Thursday, August 13, 2020

ముద్దు గారే యశోదా ముంగిట  ముత్యము వీడు

Jul 31, 2020
ముద్దు గారే యశోదా
ముంగిట  ముత్యము వీడు_!"
____&&&______
" అదొక రమణీయ కమనీయ  మనోహర దృశ్య కావ్యం_!"
  ఒకరోజున _చిన్ని క్రిష్ణుడు    నందభవన ప్రాంగణం లో_ ఆనందంగా  ఆడుతూ_ పాడుతూ _గెంతుతూ ఉన్నాడు_!
లోగిలిలో యశోదా మాత తో బాటు _కొందరు గోపికా స్త్రీలు  చల్ల చిలుకుతూ వెన్న తీస్తూ   ఉన్నారు _!
_  నంద రాజు ఇంటిలో , యశోదా రాణీ తో కలిసి , రోజూ చేస్తున్న వారి దినకృత్యమే _ఇది _!
_  అలా ఒకే  వేగంతో ,ఒకే క్రమంలో    అందరూ  కలిసి తింపుతున్న కవ్వంతో బాటు ,,కడవలో అటూ, ఇటూ సుడులు చేస్తూ  తిరిగే  మజ్జిగ చేసే "సుయ్_ సుయ్ _'" సుయ్ __ సుయ్ " అని చేసే  ధ్వని   తరంగాలు అచట ఉన్నవారికి  ఎంత శ్రవణా నందంగ వినిపిస్తూ ఉన్నాయంటే ,,
__అక్కడ గోప బాలుర తో కలిసి  ఆడు కుంటు ఉన్న  ,మన  మూడేళ్ల కృష్ణయ్య   కూడా  ఆ   సంగీత భరిత మధుర ధ్వనులు విని , పరుగున వచ్చి  , చల్లకుండ లలో నుండి వినిపించే  సంగీత కచేరీ నాదాలకు _ అనుగుణంగా తాను కూడా   చేతులూ పాదాలూ కదిలిస్తూ ,"నృత్యం " చేయసాగాడు
ఇది యశోదా రాణీ గమనించింది ,_!
"" ముద్దుగా రే యశోదా ముంగి టి ముత్యము  వలె శోభిస్తు అలరిస్తూ ఉంటున్న  తన ముద్దుల తనయుడు, చిన్ని కృష్ణుడు , అలా  తన చిన్ని చిన్ని మృదువైన నవనీతం లాంటి   పాదాలు ,హస్తాలతో అభినయం చేస్తూ ఉంటే ఆమె ,, ఆమె తో బాటు గోపికా బృందం కూడా ఎంతో ముచ్చట పడుతూ , పరమానందం తో _ పులకరిస్తూ _ఇంకా వేగంగా తమ  కవ్వాలను  తింపసాగారు _
ఒక్కసారిగా కవ్వాల జోరు పెరగడం చూసి  కృష్ణుడు కూడా తన నృత్యాన్ని అంతే వేగంతో సాగించాడు _
ఇది చూసి   యశోదా మాత, నంద నందనుని ఆట పట్టించాలని. కవ్వాన్ని  వేగం  జోరు తగ్గించి _ గోపాల బాలుని   చిలిపి చేష్టలను  ఓర కంట కనిపెడుతూ   మెల్లిగా తింపు తూ ఉండి పోయారు  ,_!
   గోవిందుడు కూడా తన జోరు తగ్గించి _ తాను కూడా  వారిని  ఓ కంట గమనిస్తూ _ వివిధ రకాలు గా తన నాట్య   భంగిమలు మార్చుతూ పోయాడు
శ్రీకృష్ణుడు సహజంగా వేణు నాద , నాట్య కళా విశార దుడు , కదా,_!
గోపస్త్రీలకు  వారు చేస్తున్న పరమ పావన మైన  చల్ల చిలకడం ,వెన్న తీయడం వంటి వారి వృత్తి పరమైన  నిత్య కృత్యం లో    వారికి  అలసట కలుగకుండా _ వారి ఉత్సాహం ఇనుమడించే  విధంగా , ప్రోత్సాహం  కలిగిస్తూ ఉన్నాడా _!" అన్నట్టుగా  ఈ ఆనంద కేళి ని  నిర్వహిస్తూ ,ఉన్నాడు
ఆస్వాదించే హృదయం ఉండాలి కానీ , ప్రకృతిలో ,పరిసరాలలో , వినిపించే ప్రతీ _ ధ్వనీ  సంగీత భరిత మే కదా _
  సుయ్ సుయ్ సుయ్ సుయ్ అంటూ వారు విడిచే ఉచ్వాస నిశ్వాస ల ధ్వని తో బాటు, పెరుగు కుండల్లో గిర గిర లతో వినిపించే  ధ్వనులు కూడా ఆలకిస్తూ వాని కి అనుగుణంగా  పెంచుతూ ,తగ్గిస్తూ  తన నటన   సాగిస్తూ ఉన్నాడు , ,మన జగన్నాటక సూత్రధారి,,_!
    ఇదంతా ,ఆ గోప స్త్రీలు, a అందాల బాలుడు తమ   గోపాలుని  అందాల నూ,, ఆనందాలను తనివారా  గ్రోల డానికి  ,మనసారా  చూడటానికి,  చేస్తూ ఉన్న పని _!"'
అయితే అలా   గోప స్త్రీలు కన్నయ్య ను విలాసంగా వినోదం పొందుతూ ఎగిరిస్తు ఉంటే  , ఈ మధుర మైన అపురూప సన్నివేశాన్ని  దివిలోని దేవతలు కూడా ఎంతో ఆసక్తితో   ఆనందంతో చేష్టలుడిగి చూస్తూ ఉండి పోయారు   l
   గోపికల రూపంలో జన్మించిన ఆ మునులు, ఋషులు అలా  తన్మయత్వం తో తాదాత్మ్యం  పొందుతూ అద్వితీయమైన  కృష్ణానందం లో బ్రహ్మానందం పొందుతూ    పరవశించా రు_!
ఈ  బ్రహ్మానందం పొందడానికే కదా వారంతా  శ్రీరామ చంద్రుని అనుగ్రహం తో గోప  స్త్రీలుగా   అద్భుతమైన  కృష్ణ భక్తిలో  ధన్యులు అయ్యారు _!
   అయితే ఇది ఇంత  రసవత్తరంగా _ రమణీయంగా  _నృత్య గాన  పద విన్యాసం తో _ అందంగా   వైభవంగా ,రక్తి కట్టడానికి ముఖ్య కారణం
  నంద కిషోరుని పాదాలకు ఉన్న   అందియ లే _!
  చిన్నారి కృష్ణయ్య కాలి గజ్జెలు ,నినదించే   నాదాలు,_  గోప వనితలు ఆడించే కవ్వాల  భ్రమణ ముతో  కలిసి _  శ్రవణా నంద కరంగా   నయన మనోహరంగా నిత్యం   నంద రాజు ప్రాంగణం లో అద్భుతంగా ,   ప్రదర్శింప బడుతూ ఉంటుంది
కృష్ణుని  అందెల రవళి , మోహన మురళి,  వింటూ  ఆనంద నిలయం అయిపోయింది ఆ  రేపల్లె వాసుల జీవన సరళి ,_!
ఈ మనోహరమైన దృశ్య కావ్యం మనకు ఒక దివ్యమైన  ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ ఉంది_!
  క్షీర సాగర మథనం సమయంలో  అమృతాన్ని సాధించడానికి  మహా విష్ణువు కావించిన   యజ్ఞం  , , నిజానికి  ,ఒక సాధకునికి ఉండాల్సిన  లక్షణాన్ని  తెలుపుతూ ఉంటుంది కదా _!
ఇక్కడ , ఈ రేపల్లె వాడల్లో, నంద గోపుని గృహంలో , యశోదా మాత  నిలయంలో గోప స్త్రీల సంయుక్త  సాధన లో ,  సాధకుని  అంతరంగాన్ని దర్శించ వచ్చు_!
  పాల కడవల్లో ఉన్న పెరుగు క్షీర సాగరం గా ,__,
ఆ పెద్ద పెద్ద బానల్లో  అటూ ఇటూ సుతారంగా తిరిగే కవ్వం , మేరు పర్వతము గా__
  గోపస్త్రీల చేతులు సురాసురుల హస్తాలు  గా___
      మనసును ఆత్మలో లయం చేస్తే కలిగే మధురాతి మధుర భావన యే , అమృతం లాంటి నవనీతం గా  మనం గుర్తించ వచ్చును ,_!
అయితే _
ఇక్కడ__  క్షీర సాగర మథనం సమయంలో  మొదట పుట్టిన విషానికి   మాత్రం  ఈ ఆనంద నిలయం లో స్థానం లేదు _!
ఎందుకంటే ,ఈ  సంగీత విభావరి ని _ సాక్షాత్తూ ఆ నారాయణు డే  స్వయంగా పూనుకొని _  తన భక్త జన గోప స్త్రీల బృందానికి నయన మనోహరంగా , జగన్మోహన కరంగ ,,తానే దర్శకత్వం  నిర్మాత  ,కథ ,మాటలు ,సంగీతం , లతో నాటకం రచించి ,పోషించి  , అందులో  శృంగారాన్ని రంగరించి     , నాట్య రంగాన్ని  రసరమ్య భరితంగా  తీర్చి దిద్దాడు   , నీలమేఘ శ్యామ సుందరుడు _!
   చల్ల చిలికే     _ ఆ గోప స్త్రీల కాలి అందియల మృోతలు __
వారి చేతులకు ఉన్న  బంగారు గాజుల తాకిళ్లకు వెలువడే  శృంగార నాదాలు __
   _ పెరుగు కుండల్లో  గిర గిరా తిరుగుతూ  ఉంటున్న కవ్వా ల భ్రమణం  వల్ల వినిపించే  _"సుయ్ _సుయ్__"" అన్న  మధుర నాదాలు__!
  కృష్ణుని కాలి మువ్వల సవ్వ ళ్ళు , __!
  కన్నయ్య అభినయం చేస్తూ ఉండగా అతడి చేతి కంకణాల సంగీత ధ్వనులు ,_!
కృష్ణుని నడుముకి ఉన్న బంగారు దట్టికి _ అందంగా అలంకరించిన  చిన్ని చిన్ని మువ్వల గంటల రావాలు__!
ఇవన్నీ కలిపి   శ్రీకృష్ణ భగవానుని   శృంగార లీలా నాట్య వినోద  అద్భుత   ప్రదర్శన  కు  __గోపికా అంగనలు ప్రేమతో భక్తితో  కృష్ణ స్వామికి ,, సమర్పిస్తూ ఉన్న మంగళ హారతి వలె   తోస్తూ ఉంటుంది కదా  __!
  చిన్ని కృష్ణుని  అరుణ కమలాల వంటి  మృదువైన లేలేత చిన్నారి పాదాలకు  తల్లీ యశోద అలంకరించిన అందెల రవళి సవ్వడి ,__ వీనులకు విందుగా ,హృదయాలను ఆనంద డోలికల్లో  విహరింపజేస్తు  __   శ్రీకృష్ణ పరంధాముని  _అఖండమైన_ అపురూపమైన భక్తి సామ్రాజ్య వైభవ ప్రత్యక్ష దర్శనం తో__  శరీరం    
రోమాంచితమై  కమ్మని మధుర భావన తో  పులకిస్తూ ఉంటుంది  కదా _!"
    యశోదా మాత గృహంలో ,,, కాళీ యుని పడగలపై , యమునా నది తీరంలో మహా రాస క్రీడా విహారం లో  __
శ్రీ కృష్ణుని  అత్యద్భుత  సుందర   లావణ్య నర్తనం వల్ల   __స్వర రాగ లయ తాళ భావ భరిత మాధుర్యం వల్ల _ భక్త జనుల హృదయాలకు  కను విందు  కలిగించేలా   __  కృష్ణుని కాలి గజ్జెల సరస రస నాద సవ్వడి_ అనవరతం ,అతడి భక్తుల  ఎదలో  వినిపిస్తూనే  ఉంటాయి_!
శ్రీకృష్ణ సుందర దివ్య మంగళ విగ్రహం ముందు మోకరిల్లి  ,నిత్యం భక్తితో ఇలా ప్రార్థన చేద్దాం _!
   "హే కృష్ణా_! శ్యామ సుందరా _! ప్రేమ మందిరా _! నీ నామమే వీనుల విందు కదరా _!""
,   నా మదిలో. అందమైన  నీ పాదాల  ను  దర్శించు దామని అనుకుంటే ,,ముందుగా నీ కాలి అందెల రవళి యే ,   మనసు పరవశించే లా ,ఒళ్ళు పులకించెలా ,  ఆత్మ పరమాత్మతో ఐక్యము అయ్యేలా  మనోజ్ఞంగా కదులుతూ __ మదిలో   హాయిగా వినిపిస్తూ ఉంటుంది ,_!
_"హే కృష్ణా ,_! నీ దివ్య మంగళ స్వరూపాన్ని ఎంత భావించినా తనివి తీరదు కదా __!
  నగుమోము తో __నవరస భరితంగా  ఆగుపించే  నీ చల్లని చూపుల్లో , ఏ మహాత్మ్యం  ఉంటుందో   గానీ ,,స్వామీ __ మాటల్లో చెప్పలేం_! సమ్మోహితుల ను చేస్తు ఉంటుంది సుమా _!
నీ  ఫాల భాగం పై నాట్యం చేస్తూ ఉన్న నల్లని ముంగురులు ,_!, పెదాల పై  కదలాడే   ఆ చిరునవ్వు_!
  మణిమయ రత్న ఖచిత కిరీటంలో  మెరుపు తీగలా  మెరిసే  ఆ నెమలి పింఛం__! 
నీ హస్త కమలాల లో దివ్యంగా  శోభించే ఆ  వేణువు ,__!
  అంగాంగమున అనంతమైన   వైభవాల ను దర్శింప జేస్తు ఏమెరుగ ని అమాయక  , బాలుని వలె  నంద గోపు ని నట్టింటిలో , యశోదా మాత ఒడిలో  ఆమె చను పాలు త్రాగుతూ ,హాయిని   ఆనందాన్ని సంతృప్తి నీ ఆమెకు  అనుగ్రహిస్తూ , పడుకుంటూ   ఉంటున్న" ట్టు గా నటిస్తూ ఉన్న ,,
ఓ  బాల గోపాలా ,,_!మమ్మల్ని , ఈ  నీ భక్తులను ,కూడా     దయ చూడు,,
అచ్యు తా _!, అనంతా_! గోవిందా _!
   శరణు _!శరణు _!శరణు_!
స్వస్తి _!
    హరే కృష్ణ హరే కృష్ణా _!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...