Saturday, July 25, 2020

భిక్షాం దేహి_!""_6

Jul 15, 2020
ఇతరులకు ఏదైనా  దాన రూపంలో ఇవ్వగలిగే సదవకాశాన్ని   , భగవంతుడు ఒక్క మానవ ప్రాణులకు మాత్రమే అనుగ్రహించాడు,_!
  అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించు కోని వాడు నిజంగా మూర్ఖుడు అవుతాడు_;
,,"భిక్ష  "అనేది తన  ఇంటిముందుకు ఎవరో అతిథి  గా ,లేదా బిచ్చ గాడు గా  వస్తేనే గానీ  దానం చేసే ఆహార పదార్థాలు . మాత్రమే కాదు_!
నిత్యం మన ఇంటిలో  రెండు పూటలా చేసే ""భోజనం ""కూడా  పరమాత్ముడు దయతో మనకు  ప్రసాదించిన భిక్ష యే,_! కదా _!""
తన  భార్య   శుచిగా ,దైవ స్మరణ చేస్తూ వండి_ ఆ ఆహార పదార్థాలు_ దేవునికి ఆరగింపు చేసి_నైవేద్యం  పెట్టి, నపుడు
అది  "ప్రసాదం ,'అనగా పరమాత్ముడు దయతో అందించిన" భిక్ష  "అవుతోంది _!!
ఆ భిక్ష ను ,ఆమె   ఎంతో  ప్రేమానురాగాలతో  భర్తకు పిల్లలకు కుటుంబానికి  ప్రతి రోజూ,పద్ధతిగా.  వడ్డిస్తూ ఉంటుంది  ,_! కదా _!
ఆ  కుటుంబ సభ్యులు కూడా అదే  కృతజ్ఞతా భావంతో , దైవ నామ స్మరణ చేస్తూ , తాము  తినే  అన్నానికి  నమస్కారం చేస్తూ , "గోవిందా గోవింద__!" అంటూ  అనుకుంటూ మాట్లాడకుండా భోజనం చేయాలి_!
, అప్పుడు , వారికి  పరమాత్ముని అనుగ్రహం లభిస్తూ ఉంటుంది _!
భగవంతుడు ,భావంలో ఉంటాడు , బాహ్యం లో  ఉండడు _కదా _!"
ఎవరైనా  భక్తులు _తిరుమల నుండి లడ్డూ ప్రసాదా న్ని  తెచ్చి  మనకు  ఇస్తే __ దాన్ని ఎంతో భక్తితో , తిరుమల కోవెలలో ,వెంకన్న స్వామి దర్శనం తర్వాత , బయట కౌంటర్ వద్ద  తీసుకునే_ లడ్డూ ప్రసాదం వలె __మహా భాగ్యం గా  కళ్ళ కద్దు కుంటూ" గోవింద"" నామం అంటూ _ గ్రహిస్తూ ఉంటాం _!
కానీ,
ప్రతి రోజూ తమ ఇంటిలో చేస్తున్న  "భోజనాన్ని"" మాత్రం   అలా ""మహాప్రసాదం"" గా భావించక పోవడం ,  మనం రోజూ .  మన ఇంటిలో తెలిసి చేస్తున్న తప్పు అవుతుంది కదా _!
,భగవంతునికి నివేది స్తేనే అది భిక్ష ,లేదా ప్రసాదం అవుతుంది _!
లేదా జంతువులు తినే  ఆహారం అవుతుంది _!
_ అలాగే  రోజూ ,ఆహారం తినే సమయంలో , టీవీ చూడటం ,మాట్లాడటం ,   అన్నం వదిలేయడం ,లేదా పారేయడం ,, ఉప్పు లేదా కారం  ఎక్కువ అని కోపగించి , ప్లేట్ ముందు నుండి అలిగి వెళ్లిపోవడం , ,
ఎంగిలి చేస్తూ , చూచే వారికి అసహ్యంగా  అనిపించేలా ప్రవర్తించడం_-_ లాంటివి  నిజంగా  మహా అపరాదాలు _!
తెలిసి చేసినా,తెలియక చేసినా,తప్పు ,తప్పే అవుతుంది_ కదా _!
""అన్నం పరబ్రహ్మ స్వరూపం _!"" అంటుంది వేద మాత _!
అన్నం అంటే దేవుడు అనుగ్రహించిన దయా భిక్ష ,_!
,  ఈ ప్రసాదాన్ని అవమానిస్తే , సాక్షాత్తూ పరమేశ్వరునీ అవమానించిన ట్టే అవుతుంది కదా _;!
ప్రపంచంలో  తినడానికి తిండి  నోచుకోని అభాగ్యులు అనాధలు , నిరుపేదలు , మూగ జీవులు ,పశువులు ఎన్నో__ తినడానికి దొరక్క _ ఆకలికి తాళలేక మరణిస్తూ ఉన్నాయి,_!
పట్టెడన్నం దొరక్క ,జనాలు రోజుల తరబడి పస్తులు ఉంటున్నారు ,,_!
ఈ తిండి గడవకనే తమ స్వంత ఊళ్లు విడిచి బొంబాయి కువైట్, బెంగుళూర్  హైదరాబాద్ లాంటి నగరాలకు  బీహార్ , ఉత్తర్ ప్రదేశ్ లనుండి వేల మంది వలస కార్మికులు  పొట్ట చేత పట్టుకొని ,కుటుంబాల తో సహా,స్వంత గ్రామాలను విడిచి పెట్టీ , వచ్చేస్తూ ఉన్నారు_!
  ""అన్నమో రామచంద్రా_!" అని అలమటించే  అనాథలకు , నీ ఇంటిలో  ,లేదా విందుల్లో మిగిలిన  ఆహార పదార్థాలను అప్పగిస్తూ ఉంటే , నీకు పుణ్యం వస్తుంది_! వారికి  పోయె  ప్రాణం  నిలబడుతుంది కదా _!!
""ఏ పాటు అయినా_ సాపాటు కొరకే  కదా _!""అన్నట్టుగా
ఉన్నవాడు , లేనివాడు  బ్రతికేది   ఈ ఉప్పు కారం మెతుకుల కోసమే కదా  _!
అందుకే ,అన్నం ను నిర్లక్ష్యం చేసినా ,  వృధా గా పారేసిన, పుట్ట గతులు ఉండవు,_!
వచ్చే జన్మలో ఇదే తిండికి  నోచుకోకుండా _ అలమటిస్తూ చావాల్సి వస్తుంది , _!
"" దేవుడు ఎక్కడో లేడు,_! నీవు తినే ఒక్కొక్క అన్నం మెతుకులో  ఉంటాడు_!
అన్నం లేక పోతే ప్రాణం లేదు _!బ్రతుకే లేదు ,_!
ప్రాణుల మనుగడ లేదు _!
అందుకే మనిషై జన్మ ఎత్తినందుకు ,
తినే అన్నాన్ని   ,దేవుడు ఇచ్చిన భిక్ష గా దేహీ దేహీ అంటూ ప్రార్థిస్తూ  తింటూ ఉండాలి
నీకు ఉన్నంతలో   అన్న దానం చేస్తూ ఉండాలి
  నీవు తప్పు చేస్తే  దైవాన్ని క్షమా భిక్ష ప్రసాదించమని  ప్రార్థించాలి
ఎవరైనా  నీ పట్ల తప్పు చేసినట్టు  అనిపిస్తే ,వారికి క్షమా భిక్షను  అందించాలి
క్షమ కు మించిన  ధర్మం లేదు ,
        క్షమ యే మానవత్వం
క్షమయే దైవ గుణం
క్షమ యే దయా భిక్ష
    స్వస్తి _!
      హరే కృష్ణ హరే కృష్ణా _!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...