Jul 23, 2020
" నాకు భయం లేదు_" అంటూ ఇన్నాళ్లూ డాంబికాలు పలికిన ప్రతీ వాడికి ,ఇపుడు పుట్టింది కరోనా భయం _;!
""నేను నీ తాత కు_తండ్రికి ఆఖరికి
ఆ దేవుడికి కూడా భయ పడను _! అన్న వాడికే వణకు పుట్టించిన భయం _!
నన్ను చూస్తే భయాని కే భయం _!"
ఇదంతా మొన్నటి మాట _!"
ఇపుడు అంతా భయం మయమే_!
నిన్ను చూస్తే భయం _!
నన్ను నేను చూసుకుం టే భయం _!
మనిషిని మనిషి నమ్మలేని భయం _!
భర్తను భార్యను విడదీస్తున్న భయం _!
అనుమానం పెనుభూతం కాదు
అనుమానం మహమ్మారి కరోనా అన్న భయం _! _!
అందరికీ భయమే _;
ఏ వస్తువును ముట్టుకున్నా భయం _!
,లేదా పట్టుకుంటే భయం _! అసలు
వస్తువు ను చూస్తేనే భయం_!
వస్తువు ను బజారు నుండి తేవా లన్నా భయం _!
దాన్ని తాకాలన్నా భయం_!
బజార్ లో ఎవరిని చూసినా భయం _!
ఎక్కడికి వెళ్ళినా భయం _! ఏది కొన్నా, భయం _!"
ఇంటికి ఎవరు వచ్చినా భయం _!
దైర్యం చేసి మాస్క్ తీసి చూడాలంటే భయం _!
మాట్లాడితే భయం _!
మాస్క్ వేయక పోతే భయం _;
మాస్క్ తీయాలంటే భయం_!
గట్టిగా ఊపిరి పీల్చడం భయం _!
కూతురి పెండ్లి నిశ్చయం అయితే భయం _!
సంబంధం కోసం తిరగాలంటే భయం _!
రాత్రి మోషన్ అయితే భయం _!
డాక్టర్ వద్దకు వెళ్తే భయం
వెళ్లకుంటే భయం _;
టెస్ట్ లు చేసు కోవాలంటే భయం _!
చేసుకోకుం టే భయం _;
టీవీ లు చూస్తే భయం _!
డైలీ పేపర్ చూడ భయం _!
పెండ్లికి బంధువులను పిలవడం భయం _!
వారిలో ఎవరికి పాజిటివ్ ఉందో అని భయం _!
వచ్చిన వారిని పలకరించడం భయం _;
వారు పని అయ్యాక వెళ్లకపోతే భయం _!
పాపం అని పక్కిం టీకి వెళ్తే భయం _!
మామూలు జ్వరం వస్తె కూడా భయం _!
దగ్గు వస్తె భయం _!
ఎవరు దగ్గినా ,తుమ్మినా ,, వాంతి అయినా భయం _;
చేత కాక పోతే భయం _;
తల నొప్పి వస్తె కూడా భయం _;
బీపీ షుగర్ టెస్ట్ కోసం_ హాస్పిటల్ వెళ్తే భయం _;
కి రాణం కొనడం _భయం _!
కూరగాయలు తేవడం
భయం_;
పక్కింటి వాడు మాములుగా వృద్దాప్యం తో చనిపోయినా కూడా భయం _!
కరోనా తో చస్తే , ప్రేతాత్మ లకు కూడా భయమే _!
దగ్గరకు రావు ,రానీయవు కదా _!
శవాన్ని కాల్చాలంటే భయం ,_!
స్మశానం తీసుకెళ్లాలి అంటే భయం _!
దగ్గరి వారు దూరం ,
దూరం వారు దగ్గర అవుతుంటే భయం _!
శవం దగ్గరకు పోను భయం _!
చూడ భయం _!
మనసారా ఏడవడం కూడా భయమే _;
ఆత్మీయు లైనా_
కన్న వారైనా __
ఎవరైనా _
కరోనా సోకిందని తెలిస్తే చాలు __!
తిన భయం _;తాగ భయం _!
నిద్రపో ను భయం _!
తద్దినాలు పెట్టడం కూడా భయం_!
ఏ శుభ కార్యం తలపెట్టినా భయం _!
పట్ట పగలు,తన ఇంటి తలుపులు బిగించుకొని , ఎవరికి కనపడకుండా , దాక్కుంటూ , బిక్కు బిక్కు మంటూ , వెఱ్ఱి గా , గోడల వంక చూస్తూ బ్రతికే బతుకు చూస్తుంటే భయం _!
బాధ చెప్పుకునే దిక్కు లేదని భయం ,_!
ఫోన్ లు టాబ్ లు చూస్తుంటే భయం _!
చూడకుంటే భయం _!
అంతం లేని కరోనా చావులు చూస్తుంటే భయం_!
ఎక్కడో కాకుండా నీ ఊరిలో నీ నగరంలో నీ దేశంలో వేలల్లో చస్తున్న కరోనా వార్తలు వింటూ ఉంటే భయం _!
బ్రహ్మ వద్ద వరం అడిగి తెచ్చుకున్న దేమో _ఈ కరోనా __ దేనితో చావు లేకుండా _!
మందు లేకుండా _!
అన్న వార్తవింటుంటే భయం _!
ఏ ఛానల్ చూసినా , ఎవరి నోట విన్నా,, ఏ పేపర్ చూసినా , దేవుడి స్మరణ కాకుండా దిక్కుమాలిన కరోనా చావుల గురించిన నిజాల గురించి న భయం _;
కరోనా చావులకు దేశాలు ,పట్టణాలు పోటీ పడుతూ ఉంటే _ ఒంట్లో వణకు పుట్టించే ,భయం _!
, ఇండ్లు భవనాలు కట్టడం భయం _!
రెక్కాడితే డొక్కాడని పేద కూలీలను చూస్తుంటే భయం _!
ఏ పోలీస్ ను చూసినా_
ము న్సి పాలిటి పారిశుధ్య కార్మికులను చూసినా__
డాక్టర్ లను __సిస్టర్ లను చూసినా __భయం భయం _;
బస్సు ఎక్కడం భయం _!,ఆటో ఎక్కడం ఇంకా భయం _!
ఉన్న ఊరు విడిచి వెళ్ళడం భయం .._;
ఇంటి గడప దాటడం భయం _!
పిల్లలను బయట తింపడం భయం _;
శ్రావణ మాసంలో నోముల భయం _!
వ్రతాలు చేయటం భయం _;
పితృదేవతల ముక్తి కోసం తద్దినాలు పెట్టడం భయం_;
చచ్చిన వారికి కర్మలు చేయడం భయం _;
కరోనా తో చచ్చిన వాడి అంత్య క్రియలు చేయడం_ అమ్మో చాలా భయం_!
శ్రాద్ధ కర్మలు చేయడం భయం_!
ఒంటరిగా ఇంట్లో ఉంటే భయం _!
నాలుగు గోడల మధ్య వాటిని చూస్తు ఇలా ఇంకా ఎన్ని రోజులు , రోజులు గడపాలో కదా _! అని భయం _!
చిన్న పిల్లలు బయట కెళ్లకుండ ఇంటిలోనే బంజేరు దొడ్డి లో నెలల తరబడి , బందీలుగా ఉంచాలంటే భయం _!
వారిని అదుపు చేయాలంటే భయం _;
వారి ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే భయం _;
వారి తిండి భయం _!
వారి ఆరోగ్యం భయం_!
పెద్దవాళ్ళు ఉంటే చాలా భయం _!
వారి ఆరోగ్యం భయం_;
వారి సంరక్షణ ఇంకా భయం _;
కన్న పిల్లలు దూరం ఉంటే భయం _;
భార్య లేని భర్తకు భయం _!
భర్త లేని భార్యకు భయం _! ఒంటరి జీవితం భయం _!
బయట కు వెళ్లి సామాన్లు తెచ్చే దిక్కు లేకుండా పోతే ముసలి ప్రాణాలు బయటకు వెళ్లాలంటే భయం _!
వెళ్ళకుం డా ఉండాలంటే భయం _!
అందరూ ఉండి , ఎవరూ అక్కరకు రాకుండా పోతూ ఉన్న కరోనా మహమ్మారి విలయ తాండవం చూస్తుంటే భయం _!
అన్నీ ఉండి ఆదరణ మాటకు నోచని అనాథలకు భయం _!
ఇలా చెపుతూ పోతూ ఉంటే , రాయడానికి కాగితాలు చాలవేమో అని భయం _;
ప్రేమ కు ఆప్యాయతలకు ఆత్మీయతకు నోచుకోకుండా , దూరంగా విదేశాల్లో తల దాచుకుని__ ఉంటున్న తమ వారిని_ తల్చుకుం టూ ఉంటే దుఖం _ భయం _!
దిన దిన గండం
నూరేళ్ళ ఆయుస్సు వలె ,
రోజూ చస్తూ బ్రతుకుతూ గడుపుతూ ఉన్న ఈ యాంత్రిక జీవితా న్ని చూస్తే భయం _!
_"ఓ దేవుడా ,_; బ్రతికి ఉండగా నే మా బ్రతుకు ను భయంకరంగా మారుస్తూ ఉంటున్న నీవు_ ఎందుకు కరోనా ను పంపించావు మా పైకి _??""
, మా భయాన్ని పోగొట్టి
భయం నుండి విముక్తిని ప్రసాదించ లేవా _?
పరమాత్మా _!
జంతువులకు లేని ప్రాణ భయం ___!
మాకెందుకు కలిగించావూ
తండ్రి_??""
దయచేసి ఈ కరోనా పీ డ ను తొలగించి __ మా భయాన్ని పోగొట్టు ప్రభూ_!!'"
మా చేత కాదు స్వామీ_ కరోనా ఆగడాలు ఆపడం _!""
నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు _లేదు_ లేదు_!
అందుకే __
నీకు సాష్టాంగ ప్రణామం చేస్తూ వేడుకుంటూ ఉన్నాం_!""
హే పరాత్పర _!
దీన బాందవా ,_!"
తప్పులుంటే మన్నించి రక్షించు _!""
ఈ దీనులను __
నీ బిడ్డలను __
ఆర్తులను __
కాపాడు _ తండ్రి ,_!""
శరణు _!
హే భగవాన్ _!""
శరణు _!"
స్వస్తి_!"
హరే కృష్ణ హరే కృష్ణా _;""
,
No comments:
Post a Comment