Thursday, August 13, 2020

మౌనం అంటే _? 4

Aug 11, 2020
    ""మౌనంగా ఉండటం అనేది ఒకచోట _"అపరాధం__"" గా మారితే __మరో చోట , అదే మౌనం జీవన్ముక్తి కి  సోపానం గా మారుతుంది .__
తన లోన బడబానలం దాచుకున్న సముద్రం , మహా గొప్ప నదులు సంగమించే సముద్రం , ప్రళయ తాండవం చేసే తుఫానులు సృష్టించే సముద్రం ,, మామూలు వేళల్లో ఎంత ప్రశాంతంగా ,, ఏమీ ఎరుగని అమాయకుడు వలె ఎంత మౌనంగా ఉంటుందో చూస్తూ ఉన్నాం _!
"తథాగతుడు , బుద్ద భగవానుడు   _ విరాగియై ,వ్యామోహం పుట్టించే  , రాజ్యాన్ని ,,భార్య బిడ్డలని,, సమస్త సుఖ భోగాలను,, త్యజించి , సత్యాన్వేషణ మార్గంలో సాధన  సాగిస్తూ  మౌనంగా ఉంటూ  గయా క్షేత్రం లో__ఘోర తపస్సు చేసాడు__!
    ""మానవుడి జీవిత లక్ష్యం ఏమిటి ,??
__" ఎందుకు మనిషికి _ఇన్ని బాధలు __?
__ తప్పించు కొలేని ,,ఈ  జరా రోగ మృత్యు భయాలతో __ అమృత తుల్యం లాంటి ఆనందమయ మైన ఈ  మానవ జీవనం ,__ ఈతి బాధల మధ్య __అజ్ఞాన అంధకారం తో , సతమతం కావలసి న దేనా?""
__ బ్రతుకంతా ఇలా సంఘర్షణ తో పోరాడే ,ఈ  జీవన్మరణ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా ,__?""
అంటూ  ఏళ్ల పాటు ఒంటరిగా   సత్యాన్వేషణ చేస్తూ,,ఒక బోధి  వృక్షం క్రింద  కూర్చుని , నిశ్శల సమాధిలో ,,,తన అత్మ విచారణ కొనసాగిస్తూ వచ్చా డు,__!
  ఎట్టకేలకు ,,ఆయనకు  సమాధానం లభించింది _!
__"అన్నిటికీ   ఈ మనస్సే కారణం ,_"అంటూ
"ధర్మం, అహింస, సత్యం  ,_" దారులు  మాత్రమే మనిషికి __రక్షణ కవచం లా  వుండి ,, సకల బాధలనుండి విముక్తిని  ఇస్తాయి __"అని ప్రతిపాదించాడు
  _"ధర్మం శరణం గచ్ఛామి _!
సంఘం శరణం గచ్ఛామి_!
బుద్ధం శరణం గచ్ఛామి_!
అంటూ  తానే స్వయంగా పూనుకొని ,తన శిష్య బృందంతో,, కాలి నడకన, గ్రామ, గ్రామం   తిరుగుతూ , ప్రశాంతమైన  ఉద్యమాన్ని ఉధృతం చేశాడు __!
ఒకసారి ,,ఒక గ్రామంలో తన శిష్య బృందంతో  అతడు  ఉండగా __,గ్రామస్తులు కొందరు  తమ పనులు మానేసి అతడి బోధలు  కూర్చుండి వింటున్నారు__!
ఇది చూసి మిగతావారికి బుద్దుడి పై  ఆగ్రహం  కలిగింది __!
కోపంతో, వారు అతడిని నానా తిట్లూ  తిట్టారు ,__!దుర్భాషలు   ,రాళ్ళు విసరడం లాంటివి చేశారు _!
  ""నీవే  ఏ పనీ చేయకుండా. __ఒక  పనికిమాలిన వాడివి__" అనుకుంటే __,మా వాళ్ళను కూడా.  దద్దమ్మ ల వలె పనిచేయకుండా బుద్దావతారాల వలె _ నీతులు చెబుతూ _ మా ఊరును  పాడు చేస్తూ ఉన్నావా __?"
__వెళ్ళి పో__!" ఇక్కడినుండి __!""అంటూ అతడిని    అవమానించారు __!
ఇంత గా  నిందలు పడుతూ .కూడా __ వారికి ప్రత్యుత్తరం ఇవ్వకుండా  
బుద్దుడు_"  మౌనంగా"" ఉన్నాడు కళ్ళు మూసుకుని___!
__  అలా ఆయన ,ఎవ్వరినీ  ఏమీ అనకుండా__ స్పందన లేకుండా _ కోపానికి రాకుండా  మౌనంగా_ ఉంటే
శిష్యులకు  కోపం వచ్చింది_!
_అడిగారు__  ఎందుకు వారికి తగిన  సమాధానం  చెప్పడం లేదని ?"
ఆయన  మందహాసం చేస్తూ ,,
"  నేను వారి మాటలు వింటే కదా ,ప్రతిగా స్పందించడానికి ,__?
__ఆ మాటల తీవ్రత ను నేను గ్రహిస్తే  కదా ,నాకు బాధ __??"
. _కానీ నేను  వాటిని గ్రహించలేదు __!"
_ , నాకు కాదు బాధ ,_!ఇప్పుడు వారికీ  కలుగుతుంది సుమా ఆ బాధ _!
  చిరునవ్వుతో అన్నాడు బుద్దుడు
  అన్నట్టుగానే ,  క్రమంగా గ్రామస్తులకు తమ పొరబాటు తెలిసి వచ్చింది,_!
అందరూ అత డిని   క్షమాపణ కోరారు  ,__!
ఆ విధంగా ,
బుద్దు డి ""మౌనం"" వారిలో మార్పు తెచ్చింది _!
_వారి  ప్రవర్తన లో పరివర్తన కలిగింది __!
_మన   మహాత్మా గాంధీ గారు కూడా మౌన వ్రతం వారానికి ఒక రోజు చేసేవారు  __! ఆ రోజున ఎంత గొప్పవాడు వచ్చినా , మాట్లాడేవాడు కాదు __!
సమయ పాలన లో ఆయన దురంధరుడు _!
_ వాస్తవానికి ,ఈ " మౌనం" ఒక   గొప్ప సాధనా సంపద __!

ఎంతో కృషి చేస్తేనే గానీ ఆ సంపద ప్రాప్తించ దు కదా _!
మౌనం ఒక ఆయుధం _!
అది  వ్యక్తిలోని సంకల్పాన్ని ధృఢ తరం చేస్తుంది _!
జీవుడిని దేవుణ్ణి చేస్తుంది కూడా _!"
   ఏళ్ల పాటు  మౌనంగా ఉంటూ చేసిన తపస్సు లేదా  ధ్యానం వలన_ యోగులకు , అమోఘమైన  శక్తి ప్రాప్తిస్తుంది _!
అందుకే రావణుడు , హిరణ్య కశిపుడు,లాంటి రాక్షసులు మాత్రమే కాకుండా ,,ధృవుడు ప్రహ్లాదుడు మార్కండేయుడు లాంటి ఎందరో భక్త శిఖామణి పుంగవులు   మౌనాన్ని యజ్ఞం గా భావించి, ఇబ్బందులను సహించి ,, కృషి తో లక్ష్యాన్ని సంకల్పించి,,
అనుకున్నది   సాధించారు__!
పరమాత్మ సాక్షాత్కారం పొందారు _!
   మౌనం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది ,__!
ఆత్మకు   తృప్తిని పరమానం దం ఇస్తుంది __! పరమాత్మ అనుభవాన్ని కలుగజేస్తుంది __!
మౌన దీక్షలో ఉంటూ ,,తమ అంతరంగం లో , రమిస్తూ _బాహ్య స్మృతి లేకుండా__ బ్రహ్మానందం పొందుతూ ఉంటారు
  __,బ్రతికి ఉండగా నే  బొందితో కైలాసం  వెళ్ళే వారి  పరమ పద సోపానానికి,, మౌన మార్గం _  సుగమం చేస్తుంది __!
   __ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతంగా ఉండే  సముద్రం  వలె
ఈ మౌనం కూడా__ అప్పుడప్పుడు ,, అంతటి ఉపద్రవాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది __!
ఇప్పుడు ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తి వల్ల ప్రపంచంలో ఎక్కడి వారు అక్కడే స్వచ్చందంగా  తమ తమ ఇండ్లలో గ్రామాల్లో నగరాల్లో  స్వచ్చందంగా  బందించ బడ్డారు _ కదా _!"
అంటే బయటి ప్రపంచం తో సంబంధాలు బాహ్యంగా తెగిపోయి నట్టే కదా__!
   ""దయచేసి మా ఇంటికి రాకండి __!""
అన్న బోర్డు తగిలిస్తూ ఒంటరి వారుగా జీవిస్తూ__ మౌనం గా  ఉండడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు __!
నిజమే. కొడుకులు కూతుళ్ళు  పెళ్లిళ్లు అయి కరోనా ధర్మమా___" అని _ పెద్దవారి దగ్గరకు రాకుండా  దూరం దూరంగా ఉంటే  ముసలి ప్రాణాల గతి ఏమిటి ?_
       తమ సంతానం అలా,,మౌనంగా ఉండటం అనేది వారి పట్ల ఒక శాపంగా మారుతోంది__!
భార్యను కోల్పోయిన భర్త ,__!
భర్త లేని భార్య __! మౌన పోరాటం సాగిస్తూ ఉన్నారు __!
, తన  ఆత్మీయులు దూరంగా  ఉండడం ,, ఒంటరిగా  సమాజం నుండి వెలువేసినట్టు గా,,వృద్దులు  నాలుగు గోడల మధ్య మౌనంగా ఉండటం అంటే
  _  స్వచ్ఛంద మరణం తో సమానం _!
కరోనా పీడ వల్ల బయట తిరగ రాదు_!
వారి అవసరాలు తీర్చే దిక్కు లేదు _!
అలా తమ
బాధ  చెప్పుకునే  దిక్కు లేక __ఎందరో అభాగ్యులు , ,, వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం మనకు తెలుసు కదా _!
   అందుకే __మౌనంగా ఉండడానికి ""దమ్ము __ధైర్యం _సాహసం __ ఆత్మ విశ్వాసం_ ,పట్టుదల ,భగవంతుడి పైన నమ్మకం _  ఆత్మ గురించిన ,,   జ్ఞానం ఉండాలి
__"మౌనం_" అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టడం ,__!
పరిసరాల  ప్రభావానికి ప్రతీకార చర్య లేకుండా  మనసును కట్టడి చేయడం __!!""
అంటే  __ మౌనం " అంత సామాన్య మైన విషయమా__??""
  ఎంతో  కృషి ,సాధన చేస్తూ ధృఢ సంకల్పంతో గమ్యం తెలియని దారిలో,అంతం లేని ప్రయత్నం చేస్తూ పోవాల్సి వస్తుంది   __కదా _!!
    మౌన పోరాటం  అనేది చాలా గొప్ప ఆయుధం __!
మహాత్ముడు గాంధీ గారు ఇదే అంకుశం తో ,,"" అహింసా పరమో ధర్మః__!""
అంటూ బ్రిటిష్ వా రి,అక్రమాలు  అన్యాయాలను  మౌనంగా ప్రతిఘటిస్తూ ,,, నిరాహార దీక్షలు, నిరసన  ప్రదర్శనలు చేస్తూ,,  విజయాన్ని సాధించారు _!
    స్వాతంత్ర్య సమర రంగంలో
గాంధీ గా రి ప్రవేశం కంటే ముందు__ శివాజీ ,కట్టబ్రహ్మన , అల్లూరి వంటి  ఎందరో వీరులు __ దేశ భక్తులు కూడా స్వాతంత్ర్యం సంగ్రామ యజ్ఞంలో  స్వచ్చందంగా ముందుకు వచ్చి  , విదేశీ పాలకులను ఎదురించి దేశం కోసం    ఆత్మార్పణ చేసుకున్నారు __!
  అయితే. అప్పటి పోరాటం వారి సామ్రాజ్య హద్దులు వరకే పరిమితం అయ్యింది
కానీ 
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచలం వరకూ ఏక చత్రం లో __ప్రశాంత ఉద్యమం నడిపించి , అహింసా మార్గం లో __ మౌన పోరాటం తో స్వాతంత్ర్య సముపార్జన గావించిన ఘనత మహాత్మునికి __దక్కింది __
ధర్మాచరణ కు కూడా మౌనం  సహకరిస్తూ ఉంటుంది ,ఇలా _!
  ,ధర్మ రాజు  __ కౌరవులు. తమకు ఎన్ని అన్యాయాలు_ అధర్మాలు చేసినా మౌనంగా భరిస్తూ వచ్చాడు__!
ఆ మౌనం __  ప్రళయం వలె _మహా భారత యుద్దం రూపంలో ఒక్కసారిగా.  ఉప్పెన వలె పొంగి పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం ను వీరాధి వీరులను  నిలువునా ముంచి పారేసింది  __!
వివేకానంద స్వామి ,రామకృష్ణ పరమహంస యోగానంద,
రమణ మహర్షి  లాంటి   మహానుభావులు  మౌనం గా ఉంటూ అద్భుతమైన  శక్తులు మహిమలు ,వేదాంత దర్శనము,,తమ యోగ సాధన ద్వారా సాధించారు
  అందుకే
మౌనం అనేది__ ప్రాపంచిక సౌఖ్యాలతో   స్వార్థ భావన తో  చూస్తే  తననే కబలించే  ఒక దెయ్యం అవుతుంది __! మౌనం గా  ఆత్మ శాంతితో మనలేని వారు,,__
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము లకు గురి అవుతూ ఉంటారు _! __సంసార లంపటం లో చిక్కి,  గమ్యం తెలియని దారిలో ,  సుఖశాంతి  లేకుండా   మనసు ఎప్పుడూ తింపుతుంటుంది
     ఇదే మౌనం,, పరమాత్మ సాన్నిధ్యం చేరాలన్న తపనతో  ఒక తపస్సు లా కొనసాగిస్తూ ఉంటే   మాత్రం ,,అతడు , అమోఘమైన శక్తి సంపన్నుడు అవుతాడు __!
జీవుడు దేవుడు కావచ్చు__!
జీవాత్మ ను. పరమాత్మ తో అనుసంధానం చేసుకొనే అవకాశం కూడా  ఉంటుంది_!
జన్మ రాహిత్యమైన   పరమాత్మ సాక్షాత్కారం  సాధించాలి అంటే  ""మౌనాన్ని" ఆయుధంగా  ఉపయోగిస్తూ, నిరంతర_
యోగా భ్యాసం ద్వారా,మనస్సును నిగ్రహింప  చేస్తూ , సాధన  చేయాల్సిన అవశ్యకత,,ఎంతైనా  ఉంటుంది ,,కదా _!
మౌనం ఒక యోగం _!
ఇంద్రియాలను మనస్సును బుద్దిని నియంత్రిస్తూ ,ఆత్మలో లయం చేస్తూ, పరమాత్మ ను ధ్యానిస్తూ, పరమానంద దాన్ని పొందే అద్భుత అపురూప అమోఘమైన ,, అంతర్ముఖ పరిశీలన,అవుతుంది_
,ఆత్మ విచారణ   తో ఆత్మానందాన్ని పెంచుతూ
జీవుడి ని ,ఉద్దరిస్తుంది ,
దుర్గతిని ,,సుగతి గా మారుస్తూ ఉంటుంది ఈ మౌనం _!
మనసు పలికే భాష ఈ మౌనం _!!
      స్వస్తి
    హరే కృష్ణ హరే కృష్ణా

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...