Saturday, July 25, 2020

క్షమా భిక్ష "_5

Jul 12, 2020
  ప్రసిద్ది గాంచిన పండరి క్షేత్రంలో , _పుండరీకుడు__ పాండు రంగని ,,పరమ భక్తుడు,_!
   అచంచలమైన భక్తి శ్రద్ధలతో,అతడు ,పాండురంగ  భగవానుని దర్శనం చేసుకొని   _జీవన్ముక్తి ని పొందిన వాడు ,_!
  ఈ  మహా భాగ్యం పొందడానికి ముందు ,అతడు మహా పాప కర్మలు చేశాడు _!
తలి దండ్రులను నిర్లక్ష్యం , చేసి , ఇంట్లోంచి వెళ్లగొట్టడం ,దైవ దూషణ చేయడం, దేవతా మూర్తుల పూజ మానడం , దురలవాట్ల తో  వేశ్యా లోలుడై , మహాత్ములను  కూడా  అవమానించినందుకు , శాపం పొంది  వికలాంగుడు గా   ఘోరంగా శిక్షింప  బడ్డా డు,
_ దానితో పశ్చాతాపం పొంది  ,
ప్రత్యక్ష దైవాలు అయిన తలిదండ్రుల అనుగ్రహాన్ని క్షమా భిక్ష ద్వారా పొంది , ధన్యుడు అయ్యాడు_!
ఆ విధంగా ,  మనసులో పరివర్తన చెంది ,చేసిన తప్పులు మళ్లీ చేయకుండా , ఉంటూ ,సద్బుద్దితో సన్మార్గంలో నడిచేందుకు సంకల్పించిన వారికి
క్షమా భిక్ష ను అనుగ్రహించడం
  మనిషిలో దైవాన్ని దర్శించడం అవుతుంది _!
    ఇంద్రుని  కొడుకు ,జయంతుడు అనే వాడు __అహంకారంతో  ,, కాకి రూపంలో వనవాసం చేస్తున్న  సీతమ్మ ను బాధ పెట్టాడు
  ,రాముడు కోపంతో విడిచిన బ్రహ్మాస్త్రం లాంటి గడ్డి పోచనుండి తప్పించుకోలేక,,వాడు ,_ పాపం  త్రిభువనాలు తిరిగి ,  తప్పించుకునే  దారి లేక  ,__చివరకు రాముని పాదాల పై పడి _అపరాధాన్ని మన్నించమని , శ్రీ రాముని  క్షమా భిక్ష కోరాడు_!
   రాముడు కరుణించి ,,శరణాగత వత్సలుడు కనుక విడిచి పెట్టాడు _
,
తప్పులు చేయ ని వాడు భూమిపై ఉండడు,_!
"మనిషి ""అంటేనే " తప్పుల తడక, ""_!_
పాప పుణ్యాల పుట్ట _!"
మంచి చెడుల కలయిక _!!
పుడుతూనే ఎవరూ పూర్తిగా మంచి,__లేదా పూర్తిగా  చెడు గా పుట్టరు,_!
అలా ఎవరూ ఉండరు కూడా,_!
  వారిలో ఉండే మంచి,చెడుల స్వభావాలు ,వారు ఉండే సంఘం ,పరిస్థితులు , చదువూ,సంస్కారం ,పెంపకం ,,  వాటిపై ఆధారపడి ఉంటాయి ,_!
వారి కర్మలు అనుసరించి ,అవి బయట పడుతాయి_!
కొందరి అపరాధాలు క్షమింపబ డవు_!
ద్రౌపది వస్త్రాహరణం విషయంలో , ప్రేక్షక పాత్ర వహించిన భీష్మ ద్రోణ కృపాచార్యుు లతో బాటు  అధర్మం పక్షం వహించిన ఏ ఒక్కరినీ ప్రాణాలతో వదలి పెట్టలేదు శ్రీకృష్ణుడు_!
క్షమాపణ కు నోచుకోని పాప కర్మలు , దైవానుగ్రహం కు నోచుకోలేరు _!
   అలాంటివారు క్షమాభిక్ష కు యోగ్యు లు కారు కూడా ,_!
  __ ఆడపిల్లలను అత్యాచారం చేసి, అంతటి తో ఆగకుండా , చంపేస్తు పట్టువడి  కూడా _ఉరిశిక్ష విధింపబడిన రౌడీ మూకలు , రాక్షసులు కూడా_ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ ఉంటారు_!
   వారికి తమ  ప్రవర్తన లో మార్పు వచ్చి పశ్చాత్తాపం తో కుమిలి పోతూ , చేసిన తప్పు ను గుర్తిం చినా కూడా  క్షమా భిక్ష ఇస్తే తప్పు అవుతుంది ,
ఆ దుర్మార్గుడి కబంధ హస్తాల లో నలిగిన అమాయక ఆడపడుచు ల  ప్రాణం తిరిగి రాదు కదా _!

కానీ, దుర్యోధనుడు లాంటి స్వార్థ పిశాచి కి_ అహంకార స్వాభావికి  శ్రీకృష్ణుడు  _"మరణాన్ని" భిక్షగ ఇవ్వడం లో  ఏ మాత్రం తప్పు లేదు   _!
_
పరమాత్ముని ప్రసాదంగా భావిస్తూ మహాత్ములకు  సమర్పించే భిక్ష తో _ ,సకల శుభాలు , పాప కర్మలు పరిహారం కావడమే కాకుండా ,మోక్షం లభించి తరిస్తారు ,_!
ఒక నాడు ,,
జగద్గురువు శంకరాచార్యులు గారు ,ఒక పేద రాలి ఇంటిముందు నిలబడి" భిక్షాం దేహి"" అని అర్తించాడు _!
ఆ పిలుపు వినగానే ,, ఆమెకు  చాలా బాధ కలిగింది_!
    అద్భుతమైన తేజస్సు తో వెలిగి పోతూ. తన ఇంటి ముంగిట కనిపించిన ._ ఆ బాల బ్రహ్మచారికి  భిక్ష గా  ఇవ్వడానికి ,, తన ఇంట్లో ఒక్క ధాన్యపు గింజకూడా లేదు,_!
అంత పేదరికంలో ఉంది ఆమె జీవితం _!
, ఏం చెయ్యాలో పాలుపోక _ చేతికి దొరికిన  ఒక ఉసిరి కాయ ను తెచ్చి_ ఆయన భిక్షా పాత్రలో వేసింది_ ఆమె !
  ఆమె దీనావస్థను శంకరులు అర్థం చేసుకున్నారు ,_
బదులుగా తన పుణ్యాన్ని కూడా  ఆమెకు దారవోసి_",కనకధారా స్తోత్రం  _"తో   _మహాలక్ష్మి మాతను   స్తుతిస్తూ_ , సంతోష పరచి,_ ఆ పేదరాలి ఇంటిలో _ కనక పు నాణేల"" వర్షాన్ని కనక ధార గా  కురిపించాడు. ,
దానితో ఆ పేదరాలి పేదరికం _,మరియు సమస్త కర్మలు  శాశ్వతంగా తొలగి పోయింది,_!
అందుకే , వేద మూర్తులు ,పండితులు ,,పురాణ ప్రవచన వక్తలు ,,మహాత్ములు ,సాధువులు ,, పెద్దవారు,, వృద్ద దంపతులు , దీక్షా పరులను,గృహస్తులు తమ గృహానికి  ఆహ్వానిస్తూ , ఉంటారు _!
వారి పాద ధూళి తమ ఇంటిలో సోకెందుకు,,వారికి భిక్షను సమర్పించేందుకు , భక్తులు  తహ తహ
లాడుతు ఉంటారు _!
ఎందుకంటే అలాంటి
భక్తుల ద్వారా భగవంతుడు తన అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటాడు _!
   పవిత్ర భావనతో ,, పవిత్ర జీవన విధానం తో సంపాదించిన _పవిత్ర ధనాన్ని లేదా ధాన్యాన్ని_ భూమిని  దానం చేయడం వల్ల దాతకు  ,అమోఘమైన  ఫలాలు కలుగుతాయి,_!
బిచ్చ గాడి ని పరమాత్మ స్వరూపంగా చూసే భావ సంపద వల్ల  _   పరమా ద్భుత మైన  లక్ష్మీ కటాక్షానికి  నోచుకుంటారు ,
దానం వల్ల యశస్సు_ తేజస్సు _కీర్తి _జీవన్ముక్తి ప్రాప్తిస్తాయి_!
      ( సశేషం )
     స్వస్తి _!"
    హరే కృష్ణ హరే కృష్ణా _!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...