Saturday, July 25, 2020

యశోదా మాత అంతరంగం

Jul 14, 2020
చిలిపి కృష్ణుని  అల్లరి భరించలేక ,కోపంతో ,తన గారాల కొడుకుని  పట్టుకోవాలని పట్టుదలగా పరుగెత్తి, అలసి పోయి,
ఇక చేతగాక  ,  బ్రతిమలా డుతు ఉన్న యశోదా మాత   అంతరంగం  ఈ మధుర గీతం _!
____&&_______
""ఎందుకురా కన్నయ్యా _!
నన్నిలా  తిప్పే వు,__?
నా తరమా నిన్ను పట్ట _!
నా వశ మా నిన్ను కట్ట _!
  పట్టరాని నిన్ను పట్టి
కట్టి వేసే దెలా కృష్ణా_?""
  
    !! ఎందుకురా !!

""గోపెమ్మ లు చూడు , వారు _
నన్ను చూసి నవుతున్నారు_!
పరుగు లాపి _నన్ను చూడు _!
అలసి సొలసి పోతున్నాను _!
  నా తండ్రీ,  బంగారు కొండా_!
వరాల మూట_ ఆగి పోరా_!
కన్నతల్లి పై  _ కన్నా
కరుణ చూపి పరుగాపరా_!
    !!ఎందుకురా !!

  వేదాలు కూడా నిన్ను_
  పట్టలేము అంటున్నాయి_!
ఋషులు కూడా తమకు  నీవు తెలియరా వు   అంటున్నారు _!
నీ లీల ల  తెలియ తరమా
  నీ మాయల
గెలువ తరమా_
పరుగు ఆపి ,వెనుక చూసి
  నా దరి జేర రావే లా _!
   .   !!ఎందుకురా !!

     కృష్ణా కృష్ణా  చిలిపి  కృష్ణా _!
నీ అల్లరిక  చాలించరా_!
ఎన్న లేని నీ ప్రేమామృత
ధార తో మము లాలించరా
నీ ముద్దు మోము చూ పి
నన్ను పరవశింప జేయుము రా
.      !!ఎందుకురా !!
  నా నోముల  ఫ లమా_!
ఈ నంద గోకుల  వరమా_!
నిన్ను చూడ వశమా_!
కొడుకు గ నిను పొందిన
నా పాలిటి భాగ్యమా _!
వెన్న దొంగ  ,నన్నిలా
వేదించుట   భావ్యమా __!??""
        !!ఎందుకురా !!

    
  నిన్ను పట్ట వశమా, కృష్ణ_!
నీ మాయను దాటకుండా_!
నిన్ను తెలియ తరమా _!
నల్లనయ్య_! ఆగవయ్య_!
పరుగు లింక ఆపవయ్య_!
నీతో పరుగెత్తలేని _
నిన్ను అందుకోలేని _
నీ తల్లి  వ్యథను గనర_!
   వేగ వచ్చి వెత దీర్చర _!!
     !!ఎందుకురా!!

  ముద్దు  లోలుకు నీ మోము  ను  _
చూడాలని ఉంది రా_!
నీ నవ్వులు  నా మదిలోన  నింపాలని ఉంది రా_!
నీ  చూపుల లో  హాయిని పొందాలని  ఉందిరా_!
తనివారా  ఒకసారి నిన్ను
హత్తుకోవాలని ఉంది రా _!

      !!ఎందుకురా!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...