Saturday, July 25, 2020

మౌనం అంటే

Jul 22, 2020     
భగవద్గీత లో గీతాచార్యుడు  శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా

మనసే మిత్రుడు ,మనసే శత్రువు కూడా _
మనసు అంటే ఆలోచన లు
మౌనంగా ఉన్న కూడా  లోన తలచే చెడు ఆలోచనలు  మనిషిని  పాపాత్ముడు గా నూ ,మంచి ఆలోచనలు వస్తె పుణ్యాత్ముడు గా మారుతూ ఉంటాడు ,,
అందుకే మౌనంగా ఉండటం  ,అనేది తన చుట్టూ జరిగే పరిణామాల పై ఆధార పడి ఉంటుంది,,
దానికి అనుకూలంగా ఆలోచనలు కదులుతూ ఉంటాయి ,,
మౌనం ప్రశాంతత నూ ఇస్తుంది
ప్రళయాన్ని  తెలుస్తుంది ,
__మౌనంగా నే ఎదగ మనీ మొక్క నీకు చెబుతోంది ,
ఎదిగిన కొద్దీ ఒదగ మనీ అర్థ మందులో ఉంది ,_!""
   అన్నాడు సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారు ,
మౌనం అనేది మనస్సు యొక్క భాష ,_!
  మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం మాత్రమే అనుకుంటాం _! ,
మాటలు లేకున్నా. ఆలోచన పరంపర ను ఆపలేము కదా ,
_""మాట్లాడటం అనేది  వెండి_"" అయితే
"మౌనం అనేది బంగారం _!" అంటారు
   మౌనంగా ఉండటం ఎంత భయంకరమైన వ్యవస్థ నో అనుభవిస్తే తెలుస్తోంది
  ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకు విద్యార్థి ఏ సమాధానం ఇవ్వకుండా ,నిశ్శబ్దంగా ఉంటే ,ఉపాధ్యాయుడికి పిచ్చి కోపం వస్తుంది
,అలాగే ఎదుటివాడు వదురు తూ వుంటే , వినే వాడు ఏమీ మాట్లాడకుండా ఉంటే    ఇక జన్మలో వాడితో మాట్లాడకూడదు అనిపిస్తుంది
  భగవంతుడు  మనిషికి మాత్రమే ఇచ్చిన వరం  మాట్లాడటం _
ఎదుట కళ్ళ ముందు జరిగేది అన్యాయం అని తెలిసి కూడా ప్రతిఘటన చేయకుండా " మౌనం "గా ఉంటే కూడా నేరమే కదా _!
అన్యాయం చేసినవారే  కాదు. జరిగే ,అన్యాయం  చూసేవారు కూడా అంతే నేరం చేసినవారు అవుతున్నారు
  ద్రౌపది వస్త్రాపహరణం సమయం లో ,శక్తి ఉండి కూడా మౌనంగా ఉన్న  భీష్ముడు ద్రోణుడు లాంటి మహానుభావులు కూడా మహాభారత  సంగ్రామం లో నిర్దాక్షిణ్యంగా వధిం పబడ్డారు _!
 
   మూగ వాడు ఈ భాగ్యానికి నోచుకొరు కదా ,_! ఎల్లప్పుడూ మౌనంగానే ఉంటాడు _!
మాట్లాడేవా రి మధ్య మౌనంగా మూగవాడు గా ఉండడం ఎంత భయంక రంగా ఉంటుందో  అనుభవిస్తే తెలుస్తోంది
  మాట్లాడటం విలువ తెలియాలంటే  ఒకరోజు అంటే  24 గంటలు  ఎవరితో మాట్లాడకుండా ఉండాలి
అప్పుడు తెలుస్తుంది ,పాపం మూగవారి ఆవేదన  , దీనావ స్థ ,ఎంత భయంకరమైన వ్యవస్థ నో _!
     మాటలతో నే _మనిషి అసలు  వ్యక్తిత్వం బయటపడుతుంది ,_!
కొందరు నయవంచకులు ఉంటారు
తేనె పూసిన కత్తి వలె తియ్యగా మాట్లాడుతూ  వెనక వైపు గోతులు తీస్తూ ఉంటారు ,_!
  ఇలా మాటల తో ఎన్నో, ఇబ్బందులు _!
  నాలుక ను నియంత్రిస్తూ _ మెదడుకు  పదును పెట్టవచ్చును
   ఎక్కువ మాట్లాడితే
వదురుబోతు అంటారు
తక్కువ  మాట్లాడితే నంగనాచి అంటారు
మౌనంగా ఉంటే     అమాయకుడు అంటారు
  మొత్తానికి ,మాటతో నే శత్రువైన మిత్రువైన  మంచి చెడూ , అనేక వ్యవహారాలు ,లావాదేవీలు ఉంటాయి
   ఫోన్ లు ,మైక్ , స్పేకెర్  ఇవన్నీ మాటలతో కోటలు కట్టే  సాధనాలు _!
ఇక మౌనం అంటే ఏమిటి?""
అన్న విషయం చూద్దాం ,
  మహాత్మా గాంధీ గారు వారానికి ఒక రోజు మౌనంగా ఉండేవారు _!
అవసరం ఉంటే పలక పై రాసి చూపించే వాడు _!
మనసును నియంత్రిస్తూ ,ఆయన తన లక్ష్య సాధనలో  విజయం పొందాడు ,
ఋషులు మహా మునులు ,భక్తులు మౌనంగా ఉంటు తమ ఆలోచనలను కేవలం పరమాత్ముని పై సంధించి మోక్షాన్ని పొందారు
అందుకే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మనస్సును అదుపులో ఉంచుకుని, గమ్యం కేసి సాధన చేస్తూ వెళ్ళాలి
మౌనం ఒక తపస్సు ,
మౌనం ఒక దీక్ష
ఒక యజ్ఞం ,ఒక వ్రతం ,ఒక సాధనా యంత్రాంగం
మౌనంగా ఉండాలంటే జ్ఞానం ముఖ్యం ,
సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు ,జ్ఞానం తప్ప
అందుకే మరణా వస్త సమయంలో కూడా జ్ఞానాన్ని మరవకూడదు
జ్ఞానం ,అత్మ సాక్షాత్కారం వల్ల మాత్రమే ప్రాప్తిస్తుంది
ఆ  పరమాత్ముని సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం గురించిన జ్ఞాన సముపార్జన కొరకై   మన ఋషిగణం వేలాది సంవత్సరాలు మౌనంగా ఉంటూ ఘోర తపస్సు చేసి  మనకు స్మృతి శృతి పురాణాలు అనుగ్రహించారు ,
మౌనం లో మధురానుభూతి పొందవచ్చును
పరమాత్మను   తదేక ద్యానం తో ఆరాధిస్తూ  ,, ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా  ఒకే చోట కూర్చుండి  భువి నుండి దివికి  తప్పించుకునే అవకాశం ఈ మౌనం అనే అద్భుతమైన అమోఘమైన , పరమానంద కరమైన   సుషుప్తి అవస్థ లో ఉంటుంది _!
    మౌనం అర్థాంగీకారం గా సూచిస్తారు ,
అంటే   ఎదుటివాడు చెప్పిన దాన్ని సమర్థిస్తూ ఉన్నాడు అన్నమాట
  మౌనం తో విశిష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి ,,
ఋషులు మునులు తమ తపస్సు ను వేలాది సంవత్సరాలు మౌనంగా ఉంటూ చేశారు ,
  మనస్సును ఆత్మతో అనుసంధానం చేయాలంటే మౌనంగా ఉండడం తప్పని సరి,
   చెప్పేది ఒకటి ,చేసేది మరొకటి చేయడం అంటే మనసు అదుపులో ఉంచుకుని శక్తినీ కోల్పోయిన ట్టె కదా
  నిజానికి మౌనంగా ఉండటం అనేది చాలా కష్టమైన పని.
  యోగ విద్య నభ్యసించుటకు , మౌనం గా ఉండటం ప్రధానం
మాట్లాడ వద్దు , మనస్సును  ఎటూ పోనీయ వద్దు
మొదటిది  మొదట్లో ఇబ్బంది అనిపించినా , అలవాటు అయ్యాక ,,సాధన చేస్తూ,, మౌనంగా ఉండవచ్చును
కానీ మనసును   ఎటూ పోనీయకుండా ,ధ్యేయం వైపు మళ్ళించడం అనేది కష్ట తరమైన విషయం
  ,శ్వాస పీల్చడం ఒకటి రెండు నిముషాలు ఆపవచ్చు
కానీ మనసును చలించకుండా ఆపడం అనితర సాధ్యమైన విషయం  ,
   స్థిరంగా ఉండకుండా అనవరతం  చలించే దానినే మనసు అంటాము ,,
అసలు ఈ. మనసు అంటే ఏమిటీ  ? ఎలా ఉంటుంది ? ఎక్కడ ఉంటుంది ? దాని స్వరూపం ఏమిటీ !? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు _!
ఎందుకంటే,మనసు అనేదే లేదు ,  _!
  మనసుకు రూపం ఆలోచనలే ,
ఏ ఆలోచన చేస్తే మనసుకు ఆ రూపం వచ్చేస్తూ ఉంటుంది ,
అరటి పండు గురించి ఆలోచిస్తూ ఉంటే మనసుకు అరటి పండు ఆకారం అంటే స్వరూపం వస్తుంది
   ఎక్కడో అమెరికా లో ఉన్న  స్నేహితుడి గురించి ఆలోచిస్తూ ఉంటే మనసుకు అదే ఆకారం అదే స్వభావం గుణం ,  స్పందన ,కలుగుతూ ఉంటాయి కదా
  ,  అనగా మనసు ఎప్పుడూ మారుతూ ఉంటుంది ,
కోతిలా ఒక విషయం పై నుండి మరొక విషయం పైకి గెంతుతూ మారుతూ వుంటుంది ,
క్షణాల్లో రంగు రూపు ,స్వభావం , ప్రవృత్తి మారుతూ ఉంటాయి
     మనసు ను బట్టే మనిషి గుణం నడక స్వభావం ,వ్యక్తిత్వం   బయట పడుతూ ఉంటాయి
   అందరూ మనుషులే ,అందరికీ మనసు ఉంటుంది
ఏ మనిషీ ఎలాంటి వాడో తెలిపేది అతడి మనస్సే
అతడి మాట ను పలికిం చేది, పాటలు పాడించేది , పనులు చేయించేది ,నడక నేర్పేది ,, తెలివి తేటలు ప్రదర్శించే ది అంతా మనస్సు వల్లనే
నిజానికి మనస్సు  మహావిష్ణువు వలె విశ్వ రూపం దాలుస్తుంది
   వాయు వేగంతో ఎక్కడో ఉన్న బంధువు గురించి ,సెకండ్ల వ్యవధిలో  విచారం చేస్తుంది
   130 కోట్ల ప్రజానీకం భారతీయులు మన దేశంలో ఉన్నారు
  వారిలో ఉన్న మనసులు వేరు
అంటే   వారి ఆలోచనా విధానం వేరు
  ఒకే సినిమా ను ఒక వేయి మంది చూస్తూ వుంటే వేయి రకాల భిన్నమైన అభిప్రాయాలు ప్రకటిస్తూ ఉంటారు
  అంటే  ఆలోచన విధానం లో అన్ని తేడాలు ఉంటాయి  అన్నమాట  ,
  ఎందుకు ఇన్ని తేడాలు అంటే
ఒకే సమాధానం
వారి కర్మలు వేరు వేరు గ ఉంటున్నాయి
        ( సశేషం )
         స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...