Thursday, August 13, 2020

నా బంగారు కొండా_!

Jul 28, 2020
అమ్మా అమ్మా _!"
  _____. ఊ_
  అమ్మా   _!,  మాట్లాడు అమ్మా _! నీ  బంగారం పిలుస్తూ ఉన్నాడు అమ్మా _!
     ఊ అంటున్నాగా _!'
"అలా కాదు   అమ్మా ,_ఇటు చూడు. నా వేపు _!'
  'ఎలాగా  రా కన్నా ,నేను ఏం చేస్తున్నా నో,,_ నీవు  చూస్తున్నావు గా _!'
ఆహా , ! ఎప్పుడూ ఉండేదే గా  ఈ మజ్జిగ చిలకడం_ వెన్న తీయడం , చల్ల చేయడం__!"
  "కన్నయ్యా ,ఇదంతా నీకోసమే కదా __!
ఎంత కష్టపడితే  నీవు ఇష్ట పడే  వెన్న  లభిస్తూ ఉందో చూస్తూ ఉన్నావుగా   __!""
     _నాకు ఇప్పుడు వెన్న అవసరం లేదు అమ్మా!_ నువ్వే కావాలి ,_!
  __"ఇప్పుడు కాకపోతే సాయంత్రం  తింటావుగా _!'
     "అమ్మా _అమ్మా _! ఒకసారి  అదంతా వదిలేసి ఇటు రావే అమ్మా _!"
""ఎందుకు   '_నాతో ఏం  పనీ __ చెప్పు ,_!
"వెళ్ళు_! వెళ్ళి  నీ కోసం  అదిగో  _అక్కడ నీ స్నేహితులు ఎదురు చూస్తున్నారు గా _!
నన్ను విసిగించక వెళ్ళ రా కృష్ణా _!!"'
  __అమ్మా _అమ్మా _!నాకు ఆకలిగా ఉంది రావే _!"
   _అయితే_ ఇదిగో ఈ వెన్న తిను రా కన్నా _! , మిగతాది తీసుకెళ్ళి  నీ స్నేహితులతో  కలిసి తినండి _!"'
  __"అమ్మా _అమ్మా _,నాకు ఏమీ వద్దమ్మా _!
"ఎప్పుడూ వెన్న తిను_ జున్ను తినూ  _!అంటావు  ,_
_మరేం కావాలి రా కన్నయ్యా__?" ఒక్కసారైనా
పాలు త్రాగరా _నా ముద్దు చిన్నారి కృష్ణయ్యా_! అని  అంటావా ,,_! అనవు కదా_అమ్మా _! _!
  _ఓహో_ తమరికి  పాలు కావాలా  _?అయితే ఆ కడవ లో ఇప్పుడే తీసిన  తీయని  చిక్కటి మీగడ  ఉన్న ఆవు పాలు  ఉన్నాయి రా _కృష్ణా__! నీకోసమే అట్టే పెట్టాను __!
తీసుకొని త్రాగరా నాన్నా __!""
  ఆ _ తీసుకో రా తాగరా_ అంటావు కానీ , నీవు మాత్రం  రావు కదా అమ్మా_!!""
_ ఎలార కృష్ణా ,_!ఇంకా ఏం కావాలి చెప్పు _!"
_అమ్మా _అమ్మా _!నన్ను ఎత్తుకో  వా ,_!
_ఇప్పుడా _? నిన్ను ఎత్తు కోవాలా  _!ఎందుకంట ?"
__ఎందుకంటే నా కాళ్ళు నీ కోసం_ నిలబడి  _"నిలబడి నొస్తూ ఉన్నాయే అమ్మా _!
_అయితే ఇదిగో__!  కాస్సేపు ఆ గద్దె పై కూర్చుని చూడ రా కన్నా _
బాగా ఆడు తూ  పరుగు పెట్టావుగా _ అందుకే కాళ్ళు నొప్పే డుతూ ఉన్నాయేమో _!'"
_"అబ్బే _!నేను    నిన్ను విడిచి బయటకు పోనే లేదు కదమ్మా. _!!'
  ఓహో_! మీరు  , శ్రీ కృష్ణుల వారు  ఇంటినుం డీ  అసలు  బయటకు  కదలనే కదల రంట , కదా _!
_నిజం గా అమ్మా_! ఇక్కడే ఉన్నాను _!
  ""కృష్ణా _!నీవు ఎక్కడెక్కడ తిరిగేది నాకు తెలుస్తూనే ఉంటుంది తెలుసా_!
  _ ఏమిటి  అమ్మా_! ఎపుడూ  ఇంట్లో ఉండే దానివి , ,_!బయటకు అసలే రాని దానివి ,_! ఎప్పుడూ ఇంటిపని వంటపని లో గోశాల లో తిరిగే దానివి  _! నీవు నన్నెలా చూస్తావు  అమ్మా_?""
   __"నేనేం చేస్తున్నా కన్నా ,__ నా కళ్ళు మనసూ కాళ్ళూ  మాత్రం నీవైపే చూస్తూ _ ఎక్కడ ఉన్నా
నిన్ను పట్టేస్తా యిరా కృష్ణా_!"
_ అదెలా ఎలా_! ఎలా అమ్మా _! చెప్పవూ_?"
_" నా బుజ్జి గోపాల బాలా,_! వరహాల తండ్రీ _!,రతనాల మూట _!, నీ కాళ్ళకు ఉన్న మువ్వల రవళి , వింటూ   ఉంటే  __ ఈ వెన్న దొంగ , నవనీత చోర బిరుదాంకితుడు  మా నంద గోపాలుడు ,యశోదా కిషోరుడు   ఎక్కడ ఉన్నా డో   _నాకు ఇట్టే   తెలిసిపోతుంది రా   _! నాన్నా _! నీవు  ఎంత  అమాయ కుడివు రా కృష్ణా_!" _
_"ఓహో అలాగా ,_!అయితే ఈ గజ్జెలు  నన్ను పట్టిస్తూ ఉన్నాయి అన్నమాట ,_! ఉండు వీటి పని చెబుతాను_!
అమ్మా_ అమ్మా_! ఈ అమాయకుడు _నీ కన్నయ్య ఆకలి మాట మరిచావా  _??
   _""అబ్బబ్బా ,_!పట్టిన పట్టు విడవ వు కదరా _!,  ఆ పాలు త్రాగమని అన్నానా __??"
__"ఆ పాలు కాదు ,_!నాకు ఈ పాలు కావాలి అమ్మా _!"
  _""ఈ పాలు అంటే _ ఏమిటి కృష్ణా ?"
__"ఎలా చెప్పాలి నీకు అమ్మా __?
  _మా అమ్మ పాలు కావా లి__!
అందుకే నన్ను ఎత్తు కో__ ఎత్తు కో __!అంటూ ఎంత  మొత్తుకుంటున్నా ,అర్థం చేసుకో వు కదా _!""
అమ్మ  మనసు తియ్యన _!
అమ్మ పాలు తియ్యన_!"
__   ఓహో అదా అసలు సంగతి ,_!అందుకే శ్రీకృష్ణ దేవుల వారు ఇంత బుద్దిమంతుడు అయ్యారన్న మాట.__!!
_" అయినా కృష్ణా  _!, రాత్రి అయితే గానీ_ నీకు ఈ అమ్మ పాలు త్రాగడం వీలు కాదు ,_నీకు తెలుసు కదా_!
_"అమ్మా _అమ్మా _!
"రాత్రి అంటే ఏమిటి అమ్మా_??""
_ రాత్రి అంటే చీకటి పడటం  రా కన్నా !"
_ మరి చీకటి పడటం అంటే  ఏమిటి అమ్మా _?
_ చీకటి అంటే ఎవరూ  మన కళ్ళకు    కనబడక పోవడం , _!ఇది కూడా చెప్పాలా కన్నా_!!
"ఓస్ ఇంతేనా అమ్మా_! అయితే  ఇప్పుడు చీకటి పడింది,  అమ్మా _రాత్రి అయ్యింది _! ,ఇక నీవు నాకు పాలు ఇవ్వ వచ్చు_!. కదా _!
అదెలా రా కన్నయ్య c_!"
  __ఇదిగో _!నేను  నా రెండు  కళ్ళు మూసుకున్నాను కదా _!నాకు ఏమీ కనబడటం లేదు  _ కదా _!నీవు కూడా  కనిపించడం లేదు  అమ్మా_!"
_అమ్మ దొంగా ,_!ఎన్ని జిత్తులు నేర్చావు రా కన్నయ్యా._! కళ్ళు మూసుకుంటే రాత్రి అవుతుందా __?
""మరేం చేయను అమ్మా __!,నేను చిన్న పిల్లాడి ని ,_!, పైగా అమాయకు డిని కదా _!నేను
ఏం చేసినా_ నీకు నాపై దయ రావడం లేదు కదా అమ్మా  ,__!"_నాకు ఏడుపు వస్తోంది అమ్మా__! ఇదిగో కళ్ళ నుండి నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి __!
చూడు ఇటు నా కేసి __!
_!" నీకు కనబడుతూ ఉందా _ అమ్మా _!"

_ కృష్ణా _!తప్పు నాదే రా _! తండ్రి __ఇదిగో లెంపలు వేసుకుంటున్నా _!
ఇకముందు ఎప్పుడూ నిన్ను  ఇలా ఏడిపించ ను సరేనా _! రా __నా కన్న __!
  నా బంగారు కొండా _!నా పుణ్య ఫల మా _! నా వజ్రాల మూ ట_!నిన్ను ఎంత విసిగించాను రా,__! కృష్ణా _!నిన్ను బాధ పెట్టాను నేను _!!
ఎంత పాపా త్ము రాలిని రా ,,,_! కృష్ణయ్యా , నీకు ఎంత ఆకలిగా ఉందో కదా __!,నాన్నా  _ రా !రా_ యదు నందన ,_! నీ   కడుపు నిండా  _ఈ అమ్మ పాలు  త్రాగు దువు కానీ , రారా , కృష్ణా _!!
నిన్ను ఎత్తుకొని  ముద్దాడుతూ ఉంటే , నీ వరహాల నవ్వు  నీ దరహాసం వదనాన్ని ,  చూస్తూ ఉంటే ,,, చల్లని చూపులను కురిపించే నీ కళ్ళను చూస్తూ ఉంటే , ,__
నాకు మనసు ఎంత పరవశం  పొందుతూ ఉంటుం దొ ,  నీకు ఎలా చెప్పేది _!
కన్నా _!నా బంగారు తండ్రి,__! ఇలా  నీవు నా ఒడిలో ఒదిగిపోయి__ నా చనుబాలు త్రాగుతూ ఉంటే  నేను పొందుతూ ఉన్న ఈ  మధురానుభూతి ని__ నాలోని  ఆత్మానందాన్ని   ఏమని వర్ణించను 
కృష్ణా , __!!"
నీవు  నా  వెనక నుండి పరుగున వచ్చి  _ ఒక్కసారిగా _నా మెడ చుట్టూ_ నీ రెండు చేతులూ వేసి   " అమ్మా _!"అంటూ నా కేసి  ఆప్యాయంగా చూస్తూ  ఉంటే  _  నా మదిలో కలిగే అలౌకిక  అనుభవం ఏమని చెప్పను రా కన్నా__!""
నీ స్పర్శలో చల్లదనం __
నీ  దర్శనం లో  పొందే భావామృతం __
నీ పలుకుల్లో తీయదనం __
నీ  భువనైక మోహన  సుందరకా రం లో నిన్ను  చూస్తుంటే  __నా తనువూ మనసూ  ఏకమై _నా అంతరంగం లో   పరమానందం కలిగిస్తూ ఉంటాయి ,__!
ఎటు చూసినా నీవే __!
కృష్ణా _! నీవు
ఎటు వైపు నుండి వస్తా వో _!,
ఎన్ని తీయని మాటల మూటలు పట్టి తెస్తా వో _!
  నీ వెనకాల  ఎంతమంది స్నేహితులు బిర బిర  పరుగులు తీస్తూ ఉంటారో__?
ఎంతమంది గోప స్త్రీలు నీపై  చాడీలు  చెప్పడానికి వస్తారో __!
కృష్ణా _;నీ అల్లరి చేష్టలతో నే  _ ఈ యశోదా నందుల ఇల్లంతా   ఒకటే సందడి కదా _!"
రేపల్లె వాడలలో  అయితే  చెప్పలేని ఆనందం !
వ్రజవాసుల హృదయాలలో__   నీ శృంగార   లీలల వైభవ మధుర  స్మృతులు _!'
ఆహా_! నా జన్మ ధన్యం ,_! ప్రభో _! శ్రీమన్నారాయణ _!   వైకుంఠ ధా మా _!నీ కృప అపారం _!
నా ఇంట నడయాడే ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని_ ప్రత్యక్షంగా దర్శించి_ ఆనందించే మధుర అనుభవాన్ని మాకు  అనుగ్రహించిన  ఓ  పరమేశ్వరా __!
పరాత్పరా __!
పరంధామా__!
పరమాత్మా __!
నీకు శతకోటి ప్రణామాలు_! స్వీకరించు తండ్రీ__!
  ఓ పరమ పితా _!
నమో నమః,_!!
స్వస్తి__!
హరే కృష్ణ హరే కృష్ణా_!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...