Thursday, August 13, 2020

మనసైన కవి మన సినారే

Aug 3, 2020
మనసైన  కవి _
మన  "సినారే _!"
____&&&&&&___&__
"_సినారే "  అంటే  ఎరుగని   ఏ తెలుగు వాడు ఉండడు కదా_!
  ""సహజమైన గేయ కవిత
లల్లుట తన   ప్రతిభ కదా _!
  భావ వ్యక్తీకరణ లో ఎంత
సౌజన్య మో  _! ఎంత  గాంభీర్య మో_!
లలితమైన పదాల కూర్పు లో ఎంత నవత ప్రదర్శిం చేనో __!"
   పదము పదము  లో  ఎన్ని  సర సాలు  పరచేనో  _!"
_  విరసమై మరో చోట  జ్వలించేనో__!"
పరవశమై
ప్రణవ నాదమై  హాయిగా  వినిపించె నో_!
తాను తడమని శృతి లేదు _!
చేయ ని  జతి లేదు _!
తనకు తానే సాటి _!
పోటీ కవితలలో మేటి!
మన సినారే__!
మంచి మనసున్న సినారే_!!

తెలంగాణ    జానపద
సాహిత్య ములో సుధలు  విరజిమ్మెను _!
  మనసు  నింపి  మరులు గొలి పి_
మనుషులలో మమత రేపి_!
మానవతా విలువలు పెంచి _!
అందమైన పద జాలము న
ఆనందపు నడక నేర్పి_
ప్రతి కవిత లో_
తన ప్రతిభ తో
తనదైన  చతుర శైలి కూర్చి _!
సాహిత్య  సౌరభాలు  తెలుగున_
వెదజల్లిన  ఒక మహా కవి_! _
మన "సినారే  "యని_!
  సాహితీ  మణిహారం లో    వెలుగొందు మణిపూస యని _!
   తెలుగు జాతి. గర్వ పడగ
  సాహితీ అభిమానులు ,
స్ఫూర్తి నొంది _
తమ, ప్రణతు లిడగా_!
    వందనములు చేతుమయ్య _
మేమందరమూ _!
మహనీ యా _!
మహా విధేయా _!
ఆహా _! మీ పాట లు వినిన
మనసూ గి పోతుంది సుమా !
"పగలే వెన్నెల కురియు _!
_జగమే. ఊయల లూగు _!
    అసంభవాన్ని సంభవం చేసిన
ఏమి  కవితా రచనా మధురిమ లు   ?!
ఏమి ప్రతిభ_!
ఏమి భావ గంభీరత _!
   లేలేత చివురు టాకుల _
సుకుమార గులాబీ రేకుల _ ప్రకృతిలోని రమణీయత_!
కళా పిపాసుల రసజ్ఞత _!
  సినీ గీతాల  అద్భుత  రచనా పరిణత _!
ఎన్ని హంగులు _!
ఎన్ని మధురిమలు _!
  రవి కాంచని చోటు ను
కవిగా నీవు  స్పృశించా వు
కదా _!
_  ఎవరి కబ్బు __ఆ పద గాంభీర్య ము ?_
  _ఎవరు నేర్తురు _ఆ సరస చతుర పద విన్యాసము _!!
  _అపురూపం _అనితర సాధ్యమైన_
ఆ  వికటాట్ట హాస
వైరాగ్య ,
పరకాయ ప్రవేశము _!
  ఎంత చదివినా , అంతు తెలియని _
   అవగాహన కానీ __
రచనా శైలి ని, నీ స్వంతం  చేసుకున్నావు కద య్యా_
ఓ రైతు బిడ్డ _!
ఓ కుగ్రామ వాసి _!
అంచెలంచెలుగా_
అందుకోలేనంత ఎత్తుకు  ఎదిగి ,
తెలుగు జాతికి పేరును
తెచ్చావు కదయ్యా _!
    సాహితీ రంగ మథనం చేస్తూ _
  ఆ హిమ శ్రుంగాలను  సైతం __ అలవోకగా  నేర్పుతో
అందు కొని _
మా కందించేవు _!
""  సినారే ,_!నీకు ఎన్ని సార్లు
_ జోహార్లు చెప్పినా_
ఎన్ని  ప్రణామాలు సమర్పించినా ,__
ఎంత చెప్పినా __
  తక్కువే కదా _!
జ్ఞానపీఠ పురస్కార ము సాధించిన_
, నీ సాహితీ పటిమకు __
నీవు అందించిన  అపురూప కావ్య,
గేయ కవితా కళా త్మ కతకు__
అందుకో __!
మా హృదయాంజలి_!
అందుకో    తెలుగు సాహిత్య కళా ంజ లీ   _!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...