Jul 19, 2020
" స్ఫురణ ఒక దైవిక శక్తి ,_!, అత్యవసర పరిస్థితుల్లో ,, అప్పటికప్పుే డు జ్ఞాపకం వచ్చి ,దానిని వినియోగించే సమయస్ఫూర్తి , శక్తిని "స్ఫురణ ",అంటాము __!
మహా భారత యుద్ధంలో ,,కర్ణుడు , అర్జునుడి తో అస్త్ర శస్త్రాలతో వీరోచితంగా యుద్దం చేస్తూ__, ఇక శక్తివంతమైన వారుణ ఆగ్నేయ అస్త్రాలను ప్రయోగించాలని ప్రయత్నిస్తే ,పాపం , వాటికి సంబంధించిన మంత్రాలు అతడికి స్ఫురించడం లేదు_!
దానితో దిగాలుపడి ,కర్ణుడు , తన రథ సారథి గా ఉన్న శ ల్యుని తో ఇలా అన్నాడు _!!
""మహా రథి శల్య మహారాజా _!, దివ్యాస్త్రాలు. నాకు అవి నా స్ఫురణ కు రావడం లేదు ,_!
అని _!!
బదులుగా శల్యుడు అంటాడు_!
"" కర్ణా _! స్ఫురణ అనేది దైవానుగ్రహం,_! ,అది కలగాలంటే దైవభక్తి ఉండాలి ,_!
నీకు దైవం పై విశ్వాసం కంటే , నీ ఆత్మ బలం పై నే. నీకు ఎక్కువగా విశ్వాసం ఉంటోంది ,_!
మనిషికి ఎన్ని అద్భుతమైన శక్తులు ఉన్నా_ అవి దైవబలం తోడు లేనిదే ఉపయోగించవు _!
అర్జునుడు నీ అంత పరాక్రమవంతుడు కాకపోవచ్చు _!
కానీ అతడికి దైవభక్తి మెండు _!
అందుకే శ్రీకృష్ణ భగవానుడు అతడికి అండ ఉన్నా డు _!
ఎవరిపై పరమాత్ముని అనుగ్రహం ఉంటుందో ,,వారికి స్ఫురణ శక్తి ,సమయస్ఫూర్తి , అణకువ వినయం ప్రాప్తిస్తాయి __!
"""కర్ణా _!, నీ పరాక్రమం పై నీకు అమితంగా గర్వం ఉంది _! ,
,అది పదిమందిలో ప్రదర్శించాలని నీకు ఆరాటం ఉంది _!
, నీ అంతటి వీరులు ఎవరూ లేరనే అహం తో ,,, ఆ గుర్తింపు కోసం__ నీవు పడరాని పాట్లు పడ్డావు__!
చెయ్యరాని తప్పుడు పనులు చేశావు _!
అర్జునుడి పై కక్ష సాధింపు కోసం , ఎంతటి అధర్మాని కైనా సాహసించావు __!
నీ శక్తి యుక్తులు ఆ పరాత్పరుని అనుగ్రహం అని నీవు ఎన్నడూ భావించలేదు , _!!
అస్త్ర శక్తి స్ఫురణ కు రావాలంటే ముందుగా దైవం పై అపార నమ్మకం ,గురువు అనుగ్రహం ఉండాలి ,_!!
ఇవి రెండూ నీవు కొలోయావు ,_!
ఇప్పుడు ఆ రెండూ అర్జునుడికి తోడు ఉంటూ విజయాన్ని చేకూరుస్తూ ఉన్నాయి__!
కర్ణా_! , నీ గురువు పరశురాముని నీవు మోసం చేశావు_! , ఈ అపరాధం తెలిసి చేశావు ,తెలియక కాదు కదా__!
మేటి దనుర్థారి కావాలన్న మహత్వ కాంక్ష , తో ,నీవు , ద్రౌపదీ వస్త్రాపహరణం లాంటి ఘోరాలు చేయడానికి. కూడా వెనుకాడలేదు __!
చేసింది అపరాధం _ అని తెలిసి కూడా పశ్చాత్తాపం పడటం ,క్షమాపణ చెప్పడం , అలాంటి తప్పు ఇకముందు చేయక పోవడం వలన ,,,, ఆలాంటి అధర్మాల ముందు __నీవు చేసిన దాన గుణ బలం వీగిపోయింది ,__!
""కర్ణా ,_!దైవబలం తోడయితే గానీ ,మానవ యత్నం ఫలించదు కదా _!
ఇపుడు ఆ దైవం ,సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు ,నీ ప్రత్యర్థి అర్జునుడికి రథ సారథి అయ్యాడు ,__!
నీవు పొందిన శాపాలు కూడా ,దైవబలం లోపించడం వల్లనే కదా_!!
ఇక జరిగిన దానికి చింతించడం మాని __,నీ అంతిమ సమయంలో నీకు ఎదురుగా నిలిచి అగుపిస్తున్న ఉన్న సాక్షాత్తూ పరబ్రహ్మం __ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దర్శిస్తూ , నీ మనస్సును అతడి పై నిలిపి ,, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని ఆనందించు ,__!
ఆ విధంగా ఈ జన్మ లో నీవు చేసిన పాపాలు అధర్మాల మాటలు చేతలు అన్నీ క్షాళన చేసుకో __! ఓ దాన వీర శూర కర్ణ ,__!
"" నీవు చేసుకున్న దాన పుణ్య ఫలం ,వల్ల నీ ఎదుటనే , భగవంతుని కళ్ళారా చూస్తూ అంతిమ శ్వాస విడిచే మహద్భాగ్యం నీకు శ్రీకృష్ణుడు నీకు అనుగ్ర హిస్తూ ఉన్నాడు!
కనీసం ,,ధర్మ బుద్ధితో ,,ఇపుడైన దైవాన్ని మనసారా దర్శించు,,_! తరించు_!
చేతికి అందివచ్చిన మహా భాగ్యాన్ని కనులారా చూస్తూ,, తనివా రా ఆనందంగా ఆస్వాదించి తరించు,_!
ఈశ్వర సాయుజ్యాన్ని పొందు _!,
నిజంగా "అదృష్టం" అంటే నీ దే కదా కర్ణ _! స్వయంగా పరందాము డే __ నిన్ను కరునించడానికి నిన్ను వెదక్కుంటు నీ చెంత నిలిచాడు ,_!
""యశస్వీ భవ _! ""
నీ రథ సారధి గా నన్ను కోరుకోని ,నాకు కూడా శ్రీకృష్ణ భగవాను ని ఎదురుగా సందర్శిస్తూ , ఆనందించే అవకాశం అందించావు కదా కర్ణ__!""
అందుకు నేను నీకు సర్వదా రుణపడి ఉంటాను __! అన్నాడు శల్యుడు ,___
ఈ శల్యుడు పాండవ పక్షపాతి __!,నకులునికి మేన మామ_!, మనసంతా పాండవులు గెలవాలని , ఉంది_!
కానీ పోరాడేది కౌరవుల పక్షాన _!"
__ యుద్ధంలో కర్ణుని నిరుత్సాహ పరుస్తూ _ పరాజితున్ని చేయడమే అతడి ఉద్దేశం__!
దీనినే శల్య సారధ్యము అంటారు ,__!
పాపం_!
ఉన్న శాపాలతో బాటు , ,కర్ణునికి ఇతడు కూడా కోరి తెచ్చిపెట్టుకున్న ఒక శాపం అయ్యాడు __!
శల్యుని కి తెలియని మరో రహస్యం కూడా కర్ణునికి మరో కొత్త శాపం అయ్యింది ,__!
అది పాండవులు తన సోదరులు అని అతడి తల్లీ కుంతీ దేవి ద్వారా తెలియడం ,_!
ఇపుడు కర్ణుడి వద్ద ఉన్న దివ్యాస్త్రాలు పనికి రాకుండా అయిపోయాయి _!
దైవ బలం లేదు _!
ఎదురుగా విజయ సారథి గా దివ్య మంగళ స్వరూప ము తో ,, కనిపిస్తున్న శ్రీకృష్ణుడు __కర్ణుడి పాలిట కాల యముడై , అర్జునుని పురికొల్పుతూ ఉన్నాడు __!
అర్జునుడికి దివ్యాస్త్రాల బలం , దైవ బలం_ రెండూ తోడుగా ఉండి అతడిని విజయుడు గా చేస్తున్నాయి __!
కర్ణుడికి కేవలం ఆత్మ విశ్వాసం , సహజమైన శౌర్య పరాక్రమాలు మాత్రమే తోడుగ ఉన్నాయి ,
అయితేనేం ,, సృష్టిలో. కర్ణుడి వంటి దనుర్ధారి గానీ __దానం లో మిన్న అనబడే వారుగాని లేరు __!
నిజానికి కర్ణుని జీవితం కడు దయనీయం __;
""నేను ఎవరు __?!,అన్న ప్రశ్నకు జవాబు __ అతడు మృత్యు వు ఒడిలోకి చేరుకునే సమయంలో కూడా చెప్పలేని దీన స్థితి అతడిది _!
, శస్త్రాస్త్రాల ప్రయోగ విధానం, గుర్తుకు రాకున్నా , తన పోరాటం రక్తం పంచుకు పుట్టిన సోదరుడితో అన్న ""స్ఫురణ __""మాత్రం ,, అతడిని వేధిస్తూ ఉంది _! అది ,అర్జునుడు సంధించని " శాప " బాణమై కర్ణుడి మృత్యువుకు బలీయమైన కారణం అయ్యింది కూడా _!;
మహా తేజస్వి _మహా దాత__ మహ వీరుడు,_ అద్భుతమైన ఆత్మ విశ్వాసం కలవాడు ,__తాను నమ్మిన సిద్ధాంతం పట్ల శ్రమించి ,,ఎవరేమన్నా లెక్కచేయకుండా ,తన పరాక్రమంతో ,విశిష్టమైన వ్యక్తిత్వ ము తో , అమరజీవి గా కీర్తి ప్రతిష్టలు స్వయంగా అర్జించుకు న్న మహోన్నత వ్యక్తిత్వం. ఈ కుంతీ పుత్రునిది_!!
రాధేయునిది ,__!
ఏది ఏమైనా
దానం చేయడం లో మాత్రం దాత లందరికీ
""స్ఫురణ"" కు వచ్చేది ,,,స్ఫూర్తిని కలిగించేది
దాన కర్ణుని ఉదార తయే కదా _!
మానవజాతి గర్వించదగిన ""ధీర చరిత"" అతడిది _!
"" ఎన్నో కష్టాలు__ శాపాలు ,విమర్శలు ,నిందలు ఎదురైనా కూడా ,,_అవమానాలకు కృంగకుండ, ,ప్రలోభాలకు లొంగకుండా , తాను పడే బాధ చెప్పుకునే దిక్కు కూడా లేకుండా బాధలు పడ్డాడు అతడు _!!
,,ఒక వీరుడు ,ఒక క్షత్రియుడు , తన ఆత్మా గౌరవాన్ని ,,ఆత్మాభిమానం ను కాపాడుకుంటూ అంత దీనంగా ,ఒక సూత పుత్రునిగా బ్రతకడం ఎంతో కష్టం !_!
అన్నీ ఉండి, అందరూ ఉండి, ఏ ఆదరణ కు నోచుకోని దురదృష్ట కరమైన బ్రతుకు కర్ణు డిది__!! _!
తన ప్రాణం కాపాడే రక్షణ కవచం లాంటి , సహజ కుండలాలను కూడా _. ,తృణప్రాయంగా భావించి_ దేవేంద్రుని కి ,ఉదారంగా దానం చేసిన ఆ మహానుభావుడు__ కర్ణుని గురించి ఎంత శ్లాఘిం చినా తక్కువే _!
కర్ణుడి గురించి బాధగా మనం
అనుకోవడమే కానీ ,_!
ఎవరు మాత్రం ఆ బాధలకు అతీతులు ??
ఎంతటి వారైనా , ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు కదా _!
విధి విధానమును తప్పించ ఎవరి వశము అవుతుంది ,చెప్పండి _??""
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!
,జై శ్రీకృష్ణ
జై. కర్ణ
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!
Saturday, July 25, 2020
స్ఫురణ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment