తూ ఉంటే__ అప్పుడు _ ఆమె బిడ్డ అనుభవించే. ఆ మధురానుభూతి. __
యశోదా మాత పొత్తిళ్ళలో హాయిగా శయనించి ఆమె చను పాలను త్రాగుతూ _ ఉంటున్న _ సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడు _ గోపాల కృష్ణ భగవానుడు _ పొందిన పరమానందం కంటే_ మన అమ్మ వద్ద మనం పొందే అనందం __ తక్కువేమీ కాదు కదా _!
" ఆహా _!
అమ్మా_!_; నీకు శతకోటి ప్రణామాలు__ సమర్పిస్తున్నాను_;
అమ్మా _!అమ్మా _!అమ్మా_;"_!"
అంటూ భావిస్తూ ఉంటే_ ఆహా _; నాకు కూడా ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటోంది _ సుమా _!!
నా
బాధలన్నీ మరచి పోతూ _ క్రమంగా సుషుప్తి అవస్థ లోకి జారి పోతున్నాను సుమా అమ్మా _!
_"ఏ ప్రాణీ కైన ,,ఎన్ని జన్మ లె త్తినా తీర్చుకోలేనిది అమూల్యమైన __ నీ , ఈ మాతృ ఋణమే కదా _
అమ్మా __;_;
నీవు దన్యు రాలివి తల్లీ _!
ఏ ఆనందాన్ని ఆశించి_ సృష్టి లో సకల ప్రాణులు జన్నిస్తూ ఉంటు న్నాయో __ఆ ఆత్మానందం నీ సాన్నిధ్యం లో ప్రాప్తిస్తుంది కదా _! అమ్మా _!
అటువంటి మాతృ మూర్తి వైన "తల్లీ _!
నీకు మనసా_ వచసా _శిరసా వందనాలు_! _!
స్వీకరించు __!
అమ్మా__!
_" ఎదో ఒక రకంగా _నిన్ను సేవించు కోవడం కంటే మించిన మహా భాగ్యం_ పృత్విలో మరెక్కడా లేదు కదా _!
అందుకే
మాతృదేవోభవ_! పితృదేవోభవ_! ఆచార్యదేవోభవ_!
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా_!
Thursday, August 13, 2020
అక్కా అక్కా
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment