Thursday, August 13, 2020

పార్థివ శివ లింగ మా_!

Aug 10, 2020
పార్థివ శివ లింగ మా_!
ప్రదోష సమయ దైవమా_!
ప్రార్థించే ఆర్తుల పాలిట_
పావన దివ్య ఔషద మా_!

పార్థివ శివ లింగ మా_!
పరమేశ్వర తేజమా _!
పాపములను పరిహరించు_
పార్వతి పతి రూప మా _!"

"పంకాజాసన వాసవాదులు_
ప్రస్తుతించు ప్రతాపమా _!
పరమ యోగులు చేరగ గోరు_
పరబ్రహ్మ స్వరూప మా _!

పాపపు పనులెన్నో చేసి_
పాపి కరోనా బారిన పడి_
పరితపించు ఈ దీనుల _
పరిరక్షించే ఆధార మా _!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...