Thursday, August 13, 2020

గోపీ లోలా, గోపాలా _2"

Aug 10, 2020
"గోపీ లోలా, గోపాలా _2"
____&&&_________
నేను కూడా  ఆ గోవిందుని  గురించి ఒకటి చెప్పాలి మీకు ,,__!
ఓ ధరణీ  _!!నన్ను కూడా గోపాలుడు  అలా దారిలో  మొన్నటి రోజున  అలానే అటకాయించాడు _!!"" 
__"అవునా   చారుల తా_ __?" ఏం చేశాడు_ ఆ దూర్త గోపాలుడు _ చెప్పు _చెప్పు__??""
      __ యమునా నదికి నీటికై వెళ్తుంటే  త్రోవలో  చెట్టు క్రింద దిగాలుగా  ఉంటే ,,
ఏమైంది కృష్ణా _?"
అని దగ్గరకు వెళ్లి చూశాను __   !  " అమ్మో ,ఈ కాలుకు నొప్పి గా ఉంది " __!""అన్నాడు
__""నిజమా  _?అది కూడా నాటకం మే నా__?""
__  మన అజ్ఞానం కాకపోతే __  మనకు న్న  సకల బాధలు ,,నొప్పులు,అవస్థలు  నివారించే  ఆ  కృష్ణ పరమాత్ముని  కి _ ఏ నొప్పి  వస్తుంది చెప్పు _!??""
  __"ఇంతకూ ఏం చేశాడే__ కృష్ణయ్యా __ ముందుఅది  చెప్పవే __??""
_ ఏం లేదు కొంచెం   వెన్న తీసి  రాయమని అన్నాడు __!'" అంతే __!""
__"రాశావా __?""
  _ రాశాను ,,  అయిపోయింది ,,నొప్పి మాయం అయ్యింది అన్నాడా __?""
  __"అన్నాడు__!"
నీవు  నీ  చేతితో ఇలా  తాకితే  చాలు హాయిగా ఉంటుంది అన్నాడా __??"'
  ""అవును ,_అదే మాట అన్నాడు _!!""
  _""కొంతసేపు నీ ఒడిలో పడుకొనా _?అన్నాడా __?""
   _"అలాగే అన్నాడు__!""
   _ కాస్తా నీ  పవిట కొంగు తో చల్లగా విస ర రాదా _??"" అన్నాడా _?
_"సరిగ్గా అదే జరిగింది __!"
అయినా ఇదంతా నీకెలా తెలుసే __??
  __" నాకే కాదు  _! వీరందర కూ   తెలుసు _!""
,_ అందరికీ తెలుసా __?? అమ్మో_!ఎలా తెలుసు__?  చాటు నుండి చూశారా  ఎమిటి __??"
_""ఆ అవసరమే లేదు సుశీ లా__!
_ మరి ఎలా తెలుసు మీకు__? ""
ఎలా అంటే కృష్ణయ్య __ కొందరి వాడు కాదు __!మన  అందరి వాడు కనుక__" _!
అవునా  అంటే ,మీరు  కూడా  నా లాగే  అలా __?"""
_" ఇదిగో _! మన ఈ అమాయక మే  మన పాలిట  ఒక  దివ్యమైన  వరం అయ్యింది __!"
_ అవును  రమ్య  __!కృష్ణుని విడిచి _ అతడిని మరచి _మనం ఎవరము  జీవించి ఉండలేము _ కదా ఇది వాస్తవం _!""
  __" అందరి "మనసులోని మాట చెప్పావే భాగ్య లక్ష్మి __!!'"
  __ ఈ భర్త _పిల్లలు_ అత్తా _మామ_ తల్లీ _తండ్రి_ బంధువులు  సంసారం _ఎన్ని లంపటాలు ఉన్నా , అన్నింటినీ మరపించే  ఆ ముగ్ద మోహన రూపం అను క్షణక్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది సుమా __!""
నిజమే , క్షణకాలం  కూడా  నీల మేఘ శ్యామ సుందరుని స్మరించుకుం డా మనం ఎవరమూ ఉండలేము  కదా _!!"
,__"" ఇది ఆ కొంటె , కృష్ణునికి కూడా  తెలుసు __!""
   _ఆ  కాళీ య మర్ధనుడు, మొన్న కూడా  నాతో ఇదే మాట  అన్నాడు__!
""నాతో  కూడా అన్నాడు_!"
""మాధవీ_! నీవే నా ప్రాణం అనీ__
నాతో అన్నాడు_!" గోవిందుడు __!""
  _ కాత్యాయనీ ,,నాతో కూడా  అదే  మాట అన్నా డే _!""
   __"మనమంతా ఈ   నంద వ్రజంలో కృష్ణయ్య కోసమే  జన్మించాము ,,_!!"
  _"అతడే మన పాలిట ఇలవేలుపు_!,ఇష్ట దైవం _!, 
కృష్ణుడే తల్లీ దండ్రి__! బంధువు _గురువూ_ కర్తా_ భర్తా _హర్తా _! మన సర్వస్వము  నంద గోపాలు డే _!
అతడే జీవాధారం ,!,ప్రాణాధారం !,భుక్తి ,ముక్తి అతడే   కదా నందినీ __!""
  నిజమే కావేరి  _! , శ్రీకృష్ణుని సన్నిధానం, మన పాలిట పరం ధామం __!"
_""వాసవీ,__! "" కృష్ణ సాయుజ్యం ""అంటే__  కృష్ణ చింతనతో __ కృష్ణ రూపంలో కలిసి పోతూ _ ఈ తనువూ మనసూ_ మరచి __ అతడిలో లీనం కావడమే కదా __!""
   భక్తి అంటే ఏమిటో నాకు తెలియదు కానీ ,, ఓ  సునయ నా __!  ""కృష్ణ సామీప్య ము"" అంటే __ బృందావనం లో__ ఆ  యమునా నది తీరంలో,__చల్లని పరిమళ యుత _ మలయ పవన వీచికలలో __ ఆ రాధా కృష్ణుని సమీపంలో __ అతడి సమ్మోహన కరమైన __ దివ్య మంగళ స్వరూపాన్ని కన్నార్పకుండా   కనులారా చూస్తూ  __ మనసారా ఆనందిస్తూ___""నేనే అతడు ,_!, ఆత డే నేను_!""  అని భావిస్తూ _అనుభవించే  అద్భుత అలౌకిక మధురానుభూతి    యే కదా మన పాలిట భూతల స్వర్గం__!""
   __"అంతేకాదు గౌతమీ,__!!
కృష్ణసారూప్యం  అంటే ఏమిటో కూడా   విను __!!""మనం ఆ  శ్రీకృష్ణ  పరందా ము ని  అనుగ్రహం తో  __అతడికి మనపై గల అవ్యాజమైన ప్రేమానురాా గా లతో  __మనకు ఈ అద్భుత  భావ సంపద  ప్రాప్తిస్తు ఉంది ,__!"
"" నేను కృష్ణుడను _!,కృష్ణుడే నేను _!, నేను కూడా  అతడి వలె నెమలి పించాన్ని ,ధరిస్తాను_! తన వలె  వేణువు వెంట ఉంచేస్తాను__! , కస్తూరీ తిలకం,ముక్కుకు మౌక్తి కం ,మెడలో కౌస్తుభం, చెవులకు స్వర్ణ కుండలాలు ,పాదాలకు మంజీరా లు , నడుముకి పీతాంబర ము  ఇవన్నీ ధరిస్తూ.  అచ్చం  నేను కృష్ణుడిలా నే  , ఉంటాను __!!"
""భావంలో __బాహ్యంలో   ఎప్పుడూ "  కృష్ణుడే నేను"" అవుతాను __!
   ,""కృష్ణసారూప్యత__" అంటే ఇదే కదా __! కృష్ణానుభవం తో పొందే  బ్రహ్మానందం  స్థితి  కదా ,_!!""
  _ మాధవీ ,, __ఎన్ని చేసినా _మనం ఎవరమూ_ఆ  రాధా రాణీ వలె మాత్రం  ఆరాధించ లేము కదా_!"
   నిజమే _!రాధా రాణీ మనపాలిట దేవత ,ఆమె అనుగ్రహం వల్లనే కదా కృష్ణుడు   పరమానంద ము కలుగజేస్తు   మనకు చేరువగా ఉంటున్నాడు __!
మనలో  అహంకారం చోటు చేసుకోవచ్చు ,, కానీ,రాధారాణి  కి కృష్ణుని పట్ల గల  అత్మ సమర్పణ భావం ,  అసామాన్యం ,అమోఘం కూడా _!!""
   __పావనీ మన ఈ  నంద వ్రజస్త్రీల్లు   దైవంగా భావించే __ఈ నంద గోపాలుడు , ఇతరులకు  మాత్రం మామూలు  గొల్ల పిల్లవాడు గా అగుపిస్తూ ఉంటాడు  ఎందుకు ?""
   __కృష్ణుని అనుగ్రహం  మనపై ఉంది కాబట్టి __
నిర్మలమైన మన చిత్తం  నిరంతరం  ఆ గోపాలుని స్మరిస్తూ ఉంటుంది కాబట్టి _ మనలో ఈర్ష్య కోపం  అహంకారం , లాంటివి  లేవు కాబట్టి , పల్లెలో ఉన్నా , విద్యా బుద్దులు లేకున్నా ,పాపం పుణ్యం, ,జ్ఞానం తెలియకున్నా , మనమంటే నంద కిషోరునికి ప్రేమ ,ప్రాణం ,ఇష్టం కూడా _! మనం పుట్టింది ,పెరిగింది , ఆఖరు శ్వాస విడవడం కూడా ఈ  కృష్ణ ప్రేమలోనే , _!
_ ఇక చాలు __ ఇక మాట్లాడకండి ,,_ అదిగో   ,,అటు చూడండి _! ఆ  చప్పుడు వినండి ,__!
__అవునవును ,మనం మాటల్లో పడి కన్నయ్య మాటే మరచి పోయాం కదా__!"
_ అలా   చూడండి,,బీనా  పావని,, మాధవీ__ వాణి, శ్యామల , , పద్మా ,_ కృష్ణ వేణి _ ఆ కృష్ణుని ,అతడి స్నేహితులని చూడండి __! మన వెన్నకుండ లను  ఒక్కొక్కటి  తీసుకొని    కలిసి పంచుకుంటూ తింటూ ఉన్నారు__!
"'__ ఆ మూలన కిటికీ లో నుండి చూడండి__! __వెన్న దొంగ ,కృష్ణయ్య__గోపాలుర వీపు ల మీదికి ఎక్కి_ _ఉట్టి మీది కుండలు __ ఒక్కొక్కటి,మెల్లిగా ,చప్పుడు కాకుండా__ ఎలా దించేస్తు ఉన్నాడో ,,చూస్తున్నారా _??""
""ఏం చేద్దాం_?   వెళ్ళి పట్టే ద్దామా __?""
     __"మనకు ఈ అల్లరి జిత్తుల మారి కృష్ణుడు దొరికేనా    _?
__" ఎన్నిసార్లు ప్రయత్నించాం  చెప్పు _?"ఈ   నంద గోపాలు డిని __ వెన్న దొంగ తనం చేస్తుండగా పట్టుకోడానికి __??""  అమ్మో __! ఇది  మన వల్ల అయ్యే పని కాదు __!
  ,చివరకు యశోదమ్మ తో మనకు చీవాట్లు తప్ప _
    _""ఎందుకే __పాపం_! మన  కృష్ణయ్యను  గురించి అతడి తల్లి  వద్ద చాడీలు చెప్పడం __!""
  _"తప్పు కదా  ? మనకి ఇష్టమైన కృష్ణునిపై ___,మనల్ని అమితంగా ప్రేమించే కృష్ణుని పై ఇలా నిందలు వేయ బూన డం__. మనకిది తగునా ,,? చెప్పండి ??_""
"వద్దు _!వద్దు _! చెప్పిన చాడీలు ఇక చాలు ,__!
__అయినా__ మనం కోరుకున్న ఈ  ఆనందాన్ని , కృష్ణుడు    మహా భాగ్యం గా __మనకు నిరంతరం  ఆత్మానుభూతి తో  ప్రసాదిస్తూ ఉండగా , ఎందుకే , మనకు ,, ఈ అగచాట్లు ఇవన్నీ  __!!" దేని కోసం చెప్పు __?" కృష్ణుని పై మనకున్న   ప్రేమ    వల్లనే కదా _!"
_ నిజమే నే     కనక దుర్గా ,_!
_"" కృష్ణార్ప నమ్ _"" అంటూ ఆరగింపు చేసి నైవేద్యం పె ట్టి__ _""సమర్పయామి "అంటూ మన  చిన్ని కృష్ణ స్వామికి  అర్పించాము కదా _!
   ఆ వెన్న దొంగ చేస్తున్న_  వెన్న విందు భోజనం దృశ్యాన్ని. చూస్తూ _ మనసారా ఆనందిస్తూ   ఉండండి _!
  ఈ కమనీయ రమణీ యంగా _ అత్యంత మనోహరంగా_
పరమాద్భుతంగా.   మనకు  అ గు పించే  ఈ  దృశ్యకావ్యం_ ఆహా _! మహిమాన్విత ము_! అపురూపం _! వేల ఏళ్ళు తపస్సు చేసే మునులు ,ఋషులకు కూడా దుర్లభమైన ఈ పరమానందాన్ని మనకు అనుగ్రహించాడు  మన కృష్ణయ్య _!
ఆహా ,,ఇంతకన్నా ఆనందం ఉండదు కదా , శైలజా __!"
  దేవతలు కూడా నోచుకోని ఈ  కృష్ణ లీలల  దర్శనా భాగ్యం   కనులారా చూస్తూ ,మనసారా ఆస్వాదించి __ఆనందించు దాం _!
   మన  గోపస్త్రీలకు మాత్రమే __ తన ఈ అపార కరుణా కటాక్షాలు ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉన్న__ ఆ  చిన్ని కృష్ణుని లేలేత సుకుమార పాదారవిం దములకు భక్తితో   ప్రణ మిల్లుదా ము రండి_!"
మన ఆరాధ్య దైవానికి శతకోటి ప్రణామాలు_ సమర్పిం చుదాం ,,రండి_! _!""
శ్రీకృష్ణా_! శరణం మమ
__!"
"సర్వం శ్రీ కృష్ణార్పన మస్తు _! _!"స్వస్తి _!"
       హరే కృష్ణ హరే కృష్ణా_!" _!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...