Thursday, August 13, 2020

గోపీలోలా_ గోపాలా_1

Aug 9, 2020
"గోపీలోలా_  గోపాలా_1___!"
____&_________
"" ఓ విశా ఖా _! మరి కొంత సేపు  , నాతో నీవు ఉంటావా__?  ఎందుకంటే _  ఆ తుంటరి కృష్ణుడు  ఈ వెన్న కోసం__ ఏ వైపునుండి వస్తాడో  _ రాడో,కాస్తా  చూడాలి కదా_!""
_"" ఉంటాను గానీ ,నళినీ , నల్లనయ్య  నిజంగా వస్తా డంటావా   *_?""
"" అయ్యో ,పద్మినీ__! అతడు  రాకుండా ఉంటాడా ,,చెప్పు _?  ,"కృష్ణార్పనం " అని నివేదన చేశాక __!"
__"నిజమే అనుకో ,, అయినా _!'
ఆ అనుమానమే వద్దు నీకు ,_!
_,"" ఓహో ,మాధవీ _!,నీవు  _ అబ్బో _ఎంత పెద్ద కుండ నిండా తెచ్చావే వెన్న ?  "
  __    శ్రీ దేవీ ,,_! మన చిన్ని కృష్ణుని కోసం  ఎంత గా శ్రమించి నా కూడా   అలసట రాదు , _! పైగా అది   ఏ మాత్రం శ్రమ  అనిపించ దు కదా   పావ నీ _!'
  "అవునులే _!ఇష్టం తో చేస్తున్న  ఏ పని  కూడా  కష్టంగా  అనిపించదు కదా  అక్కా  _!"
  _"_ఒకవేళ మనం అనుకున్నట్టుగా  నల్లనయ్య రాకుంటే  ఇన్ని  వెన్న కుండలు  ఏం చేద్దామే
మాలతీ__?"
  __""ఆ బాధ   మనకు అవసరం లేదు ,,  తెలుసా_!
ఎందుకంటే __చీమలు  శర్కర ను ఎక్కడ దాచినా కూడా __ తమ బ్రహ్మ జ్ఞానంతో పసిగట్టి   వచ్చి  తింటున్నట్టు గా  ,,
మన నవనీ త చోరుడు కూడా  తాను ఎక్కడ ఉన్నా కూడా. , తప్పకుండా వెన్న  వాసన  చూసి  ,పసిగట్టి , వస్తాడు  _!_ ఒక్కడే కాదు  సపరివారంగా _,, ,తన సమస్త  గోప బాలుర బృందంతో  అన్న , నమ్మకం _ నాకు  ఉం దే _ పద్మా _!"
__  ఏమే వకుళా ___! ఇంట్లో చేసిన వెన్నంతా తెచ్చావా,__? కొంతైనా  ఇంట్లో  ,నీ పిల్లలకు ఏమైనా మిగిల్చావా,, లేదా _??"
""_  ఓ పిచ్చి పారిజాత మా , _!మనం _ ఇలా  యశోదా తనయుడికి   ఇస్తున్న ఈ వెన్నంత_ మన పిల్లలకు ఇస్తున్నట్టు  అనుకో_! తెలిసిందా _!""
  __అవునే  ,ఊర్మిళా _! పాపం_  అతడు  ఇలా "వెన్నదొంగ"" నాయకుడు  గా మారిం ది కూడా ,, తన జట్టు కు పాలు ,,మీగడ వెన్న  విందు చేయడానికే కదా _!_ "
""  పాపం __!మనకు ఎవరికి  దొరకకుండా ఉండడానికి__ ఎంత  తిప్పలు పడుతూ ఉన్నాడో __మనం చూస్తూ ఉన్నాం గా _!"
  __నిజమేనే   సౌమ్యా ,_! తన స్నేహితుల  ఆకలి తీర్చడం కోసం  కాకపోతే __,నం ద గోపుని గృహంలో కృష్ణయ్య కు  వెన్నకేం లోటు,?" చెప్పు _!?? అక్కడ  ఎటు చూసినా __వందల  ఆవు  లు    అనుదినం గోశాల లో సమృద్దిగా  పాలు ఇస్తూ ఉంటాయి కదా _!""
   __  "" నిజం చెప్పావు ,మల్లీశ్వ రీ _! ఇపుడు మనం జాగ్రత్త గా ఉండాలి  సుమా _! ఇలా   మనం మాట్లాడుతూ ఉంటే.  మనం ఎదురు చూస్తున్న  కన్నయ్య ఇక్కడికి ఎలా వస్తాడు చెప్పు  __??
__అవునవును _ _!నిజమే_!  _ సులోచనా  _! పద __ పద _!మనం  దూరంగా   వెళ్లి కృష్ణునికి కనపడకుండా , ఎక్కడైనా  నక్కి , అక్కడినుండి పొంచి చూద్దాం రండి __!""
అవును పద __!, మనం కనిపెడుతూ ఉన్నామని వెన్నదొంగ కు తెలియకూడదు కదా _!
సరే సరే.__! పదండి _ చప్పుడు కాకుండా _ పదండి _!!""
   ___"అమ్మయ్య ,_  దూరంగా వచ్చేశాం _!  ఇక్కడినుండి చక్కగా కనిపిస్తాడు   ఆ చిన్నారి  మాయదారి  గోపాల కృష్ణుడు _! కదా _!
     _ అవునే   వాణి_!_ కృష్ణుడు వచ్చేది పోయేది     చూడ వచ్చు ,ఇక్కడినుండి_!"" _! సరే  కానీ,_సరోజా,_! మీ అందరికీ  ఒక విషయం చెప్పాలి ,  _!
ఏమిటీ అది చెప్పు _??
__""నిన్న కృష్ణుడు కనిపించాడు నాకు _!!""
__ఏమిటీ _!  ఎదురుగా కాకుండా నీకు ,,కృష్ణుడు కలలో కూడా  కనిపిస్తూ ఉన్నాడా ,_??"
__ " అయ్యో ,,కలలో కాదే ,,_! నిజంగానే , నాకు  ఎదురుగానే  కనిపించాడు ,_!""
""అవునా _! నిజమా ,_!!" నీతో  మాట్లాడా డా _? చెప్పు చెప్పు _! తొందరగా చెప్పు _??"
__ అబ్బ ఆగవే ,_! నన్ను పూర్తిగా  చెప్పనీయ వే  ,__!! 
""చల్ల అమ్మడానికి  నిన్న _ పాలు వెన్న కుండలతో __ నేను వాడ స్త్రీల తో కలిసి వెళ్తూ  ఉంటే ,,,మధురకు వెళ్ళే దారిలో   మన కృష్ణయ్య కనిపించాడు __!""
__"అవునా _నీకా   __? అపాడా నిన్ను _?? ఏమన్నాడు __?"?!
  "వెనకాల వచ్చి  మెల్లిగా_    నాకు దగ్గరగా  వచ్చి
  ___""నా  కళ్ళలో నలక పడింది _ గోపికా _""!"
అన్నాడు __!
_**"అయ్యో __పాపం _! నిజమా __?""
  _ నేను కూడా ," అయ్యో పాపం __,నిజమే అనుకోని ఆగాను.__!"
అగావా __?
తర్వాత __?! ఏం చే సావ్  _??
_!"",  కృష్ణయ్యను ,, బృందావనం పూల సజ్జెలోకి తీసుకెళ్ళి  కన్నయ్య కన్నుల్లో  చల్లగాలి  సన్నగా మెల్లిగా ఊదాను,__!'
""  ఆ  తర్వాత __?"
__""ఏముంది  కృష్ణయ్య  ఆడిన  నాటకం అది ,_ అని అప్పుడు  తెలిసింది ""_!
"" నిన్ను  తన తీయ ని మాటలతో నిన్ను బుట్టలో  వేశాడు _! అంతే నా _!!""
_""జిత్తులమారి  కృష్ణయ్యా_! ఎన్ని లీలలు చేసేవయ్యా _!!
"" అందరి కళ్లు కప్పే వాడికి ,ఇలాంటి ఎత్తులు మామూలే _!!
__తర్వాత   ఏం జరిగింది చెప్పవే __??"
__ ,""ఏముంది నీ పెదవులు దొండపండు లా  ఎర్రగా  పండి పోయి ఉన్నాయి అన్నాడు __!""
  __  తాను  రా చిలక _! అని కూడా అన్నాడా __??""
__""అన్నాడు _!"
   చిలక కు దొండపండు కొరకాలి అనిపిస్తుంది__"! అన్నాడా __?"
_"ఆ  _!అలానే అన్నాడు _!""
  _"అన్నంత పని చేశాడా ""_?_____!""
  _ ఇంకేం చెబుతుంది ,,  _! అది  చెప్పడానికి ఎంత  సిగ్గుపడుతోం దొ , చూడవే__!_"
_""ఎంత అదృష్ట మే  __ కృష్ణ ప్రియా నీది __? ఆ ,నంద నందనుని  కౌగిలిలో   _ ఒదిగి పోవడం  ,ఎంత ఆనందమో కదా _ నీ జన్మ తరించింది  కదా _!!""_
  ""నిజమే సుమిత్రా  __!ఆ గోవిందుని  చూస్తు ఉంటే__ ఈ జగాన్ని __ సర్వస్వాన్ని   సమస్తం  మరచి పోతాం  సుమా __!"
__""ఇక దేనిపై కూడా మన  మనసు పోదు సుమా _!""
          (సశేషం )
స్వస్తి _!
   హరే కృష్ణ హరే కృష్ణా _!!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...